మెయిన్ ఫీచర్

శ్రీ చక్రము మానవ శరీరము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక వ్యక్తి జాతక చక్రమును పరిశీలించినపుడు, ఆ వ్యక్తి జాతక చక్రమందు శుభగ్రహములున్న (గురు, శుక్ర, పూర్ణచంద్రుడు, వారితోకూడిన బుధుడు) రాశులకు చెంది శరీరావయములు ఆరోగ్యముగా నుండుట అట్లే అశుభగ్రహము (రవి, కుజ, శని, రాహు, కేతువు)లున్న రాశులకు చెందిన శరీరావయముల నారోగ్యముగా వ్యాధిగ్రస్థమగుట, జ్యోతష్యశాస్త్ర పరిచయమున్న వారెరిగిన విషయమే కదా!
మన శరీరం ఎంతో అద్భుతమైనది. ఎందువల్లనంటే, అది అద్భుతమైన దైవశక్తితో నడుపబడుతున్నది. విజ్ఞానశాస్త్రానికి అంతుపట్టని యెన్నో గొప్ప ఆశ్చర్యకరమైన శక్తులు మన శరీరంలో నిక్షిప్తమై ఉన్నాయి. అనంతమైన ఆత్మశక్తివల్ల జీవక్రియలచే అద్భుతమైన రుూ శరీరమనే యంత్రం నడుపబడుతున్నది. ప్రకృతి అంతా ఆవరించి వున్న విశ్వశక్తి మనలోని ప్రాణశక్తిని జాగృతంచేసి శరీరాంతర్గతం చేస్తోంది. ఈ ప్రాణశక్తి అసమతుల్యత వల్లనే శరీరం రోగగ్రస్తవౌతుంది. స్థూల శరీరారోగ్యానికి ఆహారమెంత అవసరమో, సూక్ష్మ శరీరానికి ప్రాణశక్తి అంత అవసరము. ఉచ్ఛ్వాస నిశ్వాసలు నియంత్రించి, శ్వాసను నిశ్చలముగా ఉంచి, ధ్యాననిమగ్నుడై అంతర్ముఖుడైన యోగికి జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. దీనినే ఆజ్ఞాచక్రం అంటున్నాము. జ్ఞాని తను కూర్చున్నచోటునుండే సమస్త బ్రహ్మాండాన్ని చూడగలడు. సంపూర్ణ జ్ఞానం కలగడంతోపాటు మూడవ నేత్రం తెరుచుకుంటుంది. దీనినే ఆత్మసాక్షాత్కారమని అంటాము ఇది అకుంఠిత దీక్షతో, నిరంతర సాధన చేయగలిగితే ప్రతి వ్యక్తి ఆత్మసాక్షాత్కారానికి అర్హుడే. భ్రూమధ్యం వెనుక వెన్నుపూస ప్రారంభ స్థానమే, ఆజ్ఞాచక్రస్థానం. పంచ జ్ఞానేంద్రియాలు (కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం) రోగగ్రస్తం కాకుండా ఉండాలంటే, ఈ ఆజ్ఞాచక్రాన్ని బాగా శక్తివంతం (చార్జి)చేసుకోవాలి.
మనస్సు, బుద్ధి, అహంకారం ఈ మూడు ఆజ్ఞాచక్రంలోనే ఉంటాయి. శరీరంలోని సమస్తనాడులు యిందులోనే కలుస్తాయి. బుద్ధి ఆజ్ఞాపిస్తుంది. కాబట్టి, శరీరాంగాలన్నీ ఆజ్ఞాచక్రాధీనంలో ఉంటాయి. దీనిని గురుచక్రమని కూడా అంటారు. ఆజ్ఞాచక్రాన్ని జాగృతం చేసుకున్న యోగులకు దివ్యదృష్టి, త్రికాలజ్ఞానం, ప్రకృతిని శాసించగల శక్తిమొదలగునవి సాధ్యమవుతాయి. శ్రీశంకరాచార్యులవారిచే రచించబడిన శ్రీదక్షిణామూర్తి స్తోత్రములో నాలుగవ శ్లోకాన్ని పరిశీలిద్దాం.
శ్లో॥ నానా ఛిద్ర ఘటోదరస్థితి, మహాదీప, ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా బహిఃస్పందతే
జానామీతి త్వమేవ భాన్తమనుభాత్యే, తత్సమస్తం జగత్
తస్మైశ్రీ గురుమూర్తయే, నమయిదం శ్రీదక్షిణామూర్తయే॥
భావము: అనేక రంథ్రములుగల కుండయందలి జ్యోతియొక్క కాంతి బయటకు ప్రసరించుచున్నట్లు మన శరీరమందలి ఆత్మచైతన్యము, నేత్రము మొదలగు జ్ఞానేంద్రియముల ద్వారా, బహిర్గతాంతఃకరణ వృత్తి ప్రతిఫలితమై, బాహ్య విషయ ప్రకాశమగుచున్నదో, అదే విధముగా, స్వయంప్రకాశము గలిగిన, ఏ పరమాత్మయొక్క స్ఫురణమువల్ల సమస్తమైన జగత్తును భాసిల్లుచున్నదో అట్టి గురుమూర్తియగు శ్రీదక్షిణామూర్తికి నమస్కారము. ఇచ్చట ఆత్మవల్ల శరీరము, పరమాత్మ ప్రకాశముచే సమస్త జగత్తు భాసిల్లుటను బహు హృద్యముగా వివరించారు.
ప్రపంచంలోని భౌతిక శాస్తవ్రేత్తలందరికి ఆరాధ్యుడైన ప్రపంచ ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఐన్‌స్టీన్, (తన మాటలలో) నేను అణువుల గురించి పరమాణువుల గురించి ఎన్నో పరిశోధనలు చేసి E=MC2 అని సిద్ధాంతీకరించినప్పటికీ, పదార్థ పరిశీలనకు అంతములేదని ఇంకా తెలుసుకోవలసినదెంతో ఉందని, తను చెప్పినదే చివరిదికాదని, ఈ భౌతిక ప్రపంచాన్ని నడిపించే శక్తి ఏదో ఉందని దాన్ని తెలుసుకోవాలంటే భారతీయ తత్త్వశాస్తమ్రులే గతి అంటాడు. అందుకు Where Science ends, there spirituality begins అంటారు కాభోలు. పదార్థాన్ని అందరూ చూస్తారు కానీ, పదార్థమందలి తత్త్వాన్ని కొందరే చూడగలరు.

..........................ఇంకావుంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590