Others

భారతీయ నవలా దర్శనం.. భిన్న సంస్కృతుల సమ్మిళిత సాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు చిన్నప్పటి నుండి కథలు వినడం తెలుసు. పేదరాసి పెద్దమ్మ దగ్గర్నుండి ఎన్నో జానపదాలు, పౌరాణికాలు, చారిత్రకాలు మనకు వినపడుతూనే ఉన్నాయి. కొన్ని ఆశ్చర్యాన్ని, కొన్ని అద్భుతాన్ని, కొన్ని ఆనందాన్ని, కొన్ని భయాన్ని కలిగించాయి. కొన్ని మాత్రమే మళ్లీ మనం చెప్పగలిగే స్థాయిలో మనలో ఇమిడిపోయాయి. మాటలను వెతుక్కుంటూ, కథను గుర్తుంచుకుంటూ చెప్పడంలోని తడబాటు మనకు తెలుస్తూనే ఉంటుంది. మనం చాలా పుస్తకాలు చదువుతాం. వాటిల్లో మనిషిని స్థిమితంగా కూర్చోనివ్వని పుస్తకాల గురించి ఇతరులకి చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఒకొక్కసారి రాయడానికీ పూనుకుంటాం. కాని మనలో చాలా కొద్దిమంది మాత్రమే అలా చెప్పగలిగే నైపుణ్యతను అందిపుచ్చుకుంటారు. ఒకరో ఇద్దరో మాత్రమే అక్షరాలుగా మార్చగలుగుతారు. అలాంటి ఒకరిద్దరిలో వాడ్రేవు వేదలక్ష్మీ దేవిగారు ఒకరు. ఆర్ట్ ఆఫ్ రీటెల్లింగ్ సొంతం చేసుకున్న సృజనశీలి ఈమె. స్వతహాగా కథకురాలు కావడంతో, ప్రతి చిన్న మార్పునకు స్పందించే హృదయం ఉండటంతో పనె్నండు భాషలలో 1882 నుండి 2006 వరకు ప్రచురణ పొందిన ఉత్తమోత్తమమైన అరవై భారతీయ నవలలను పాఠకులకు పరిచయం చేసే పనిని ఒక మాసపత్రికలో ‘కాలమ్’గా మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు కొనసాగించారు. అది ఇప్పుడు ‘్భరతీయ నవలా దర్శనం’గా మనకు అందుబాటులోకి వచ్చిన గొప్ప పోషక విలువలున్న విందు భోజనం. ఈ నెల పదకొండున విజయవాడలో వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి సాహిత్యస్ఫూర్తి సదస్సు జరుగుతున్న నేపథ్యంలో... ఆమె అందించిన ఈ కొత్త కానుకలోని విశేషాలను తలచుకుందాం.
జాన్ సదర్‌లేండ్ అనే ఒక ఆంగ్ల ఆచార్యుడు ‘ప్రపంచ సాహిత్యంలో జరుగుతున్న రెండు విషయాల మీద నేను ఎపుడూ పశ్చాత్తాపం చెందుతూ ఉంటాను’ అంటాడు. అందులో ఒకటి ‘కామన్ రీడర్’ని మన సాహిత్యం దూరం చేసుకోవడం, నిర్లక్ష్యం చేయడం. అకడమిక్ విమర్శకులు ఎప్పుడూ సాధారణ పాఠకుడి స్థాయిని, అభిప్రాయాన్ని, ఇష్టాన్ని ఆమోదించలేక పోవడం, కనీసం గౌరవించకపోవడం. దీనివలన సాహిత్యంలో ఉన్న మంచి సృజన నూటికి తొంభై శాతం చదివే అలవాటున్న పాఠకులకు చేరడం లేదు. కాబట్టే సుమారు ఐదువందల పుస్తకాల గురించిన పరిచయాన్ని సంకలనం చేసి రేండమ్ పబ్లికేషన్స్ ద్వారా 2014లో ‘్హ్యతీ ఆ్య ఇళ తీళ ళ్ఘజూ’’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు జాన్. ఇలాంటివే ఒకట్రెండు వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా సంక్షిప్తంగా పరిచయాల్ని మాత్రమే అందించాయి. ఏమి చదవాలన్న పాఠకుల సందిగ్ధానికి ఒక తోవను చూపెట్టాయి.
