ఎడిట్ పేజీ

‘కోదండం’తో ఎవరికి గండం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి.హబ్ పేరుతో ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డారని, విద్యాహక్కు చట్టం అమలు చేయకపోవడమే గాక ప్రభుత్వం కార్పొరేటు విద్యాసంస్థలకు కొమ్ము కాస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి విమర్శలు చేసినంత మాత్రాన బిజెపి తెలంగాణలో అధికారంలోకి రాజాలదు. కోదండరామ్ వంటి నేతలు బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించినప్పుడే ప్రజలు ఎన్నికల్లో ఒకే పార్టీకి పట్టం కడుతారు. కేసీఆర్ ఇప్పుడు మహాభారత యుద్ధంలో అభిమన్యుని వలే అన్ని
దిక్కుల నుండి ఏక కాలంలో ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ సర్కారుపై కోదండ చేస్తున్న విమర్శల్లో ప్రధానమైనవి ఇవీ.. ఏక కుటుంబ పాలన, నిధుల దుర్వినియోగం. బడుగువర్గాల అభ్యున్నతి విస్మరించటం. విద్యార్థులకు ఉద్యోగం ఉపాధి లేకపోవడం. యాదాద్రి, వేములవాడ తదితర ఆలయాలకు వందల కోట్లు కేటాయించడం. ఎన్నికల సమయంలో ఈ ఆరోపణలకు తగిన సాక్ష్యాలను ఆయన ప్రజలకు చూపవలసి ఉంది.
**
తెలంగాణ జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరామ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించగానే తెరాస శ్రేణుల్లో ఎందుకు కలవరం మొదలైంది. నిజానికి కేసీఆర్‌తో పోల్చితే కోదండరామ్ గొప్ప వక్త కాదు. అయనా అధికార పార్టీలో ఆందోళన ఎందుకు? ఉస్మానియా వర్సిటీలో కోదండరామ్ ఒక సీదాసాదా అధ్యాపకుడు మాత్రమే. చిన్నప్పటి నుండి వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఉద్యమం సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన నిర్వహించిన ‘మిలియన్ మార్చ్’ సంచలనం సృష్టించింది. కోదండరామ్ వెనుక వామపక్ష పార్టీలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ‘దొరల తెలంగాణ’కు బదులు సామాజిక తెలంగాణ కోసం తాను ‘తెలంగాణ జన సమితి’ (టీజేఎస్) పార్టీని స్థాపించినట్టు ఆయన ప్రకటించారు. అప్పుడే ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ నుండి టిజెఎస్‌లోకి వలసలు మొదలైనాయి.
కేసీఆర్ ఏకపక్ష విధానాలను ఎండగట్టేందుకే కోదండరామ్ పార్టీ ఆవిర్భవించిందని అంతా భావిస్తున్నారు. ఇసుక మాఫియాతో చేతులు కలపటం, అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయటం, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అక్రమాల కారణంగా కేసీఆర్ పాలన అవినీతి మయమైందని కోదండరామ్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ‘దొరగారి ధర్మదర్శనం కూడా మాకు దొరకటం లేదు’- అని ఆయన వ్యంగ్యాస్త్రం ప్రయోగించాడు. ఉద్యమకాలంలో కేసీఆర్‌కు ఆయన సన్నిహితుడు, వ్యూహకర్త. కేసీఆర్ సీఎం పదవి చేపట్టాక ఆయనను కలుద్దామని ఒకసారి ప్రయత్నించి కోదండరామ్ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. కుటుంబ పాలనను అంతం చేయాలన్నదే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. కేసీఆర్‌పై యుద్ధం ప్రకటించగానే ఆయనపై తెరాస నేతలంతా భగ్గుమన్నారు. కోదండ ఒక విషసర్పం లాంటివాడని కేసీఆర్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే- ‘చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అని టిఆర్‌ఎస్ శ్రేణులు నిర్ణయించుకున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఉస్మానియా వర్సిటీలోనే నేడు కోదండరామ్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి, ‘కాగ్’ నివేదికకు భయపడని కేసీఆర్ ఈరోజు కోదండరామ్ అంటే ఎందుకు భయపడుతున్నారన్న వ్యాఖ్యానాలు జోరందుకున్నాయి. ప్రభుత్వాన్ని కూల్చివేసేంత శక్తిసామర్ధ్యాలు కోదండకు లేవన్నది కేసీఆర్‌కు తెలుసు. జస్టిస్ చంద్రకుమార్ కొత్త పార్టీ పెట్టినా కేసీఆర్ పట్టించుకోలేదు. వచ్చే ఎన్నికల్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి తరచూ చేసే ప్రకటనలను కేసీఆర్ అపహాస్యం చేస్తుంటారు. అలాంటిది కోదండరామ్ అంటే పాలకపక్షంలో ఎందుకంత గుబులు? కేసీఆర్ సర్కారుపై కోదండ చేస్తున్న విమర్శల్లో ప్రధానమైనవి ఇవీ.. ఏక కుటుంబ పాలన, నిధుల దుర్వినియోగం. బడుగువర్గాల అభ్యున్నతి విస్మరించటం. విద్యార్థులకు ఉద్యోగం ఉపాధి లేకపోవడం. యాదాద్రి, వేములవాడ తదితర ఆలయాలకు వందల కోట్లు కేటాయించడం. ఎన్నికల సమయంలో ఈ ఆరోపణలకు తగిన సాక్ష్యాలను ఆయన ప్రజలకు చూపవలసి ఉంది.
