మెయిన్ ఫీచర్

సమిష్టి కృషి విజయాలకు నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోగులకు సేవ చేయడం అంటే వారికొచ్చిన
జబ్బులకు మందులివ్వడమే కాదు, రోగుల మానసిక పరిస్థితికి తగ్గట్టుగా మాట్లాడి వారిని ఆరోగ్యవంతులను చేయడం కూడా వైద్యుని బాధ్యత. ఈ బాధ్యతను ఎవరూ చెప్పరు. కాని వైద్యులైన ప్రతివారు తాము అందించిన వైద్యంతో రోగులు స్వస్థత పొందాలి అనుకొంటే వారే ఈ బాధ్యతను తమకు తాముగా స్వీకరిస్తుంటారు. అయతే ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఇంట్లో ఉన్న అందరు సభ్యులు కూడా సహకరించాల్సి ఉంటుంది. అయతే ఈ మధ్య కార్పోరేటు వైద్యంలోఈ బాధ్యతను నెరవేర్చడానికి కొందరు మహిళలు ముందుకు వస్తున్నారు. వారే వైద్య బృందానికి, వైద్యం కోరే వారి కుటుంబాల మధ్యవారధులుగా నిలిచి ఎంతో సున్నితమైన బాధ్యతను తమభుజస్కంధాలపై వేసుకొంటున్నారు.
ఇటు ఇంట్లో ఇల్లాలిగా.. పిల్లలకు తల్లిగా తన బాధ్యతలను ఎలా నెరవేరుస్తూ మరో ప్రక్క నమ్రత హితేష్ సవ్లాని యశోద హాస్పిటల్స్ హైదరాబాద్‌లో అసిస్టెంటు జనరల్ మేనేజరుగా, కార్పొరేటు సర్వీసెస్‌కి పనిచేస్తున్నారు. మరొకవైపు సమర్థవంతంగా దాదాపు ఇరవై ఏళ్లుగా కస్టమర్ సర్వీసు, సేల్సు, డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ మేనేజ్‌మెంటు, రిలేషన్‌షిప్ మేనేజిమెంటు, ఫైనాన్సులో ఇంకా హెల్తుకేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.

యువతులు నేడు ఇంట్లోను కార్యాలయంలోనూ పనిచేయడం చాలా సహజం అయపోయంది. ఫలాన రంగం అని కాక అవకాశ మొచ్చిన ఏ రంగంలోనైనా తమదైన శైలిని కనబర్చడమనేది మహిళలకు వెన్నతో పెట్టిన విద్య. ఏ కార్యాన్నైనా సంతోషంగా అందరి మెప్పు పొందేవిధంగా చేయడంలో ఒక్కో మహిళది ఒక్కో విధానం. వృత్తులన్నీ మహోన్నతమైనవి అయనా వైద్యవృత్తిలో ఎక్కవ బాధ్యతలెక్కువగా ఉంటాయ. రోగులకు సేవ చేయడం అంటే అటు వారికొచ్చిన జబ్బులకు మందులివ్వడమే కాదు, రోగుల మానసిక పరిస్థితికి తగ్గట్టుగా మాట్లాడి వారిని ఆరోగ్యవంతులను చేయడం కూడా వైద్యుని బాధ్యత. ఈ బాధ్యతను ఎవరూ చెప్పరు. కాని వైద్యులైన ప్రతివారు తాము అందించిన వైద్యంతో రోగులు స్వస్థత పొందాలి అనుకొంటే వారే ఈ బాధ్యత తమకు తాముగా స్వీకరిస్తుంటారు. అయతే ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఇంట్లో ఉన్న అందరు సభ్యులు కూడా సహకరించాల్సి ఉంటుంది. ఇపుడున్న కార్పోరేటు హాస్పటల్స్‌లో వైద్యులతో పాటుగా రోగులకు కావలసిన సదుపాయాలను చూడడానికి ఎందరో ఉద్యోగులు కూడా సహకరించాల్సి ఉంటోంది. వైద్య బృందానికి, వైద్యం కోరే వారి కుటుంబాల మధ్యవారధులుగా వీరు ఎంతో సున్నితమైన బాధ్యతను మోయాల్సి ఉంటుంది. అటువంటి సున్నితమైన అంశాలను చూసే అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పదవీ బాధ్యతలు మోస్తూనే ఇటు ఇంట్లో ఇల్లాలిగా పిల్లలకు తల్లిగా తన బాధ్యతలను ఎలా