దీనికి భిన్నంగా, వాడ్రేవు వీరలక్ష్మీ దేవిగారి భారతీయ నవలా దర్శన యాత్ర కొనసాగింది. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన నవలలను పరిచయం చేయడం మొదలుపెట్టి ఆ దారిలో ఆమెకు కనిపించిన, కదిలించిన, ఎన్నో పొత్తాలను పాఠకుల హృదయాలలోకి నేరుగా చేర్చి కూర్చోపెడతారు. కూర్చోపెట్టారు కూడా. యాత్రలు అనేక రకాలు. అయితే బస్సు యాత్రో, రైలు యాత్రో కాదు. ఇది సాహిత్యం ద్వారా భారతదేశాన్ని చుట్టివచ్చే అపురూప యాత్ర. బెంగాలీ, కన్నడ, తమిళ, మలయాళ, మరాఠి, హిందీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, సింధీ, ఆంగ్ల, తెలుగు భాషలలోని సమాజాన్ని, సంస్కృతిని, అప్పటి కాలాన్ని, మనుషులని ఆయా నవలల ద్వారా పట్టుకొని భిన్న సంస్కృతుల సమ్మిళితమైన భారతీయతను ఆమె పాఠకులకు చూపెడతారు. ఇలా చూపెట్టడానికి జాన్ ఎంచుకున్న మార్గాన్నో, మరో ఇతర రచయిత దారిలోనో ఆమె వెళ్లలేదు. ఇప్పటిదాకా పుస్తకాలను పరిచయం చేసిన రచయితలందరూ కేవలం ఆ పుస్తకాలలోని మంచిని, లోపాల్ని కూడా చెప్పారు. అయితే వాళ్లందరూ కేవలం మంచి పుస్తకం పాఠకుడికి చెప్పాలన్నది తమ కర్తవ్యంగా భావించి, ఫెర్‌ఫార్మింగ్ ఎ డ్యూటీగా కానిచ్చేరు. కాని వీరలక్ష్మీదేవిగారు తను చదివిన నవల తనలో కలిగించిన ఆలోచనలని, అనుభవాలని, అనుభూతులను స్వీకరించి, ఆ నేపథ్యంలోంచి నవలను పాఠకులకు పరిచయం చెయ్యడం మొదలు పెడతారు. బహుశా నాకు తెలిసి, ఇలా ఒక కామన్ రీడర్ తనకు నచ్చిన పుస్తకాన్ని తనలాంటి పాఠకులకి అందజేసే ప్రయత్నం ఇదే మొదటిది. వీరలక్ష్మీదేవిగారు ప్రాథమికంగా గొప్ప చదువరి. చదవడం వలన కలిగిన సమస్తమైన మార్పులను ఆహ్వానించి, ఆకళింపు చేసుకొని, వాటిని ఇతరులకు చేరవేసే యజ్ఞానికి, యాత్రకి శ్రీకారం చుట్టిన విదుషీమణి ఈమె.
నవలలను పరిచయం చేయడంలో మూడు రకాల మార్గాలను ఎంచుకొంటారు ఈమె. మొదటిది ఈమెకు కలిగిన చదువరి అనుభవంలోంచి నవలను చెప్పడం, రెండవది నవలలోని విశేషాలను అందివ్వడం, మూడవది అనువాద నిపుణతను గుర్తించి, దానిని అదనపు అడ్వాంటేజిగా చెప్పడం. దాదాపు చాలా నవలలను చదివిన తర్వాత ఆమెకు కలిగిన ఉత్తేజం, ఉద్విగ్నతతో పాఠకులను పలకరించడం మొదలు పెడతారు. రచనా కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటూ, కథను విప్పుకుంటూ మధ్యలో కనపడే విశేషాలను పోగేసుకుంటూ నవల మొత్తాన్ని పాఠకుడికి చేరవేస్తారు. కొన్ని గమనింపులు కూడా ఈ గ్రంథం పట్ల మనకు ఆసక్తిని కలిగిస్తాయి. ‘ఇదే కథ శరచ్చంద్రుడయితే మరింత స్పందనాత్మకంగా, సంవేదనాత్మకంగా చెప్పి ఉండేవారు. ఠాగూర్ కంటే శరత్ హృదయవాది’ అని చెప్పడం, ‘గొప్ప రచయిత కాలం చెల్లుతున్న పాత ధర్మాలను గుర్తుపడతారు. వాటి స్థానంలోకి కొత్తవాటిని తెచ్చే ప్రయత్నం చేస్తాడు’ అని ప్రొజెక్ట్ చెయ్యడం, అనితాదేశాయ్ రాసిన ‘కొండమీద మంట’ గురించి రాస్తూ... ‘నవల పూర్తి చేశాక ఒక విభ్రాంతిలోకి వెళ్లి, కరిగి నీరయ్యాను. స్ర్తివాద సిద్ధాంతాలలోంచి జీవితాలను చూసి తిరిగి దాన్ని ఆ దృష్టితో కళారూపంగా చెప్పగలగడం ఇంకా మనం ఎంతగా నేర్చుకోవాలో ఆ నవల చెప్పింది’ అని ష్యశషఖఒజ్యశకి రావడం, నళినీ జమేలా ఆత్మకథ గురించి చెపుతూ ‘ఆ గొంతును నిబద్ధతతో వినడం మన బాధ్యత అని నాకు అనిపించింది’ దృఢంగానూ, బలంగానూ పాఠకుడికి చేరవేయడం లాంటివి ఎన్నో మనకి భారతీయ నవలాదర్శనంలో కనపడతాయి.