ఒకటి మాత్రం నిజం. నాలుగేళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి ఉత్సాహం, ఉద్రేకం ఇవ్వాళ తెలంగాణలో ఎక్కడా కనిపించడం లేదు. ‘ఆంధ్రోళ్ల పాలన’ నుండి విడివడి తాము ఏమి సాధించినట్లు? అని ప్రజలు ఆలోచనలో పడ్డారు. ‘ఆంధ్రా పార్టీలతో మాకేం పని?’ అని ఇవ్వాళ మంత్రి హరీశ్‌రావు అనలేడు. ఎందుకంటే- తేదేపా, జనసేన పార్టీలు ఇపుడు తెరాసకు అనుకూలంగా ఉన్నాయి. ఈ కారణంగా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ భాజపా, కాంగ్రెస్, కోదండరామ్ పార్టీ, వామపక్షాలను ఎదుర్కొనవలసి ఉంటుంది. కులాల వారీగా ఆలోచిస్తే రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ నాయకత్వంలో బలపడుతోంది. ఇది కేసీఆర్‌ను కలవరపరిచే విషయం. దీంతో ఆయన జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నాడు. ఒక కుటుంబ పార్టీగా ముద్రపడిన తెరాసకు రాబోయే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ మద్దతు ఇస్తుందా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. రాజకీయ కోణంలో కాంగ్రెస్, భాజపా నేతలు చేస్తున్న ఆరోపణలను కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదు. కోదండరామ్ పార్టీ వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుందనే అంశంపైనే ఆయన దృష్టి నిలిచింది. పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేస్తే తెరాస ఓటుబ్యాంకు పదిలంగా ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. మిగతా పార్టీల కన్నా కోదండరామ్ పార్టీ వల్లే అంతో ఇంతో నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని కూడా తెరాస నేతలు విశే్లషిస్తున్నారు. కాంగ్రెస్‌తో కోదండరామ్ జత కడితే కేసీఆర్‌కు ఇబ్బందులు తప్పవన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఆయనను ఎదుర్కొనేందుకు తెరాస పార్టీ టీ.టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.
రాబోయే ఎన్నికల్లో కోదండరాం ఓడిపోతే ఆయనకు అంతగా నష్టం ఉండదు. కానీ, టిఆర్‌ఎస్ ఓడిపోతే తృతీయఫ్రంట్ పేరుతో కేసీఆర్ ఢిల్లీలో ‘చక్రం’ తిప్పే పరిస్థితి ఉండదు. తెరాసలో చీలికలు వస్తే గనుక కాంగ్రెస్ మరికొంత బలపడుతుంది. అప్పుడు మజ్లిస్ పార్టీ అండతో ఉత్తమకుమార్‌రెడ్డి లక్ష్యం చేరుకోవచ్చు.
తెరాస పాలనపై ఇన్నాళ్లూ కాంగ్రెస్, భాజపా నేతలు విమర్శిస్తుండగా ఇప్పుడు కోదండరామ్ సరికొత్తగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విమర్శలకు తెరాస నాయకత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. కేసీఆర్ పాలనలో పలు అవకతవకలు జరిగినట్టు ఇటీవల ‘కాగ్’ నివేదిక వెల్లడించింది. టి.హబ్ పేరుతో ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డారని, విద్యాహక్కు చట్టం అమలు చేయకపోవడమే గాక ప్రభుత్వం కార్పొరేటు విద్యాసంస్థలకు కొమ్ము కాస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి విమర్శలు చేసినంత మాత్రాన బిజెపి తెలంగాణలో అధికారంలోకి రాజాలదు. కోదండరామ్ వంటి నేతలు బలమైన ప్రజాఉద్యమాన్ని నిర్మించినప్పుడే ప్రజలు ఎన్నికల్లో ఒకే పార్టీకి పట్టం కడుతారు. కేసీఆర్ ఇప్పుడు మహాభారత యుద్ధంలో అభిమన్యుని వలే అన్నిదిక్కుల నుండి ఏక కాలంలో ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ ప్రజల సెంటిమెంట్లను ప్రాతిపదికగా చేసుకుని టిజెఎస్ పార్టీ ఆవిర్భవించిందని చెబుతున్న కోదండరామ్ ‘ప్రగతిభవన్ గడీని బద్దలు కొడతాం’ అంటూ పిలుపునిచ్చాడు. కోదండరాం పార్టీని ‘తాడు, బొం గరం లేని పా’ర్టీగా టిఆర్‌ఎస్ అభివర్ణించింది. ఎన్నికలకు ముందు ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు మామూలే. కోదండరాం బలం ఏమిటో రాబోయే రోజుల్లో తేలిపోతుంది. ప్రస్తుత అంచనాలను బట్టి టిర్‌ఎస్ ఓట్లను ఆయన చీల్చగలడని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్, భాజపాలకు ఎంతమేరకు కలసి వస్తాయి? కోదండరామ్‌ను కాంగ్రెస్ వారే నడిపిస్తున్నారని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎంతవరకూ నిజమో, పొత్తు రాజకీయాలు ఏ పార్టీకి కలసివస్తాయో తేలాలంటే కొద్దినెలలు నిరీక్షించాల్సిందే.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668