నెరవేరుస్తుందో నమ్రత హితేష్ సవ్లాని యశోద హాస్పిటల్స్ హైదరాబాద్‌లో అసిస్టెంటు జనరల్ మేనేజరుగా, కార్పొరేటు సర్వీసెస్‌కి పనిచేస్తూనే తల్లిగా, భార్యగా, గృహిణిగా, కూతురిగా, కోడలుగా, అక్కగా ఎన్నో వ్యక్తిగతమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఒకవైపు. మరొకవైపు సమర్థవంతంగా దాదాపు 20 ఏళ్ళుగా కస్టమర్ సర్వీసు, సేల్సు, డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ మేనేజ్‌మెంటు, రిలేషన్‌షిప్ మేనేజిమెంటు, ఫైనాన్సులో ఇంకా హెల్తుకేరు ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. వీరి జీవిత భాగస్వామి డా.హితేష్ కూడా వైద్యుడిగా సమాజసేవకు అంకితమయ్యారు. వీరి ముద్దుల కుమారుడు సహాయ్‌ను తీర్చిదిద్ది ఆదర్శవంతంగా పెంచుతున్నారు శ్రీమతి నమ్రత హితేష్ సవ్లాని. తన కుటుంబంతో సమయం గడపడం, సహాయ్‌ను తీర్చిదిద్దడంలో తన ఒత్తిడి తగ్గి తను ఎంతో సమర్థవంతంగా ఉద్యోగంలో విధులను నిర్వహిస్తున్నారంటారు ఈవిడ. వారితో కాసేపు మాట్లాడుదాం రండి.
* మీకు స్ఫూర్తి ఎలా వస్తుంది?
-నా కుటుంబం నుండి. చిన్నప్పటినుండి మా అమ్మ, నాన్న మంచి విలువలు నేర్పించారు. వారి పెంపకంలో ధైర్యంగా ముందుకు దూసుకువెళుతున్నాను.
* వ్యక్తిగతంగా ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నారు? అవి ఎలా అధిగమించారు?
-ఉద్యోగం చేస్తున్న మహిళకు, ఒక తల్లిగా, భార్యగా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. నా పనిలో ఉండే ఒత్తిడి నా కుటుంబంపై నీడ పడనీయను. ఈ విధంగా బాలన్సుడుగా, సమతుల్యంగా జీవితం ఉండేటట్లు చూసుకుంటాను. నేను ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నపుడు నా కుటుంబం నాకు ప్రేమనే కాదు వారి పూర్తి మద్దతు ఇస్తున్నారు.
* విధి నిర్వహణలో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొంటారు? అవి ఎలా అధిగమిస్తారు?
-రోజూ ఎన్నో విధులు నిర్వహిస్తున్నపుడు ఒక్కోసారి నిరాశ, నిస్పృహ వస్తాయి. ఎవరికైనా సహజమే కదా! కాని, ఏ పనులు ముందు చేయాలి, వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవన్నీ చూసుకుంటూనే రోజంతా ఉత్సాహంగా జరిగిపోతుంది. ఇవి చేయడంలోనే ఒత్తిడి కూడా తగ్గుతుంది.
* మిమ్మల్ని ఎవరు ప్రోత్సహిస్తారు?
-మా వారు డా. హితేష్. ఆయన కూడా సమాజ సేవకు అంకితమైన వైద్యుడు. మా బాబు సహాయ్. పిల్లలనుండి ఎంతో నేర్చుకోవచ్చు మనం. శక్తివంతంగా ఉండటం, సీదా సాదాగా ఉండటం, నేర్చుకోవడం, క్షమించడం, ఇవన్నీ మా బాబును చూస్తే ఎంతో ఉత్తేజంగా ఉంటుంది. మావారు కూడా నేను చేసేపనులను పరిశీలిస్తూఉంటారు. పైగా మంచివాటిని కొద్ది కష్టమైనవి అయనా వాటికి సహకారం అందిస్తాను నీవే నిర్వహించగలవు అంటూ నన్ను సమర్థిస్తారు, ప్రోత్సహిస్తారు. మహిళలకు ఇంట్లో ఇట్లాంటి ప్రేమ, ప్రోత్సాహాలు లభిస్తున్నప్పుడు అందరూ ఎన్నో గొప్ప పనులు సాధించవచ్చు కదా!