ఒక ‘బన్‌గర్‌వాడి’, ఒక ‘పర్వా’, ఒక ‘యాజ్ఞసేని’, ఒక ‘వనవాసి’, ఒక ‘సంస్కార’, ఒక ‘కూలిగింజలు, ఒక ‘చిత్రలేఖ’, ఒక ‘విషాద కామరూప’, ఒక ‘చిత్రగ్రీవం’, ఒక ‘స్వర్గసీమకు స్వాగతం’ భారతీయ నవలా సంపదను తెలియజేస్తాయి. విభిన్న భాషా సమాజాల్లో, సంస్కృతులలో, ఆయా కాలాలలో ఎలాంటి సంప్రదాయాలు, కట్టుబాట్లు, జీవన విధానాలు, సంబంధాలు మనిషిని పట్టి పీడించాయో, విముక్తుడిని చేశాయో, దుఃఖ పరిచాయో, ఆనందాన్నిచ్చాయో తెలుసుకునే అరుదైన అవకాశాన్ని భారతీయ నవలా దర్శనం మనకు అందిస్తుంది. విభూతి భూషణ్ రచనలలోని సంగీతాన్ని, శరత్‌లోని మృదయ రాగాలని, రవీంద్రుని ఈస్థటిక్ జ్ఞానాన్ని, భైరప్పలోని ఇతిహాసపు కొత్త కోణాలని, జయకాంతన్ చూపెట్టిన తమిళ సమాజాన్ని, శశిదేశ్ పాండే వౌనాన్ని మనకు చేరవేయడంలో, వాటిని మనం దగ్గరికి తీసుకునేలా ప్రేరేపించడంలో ఈ ‘కాలమ్’ ఎక్కువ విజయమే సాధించింది.
ఈ గ్రంథానికి ఇంకో మెరుపు తునక ఉంది. అది రచయిత్రి తాను నవలను మొదటగా చదివిన అనుభవానికి కొద్దికాలం తర్వాత అంటే సుమారు పదిపదిహేనేళ్ల తర్వాత చదివిన అనుభవానికీ మధ్య తేడాని గుర్తించి చెప్పడం పాఠకుడికి విశేషంగానూ, అబ్బురంగానూ అనిపిస్తుంది. ఒక మంచి గ్రంథం చదివిన ప్రతిసారి ఒక కొత్త సంగతిని చెపుతూనే ఉంటుంది అనే విశ్వరహస్యాన్ని ఈ రచయిత్రి ష్యశచిజూౄ చేస్తారు.
‘‘చిన్నప్పుడు చదివినపుడు ఈ నవలలో ఇంతే అర్థమయింది. ఆ అరణ్యంలోని ధూసరవర్ణ శీర్షరేఖ, పొడవైన దీర్ఘశైల శ్రేణి, ధూధలి పుష్పాల సువాసన, రక్త పరాగ వృక్షాల శోభ, పత్ర విహీనమైన గోల్‌గోలీ పువ్వుల చెట్టు, శుభ్ర నీల ఆకాశం, అడవిని ధగధగాయమానం చేసే వెనె్నల రాత్రులు... ఇవే కలల్లోకి కూడా చూస్తూ ఉండేవి.
