మెయిన్ ఫీచర్

పనిమనిషి నుంచే జీవిత పాఠాలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కోట్లాది రూపాయలు వారసత్వంగా వచ్చిన సంపద కాదు ముఖ్యం నాకంటూ సొంత వారసత్వాన్ని నిర్మించుకుంటాను’’ అని అంటోంది అనన్యా బిర్లా. దేశంలో అతి సంపన్నుడైన కుమార మంగళం బిర్లా కుమార్తె అయిన 21ఏళ్ల అనన్యా బిర్లా చురుకైనది, తెలివైనది, తనకంటూ ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ దూసుకుపోతున్న యువ పారిశ్రామికవేత్తగా నేడు సుపరిచితురాలు. ఇది తండ్రి వారసత్వంగా వచ్చిన ప్రతిభ కాదు. అసలు ఆమెకు తండ్రి వద్ద చనువే లేదు. బిజీగా ఉండే తండ్రి ఎపుడైనా ఒకసారి కనిపించినా చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యేదానిని చెబుతోంది. రెండు పదులు కూడా నిండని వయసులోనే వ్యాపారంలో అడుగుపెట్టి తన వ్యాపారాన్ని బిర్లా వారసత్వ వ్యాపార సామ్రాజ్యంలో భాగం చేయకుండా తనవ్యాపారంగా దినదినాభివృద్ధి చేస్తున్న అనన్యా బిర్లాకు స్ఫూర్తి ఎవరో తెలుసా ఒకరు పనిమనిషి, మరొకరు మదర్‌థెరిస్సా.
ఆరు నెలల వయసు నుంచే పనిమనిషి లత చేతిల్లో పెరిగానని, పసి వయసు నుంచే ఆమెను గమనించటం వల్ల ఎన్నో విషయాలను జీవిత పాఠాలుగా నేర్చుకున్నానని చెబుతోంది. పుట్టుకతోనే బంగారు స్పూనుతో పుట్టినా... ఏ మాత్రం అహంకారం, అతిశయోక్తి లేకుండా జాలీగా జీవితాన్ని గడపేయకుండా భిన్నమైన ఆలోచనలతో సంపదను సృష్టించి, ఆ సంపదతోనే పేదలకు ఏదైనా చేయాలనే ఆరాటపడే అనన్య చిన్నప్పటి నుంచి ఏదో ఒక వ్యాపకాలతో గడిపేది. పసిప్రాయం నుంచే అనన్య చేత ఫజిల్స్ పూరించటం, ఏదైనా డిజైన్స్ కుట్టించటం, అందమైన చేతిరాతను నేర్పించటం తదితరవన్నీ తల్లి నీరజా బిర్లా నేర్పించిందట. ఇలా మంచి వ్యాపకాలతో పెరగటం వల్లనేమో తాను చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా నిర్మాణాత్మకంగా చేయటం అనేది అలవడిందేమోనని అంటోంది. ఇక స్కూల్లోనైతే టెబుల్ టెన్సిస్, స్విమ్మింగ్, ఫుట్‌బాల్ ఆడటం తదితర వ్యాపకాలతో బిజీ బిజీగా ఉండేది. దీనికి తోడు ఆమె ఏ పని చేసినా తల్లిదండ్రులు ఓపెన్‌మైండ్‌తో వ్యవహరించేవారు.
