మెయిన్ ఫీచర్

ధ్యానయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధ్యానం అవిచ్ఛిన్నంగా, సక్రమంగా నియమ ప్రకారం సాగుతూ ఉండాలి. ఓరోజు కాస్సేపు కూర్చుని ధ్యానం చేసి ఆ తర్వాత కొన్నిరోజులు దాని సంగతి అసలు పట్టించుకోకుండా మరచిపోవడం- మళ్ళీ ఇంకో రోజు మరికాసేపు ధ్యానం చేయడం అలా కుదరదు. నిద్ర ఎంత సజావుగా సాగుతుందో, ఆహారం తీసుకోవడం ఎంత సజావుగా సాగుతూ ఉంటుందో, పరిశ్రమ చేయడం ఎంత సక్రమంగా సాగుతూ వుంటుందో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత సక్రమంగా సాగుతూ ఉంటాయో అంత సక్రమంగానే మన ధ్యానం సాగుతూ ఉండాలి.
అప్పుడే దైవత్వం తన వైభవ దర్శనానికి మహాద్వారం తెరుస్తుంది! ధ్యానంతో మన ‘మైండ్’ కామ్‌అయిపోతుంది. ఖాళీ అయిపోతుంది. శ్వాసమీద ధ్యాస పెడుతూ అలా-అలాగే ఉండిపోతే, క్రమంగా మనస్సు నిర్మానుష్యమై పోతుంది. అపారమైన విశ్వశక్తి మనలోపల ప్రవహిస్తూ ఉంటుంది. దానినే మనం ‘కాస్మిక్ ఎనర్జీ’అంటాం. దీనినే ‘ఆకాశగంగాధార’అంటారు. శివుడి జుట్టునుండి.. పైనుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది. అంటే క్రింద శివుడు ధ్యాన స్థితిలో ఉంటాడు. పైనుండి షవర్‌బాత్ లాగా ‘కాస్మిక్ ఎనర్జీ’వస్తూ మనలోపల చేరుతూ ఉంటుంది. ఇదే ధ్యానయోగం!
మొదట శ్వాసలను! ఆపైన వాక్కులను! శ్వాసలను కాపాడుకుంటే ఆరోగ్యం మరి ఆయుష్షు! వాక్కులను కాపాడుకుంటే జీవితం కాపాడబడుతుంది! ధ్యానం అంటే శ్వాసమీద ధ్యాస- జ్ఞానం అంటే మాట మీద ధ్యాస!
ధ్యానయోగం అంటే ఏమిటి?
అపారమైన విశ్వమయ ప్రాణ చైతన్యాన్ని మరి ప్రాణశక్తిని మన లోపలికి తీసుకుంటూ ఉండడమే ‘్ధ్యనయోగం’! అపుడు దివ్యచక్షువు తెరుచుకుంటుంది. కనుక ఈ ధ్యానయోగం యొక్క ఉచ్ఛస్థితిలో మనిషి యోగి అవుతాడు. క్రమంగా ఆ యోగి ఋషి అయిపోతాడు. ఓ యోగి ఋషి అయినపుడు అది ధ్యానయోగం యొక్క పరాకాష్ఠ- అతడినే ఆ ఋషినే ‘‘ద్రష్ట’’అంటారు. ద్రష్ట అంటే దర్శించేవాడు. The seeing మూఢవ కంటితో చూడడం!
ప్రతి మనిషి కూడా ఒక ఋషికావాలి. ఋషిగా కాకపోతే మళ్ళీమళ్ళీ పుడుతూనే ఉండాలి. వశిష్ఠుడు బ్రహ్మర్షి. విశ్వామిత్రుడు తపస్సు చేత సాధించి బ్రహ్మర్షి అయ్యాడు. ఎలా అయ్యారు వీరంతా మహర్షులుగా- బ్రహ్మర్షులుగా?

"Unless thine two eyes become one, you cannot enter the knigdom of god" నీ ఛర్మచక్షువులు రెండూ ఏకమైపోయి ఒకానొక దివ్యచక్షువు కాలేకపోతే నువ్వు దేవునిరాజ్యంలో ప్రవేశించలేవు’ అని నుడివారు జీసస్ క్రైస్ట్.
దివ్యచక్షువు అంటే మూడవ కన్ను"Third Eye'`పరమశివుడి మూడవ కన్ను అంటాం! శివుడు మూడవ కన్ను తెరుచుకుంటే అపుడు మరి భగ్గుమనేవి ‘దుష్కర్మలు’ మనలోని సంచిత ప్రారబ్ద కర్మలు. యోగులందరూ ఋషులు అయినపుడు మూడవ కన్ను వస్తుంది.
‘లోబ్‌సాంగ్ రాంపా’ అనే టిబెటియన్ మాస్టర్ వ్రాసిన "Third Eye" పుస్తకం చదివితే మూడవ కన్నుయొక్క పూర్తి విషయం కొంతైనా తెలుస్తుంది.
మూడవ కన్ను తెరుచుకుంటేనే దైవత్వం తన వైభవానికి మహద్వారం తెరుస్తుంది. కనుక ధ్యానాన్ని క్రమంతప్పకుండా చెయ్యాలి ప్రతి మనిషి.
మనిషి ‘‘సత్యానే్వషి’’గా మారినపుడే ‘‘సంప్రజ్ఞత’’ కలుగుతుంది. మరి ‘‘సత్యానే్వషణ’’ నిరంతర గమనికవల్లనే సాధ్యం. నిరంతర గమనిక వల్ల ‘‘జాగరూకత’’ఏర్పడుతుంది. జాగరూకతవల్ల ఎరుక కలుగుతుంది. ఎరుకవల్లనే ‘స్వేచ్ఛ’ తెలుస్తుంది.
స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు- విడుదల!
బాధ్యతలతో ఉంటూనే బంధాలనుండి విడుదల! ఇతరుల్ని బంధంనుండి విడి వడడం కాదు- మనలోని బంధాలనుండి విడుదలై! అదే Liberation ఆత్మస్వాతంత్య్రం/ముక్తి/ మోక్షం.
ఇలా ఎన్ని విశేషణాలైనా చెప్పుకోవచ్చు!

-మారం శివప్రసాద్ 9618306173, 8309912908