మెయిన్ ఫీచర్

అతిథిదేవో భవ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు కాలం మారింది. కలి ధర్మం ప్రవేశించింది. ఎదుటి వాడి ఆకలిని తీర్చేందుకు ప్రాణాలను అర్పించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇంటి ముంగిట నిలిచిన అతిథి బాగోగులను గమనించుకుని తీరాలన్న శాశ్వత నీతిని మాత్రం కాదనలేం!
ఏకాలమైనా మనిషి మనిషే అతనికి ఆకలిదప్పులు ఎపుడూ ఉండేవే. మానవత్వంతో మసిలేవాడే నిజమైన మనిషి అనిపించుకొంటాడని సర్వశాస్త్రాలు చెబుతాయ.
శత్రువైనా సరే, బాధలో మన ముందుకి వచ్చిన వాడికి మనకు తోచిన సాయం చేయాలన్న ధర్మాన్ని కొట్టి పారేయలేము.
గురుడు హస్తిమస్తక సంయోగంతో చిత్కళాన్యాసంచేసి, త్రివిధ దీక్షల చేత పూర్వకర్మలు దగ్ధం చేసి, భౌతిక శరీరాన్ని లింగ శరీరంగా చేసి యిచ్చిన ఇష్టలింగాన్ని స్థూల శరీరంలో కంఠంలో గాని, శిరస్సుపై గాని, భుజం మీద కాని వక్షస్థలంపైన గాని ధరించాలి.ప్రాణభావ లింగాలతో దానికి అవినాభావంగా ఐక్యాను సంధానం అలవరచుకోవాలి. ప్రణవ మంత్రంతో కూడిన శివ పంచాక్షరి తప్ప మరే మంత్రాలను మననం చేయగూడదు. ఇష్ట లింగం ఒకవేళ శరీరంనుండి క్రింద పడితే ప్రాణ త్యాగం చేయాలి. లింగైక్యం చెందినవాడు ఆ వ్యక్తి చేతిలోని లింగాన్ని వుంచి అతనిని పూడ్చిపెట్టాలి. ఇది వీరశైవ లక్షణం.
పురుషులతోపాటు స్ర్తిలకు కూడా లింగ ధారణ విధించబడింది. పుట్టిన శిశువుకు కూడ లింగ దీక్ష చేయాలి. అందువల్ల వీరశైవులకు స్ర్తిపురుష వివక్ష లేకుండా పుట్టుక నుండి ద్విజత్వం లభిస్తుంది. వీరికి లింగమే యజ్ఞోపవీతం. (బసవ పురాణం) పీఠిక పుట-2 ఆనాటి వీరశైవ మతాచారాలను ఆచార వ్యవహారాలను సంప్రదాయాలను తరచి చూస్తే ఆశ్చర్యమేమీ లేదు. వైష్ణవ సంప్రదాయంలో కూడా గోరాకుంభార్ కథలో పసిబిడ్డను కుండలు చేసే మట్టిలో తొక్కి వేస్తాడు తండ్రి. ఆ తర్వాత పండరీనాధుని పిలుపుతో బిడ్డ సజీవంగా వస్తాడు మూఢ భక్తులకు తమ విశ్వాసమే వారికి రక్ష. పరమావధి ఆ పరమ శివుడు. తాము ఆ భగవంతుని కైంకర్యంలో పాత్రధారులు. భార్య బిడ్డలు నిమిత్త మాత్రాలు. అట్టి భక్తుల రక్షణకోసం పరమ శివుడు కూడా వారికి సేవలు చేసిన సందర్భాలున్నాయి. వీర శైవ మతం 12వ శతాబ్దిలోతెలుగు దేశంలో బాగా వ్యాపించింది. వీరశైవుల ఆచార వ్యవహారాలు ప్రత్యేకమైనవి. జంగములకు విశిష్టమైన అతిథి సత్కారం చేయడం వీరశైవుల సంప్రదాయం.
అతిథి సేవనకు భారతీయ సంప్రదాయం ప్రాధాన్యం యిస్తుంది. అన్ని మతాలు అతిథి సేవకు పెద్దపీట వేశాయి. అంబరీషుని కథ అతిథి సేవా తత్పరతను తెలియజేస్తుంది. అతిథి సంతర్పణలో ధన్యులయిన వారి గాథలు కోకొల్లలు.
