మెయిన్ ఫీచర్

వర్తమానం - స్వేచ్ఛ - కరుణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్తమానంలో పూర్తిగా నిమగ్నమైపోయి వున్న యోగికి గతాన్ని గురించి కానీ, భవిష్యత్తును గురించి కానీ పట్టించుకునే సమయం లభించదు. అట్టి యోగుల ప్రవర్తన అనుక్షణం ఇక్కడే, ఇప్పుడే అన్న తీరులోనే వుంటుంది. ఏ ఆశయాలకోసమో లేదా ఏ ఆశయాలకు విరుద్ధంగానో వారు జీవించరు. కేవలం ఈ క్షణపు మాధుర్యానే్న వారు జీవిస్తారు- అనుభవిస్తారు-గానం చేస్తారు- నర్తిస్తారు. ఆపై ‘మరుక్షణం’ ఆసన్నమైనపుడు, ఆ క్షణ మాధుర్యాన్ని కూడా అదే సంతోషంతో అదే ఆనందంతో జీవిస్తారు. అనుక్షణ ‘సద్యఃస్ఫూర్తి’తోనే వారుంటారు.
‘ఇదే నిజమైన, వాస్తవమైన యోగత్వ స్థితి’ ఇదే సంపూర్ణ స్వేచ్ఛా ప్రాప్తి! ‘అదే ధ్యానం’! పూర్తిగా ఈ క్షణంలో ఉండడమే ధ్యానంలో ఉండడమంటే! యోగి వాంఛిస్తున్నది ఈ క్షణానే్న ఈ చిన్ని శుద్ధ స్ఫటిక సాదృశ నిర్మల క్షణానే్న! ధ్యానస్థితి అంటే ఈ క్షణాన్ని పూర్తిగా జీవించడమే!
‘ధ్యానస్థితి’- అటువంటి ధ్యానస్థితి మీకు ప్రాప్తించినపుడు మీలో పెరిగిన రెండు రెక్కలను మీరు దర్శించగలుగుతారు అతీషా అనే మాస్టర్ ఈ రెండు రెక్కలలో ఒకదానిని ‘కరుణ’ లేక ‘మిత్రత్వం’ అంటారు. ఒక రెక్క కరుణ- మరొక రెక్క స్వేచ్ఛ. ఈ రెండు రెక్కలూ మనలో ఏకకాలంలోనే ప్రభవిస్తాయి. ఏకకాలంలోనే ఎదుగుతాయి. అనంతమైన తృప్తిని మనకు అవి అందిస్తాయి.
మనకు అపుడు ఏ విరోధాలూ ఉండవు. దేనినో పొందలేకపోయామన్న అశాంతి కూడా మనకు అపుడు ఉండదు. గతంలో మనకు ఇతరులతో విరోధం/వైరం మన స్వభావాన్ని నిర్థారించి శాసించింది. గతాన్ని విస్మరించి భవిష్యద్దర్శనాన్ని మనం చేయాలనుకున్న ఆ గతం మనల్ని తరుముతూనే వుండింది. కానీ ఆ విషయం మనకు అర్థం కాలేదు. భవిష్యత్తును దర్శిస్తున్న మనం కంటున్నవి అందమైన కలలు మాత్రమే. ఆ కలలు సత్యాన్ని ఏ మాత్రం మార్చలేవు. సత్యం ఎప్పుడూ ఒకే విధంగానే వుంటుంది. అది మారదు. సత్యాన్ని ఎరుకల్ని మనం ఎప్పటిపుడు సందర్భనుసారంగా దర్శించాలి- గ్రహించాలి- అన్వయించుకోవాలి! సత్యం ఎరుకల్ని కూడా ప్రవర్తింపబడినపుడు, మాట్లాడినపుడు, ఆచరించినపుడు అదే ఆత్మస్థితి - బ్రహ్మజ్ఞానం! అలా కానట్లయితే మన కలలు పసలేనివే అయి వుండి, నిర్వీర్యంగానే ఉంటాయి.
స్వేచ్ఛ, కరుణ అనే సత్యాలు వర్తమానానికి మాత్రమే వర్తిస్తాయి. స్వేచ్ఛ అంటే ఏమిటి? సానుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ ఉండక గతాన్ని మరి భవిష్యత్తునూ పట్టించుకోకుండా.. కేవలం ఇపుడే ఇక్కడే ఉండడం అనేదే దాని అర్థం.
ఓ కృష్ణుడి జీవితం- ఓ బుద్ధుడి జననం- ది జీసస్ సంభవం- ఓ మహమ్మద్ సాహసం- ఓ అతీషా బోధనం- ఆ స్థితిప్రజ్ఞుల జీవనస్ఫూర్తి వారి ఆనంద ఆవరణం స్పర్శమాత్రాన సర్వులకూ సంక్రమించేది. వారి వారి సామీప్యంలో అందరూ పరవశులై నవ్య నేత్రాల్ని సత్య దర్శనం చేయగలిగేవారు. ‘ఇక్కడే ఇపుడే ఈ వర్తమాన క్షణం’లోనే జీవించే దృక్పథమే ప్రతిక్షణమూ జాగరూకతల్ని ఉండగల ‘నిత్యజాగ్రత్త’ స్థితే, ఆ ఎరుకే వారి నుండి మనందరికీ అందిన మహాప్రసాదం; పూర్తిస్వేచ్ఛ అంటే ఇదే! ఈ విషయంపైనే ధ్యానించాలి! గతం గతః! వర్తమానమే బహుమానం! ప్రెజెన్స్ ఈజ్ ప్రెజెంట్!
లోపల ఎరుక! బయట కరుణ! అంతరంలో ధ్యానమే బాహ్యంలో కరుణ ఎరుక మన అంతర్భాగం- కర్తుృత్వం మరి కరుణ సర్వులతో సంబంధం మిరి బాహ్యంలో సర్వులతో పంచుకోవడమే! ఇది నిష్పక్షపాత స్థితి- బాహ్యం! ఎరుక అనేది అమనస్కపు సహజ స్థితి- అంతరం!
‘అది దర్పణం- ప్రతిబింబిస్తున్న అద్దం’

-మారం శివప్రసాద్ 9618306173, 8309912908