ఇప్పుడు చాలాకాలం తర్వాత చదివినపుడు ఈ పుస్తకంలోని మరొక గొప్ప పార్శ్వం సాక్షాత్కరించింది. బయట ప్రకృతి సౌందర్యంతో పోటీపడే అంతఃసౌందర్యం గల నాయకుడూ, ఆ వెలుగులో ప్రకాశించే మరికొందరు వ్యక్తులూ, ఏది ఉత్తమోత్తమమైన జీవితమో ఎంతో స్పష్టంగా తెలియజెప్పే కథా, అరణ్య సౌందర్య వర్ణనకు సమాంతరంగా నడిచాయి. ఈసారి అది నన్ను కట్టిపడేసి నవలా రచయిత విభూతి భూషణ బందోపాధ్యాయ పాదాలకు ప్రణమిల్ల చేసింది.’’ - అంటూ చదివిన ప్రతి అక్షరంలోనూ తాను ష్యశశళషఆ అవుతూ, కదిలిపోతూ... మనల్ని కూడా ఆమెతో పాటు సకల జ్ఞాన శోభితము, మానసికోల్లాసము కలిగించే నవలా యాత్రకు చేయి పట్టుకుని నడిపించుకుని తీసుకువెళ్తారు.
చాలామంది పుస్తకాలను ప్రేమించేవాళ్లు, గౌరవించేవాళ్లు, చదివేవాళ్లు, చదివింది రాసేవాళ్లు మనమధ్య వున్నారు. చాలామందికి మంచి పుస్తకాల గురించి సమాచారమే అందటం లేదు. మంచి పుస్తకం కోసం ఎదురుచూసే సాధారణ పాఠకుడికి ఖచ్చితంగా ఈ ‘్భరతీయ నవలా దర్శనం’ కరదీపిక అవుతుంది. ఇది ఐదు పనులు చేస్తుంది. మొదటిది, ఒక మంచి నవలను గురించి చెబుతుంది. రెండవది, ఆ నవల మనలో కలిగించే రసానుభూతిని మనకి తెలిసేలా చేస్తుంది. మూడవది, ఆ నవల పుట్టిన భాషా సమాజపు సాంస్కృతిక స్వరూపాన్ని, కాలాన్ని మన ఆలోచనకి అందిస్తుంది. నాలుగవది, ఆ నవలా నిర్మాణపు విశిష్టతను మనకు తెలియచెప్తుంది. ఐదవది, అనువాదపు సౌరభాన్ని మనకి చేరవేస్తుంది. ఈ ఐదు లక్షణాలు మనలోకి ఒలికిన తరువాత మనలో ఏర్పడ్డ ఆ జ్ఞాన ఛాయ మనలను మరిన్ని మంచి పుస్తకాల వైపు అడుగు వేసేలా ప్రోత్సహిస్తుంది. మరికొంతమందికి వాటిని చెప్పేలా ప్రేరణనిస్తుంది. వీరలక్ష్మీదేవిగారి తపన కూడా అదే. ‘్భరతీయత’ ఒక విభిన్న సంస్కృతుల సమ్మిళితం. ఇది నిత్య ప్రవాహిని. అనేక వాటిని కలుపుకుంటూ, అక్కరకు రాని వాటిని విసర్జిస్తూ సమస్త కాలాలలోనూ భారతీయ సమాజాన్ని తెలుసుకోవడానికి ఈ పొత్తం మనకుపయోగపడుతుంది. ఇది ఆమె ఏడు సంవత్సరాల పాటు చేసిన నిరంతర జ్ఞానయాత్ర. మరో విశేషం ఈ 520 పేజీల పొత్తంలో ఎక్కడా పునరుక్తి లేకపోవడం చెప్పుకోదగ్గ విషయం. ఆమె సమస్త సాహిత్యాన్నీ మళ్లీ ఒకసారి మూల్యాంకన చేసుకొనే అవకాశానికి ఈ నెల 11న విజయవాడ వేదిక అవుతున్న సందర్భంలో ఇలా ఈ పొత్తాన్ని గురించి వివరాలు పంచుకోవడం మనకు స్ఫూర్తినిస్తుంది.

- నండూరి రాజగోపాల్ 98481 32208