Others

ఇంతి ఇంతింతై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెన్నవంటి మనసు
సన్నజాజి రూపు
ఎన్నదగిన వనె్న
ఎనె్నన్ని ఉన్నా..
కనె్నపిల్లల బతుకు
కన్నీటి పాలగును
అందమే శాపమా?
అది ఆమె పాపమా?

కలువ రేకుల కళ్లు
అద్దాల చెక్కిళ్లు
నండూరి ఎంకిలా
నాజూకు నడుము
కలబోసి చెక్కినది
కనె్నపిల్ల సొగసు
సొగసు సొంతమైనా
శోకమైన బతుకు!
అందమే శాపమా?
అది ఆమె పాపమా!?

అమ్మగా.. ఆలిగా..
ప్రేమ పంచిన పడతి
బొమ్మగా మారడం
కాలమహిమే కదా!
చెల్లిగా.. చెలియగా..
అవతరించిన అతివ
మనసు చంపుకొనుట..
మహిళలకు శాపమే..!
అది ఆమె పాపమే!

-యం. భానుప్రియ