మెయన్ ఫీచర్

భాజపాకు ప్రమాద ఘంటికలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాపై ఆర్థిక ఆంక్షలు విధించి- ఆ దేశం నుంచి సరుకుల దిగుమతిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోయింది? కులభూషణ్ యాదవ్‌ను పాక్ జైలు నుండి ఎందుకు విడిపించలేకపోతోంది? బలూచిస్తాన్ ఎనభై సంవత్సరాలుగా స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నది. అక్కడ చైనా తన కారిడార్‌ను నిర్మించింది. దీనిని వ్యతిరేకించిన బెలూచీలను గుంపులు గుంపులు చంపివేస్తున్నారు. బెలూచిస్తాన్‌కు స్వాతంత్య్రం ఇప్పించాలని భారత్ ఎందుకు వాదించలేకపోతున్నది?

వీణ్ నిషాద్ అట్టడుగు వర్గానికి చెందినవాడు. క్రియాశీల సమాజవాదీ పార్టీ కార్యకర్త. ఈయనను ఆ పార్టీ గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల్లో తన అభ్యర్థిగా రంగంలోకి దించింది. ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ గోరఖ్‌పూర్‌లో ఒక మఠం నిర్వహిస్తున్నాడు. ఇక్కడ జాతి కుల మత భేదాలుండవు. అందరూ కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. యోగి అధికారానికి అక్కడ తిరుగులేదు. వరుసగా ఆయనే గోరఖ్‌పూర్ ఎంపీగా ఎన్నిక అవుతూ వచ్చాడు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో గోరఖ్‌పూర్ ఎంపీ సీటుకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి ఆ మఠంతో సంబంధం లేనివాడు. నిషాద్ మాత్రం యోగి మఠానికి సేవలు చేస్తుంటాడు. ‘మిత్రులారా.. నన్ను గెలిపిస్తే యోగి ఆదిత్యనాథ్ మఠాన్ని గెలిపించినట్లే’ అని నిషాద్ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. దాంతో ఆయన గెలిచాడు. ఇది వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు కాని.. కఠోర వాస్తవం. సొంత శిష్యుడే ఆదిత్యనాథ్ ఆధిపత్యానికి గండి కొట్టాడు.
యూపీలో బాగా అపఖ్యాతిపాలైన రాజకీయ నాయకులలో ములాయం సింగ్ ఒకడు. ఈయన ముగ్గురు భార్యల ముద్దుల దశరథుడు. చిన్న భార్య కైక ఒక వరం కోరింది. తన కొడుకును పట్ట్భాషేకం చేయటం, పెద్ద భార్య కొడుకు అఖిలేశ్‌ను అడవులకు పంపించటం. ఇక్కడ కలియుగ రామాయణం కథ అడ్డం తిరిగింది. అఖిలేష్ యాదవ్ తన తండ్రి ములాయంపైనే తిరగబడ్డాడు. ఈ తిరుగుబాటులో సమాజవాద్ పార్టీ రాజకీయాధికారాన్ని కోల్పోయింది. గోరఖ్‌పూర్‌లో ప్రవీణ్ నిషాద్ గెలిచినంత మాత్రాన సమాజవాదీ పార్టీ పునరుత్థానం సాధ్యం కాకపోవచ్చు. కాని ఇది బిజెపికి ప్రమాద ఘంటికలను మ్రోగించింది. యూపీలో మరొక అపఖ్యాతిపాలైన రాజకీయ నాయకురాలు మాయావతి. ఈమె కుల రాజకీయాలను ప్రజలు అసహ్యించుకున్నారు. ‘నాకు పూలదండలు వద్దు, నోట్ల దండలు వేయండి’ అని ఆమె ఎన్నికల సభలలో కోరింది. పెద్దనోట్ల రద్దుతో బాగా నష్టపోయిన వారిలో మాయావతి ఒకరు. తాజ్ కారిడార్ నిర్మాణం కేసులో ఆమె మొదటి నిందితురాలు. ‘నాకు మద్దతునివ్వకపోతే నిన్ను జైలుకు పంపుతాను’ అని లోగడ సోనియా గాంధీ మాయావతిని బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసి బిఎస్‌పి మద్దతును పొందింది. ఇప్పుడు మారిన పరిస్థితులలో మాయావతి, భగోరియా వంటి బిఎస్‌పి నాయకులు బిజెపికి వ్యతిరేకంగా గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్‌లో పనిచేశారు. అంటే దళిత క్రైస్తవులు- ముస్లిములు ఏకమైనారు. దీనిని ఎస్పీ అభ్యర్థి సద్వినియోగం చేసుకున్నాడు. ఇక బిజెపికి మొదటి నుండి వెన్నండి నిలిచిన బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కుర్మీ సామాజిక వర్గం ఓటింగుకు కదలలేదు.
