మెయిన్ ఫీచర్

బరువు పెరుగుతున్నారా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్యకాలంలో ఊబకాయులు ఎక్కువౌతున్నారు. కార్పోరేట్ స్కూల్స్, కాలేజీలు, ఆఫీసు వర్క్ లాంటి వాటితో లింగ భేదం లేకుండా మనుషులందరిలో ఎక్కువగా స్థూలకాయులు తయారు అవుతున్నారు. దానికి కారణం కేవలం సరైన వ్యాయామం, సరైన తిండి లేకపోవడమే. తినే తిండిలో కూడా క్రమబద్దం లేకుండా రాత్రి పొద్దుపోయన తర్వాత తినడం, జింక్ పుడ్ ఇన్‌స్టంట్ పుడ్ లాంటి వల్ల శరీరం క్రమం లేకుండా పెరిగిపోతోంది. దానితో ఎక్కడ చూసినా జిమ్‌సెంటర్లు, ఫిట్‌నెస్ షాపులు తయారు అవుతున్నాయ. బరువు తగ్గిస్తాం అంటూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది... ఇందులో ఎవరికి వారు సరైన అవగాహన లేకుండా
కొద్దిమంది తిండి నియంత్రణ చేసేస్తున్నారు. దీనిలో శరీరానికి అవసరమైన పోషకాలు లేకపోవడం జరుగుతోంది. ఇట్లా చేయడం వల్ల నీరసం, కొత్త జబ్బులు బారిన పడుతున్నారు.అలా కాకుండా ఎత్తుకు తగ్గ బరువు ఉండేవిధంగా చూసుకోవాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. తిండి నియంత్రణలో ముఖ్యంగా పోషకపదార్థాలు తీసుకోడం, అవసరమైన కెలోరిస్ వచ్చే ఆహారాన్ని తప్పక తీసుకోవడం తప్పనిసరి. ఇవే కాక
* ఇంట్లో వండిన వస్తువులు * కూరగాయలు మరియు పళ్లు * సలాడ్స్ మరియు వేయించిన స్నాక్స్ * ఆరోగ్యాన్నిచ్చే పానీయాలు * సమృద్ధిగా నీరు తాగడం వాటిపై దృష్టినిలపండి. * పొగాకు ఉత్పత్తులు * బయటి ఆహారం * నూనెలో వేయించిన పదార్థాలు * కాఫీ మరియు టీ * ఎక్కువ మొత్తంలో అన్నపానీయాలు తీసుకోవడం లాంటివి చేయకుండా ఉండండి. ఇవేకాకుండా
అల్పాహారం మానేయకండి. భోజనంలో సోయా, గోధుమ సమపాళ్ళలో కలిపి చేసిన చపాతీలు - ఒక కప్పు - మొలకలు లేక ఒక కప్పు పప్పు , సగం కప్పు పెరుగు, కూరగాయలు, పచ్చి సలాడ్ ఇవి ఉండేలాగా చూసుకోండి.
* సరైన ఆహారం - సరైన నిద్ర ఉండేలా జాగ్రత్త తీసుకోండి. సరైన మొత్తంలో ద్రవపదార్ధాలు తాగండి,వీటి అన్నింటి వల్ల మీరు అనుకొన్న పని అనుకొన్నట్టుగా చేయగలరు.
ఇదేకాదండోయ్
* వ్యాయామం - రోజుకు కనీసం 20 నిముషాల వ్యాయామం అవసరమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దీనివల్ల మీరు భౌతికంగా ఫిట్‌గా, చురుకుగా, అలర్ట్‌గా ఉంటూ మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. మానసిక ఉల్లాసానికి వ్యాయామాలు కూడా ఉపయోగపడుతాయ.
* నిద్ర - రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోండి. అది మీ శరీరం సరిగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. అంతర్గతంగా బలంగా ఉంచుతుంది.
ఇవి చూసుకొంటే చాలు ఆరోగ్యంతోపాటుగా మీ శరీరం అందంగా ఉంటుంది. అటు లావుగాను, లేక ఇటు బక్కపల్చగాను లేకుండా సమసౌష్ఠవంతో అందంగా ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక మీదే ఆలస్యం.

- జి. కల్యాణి