మెయిన్ ఫీచర్

సమయంతోనే సృజనాత్మకత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫీసుకు అప్పుడే వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేసి వచ్చి కూర్చున్న మంజుల తనకు ఫోన్‌కాల్ వచ్చిందని ప్యూన్ వచ్చి చెప్పడంతో వెంటనే లేచి వెళ్లి ఫోన్ అందుకుంది. అవతలి వైపు నుంచి రమ గొంతు వినిపించింది. ‘ఏంటి ఇంత ఉదయమే ఫోన్ చేశావు. ఆఫీసుకు రావడం లేదా ’అని అంది మంజుల.
‘అవును. నిన్న చుట్టాలు వచ్చారు. దాంతో పని ఎక్కువైంది. ఈరోజు నాకు అంతగా ఒంట్లో బాగుండడం లేదు. ఇంటి పని వంటపని చేయడంతో బాగా అలసిపోయాను. అందుకే నేను లీవ్ పెట్టానని బాస్‌తో చెప్తావేమో నని కాల్ చేశాను’ అంది రమ.
‘అవును కాని నీకు పనిమనిషిని పెట్టుకోమని చిలకకు చెప్పినట్టు చెప్పినా నీవు వినమేమిటి?’ అంది మంజుల
‘వూఁ..’ అని చిన్న మూలుగు తప్ప మాట లేదు అవతలి వైపు.
‘సరేలే తరువాత మాట్లాడుతా’ అని ఫోన్ పెట్టేసింది మంజుల
రమ లాంటి వాళ్లు మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఇంటి పని చేసుకొనేందుకు పనిమనిషిని పెట్టుకుంటే ఆమెకు ఇచ్చే జీతం దండుగ ఖర్చు అని ఇంటి పని అంతా తమపైనే వేసుకొని సతమతమయ్యే మథ్యతరగతి గృహిణులు ఇంకా ఉన్నారు. అందుకే వారు శారీరికంగా బాగా అలసిపోతున్నారు. వారిలో సృజనాత్మకత ఉన్నా దాన్ని వెలికితీయడానికి తగిన సమయం లేక ఎవరైనా సృజనాత్మకమైన పనులు చేసినపుడు నాకు కూడా అలాంటి ఐడియాలు చాలా వస్తాయి. అవి అన్నీ చేద్దామంటే టైమ్ లేదు అని వాపోతుంటారు.
శ్రమ అనేది ఏదైనా మానసికమైనా, శారీరకమైనాశ్రమే. కాదనం. కాని ఈ శ్రమలో కొంత వ్యత్యాసాలు ఉంటాయి. వాటిని గమనించాలి. శారీరక శ్రమతో ఒకలాంటి పనులు చేస్తే మానసిక శ్రమతో అద్భుతాలను సృస్టించవచ్చు. అందుకే ఇల్లు కట్టేమేస్ర్తి ఎంత ముఖ్యమో ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ చేసే వాళ్లు కూడా అంతే ముఖ్యం. ఎవరి పని వారికి ప్రాముఖ్యమైందే. అయితే మనకు ఏ సమయానికి ఏ పని కావాలి అని ఎంచుకోవడంలోనే విజ్ఞత ఉంటుంది.
మహిళలందరూ సామాన్యంగా అన్నీ పనులు చేస్తారు. కాని దేనికి ప్రాముఖ్యం ఇవ్వాలనేదాన్ని బట్టి వాళ్ల తెలివితేటలు బయట పడుతాయి.
ఉదాహరణకు కొంతమంది వారికి మంచి సమయం చిక్కితే అద్భుతమైన నిర్మాణాలు చేస్తారు. కొత్తదనంతో కూడిన రచనలు చేస్తారు. మరికొంతమంది ఎవరికీ తట్టని ఆలోచనతో వారు నలుగురికి మేలు చేసే పనులకు ప్రణాళిక వేస్తారు. ఇట్లాంటివాటికి సృజనాత్మక అవసరం. అందరిలో ఒకే లెవల్‌లో సృజనాత్మక ఉండదు. ఎవరి మైండ్ మెచ్యూరిటీని బట్టి లేకపోతే ఎవరి అనుభవాలను బట్టి , అవసరాన్ని బట్టి కొత్తవాటిని ఆవిష్కరించవచ్చు.
అయితే ఇవేవీ చేయకుండా నేను డబ్బులు కూడబెట్టాలి అని పనులు తానే చేసుకొంటూ ఉంటే మెరుగైన పనులను చేయడానికి తగిన సమయం లేకుండా పోతుంది.
ఉద్యోగినులు అయితే అటు ఆఫీసులో పనులు, ఇటు ఇంట్లో పనులు చేసుకోలేక సతమతమవుతుంటారు. వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి వారికి సమయమే ఉండదని అని వాపోతుంటారు. ఇట్లాంటివాళ్లు కూడా కొన్ని పనులను ఇతరులకు అప్పచెప్పాలి. పని మనిషిని పెట్టుకొంటే నైపుణ్యం అంతగా అవసరం లేని పనులు ఆమె చేసేస్తుంది. ఆ సమయాన్ని వీళ్లు నైపుణ్యమైన పనులు చేయడానికి ఉపయోగించుకోవాలి. అందుకే పనుల వికేంద్రీకరణ కావాలి అంటారు. అంతేకాదు చాలామంది పనిమనిషిని పెట్టుకోకుండా పొదుపు చేసిన డబ్బుతో పోలిస్తే లాస్ శాలరీ పేరు మీద కోల్పోయిది ఎక్కువే అనే విషయం మీద కూడా దృష్టి పెట్టరు.
చూడండి. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థల్లో వేతనాలు జీతాల విషయంలో తేడాలు , శారీరిక శ్రమ చేసేవారికన్నా మానసికమైన శ్రమను వెచ్చించిచే వారికి సౌకర్యాలు, వారి జీతభత్యాలు ఎక్కువగా ఎందుకుంటాయి అనుకొంటారు. ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే శారీరిక శమ్ర చేసేవారిలో ఖర్చు అయ్యే ఎనర్జి, మానసిక శ్రమను చేసేవారిలో ఖర్చు అయ్యే ఎనర్జి లెవల్స్ లో తేడా ఉంటుంది కనుకే. ఈ విషయం చాలామందికి తెలియదు. చూడండి మరొక ఉదాహరణ ఆఫీసుల్లో గుమాస్తాలకు ఒక్క ఫ్యాన్ సౌకర్యంమాత్రమే ఉంటుంది. అదే ఆఫీసరు అయితే ఎసి సౌకర్యం, విడిగా ఒక చాంబర్ ఇస్తారు. అలాగే ప్రయాణాలకు ఎసి క్లాసులు ఇస్తుంటారు. ఫ్లైట్ సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇదంతా చేసే పనులనుబట్టి సౌకఠ్యాలు, సమయం, నైపుణ్యత, ప్రాముఖ్యత ఇట్లాంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పని విభజన చేయాల్సి ఉంటుంది. ఇవి చేయడంలోకూడా మహిళలదే అగ్రస్థానం లో ఉండాలి అంటే వారు ఇట్లాంటి వాటిని మంచి అవగాహనతో అర్థం చేసుకొని పనులను విభజించుకొని ముందుక వెళ్లాలి. శారీరిక శ్రమ , మానసిక శ్రమ, వీటిలో దేనికి ప్రాముఖ్యం ఇవ్వాలి అన్న విషయం తెలుసుకుంటే అద్భుతాలు ఆద్యులు మనమే అవుతాం.

-మాధవ పెద్ది ఉష