‘మరో పది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇవ్వాళ ఎవరు గెలిస్తే మనకేమిటి?’- అని హిందూ సామాజిక కార్యకర్తలు నిర్లిప్తంగా ఊరుకున్నారు. ‘అరయగ కర్ణుండు చచ్చె ఆర్గురి చేతన్’ అన్నట్లు గోర్‌ఖ్‌పూర్‌లో బిజెపి అభ్యర్థి ఓడిపోయాడు. ఫూల్‌పూర్‌లోను ఇదే జరిగింది. బీహార్‌లో ఆర్‌జెడి అభ్యర్థి గెలిచాడు. జైలులో వున్న లాలూ ప్రసాద్ సానుభూతి పవనాలు పనిచేశాయి. ఇవన్నీ మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య నిజస్వరూపానికి దర్పణం పడుతున్నాయి. ఫూల్‌పూర్ 1962 నుండి నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన లోక్‌సభ స్థానం. అయితే ఈ స్థానంలోను, గోరఖ్‌పూర్‌లోను కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో బిజెపి ఓడిపోవడం గమనార్హం.
భారత్‌లో జరుగుతున్న ఎన్నికలలో చైనా, పాకిస్తాన్‌లు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నాయి. యూపీలో అజంఖాన్ అనే ఉగ్రవాది పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంటు, ఎస్పీలో కార్యకర్త. బిజెపి ఓటమికి ఎక్కువ సంతోషపడింది ఆ పార్టీ సిద్ధాంతకర్తలే. ఒక సిద్ధాంతంతో నడుస్తున్న పార్టీలు రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి కమ్యూనిస్టు పార్టీ, రెండవది బిజెపి. తక్కిన పార్టీలన్నీ వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాయి. అనేక ప్రాంతీయ పార్టీలు జాతీయ సిద్ధాంతాలు లేనివే. కమ్యూనిస్టులు అరాచక శక్తులను ప్రోత్సహించి హత్యా రాజకీయాలను ఆదరించటంతో కమ్యూనిజం సహజ మరణం చెందింది. ఇక బిజెపి మాటేమిటి?! ఒకనాటి భారతీయ జనసంఘ్ పార్టీ బిజెపిగా అవతరించింది. జనసంఘ్‌లో శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, డాక్టర్ రఘువీర్, బల్‌రాజ్ మధోక్, అటల్ బిహారీ వాజపేయి, విజయరాజె సింథియా వంటి తొలి తరం నాయకులు ఉండేవారు. వీరంతా పార్టీ కోసం జీవితాలను అంకితం చేశారు. గోపాలరావు ఠాకూర్ యూపీ నుంచి విజయవాడ వచ్చాడు. తెలుగు నేర్చుకొని 1950 నుండి జనసంఘ్ విస్తరణకు దోహదం చేశాడు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జీవించాడు. ఇలా లక్షలాది జనసంఘ్ కార్యకర్తలు తొలి వెలుగులై పార్టీ నిర్మాణానికి తోడ్పడ్డారు. ఇవ్వాళ బిజెపిలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, దత్తో పంత్‌జీ, నానాజీ దేశ్‌ముఖ్‌లు లేరు. బిజెపి అధికారంలో ఉన్నది కదా అని పనులు చేయించుకోవటం వచ్చినవారే ఆ పార్టీలో ఎక్కువగా ఉన్నారు.
బిజెపికి కొన్ని వౌలిక సిద్ధాంతాలున్నాయి. అందులో మొదటిది శ్రీలంక- నేపాల్ తూర్పు పశ్చిమ పాకిస్తాన్‌లు బర్మా ఆప్ఘనిస్తాన్‌లను ఏకం చేసి సాంస్కృతిక అఖండ భారత్‌ను నిర్మించటం. దీన్ని గూర్చి ఇవ్వాళ ఎవరూ మాట్లాడటం లేదు. ఇక రెండవది దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం. అయోధ్యలో రామాలయం, మధురలో కృష్ణాలయం, వారణాసిలో శివాలయం ఈ సాంస్కృతిక భావజాగృతిలో అంతర్భాగమే. ఐతే ఇవేవీ జరుగలేదు. కనీసం హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా, వికారాబాద్‌ను గంగవరంగా, అహమ్మదాబాద్‌ను కర్ణావతిగా, అలహాబాద్‌ను ప్రయాగగా మార్చటంలో బిజెపి ప్రభుత్వం విఫలమైంది. న్యూఢిల్లీలో అక్బర్ రోడ్, ఔరంగజేబు రోడ్డులున్నాయి. విజయవాడలో కారల్‌మార్క్స్ రోడ్ ఉంది. ఇలాంటి పేర్లు పెట్టుకోవడానికి భారతీయులు సిగ్గుపడటం లేదు సరికదా ఇదేదో ఘనతగా భావిస్తున్నారు. బానిసత్వాన్ని అనుభవించటంలో ఆనందం పొందుతున్నారు. విదేశీయుల పేర్లు పెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. కన్నయ్య అంటే వీరికి అసహ్యం. కెన్నడీ అని పిలుచుకోవటం ఇష్టం. ఈ మానసిక దాస్యం నుండి జాతిని విముక్తం చేయడానికి పుట్టినదే బిజెపి, ఆ పని తప్ప తక్కినవన్నీ చేస్తున్నది. ఆర్టికల్ 370 రద్దుచేసి కాశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేయగలిగిందా? ఫెడరల్ విధానాన్ని రద్దుచేసి యూనిటరీ రాజ్యాంగం నిర్మించగలిగిందా? ఉగ్రవాదుల నుండి దేశాన్ని విముక్తం చేయగలిగిందా? కమ్యూనిస్టు గూండాల నుంచి కేరళను రక్షించగలిగిందా? రూపాయి పతనావస్థలో వుంది. వంద రూపాయల నోటు కొనుగోలు శక్తిని కోల్పోయింది. ఆర్థిక రంగంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమిటి? తెలంగాణలో కెసిఆర్, సీమాంధ్రలో చంద్రబాబు, తమిళనాడులో స్టాలిన్, కర్నాటకలో సిద్ధరామయ్య, కేరళలో విజయన్, మహారాష్టల్రో ఉద్ధవ్ థాకరే, గుజరాత్‌లో హార్దిక్ పటేల్ బిజెపి పతనం కోసం కృషిచేస్తున్నారు. ఈ సంగతి బిజెపి అగ్రనాయకులకు తెలిసినా ఎందుకు ఉష్టప్రక్షి ధోరణిని అవలంబిస్తున్నారు?
అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నేపాల్, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, నాగాలాండ్ ప్రాంతాల్లో చైనా అనుకూల వర్గాలు ప్రత్యక్ష పోరాటాలు చేస్తూ జాతీయ భద్రతకు సవాలు విసురుతున్నాయి. చైనాపై ఆర్థిక ఆంక్షలు విధించి- ఆ దేశం నుంచి సరుకుల దిగుమతిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోయింది? కులభూషణ్ యాదవ్‌ను పాక్ జైలు నుండి ఎందుకు విడిపించలేకపోతోంది? బలూచిస్తాన్ ఎనభై సంవత్సరాలుగా స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నది. అక్కడ చైనా తన కారిడార్‌ను నిర్మించింది. దీనిని వ్యతిరేకించిన బెలూచీలను గుంపులు గుంపులు చంపివేస్తున్నారు. బెలూచిస్తాన్‌కు స్వాతంత్య్రం ఇప్పించాలని భారత్ ఎందుకు వాదించలేకపోతున్నది? 2జి స్పెక్ట్రం కేసులో తమిళ నాయకులు నిర్దోషులుగా ఎలా ప్రకటింపబడ్డారు? సల్మాన్‌ఖాన్ సినీనటుడు కావటంతో పలు కేసుల్లో నిర్దోషిగా బయటపడ్డాడు. ప్రజలకు న్యాయస్థానాలపై విశ్వాసం పోతే ప్రజాస్వామ్యం నియంతృత్వానికి దారితీస్తుంది. బిజెపి తన చారిత్రక పాత్రను నిర్వహించలేకపోయింది. అమెరికా- చైనా- పాకిస్తాన్‌లకు కావలసిందిగా ఇదే!
2019 ఎన్నికల్లో ‘మాకు మరొక్క ఛాన్సు ఇవ్వండి. అయోధ్యలో అప్పుడు రామాలయం కడతాను. ఆక్రమిత కాశ్మీరును భారత్‌లో కలుపుతాము. చైనా సరకులపై నిషేధం విధిస్తాము. ఇత్తెహాదుల్ మజ్లిస్ వంటి సంస్థలను రద్దుచేస్తాము. కేరళను కమ్యూనిస్టుల నుండి విముక్తం చేస్తాము. సోనియా, దయానిధి మారన్, పి.చిదంబరం, మణిశంకర్ అయ్యర్, రాబర్ట్ వాద్రా, ములాయం సింగ్ అక్రమాస్తులను జప్తు చేస్తాం’ అంటే ప్రజలు నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరింపబడిన మణిశంకర్ అయ్యర్‌ను ‘రాజద్రోహ నేరం’ కింద ఎందుకు అరెస్టు చేయలేకపోయారు? కేంద్ర సంగీత సాహిత్య నాటక అకాడమీ కార్యవర్గాలను కన్వీనర్లను మీరు ఎందుకు రద్దుచేయలేకపోయారో వివరించండి. పార్లమెంటులో ఎంపీలు పరస్పరం మైకులు విసురుకుంటుంటారు. దీనిని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటారా? తమిళనాడులో రోజురోజుకూ ఉత్తర భారత వ్యతిరేకత- సంస్కృతం - సంస్కృతి- హిందీ - హిందూ వ్యతిరేకత పెరుగుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాలల్లో రాజకీయ పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. తెలంగాణలో తెరాస-తెదేపాల మధ్య ఎన్నికల పొత్తు ఖరారు అయినట్టేనా? దీనికి కాంగ్రెస్, బిజెపి ఎందుకు స్పందించడం లేదు. మోదీ ప్రభుత్వంపై లోక్‌సభలో జగన్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మద్దతునివ్వటం అనూహ్య పరిణామం. ఈ ఎత్తులు, అనైకతిక పొత్తులు బిజెపిని ఇరుకున పెట్టడానికే అని వేరే చెప్పనక్కరలేదు.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668