మెయిన్ ఫీచర్

బోసుబాల్‌తో ఆరోగ్యం భేష్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోసుబాల్‌తో అరగంట సేపు ఆడుకుంటే ఉబకాయం అనే మాటే ఉండదు. ఆహార నిపుణుల సూచనలు పాటిస్తూ.. క్రమం తప్పకుండా ఈ బోసుబాల్‌తో వ్యాయామం చేస్తే మీ శారీరక ఆరోగ్యానికి దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ దీనితో అరగంట పాటు వ్యాయామం చేస్తే చాలు ఫిట్‌నెస్ మీ సొంతమవుతోంది. శరీరంలో పేరుకుపోయిన అధిక క్యాలరీలు తగ్గిపోతాయి. గుండె సాధారణరీతిలో స్పందిస్తుంటుంది. కీళ్లలో సత్తువ వచ్చి ఎంత దూరమైనా ఎలాంటి నొప్పులు లేకుండా సునాయాసంగా నడుస్తారు. రోజుంతా ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంటారు.

ఉదరవ్యాయామం...
మీ వీపు వెనుక భాగాన్ని ఈ బొమ్మలో చూపించినట్లుగా బాల్‌పై మోపండి. నేలకు సమాంతరంగా మోకాళ్లను వంచండి. చేతులను ఛాతి వెనుక వైపు ఉంచండి. ఇది ప్రారంభ దశ మాత్రమే. తలను వంచుతూ మొదటి దశకు రండి. తుంటి భాగాన్ని మాత్రం వంచొద్దు. ఇలా 10 నుంచి 15 సార్లు చేస్తే చాలు.

మోకాలిపై వంగి...
బాల్‌పై మీ రెండు కాళ్లు తేలికగా ఉంచండి. రెండు వైపులా నిటారుగా నిలబడండి. ఆ తరువాత శరీరంలోని ముఖ్యమైన భాగాలను సజావుగా ఉంచి మోకాళ్ల వరకు వంచండి. మళ్లీ యథాస్థానానికి చేరుకోండి. ఇలా చేయటం వల్ల మోకాళ్లు చక్కగా పనిచేస్తాయి. ఇది కూడా 10 నుంచి 15సార్లు చేస్తే మంచిది.

జంప్ చేస్తూ...
బాల్‌పై జంప్ చేస్తూ కూడా వ్యాయమం చేయవచ్చు. బాల్‌పై జంప్ చేసేటపుడు రెండు చేతులను గు మ్మటం వలే ఉంచాలి. బాల్‌ను ఒత్తిడికి గురిచేస్తున్నట్లు జంప్ చేయాలి. ఇలా 12 నుంచి 15సార్లు చేస్తే చాలు.

సైడ్ టు సైడ్
ఒక చేతిని బాల్‌పైన, మరో చేతిని నేలపై ఉంచాలి. తల నుంచి మునివేళ్ల వరకు శరీరాన్ని మొత్తం నిటారుగా ఉంచాలి. ఈ భంగిమను పక్కపక్కనే మార్చుకుంటూ 10 నుంచి 15సార్లు చేస్తే సరిపోతుంది. ఈ రోజుల్లో అందరూ కూడా స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలనుకుంటారు. బయటకు వెళ్లి వ్యాయామం చేయలేనివారు ఇలాంటి బోసు బాల్‌ను కొనుగోలు చేసుకుంటే ఇంట్లోనే వ్యాయామం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఏడు గంటలు నిద్రపోయిన తరువాత ఈ వ్యాయామం చేస్తే క్యాలరీలు ఎక్కువ స్థాయిలో కరుగుతాయట!.

మోచేతులతో...
బాల్‌పై రెండు చేతులు తొలుత నిశ్చలంగా ఉంచండి. ఆ తరువాత మోచేతులపై శరీర బరువును ఉంచి రెండు కాళ్లను జాపి తల నుంచి మడిమ వరకు నిటారుగా ఉంచండి. ఇలా ఒక నిమిషం పాటు ఉంచితే చాలు.

మోకాళ్లపై..
ఈ వ్యాయామం చేయటానికి కొంచెం శ్రమపడాల్సి ఉంటుంది. కాని దీనివల్ల మోకాళ్ల దగ్గర నుంచి అన్ని భాగాలు చురుకుగా పనిచేస్తాయి. మోకాళ్లను బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి. క్రీడల్లో పాల్గొనేవారికి, జాగింగ్ చేసేందుకు ఈ వ్యాయామం ఎంతోగానో ఉపకరిస్తుంది. జంప్ చేస్తున్న పొజిషన్‌లో నిలబడాలి. దాదాపు నిమిషం పాటు చేస్తే చాలు.