* మీరు ఎలాంటి విజయాలు - పరాజయాలు చూశారు?
-మంచి చెడు అనేవి జీవితంలో రెండూ వస్తాయి. రంగులరాట్నంలా ఇవి సహజమే! రెంటినీ సమానంగా చూడాలి. విజయాలకి పొంగకుండా, పరాజయాలు లేదా అవరోధాలు వచ్చినపుడు కుంగిపోకుండా ఉండాలి. అపుడు జీవితం సాఫీగా జరిగిపోతుంది. ఒక మేనేజరుగా నాతో పని చేసేవారినందరినీ సంతోషపెట్టాలి, ప్రోత్సహించాలి. వారి విజయాలతో నా విజయం- సంతోషం ముడిపడి వున్నాయి. నా విజయాలను నా టీం- నాతో పనిచేసే వారితో పంచుకుంటే పెంచుకుంటాను. జీవితంలో ఎలాంటి ఒత్తిడి, అడ్డంకులు వచ్చినా, భయం లేకుండా ముందుకు వెళతాను. ఎంత కష్టమైనా పరిస్థితులు చూసినా, వచ్చినా దిగులుపడను, నిరాశ చెందను. ఇది ప్రతిరోజూ, ప్రతివారం, సంవత్సరాలుగా చేస్తున్నాను.
* మీరు ఇంట్లో సింధీ భాష మాట్లాడుతారా?
-నేను నిజామాబాద్‌లో పెరిగాను. అందుకే చిన్నప్పటినుంచి సింధీ, హిందీ, ఇంగ్లీషు, తెలుగు, అన్ని భాషలు చక్కగా మాట్లాడుతాను. నాన్నగారు బిజినెస్ చేసేవారు, అమ్మ ఇంట్లోనే ఉండేది. అక్కయ్య ముంబైలో పనిచేస్తుంది, తమ్ముడు ఆఫ్రికాలో ఉంటున్నాడు.
* మీరుచాలా మందితో పనిచేయాల్సి వస్తుంది కదా పైగావేర్వేరు పనులు కూడా చేయాల్సి వస్తే మీరు ఎలా పనిచేస్తారు.
-నా టీం వర్క్ తోనే ఎంతో సంతోషం మరెన్నో విజయాలను సాధించవచ్చు అని నా కెరీర్‌లో నేను తెలుసుకొన్నాను. నా టీంలో ఎంతోమంది ఉన్నారు. అలాగే డాక్టర్లు, నర్సులు, పేషెంట్లు, అటెండర్లు, కార్పొరేట్ హ్యూమన్ రిసోర్స్, ఎడ్మిన్, వసతులు- ఫెసిలిటీస్, ఆడిట్, హౌస్‌కీపింగ్, గెస్ట్ రిలేషన్స్, ఎడ్మిషన్స్, బిల్లింగ్, కార్పొరేట్ స్థాయిలో ముఖ్యంగా ఎడ్మిన్, సీనియర్ ఆఫిషీయల్స్ అందరితో కలసి పనిచేస్తాను. అందరినీ సమన్వయపరుస్తాను.
‘‘చుక్కలని అందడానికి ప్రయత్నిస్తే ఆకాశం మనదవుతుది’’ అంటారు నమ్రత హితేష్ సవ్లాని. మన వూహలను, కలలను నిజం చేసుకోవాలంటే కష్టపడి సాధించాలి. పరిధి పెట్టుకోకుండా ఎంతో సాధించాలి, బాధ్యతలు పెంచుకోవాలి, సంతోషం పంచుకోవాలి’’ అంటారు నమ్రత హితేష్ సవ్లాని.
*