మెయిన్ ఫీచర్

సరిగము మధురిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శిశుర్వేత్తి - పశుర్వేత్తి - వేత్తిగాన రసః ఫణిః’’- అన్నది ఆర్యోక్తి! మనసును మరపించి మురిపించడంలో సంగీతానికున్న ప్రాశస్త్యాన్ని- గానానికున్న ప్రాముఖ్యాన్ని తేటతెల్లం అయ్యేలా చెప్పబడిన ఆ మాట సర్వజనావళికి శిరోధార్యం! ఒకప్పటి కాలంలో- పిల్లల స్వరంతో సంబంధం లేకం పిల్లలందరికీ- ఆడా మగా అనే భేదం చూపకుండా తప్పనిసరి సంగీతభ్యాసం చేయించేవారు. అది ఒక సాధన ప్రక్రియగా ఆమోదించబడింది.
సంగీత విద్యను- అది గాత్రమైనా- వాయిద్య విశేషమైనా- ఓ కళగా కాక- కాలక్షేప క్రియగా ఏకాగ్ర చిత్తానికి చిహ్నంగా, పిల్లలకు అటువంటి ప్రోత్సాహమిచ్చేవారు నాటి పెద్దలు. కానీ, ఈనాడు ఈ పోటీ చదువుల పరుగులో ఆట పాటలన్నీ సుమారుగా అటెకెక్కిపోయాయి. కారణాలేమైనా ఈ నేటి పరిస్థితి దురాలోచన లేని దుస్థితి అని చెప్పక తప్పదు! అది ఒక అనాలోచిత చర్య!
నిజానికి మనిషిలో కళ అనేది ప్రతిభా పాటవ ప్రదర్శనకు మూలం. సర్వజనామోదమైన సంగీత ‘కళ’ అభ్యసించటం వలన- తెలివితేటలకు సానపట్టే అవకాశముంటుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకునే ‘్ధర్మసూక్ష్మం’ తెలుస్తుంది. పద లాలిత్యంతో పల్లవించే సంగీతం ద్వారా భాషమీద పట్టు- భావ ప్రకటనలోని లోగుట్టు- చిన్న వయసులోనే పిల్లల పరిణితిని పెంచే అవకాశాలను అద్దం పడతాయి! మనశ్శాంతి పెరిగి- ఏకాంత భావన తరిగి- వారిని సమాజం గర్వించదగిన దేశ పౌరులుగా తీర్చిదిద్దుతాయి.
వారిలో వారికే తెలియనంత ఐక్యూ పెరుగుతుంది. తద్వారా కళాకారులైన పిల్లలు చెప్పే పాఠంమీద - చదివే చదువుమీదా ఏకాగ్రత పెంపొందింపచేసుకుని మేటిగా తయారౌతారు. అధ్యయనకారులు కూడా ఇటీవల ఈ నిజాలను ఘంటాపథంగా అంగీకరించి ఆమోదించడం ఆధునిక పరిణామం! దైనందిన జీవితంలో వ్యాపకం లేని మెదడు దెయ్యాలకోట కాకుండా చూసుకోవాలంటే సంగీత సాధనను మించిన ఉపయుక్త వ్యాపకం వేరొకటి లేదని సూత్రీకరించవచ్చు!
తన ఆలోచనల చురుకుదనానికీ- మెదడు మెరుగైన రీతిలో జ్ఞాపకశక్తి పెంచుకోవడానికీ తన సంగీతమే మూల కారణమని- కీ.శే. మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటివారు అంగీకరించారు. హృదయ స్పందన మొదలుకొని, అనంత ఆకాశ తీరాల నుండి రాలిపడే వాన నీటి చుక్క వరకూ అన్నింటా రసాస్వాదన కలిగించే సంగీత శబ్దమే- ఈ చరాచర జగత్తులో శ్రుతిలయకు మూలమైన జీవన నాదం! అది ఒక ప్రపంచ భాష! ఆద్యంతమెరుగని అనురాగ రాగం- మనందరి మనసులను తమాషాగా తట్టి లేపుతుంది.
సంగీతానికి రాళ్ళను కలిగించే శక్తి వుందని ఋజువైన ఈ జీవన నేపథ్యంలో సంగీతమొక సహజీవన యాత్రకు సహాయకారి. ప్రముఖ వాయిద్యకారుడు వారెన్ బఫెట్ 85 ఏళ్ళ వయసులో కూడా తనలో నెలకొన్న చరుకుదనానికి హేతువు తన నరనరాల్లో ప్రవహిస్తున్న సంగీతమేనని నొక్కి చెప్పాడు. మరి అంతటి విశేష విశే్లషణ కలిగిన సంగీతానికి నేడు మన జీవితాలలో అందుతున్న ప్రోత్సాహమెంత? ఏ కళాపోషణకూ నోచుకోని జీవితం- ఎందుకూ కొరగాదని ఏనాడో మన ముళ్ళపూడివారు ముచ్చటగా హెచ్చరించారు కదా!
మాతృత్వపు మమకారానికి మచ్చుతునకగా చెప్పబడిన మన లాలిపాట- జోలపాట శ్రావ్యతతో సంబంధంలేని సంగీత పాఠం. ఎలా అంటే పసి వయసు నుంచి పెద్దయ్యేవారికి కూడా హాయినిగొలిపే హార్మోన్- డోపమైన్- సంగీతం వినడంవలన మెదడు కేంద్రంలో రెట్టింపవుతుంది. నేర్పేందుకు సంగీతం క్లాసులు కూడా వుండేవి. చదువుతో అలసిపోయిన మెదడు స్వాంతన పొందేవి ఆ క్లాసు ద్వారానే!
మరి ఈ రోజుల్లో ఈ ఇంగ్లీషు మీడియం ఇంటర్నేషనల్ స్కూళ్లలో అటువంటి అవకాశమేది? బలవంతపు బట్టీయం చదువుల్లో ఆట పాటల తీరుతెన్నులు కూడా ఆధునికమైన సృజనాత్మకతకు సుదూరంకావడం సహజమైన పరిణామం. కళాత్మకతకు కాస్తంతైనా అవకాశమీయని ఈ యాంత్రిక విద్యలు- మన పిల్లలకూ బతుకుతెరువు చూపించగలవేమోగానీ బతుకు బరువును తగ్గించలేవు. మానసిక ప్రశాంతతకు మార్గాన్ని చూపలేవు. ఇటీవల ఇంతై వటుడింతై.. అని పెరిగిపోతున్న డిప్రెషన్‌కి విరుగుడు మందు ఈ సంగీత సాధన ద్వారానే సాధ్యం! అందుకే మానసిక ఒత్తిడిని మాయం చేసే సంగీతంపై చిన్నచూపు తగదు. మనసుకు మందు వేయగల శక్తి- ఒక్క సంగీతానికే వుంది!

-మరువాడ భానుమూర్తి 8008567895