బిర్లా వారసురాలిగానే ఆమెకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయట. ముఖ్యంగా టీనేజ్‌ప్రాయంలో స్కూలుకు వెళ్లే వయసులో సంపన్నురాలైన బిర్లా మనవరాలిగా ఆమెను ప్రత్యేకంగా చూ డటంతో అటువంటి పరిస్థితులకు ఇమడలేక స్కూళ్లను తరచూ మార్పించుకోవాల్సి వచ్చింది. చివరకు ఇంటి వద్దే చదువుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే తాను పరిశీలించిన పరిస్థితులు మనసు పొరల్లో నాటుకుపోయి అదే ‘ స్వతంత్ర ఫైనాన్స్’ కంపెనీ ఏర్పాటుకు దారితీసిందని చెబుతోంది. గ్రామీణప్రాంత మహిళలకు అతి తక్కువ వడ్డీకి రుణాలను అందజేసే ఈ సంస్థను 2013లో అనన్య ప్రారంభించారు. యుక్తవయసులో ఓ యువతి విశాల దృక్పధంతో ఏర్పాటుచేసిన ఈ సంస్థపై ఎలాంటి ప్రతికూల భావాలు ఏర్పడలేదంటే అతిశయోక్తికాదు. ఇచ్చిన రుణాలను నిక్కచ్చిగా చెల్లించే కస్టమర్లు దాదాపు 1,20,249 మంది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్నారు. పేద గ్రామీణ మహిళలను స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు చేయుతనివ్వాలనే తలంపు యుక్తవయసులోనే ఆమెకు రావటం, నేటికీ ఈ సంస్థపై ఎలాంటి విమర్శలు సైతం రాకపోవటం ఆమె నిబద్ధతకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ సంస్థ ఏర్పాటుచేసేందుకు తండ్రిని ఒప్పించి ఐదుకోట్ల రూపాయలు తీసుకుంది. అది నేడు 128 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది.
గ్రామీణ పేద మహిళలు కుట్టుమిషన్లు, పాడి గేదెలు తదితరవాటిని కొనుగోలు చేసేందుకు అతి తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తారు. ప్రభుత్వ బ్యాంకుల చుట్టూ తిరగలేక ఈ సంస్థలో రుణాలు తీసుకుని ఎంతోమంది ఉపాధి పొందటమే కాకుండా తిరిగి రుణాలు చెల్లించే అర్థికంగా అభివృద్ధిచెందుతున్నారు. ఈ సంస్థను ఏర్పాటు చేసేముందు అనన్యకు ఆమె తల్లి ఓ సలహా ఇచ్చిందట! రోమ్ నగరాన్ని ఒక్కరోజులో నిర్మించలేదు. అలాగే వ్యాపారాన్ని కూడా ఒక్కరోజులోనే విస్తరించలేమని చెప్పిందని అంటారు.
వ్యాపారంలో వస్తున్న ఆదాయాన్ని చూసి పొంగిపోకుండా ఈ-కామర్స్ వెంచర్‌ను ప్రారభించింది. మన చుట్టూ ఉండేవారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయటమే ఈ వెంచర్ ఉద్దేశ్యమంటారు. ఎంతోమంది సృజనాత్మకంగా చేతితో తయారుచేసిన వస్తువులకు మార్కెట్ లేక చిన్న చిన్న వ్యాపారాలు మూతపడుతున్నాయి. చేతకళలకు ఆదరణ కల్పించే ఉద్ధేశ్యంతో హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించేందుకు ఈ-కామర్స్‌ను ఏర్పాటుచేయటం జరిగిందని అనన్య వెల్లడిస్తున్నారు. నిరుపేద చేతివృత్తులువారు తయారుచేసిన వస్తువులకు ఓ బ్రాండ్ కల్పించే పనిలో ఆమె ప్రస్తుతం నిమగ్మమయ్యారు. రాబోయో ఐదేళ్లలో ఈ వ్యాపారాన్ని కూడా లాభాల బాటలో నడేపేందుకు ఆమె ప్రణాళికలు రచిస్తున్నారు.
12 ఏళ్ల వయసులో ఆమె రాసిన ‘అనన్య అంటే ఎవరు? అనే కవిత ఆమెను బిర్లా వారసురాలిగా కాకుండా తానేంటో ఓ బ్రాండ్‌గా రూపొందేందుకు దోహదం చేస్తుందని చెబుతున్నారు. ఖాళీ సమయంలో గిటార్ వాయిస్తూ రిలాక్స్ అవుతోంది. ధైర్య సాహసాలను గుండెల్లో నింపుకుని అడుగు ముందుకువేస్తే అపజయం లేదంటోందామె.