మెయిన్ ఫీచర్

ఆడపిల్లలకు ఇవి చెబుతున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల పెంపకం కత్తిమీద సాములాంటిదేనని ప్రతి తల్లి అంగీకరించే విషయం. వారి ఎదుగుదలను గమనించటంతో పాటు వారికి జీవిత పాఠాలను కూడా తల్లే బోధించాల్సి ఉంటుంది. అందుకేనేమో బిడ్డలు ఎదుగుతున్న కొద్దీ వారి ప్రవర్తనకు అనుగుణంగా ప్రతి తల్లి తనను తాను మలుచుకుంటోంది. తల్లి బోధించే పాఠాలే సమాజంలో ఆడపిల్లకు ఉన్నతమైన స్థానమే లభించటమే కాదు ఆత్మవిశ్వాసంతో, నిర్భయత్వంతో ముందుకు సాగుతోంది. నాలుగేళ్ల వయసు నుంచే వారికి చెప్పాల్సిన విషయాలను తల్లి విడమర్చి చెప్పాల్సి ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం...
బార్బీ బొమ్మలతో కాదు కారు బొమ్మలతో ఆడుకోమని చెప్పండి. బుక్స్, ఫజిల్స్, బ్లాక్స్, కిచెన్ సెట్స్, ప్లే టెంట్స్ తదితరవాటిని ఆ ఆ పిల్ల ముందు ఉంచితే ఏది కావాలంటే అది ఎంపిక చేసుకుంటుంది.
అందమైన చూపులు, అందం మీద మనసు లగ్నం చేసేలా ప్రోత్సహించవద్దు. అంతఃసౌందర్యమే ఆభరణమని తెలియజేస్తే వారిలో అందం పట్ల ఆత్మన్యూనతా భావం వీడి అంతఃసౌందర్యమే ఆనందం అనేలా ప్రవర్తిస్తారు.
ఎదుగుతున్న ఆడపిల్లలకు అందంతో పాటు ఆరోగ్యం గురించి వివరించాల్సిన అవసరం ఉంది. శారీరక బరువు పట్ల ఎపుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన మేరకు ఎపుడూ ఎదో ఒకటి తినమనే ప్రోత్సహించండి. సమాజంలో విభిన్నమైన శారీరక ఆకృతులతో మనుషులు ఉంటారు. వారిని స్వాగతిస్తూనే..్ఫట్‌గా ఉండేందుకు తినాలేగానీ సన్నగా ఉండాలనే తపనతో తిండి తినవద్దని చెప్పండి.
భయం అనే భావనతో ఎవ్వరినీ ఏ ప్రశ్న వేయవద్దు. పిల్లలు మనసు సందేహాల పుట్ట. సహనం, ఓర్పుతో వారికి సమాధానాలు ఇస్తే వారిలో ఆత్మవిశ్వాసం, భయం లేకుండా పెరుగుతారు. దీంతో రెండోసారి చెప్పకుండానే ఏపనైనా చేయగలుగుతారు.
నెలనెలా వచ్చే రుతుస్రావం సర్వసాధారణ విషయంగా మీరు భావించటంతోపాటు అందుకు అనుగుణంగా ఇంట్లో ప్రవర్తిస్తే.. ఆడపిల్లలు సైతం వంటగదిలోకి వచ్చి ఏపనైనా స్వేచ్ఛగా చేయగలుగుతారు. దీనివల్ల రుతుస్రావం తమకు లభించిన వరంగా ఆడపిల్లలు భావించేలా తల్లి ప్రవర్తించాలి. మూఢనమ్మకాలతో ఆంక్షలు పెట్టవద్దు.
బిడ్డల కలల సాకారానికి తల్లిదండ్రులు సహకరించాలి. పసివయసులో వారి కలలను కొట్టిపారేయకండి. ఆడపిల్లలేమిటి? కలలు కనటమేమిటి? ఇలా పగటి కలలు కంటూ దారితప్పుతారని భావించారో వారి స్వేచ్ఛకు అడ్డుకట్టవేసినట్లే. సామాజికంగా ఎలాంటి ఒత్తిడి వచ్చినా.. వారి కలల సాకారానికి తల్లిదండ్రులు మీ వంతు సహకారం ఇవ్వటమేకాకుండా వారిని ప్రోత్సహించండి.
పెళ్లికి ప్రాధాన్యం ఇవ్వమని చెప్పాలేగానీ.. అదే జీవిత సర్వస్వమని ఒత్తిడిచేయవద్దు. ఉన్నతమైన చదువు,
స్వతంత్రంగా కెరీర్‌ను తీర్చిదిద్దుకుని స్వతంత్రంగా జీవించటం ద్వారానే ఆనందమైన జీవితాన్ని గడపవచ్చని చెప్పాలి. ఇవన్నీ సాధించిన తరువాతే పెళ్లి చేసుకోవటానికి సిద్ధంకావాలని వారి మనసుల్లో నింపండి.
రాబోయో కాలంలో తల్లిగా, కుమార్తెగా, సోదరిగా ఏ పాత్రలో జీవించినా.. తనకంటూ స్వతంత్రంగా సొంత గుర్తింపును సాధించుకోవాలనే తపనతో ముందుకుసాగాలి.
ప్రస్తుత సమాజంలో వారు సురక్షితంగా, భద్రంగా ఎలా జీవించాలో నేర్పండి. మగవారు, అపరిచితులు ఆడపిల్లలను తాకుతూ మాట్లాడతారు. ఈ సందర్భంలో ఆ స్పర్శ మంచిగా ఉందో లేదా ఏదైనా దుర్భిద్దితో తాకుతున్నారో విడమర్చి చెప్పండి. ఆత్మీయ స్పర్శ ఎలాఉంటుందో వారికి వివరిస్తే.. అపరిచితులు పట్ల చిన్నవయసు నుంచే ఆడపిల్లలు సురక్షితంగా ఉంటారు.
స్వార్థంగా ఉండటం నేరం కాదు. మీకోసం, మీ అవసరాల కోసం కొన్నిసార్లు స్వార్థంగా వ్యవహరించటంలో తప్పులేదని తెలియజెప్పండి.
స్నేహితులు తదితరులతో వాగ్వివాదం చేసే సందర్భంలోగానీ ఆడ పిల్లలు తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించాలి. ప్రతి సందర్భంలోనూ తల్లే చెంత వుండదు. ఒంటరిగా జీ వించే పరిస్థితులు ఉత్పన్నమైనపుడు గట్టి గా, నిర్భయంగా మీ అభిప్రాయాలను వెల్లడించండి.
ప్రస్తుతం నెలకొన్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఆడపిల్లలు భ ద్రంగా జీవించటానికి అవసరమైన మానసిక, శారీరక దృఢత్వాన్ని అందించాల్సిన బా ధ్యత తల్లిపైనే ఉందని మరువకండి.

- టి.ఆశాలత