మెయిన్ ఫీచర్

భళా.. భారతీయ బుడతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో భారత సంతంతికి చెందిన విద్యార్థులు చూపిస్తున్న ప్రతిభాపాటవాలు అబ్బురపరుస్తున్నాయి. పువ్వు పుట్టగానే పరమళిస్తుందన్నట్లు అక్కడ జరిగే వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న మన చిన్నారులు అబ్బురపరచే విధంగా సమాధానాలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. మొన్నటి మొన్న నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో మొదటి మూడు బహుమతులు భారత సంతంతికి చెందిన చిన్నారులే సంపాదించగా.. నేడు ప్రతిష్ఠాత్మకమై స్క్రిప్ప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీ పరీక్షల్లో సైతం మొదటి పది స్థానాలకుగాను ఏడు స్థానాలు మన చిన్నారులే సాధించారు. గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్షలో మన విద్యార్థులు విజయం సాధించటం తొమ్మిదవసారి. టెక్సాస్‌కు చెందిన నిహార్, న్యూయార్క్‌కు చెందిన జి.జైరామ్ కోఛాంపియన్స్‌గా నిలిచారు. నేను అసలు ఎక్కడా పెద్దగా మాట్లాడను. ఇంత పెద్ద స్టేజీపై నిర్భయంగా తప్పులు లేకుండా స్పెల్లింగ్స్ చెప్పగలిగానంటే తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహామే కారణమని నిహార్ అంటున్నాడు. జైరామ్ సోదరుడు 2014లో కో-్ఛంపియన్‌గా నిలువగా అతడ్ని స్ఫూర్తిగా తీసుకున్న జైరామ్ ఈ ఏడాది తాను కూడా పొల్గొని విజయం సాధించాడు. కాలిఫోర్నియాకు చెందిన గణేష్ కుమార్ గత ఏడాది నాలుగవ స్థానంలో నిలువగా.. ఈ ఏడాది మూడవ స్థానంలో నిలిచాడు. అలాగే రుత్విక్, శ్రీనికేతన్, జష్ను, స్మృతీ ఉపాధ్యాయ ఫైనల్స్‌కు చేరుకోవటం విశేషం. ఈ పోటీలో మొత్తం 285 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
నేషనల్ జియోగ్రాఫిక్ విజేత మనోడే..
ఈ ఏడాది నేషనల్ జియోగ్రాఫిక్ విజేతగా రిషినాయర్ అనే పనె్నండేళ్ల బాలుడు నిలిచాడు. ఎన్నడూ లేనివిధంగా ఈసారి అమెరికాలోని భారత సంతంతికి చెందిన పదిమంది బాల మేధావులు ఫైనల్స్‌కు వెళ్లటం విశేషం. వాషింగ్‌టన్‌లోని నేషనల్ జియోగ్రాఫిక్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన 28వ కాంపిటీషన్‌లో మొదటి మూడు స్థానాలను భారత సంతంతికి చెందిన విద్యార్థులే సాధించారు. మొదటి విజేతరిషినాయర్‌కు 50 వేల డాలర్ల స్కాలర్‌షిప్‌తో పాటు నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీలో జీవితకాల సభ్య త్వం లభిస్తోంది. భారత సంతంతికి చెందిన విద్యార్థికి ప్రతిష్ఠాత్మకమైన ఈ స్కాలర్‌షిప్ పొందటం ఇది ఐదవసారి. రన్నర్‌గా నిలిచిన జొన్నలగడ్డ సాకేత్ (14)కు 25,000 డాలర్ల స్కాలర్‌షిప్ లభించింది. మూడవ స్థానంలో నిలిచిన కపిల్ నాథన్ (12)కు పదివేల డాలర్ల స్కాలర్‌షిప్ లభించింది. మిగిలిన ఏడు స్థానాలలోనూ భారత సంతంతికి చెందిన విద్యార్థులే నిలిచారు. వీరికి 500 డాలర్ల బహుమతి లభించింది.
chitram...
నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులు