మెయిన్ ఫీచర్

పానీయాలు పొడులుగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** కొబ్బరిపాలను ఎప్పటినుంచో ప్రిజర్వేటివ్స్ వాడి నిల్వచేసే సంగతి అందరికీ తెలిసిందే..
ఈ పాలతో వంటలు కూడా వండుకోవడం చాలామంది కేరళీయులకు అలవాటే.. కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కొబ్బరినీళ్లను కూడా పొడిరూపంలో
తయారుచేస్తున్నారు.

మండే ఎండల్లో ప్రయాణం..
చుట్టూతా కనీసం మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి..
గొంతేమో కొబ్బరి నీళ్లనో.. మజ్జిగ చుక్కనో కోరుకుంటుంది..
కనుచూపుమేరలో చిన్న కొట్టు అయినా కనిపించదు..
చల్లచల్లని వర్షాకాలంలో ఓ గర్భిణీ స్ర్తీకి చెఠుకురసం తాగాలనిపిస్తుంది.. ఆ కోరిక ఆమె నోటి నుంచి బయటకొచ్చిన మరుక్షణం.. ఇదేం విడ్డూరమమ్మా.. ఎంత కడుపుతో ఉంటే మాత్రం ఇంత గొంతెమ్మ కోరికలా.. అనే మాటలు చుట్టుపక్కల నుంచీ హెచ్.డి. శబ్ద తరంగాల రూపంలో బయటకు వచ్చేస్తాయి. ఒకప్పుడైతే ఇవన్నీ విడ్డూరాలే.. గొంతెమ్మ కోరికలే.. కానీ నేడు ఇవన్నీ సాధ్యాలే.. మీరు ఎడారిలో కూడా మజ్జిగ, చెరకురసం, కొబ్బరినీళ్లు.. ఇలా వేటినైనా తాగచ్చు.. ఎలా అనుకుంటున్నారా.. అయితే చదవండి.. వివరాల్లోకి వెళితే..
పూర్వకాలం నుండీ భారతదేశంలో పచ్చళ్లకీ, పొడులకీ గిరాకీ బాగా ఎక్కువ. మొదటిముద్ద నెయ్యి వేసుకుని పచ్చడితోనో, పొడితోనో లాగించడం మన సంప్ర దాయం. అలాంటి సంప్రదాయాన్ని మిగతా ఆహారపదార్థాలకు ఎందుకు ఆపాదించకూడదనుకున్నారో.. ఏమో కానీ.. అన్నింటినీ పొడుల రూపంలో తెచ్చేస్తున్నారు. ఆకుకూరలను, కూరగాయలను పొడుల రూపంలోనూ, ఒరుగుల రూపంలోనూ నిల్వచేసుకోవడం పూర్వం నుండీ ఉంది. అందుకే మామిడి ఒరుగులూ, నిమ్మ ఒరుగులూ.. అని రకరకాల ఒరుగులను ఆయా కాలాల్లో దొరకవని ముందుగానే తయారుచేసి పెట్టుకునే అలవాటు ఉంది మనకి.. కానీ నేడు టెక్నాలజీ మారింది.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం జోరందుకుంది.. ఇంకేమిటి.. పానీయాలు కూడా పొడుల రూపంలోకి మారి డబ్బాల్లోనూ, పాకెట్లలోనూ చేరిపోతున్నాయి.
పుట్టగొడుగులు..
పుట్టగొడుగులు మనకు అన్ని కాలాల్లోనూ దొరకవు. చలికాలంలో, వర్షాకాలంలో మాత్రమే ఇవి విరివిగా దొరుకుతాయి. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకు అంటే పల్లెటూరులో నివసించే వారికి పుట్టగొడుగులు దొరకవు. అలాంటివారికోసం పుట్టగొడుగులను పొడిరూపంలో నిల్వచేస్తున్నారు. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటున్నందు వల్ల వీటిని కూరల్లో వాడుకుంటున్నారు.
మునగాకు..
మునగాకు కొన్ని ఋతువుల్లోనే దొరుకుతుంది. అప్పుడు మునగాకు పొడి చేసుకోవడం, దానికి సంబంధించిన వంటకాలు చేసుకోవడం మన సంప్ర దాయం. కానీ మునగాకును పొడి చేసి ఇప్పుడు అన్ని కాలాల్లోనూ దొరికే విధంగా చేశారు. ఫలితంగా వంటల్లోకి, ఔషధ సేవనానికి కూడా మునగాకు పొడి విరివిగా ఉపయోగపడుతోంది.
చెరుకురసం..
చెరుకురసం బండి కనిపిస్తే చాలు మన బండికి బ్రేకులు పడిపోతాయి. చెరకురసం తాగితే కానీ అక్కడ నుండి కదలం. దాని రుచి అలాంటిది మరి.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.. అన్ని కాలాల్లోనూ చెరకురసం ఎందుకు దొరకదు అని అనుకుంటుంటాం కూడా.. ఇదే ఆలోచన ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళకి వచ్చిందో.. ఏమిటో.. ద్రవరూపంలోని ఆహారపదార్థాలను పొడిరూపంలోకి మార్చే స్ప్రే డ్రైయింగ్ విధానాన్ని కనిపెట్టేశారు. దీనిద్వారా చెరకురసాన్ని పొడిరూపంలో తయారుచేసేశారు. పాలపొడిని తయారుచేసే యంత్రాలకే కొద్దిపాటి మార్పులు చేసి చెరకురసం పొడిని తయారుచేస్తున్నారు. గ్లాసు నీళ్లలో ఈ పొడిని కలిపి, ఐస్‌క్యూబులు కలిపి తాగితే సరి. మామూలు చెరుకురసమైతే ఆరుగంటలకు మించి నిల్వ ఉంచి తాగలేం. అదే పొడిరూపంలో అయితే ఎప్పుడు పడితే అప్పుడు తాగేసేయొచ్చు. పైపెచ్చు దీనిలోని పోషకాలు, ఖనిజాలు అలాగే ఉంటాయట.. పంచదారకు బదులు దీన్ని ఇతర ఆహారపదార్థాల్లో కూడా కలుపుకోవచ్చట. మరింకేం.. ఎప్పుడు పడితే అప్పుడు, ఏ కాలంలోనైనా చెరకురసం తాగచ్చు.
మజ్జిగ..
మజ్జిగ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది. పెరుగుకు, పాలకు ఇంకా కొరత రాలేదు మనదేశంలో.. కానీ ఎక్కడికైనా వెళ్లేటప్పుడు అంటే టూర్లకు కానీ, దూరప్ర యాణాల్లో కానీ మజ్జిగను వెంట తీసుకుని పోవడం వల్ల అది పులిసిపోయి వాసన వస్తుంది. దాన్ని తాగడానికి మనం ఇష్టపడం. అలాంటి మజ్జిగ ప్రియుల కోసం మజ్జిగను పొడిరూపంలో తయారుచేశారు. మజ్జిగకు కాస్త చిక్కని పాలను కలిపి తక్కువ ఉష్ణోగ త వద్ద ఎండబెట్టి ఈ మజ్జిగపొడిని తయారుచేస్తున్నారు.
దూర ప్రయాణాలు చేసే మజ్జిగ ప్రియులు ఈ పొడిని కాసిన్ని నీళ్లలో కలుపుకుంటే చాలు.. రుచికరమైన మజ్జిగ రెడీ..
కొబ్బరి నీళ్లు
కొబ్బరిపాలను ఎప్పటినుంచో ప్రిజర్వేటివ్స్ వాడి నిల్వచేసే సంగతి అందరికీ తెలిసిందే.. ఈ పాలతో వంటలు కూడా వండుకోవడం చాలామంది కేరళీయులకు అలవాటే.. కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కొబ్బరినీళ్లను కూడా పొడిరూపంలో తయారుచేస్తున్నారు. మండే ఎండల్లో బస్సులోనో, రైలులోనో ప్రయాణించేవాళ్ళు నోరెండిపోతుంటే నీరసం తగ్గడానికి కొబ్బరిబోండాం తాగితే బాగుండు అనుకునేవారు కాసిని నీళ్లలో ఈ కొబ్బరినీళ్ల పొడిని కలుపుకుంటే చాలు కొబ్బరినీళ్లు తయారయిపోతాయి. పైగా వీటిలో ఉండే లవణాలు, పోషకాలు ఏమాత్రం చెక్కుచెదరవట.. లేత కొబ్బరిబోండాల్లోని నీటిని తీసుకుని అందులోని రుచి, పోషకాలు ఏమాత్రం పాడవకుండా వాటిని శీతలీకరించి, ఆపై ఎండబెట్టి పొడిచేస్తున్నారు. అందుకే ఇవి సహజ కొబ్బరి నీళ్లలాగానే రుచిగా, స్వచ్ఛంగా ఉంటున్నాయి. అంతేకాదండోయ్.. ఇందులోనూ సోడియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలన్నీ యథాతథంగా ఉన్నాయి. కేవలం పదిగ్రాముల పొడితో గ్లాసుడు కొబ్బరినీళ్లు తయారైపోతాయి.
ఇవే కాదు.. రకరకాల పండ్ల పొడులు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే వీటిలో కొద్దిగా పంచదారను కూడా కలుపుకోవలసి వస్తుంది. మునుపు దొరికే పండ్ల పొడులలో ప్రిజర్వేటివ్స్ కలిపేవాళ్లు కానీ ఇప్పుడు తయారుచేసే వాటిలో ప్రిజర్వేటివ్స్ కలపడం లేదు.. పైపెచ్చు ఆ పండ్లలోని పోషకాలు, ఖనిజాలు చెక్కుచెదరకుండా చేస్తున్నారు. కాబట్టి ఇకనుంచి కాలం కాని కాలంలో కూడా మనం అన్ని రకాల పానీయాలను తాగేసేయచ్చు.. ఆరోగ్యాన్నీ పొందవచ్చు.

-మహేశ్వరి