కృతిపతి అవచి తిప్పయ్యశెట్టి వంశానికి చెందిన హరవిలాసంలో చిరుతొండ నంభి కథను శ్రీనాథుడు చక్కగా వర్ణించాడు. దుర్వాసముని శాపం చేత తుంబురుడు కాంచీనగరంలో శివభక్తుడైన చిరుతొండ నంబిగా జన్మించాడు. శివభక్తుడైన చిరుతొండనంబికి శివుడు చెఱకు మోపెత్తి సాయపడ్డాడు. అలా సాయపడటంవల్ల శివుని మేను చెమర్చింది.అది చూసి పార్వతి నాట్యమాడుతున్న అచ్చరను చూసి శివుని శరీరం చెమర్చిందని ఈర్ష్యపడింది.
శివుడు పార్వతి చిరుతొండనంబి భక్తి పారమ్యాన్ని చూపడానికి భూలోకంలో వృద్ధ దంపతుల రూపంలో వస్తారు. ఇంద్రుడు 21రోజులు అఖండ వర్షం కాంచీ నగరంలో కురిపిస్తాడు. అయినా చిరుతొండకు అన్నదానం ఆగకుండా చేశాడు. 22వ రోజు సహపంక్తికి ఏ ఒక్క జంగమ ప్రమధుడు రాలేదు. చిరుతొండ నంబి ఊరూవాడా వెదికి పాడుపడ్డ గుడిలో వృద్ధశైవ దంపతుల రూపంలో ఉన్న శివపార్వతులను శివార్చనకు ఆహ్వానిస్తాడు. కపట శివయోగి నరమాంసం కావాలని నియమం పెట్టాడు. తల్లి సిరియాళుని కోసి వండి పెడుతుంది. శివయోగి చిరుతొండనంబి కుమారుని సహపంక్తి భోజనానికి పిలిచాడు. తల్లి కూడా పిలిచింది. సిరియాళుడు స్వస్వరూపంతో వచ్చాడు. శివుడు ప్రత్యక్షమై చిరుతొండని కైలాస వాసిని చేశాడు. కుమారస్వామియే ఈ సిరియాళునిగా జన్మించాడని శివయోగి చెప్పాడు. విష్ణువు, బ్రహ్మాది దేవతలు విచ్చేశారు. కంచి చుట్టుప్రక్కల ఏడు గ్రామాల ప్రజలను కైలాసానికి కైలాసం నుండి వచ్చిన విమానాలు తీసుకెళ్ళాయి. చిరుతొండ నంబి ప్రమథ గణాలలో ఒకడై నిలిచాడు.
మూఢ భక్తులు, ముగ్ధ్భక్తులు అని రకరకాల శివభక్తుల కథలు చాలా బసవపురాణంలో ఉన్నాయి. గోడగూచి కథ, మొఱపద వంకయ్య కథ, ముగ్ధ సంగయ్య కథ, బిజ్జ మహాదేవి కథ, మడివాలు మాచయ్య కథ, జగదేవ మల్లని కథ, బాణుని కథ, పిట్టవ్వ కథ, బ్రహ్మయ్య కథ ఇలా ఎనె్నన్నో కథలు. అందరినీ ఒక్కొక్క దారి. శివభక్తి పారమ్యమే వారి పరమావధి.
ఈ కథలో కన్న కుమారుని బలియివ్వడానికి తండ్రి సిద్ధపడ్డాడు. మారుమాటాడక తల్లి అంగీకరించింది. తల్లిదండ్రుల మాటను తనయుడు శిరసావహించాడు. అతిథిగా వచ్చిన జంగమయ్య నరమాంసం కావాలన్నప్పుడు మరో సంశయం లేకుండా కుమారుని అర్పించడానికి చిరుతొండ నంబి సిద్ధపడటం ఈ కథలో ముఖ్యమైన విషయం.
పిల్లవాడు సహపంక్తిలో లేకుండా భోజనం చేయజాలనని జంగమయ్య అన్నప్పుడు అంతే విశ్వాసంతో కుమారుని ఎలుగెత్తి పిలిచింది తల్లి.్భక్తుల పరీక్షలో యిదొక భాగం.
‘‘సర్వజ్ఞ! మీ మనోజ్ఞంబైన యట్టి
సర్వలక్షణ గుణ సంపూర్ణుడొక్క
వరపుత్రుడున్నాడు, నరమాంస మింక
బొరుగింటికిని పిల్వ బోయెదనయ్య?’’
ఇరుగింటికి, పొరుగింటికి పోనక్కరలేకుండా నా కుమారుని మాంసమే వడ్డిస్తానని చిరుతొండనంబి మాట ఇవ్వడం చూస్తే అతిథి మర్యాద ఎంత గొప్పదో అర్ధవౌతుంది.
అందుకే ఆనాటికి ఈనాటికీ కూడా అతిథి ‘‘అతిథి దేవోభవ’’ అన్నారు.

- ఉషశ్రీ తాల్క