మెయన్ ఫీచర్

సారంలేని చదువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గ్రీన్‌విచ్ రేఖ..అంటే ఏంటి.? ఈ ప్రశ్న ఎప్పుడూ వినలేదు..? గ్రూప్-2 రాష్టస్థ్రాయి పరీక్షలు రాసిన నలుగురు ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు రైల్లో మాట్లాడుకుంటున్న మాటలివి. సర్వశిక్షా అభియాన్‌లో భాగంగా ప్రాథమిక స్థాయి పాఠశాలలకై ఎంఆర్‌పి పోస్టులకోసం ఎంపికకై కలెక్టర్ల సమక్షంలో జరిగిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ఇంటర్వ్యూలో- క్రితం రోజు బోధించిన ఆంగ్లభాషలోని బోధనాంశం ఏంటని ప్రశ్నిస్తే, ‘్ఫక్స్ అండ్ గ్రేప్స్’ అని, ‘ది జూ’ అని పాఠ్యాంశాల టైటి ళ్ల పేర్లు చెప్పారు కాని ఏ ఒక్కరూ ఆ పాఠం ద్వారా బోధించాల్సిన భాషాసంబంధమైన అంశాన్ని చెప్పని స్థితి! ఇప్పటికీ ఈపరిస్థితిలో మార్పు రాలేదు. తెలుగు భాషా బోధనకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. నాగార్జున సాగర్ అనే పాఠ్యాంశాన్ని తెలుగు భాషగా ఎలా బోధిస్తారు, సాంఘిక శాస్త్రంగా ఎలా బోధిస్తారని అడిగితే దాని కథనంగా చెబుతామని సమాధానం.
సాధారణ పాఠశాల విద్య, సాధారణ పాఠ్యాంశాల చుట్టే తిరుగుతుంది. భాషలతో పాటుగా గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రాలలో ప్రాథమిక అంశాలపై అవగాహనను పెంపొందిస్తుంది. ఇలా పొందిన అవగాహన జీవితకాలం ఉండాల్సిందే. నిజ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు ప్రతి వ్యక్తి ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. దీనికి భిన్నంగా పోటీ అనే క్రీడలో నెగ్గాల్సిన ట్రిక్కుల్ని అవపోసన పట్టడమే విద్య యొక్క పరమార్ధంగా మారింది. ఈ విషయ అవగాహనపై ఓ సమగ్రత, స్పష్టత వెతికినా కానరాదు. పోనీ, తర్వాతి కాలంలో పెంపొందించుకుంటారా అంటే అవీలేదు. నిన్నటి శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలకు కారకులెవరో, వారు అందించిన విజ్ఞానామే కాదు, వాటికోసం ప్రాణాల్నే త్యాగం చేసిన శాస్తజ్ఞ్రుల, తత్వవేత్తల గూర్చి పట్టింపు ఉండదు.
పదార్థం పుట్టుక, దాని రకాలు, దాని ధర్మాలు తెలియని ఉపాధ్యాయులే అత్యధికం. భారమితి ఉపయోగాలు తెలియవు. పీఠభూమి, పర్వత ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం ఎందుకుంటుందో అర్థంకాదు. విద్యార్థులకు కారణాలు చెప్పలేని స్థితి. శబ్దాన్ని, అతి దూరాన్ని ఎలా కొలుస్తారో చెప్పలేని తికమక. సజీవులకు, నిర్జీవులకు గల ముఖ్యమైన భేదాలు చెప్పమంటే..నేను జీవశాస్త్ర ఉపాధ్యాయుడిని కాను అని దాటవేత. పైథాగరస్ సిద్ధాంతాన్ని, ఆర్కిమెడిస్ సూత్రాన్ని, ఐన్‌స్టిన్ సాపేక్ష సైద్ధాంతిక విషయాలను విద్యార్థులకు అవగాహన కలిగించడంలో అత్యధికులకు నిరాసక్తతనే. పేరాలను, వాక్యాలను ఎత్తి చదివి, ప్రశ్నలకు జవాబులు రాయించడమే విషయాల బోధన విధానం. లామార్క్ సిద్ధాంతానికి, డార్విన్ సిద్ధాంతానికి, వీటిని క్రోడీకరించిన హ్యూగోడివ్రీస్ సిద్ధాంతమేంటో, వీటి ద్వారా జీవ పరిణామ సిద్ధాంత పరిజ్ఞానాన్ని విద్యార్థుల్లో ఎట్లా పెంపొందించాలో అత్యధికులకు పట్టదు. ఏకకణ, బహుకణ జీవులను గురించి, కణ సిద్ధాంతం గురించి, ఏకలింగ, ద్విలింగ, జల, ఉభయచర, భూచర, వాయుచర జీవుల వైవిధ్యాలను గూర్చి స్పష్టత ఉండదు.
శక్తి, శక్తి మార్పిడుల గూర్చి తెలినివారు కొందరైతే కోపర్నికస్ సిద్ధాంతాన్ని పట్టించుకోక, భూకేంద్ర సిద్ధాంతాన్ని నమ్మే ఉపాధ్యాయులే అధికులు. గ్రహాల స్థితిగతుల గూర్చి, గ్రహణాలేర్పడడం గురించి కారణాలను పట్టించుకోనివారే గ్రహణం పట్టిన రోజు పాఠశాలకు సెలవివ్వమని రెట్టిస్తారు. ఇలాంటి ఉపాధ్యాయులే ద్రవ్యనిత్యత్వ నియమం గూర్చిన నిర్వచనం మాత్రం చెబుతారు కాని, ఈ సూత్రాన్ని సామాజికంగా వర్తింపజేసి, బాబాల బండారాన్ని విడమరిచి చెప్పరు. పైగా ఫలానా బాబాను నమ్ముకుంటే పరీక్షల్లో బాగా మార్కులు సంపాదిస్తారని సెలవిస్తుంటారు. పరమాణువు సిద్ధాంతం వివరించడం, అందులోని వౌలిక అంశాలలైన ప్రోటాన్ల, ఎలక్ట్రాన్ల, న్యూట్రాన్ల గురించి తెలపడం తప్ప జీవం పుట్టుకకు మూలకాలే కారణమన్న అన్వ యం ఉండదు. ఆవర్తన పట్టికలో కొన్ని ఖాళీలెందుకున్నాయో తెలియని ఉపాధ్యాయులు కూడా రసాయన శాస్త్రాన్ని బ్రహ్మాండంగా బోధిస్తారని ప్రతీతి. కార్బోహైడ్రేట్లకు, హైడ్రోకార్బన్లకు గల భేదాలు తెలియనివారే కాదు, తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేని విద్యావ్యవస్థ మనది. యంత్రాల గూర్చి తెలిసినా, యంత్ర లాభం అంటే ఏంటని బిక్కమొహం వేసేవారు మరికొందరు.
మన పాఠ్యపుస్తకాల రూపకల్పన కూడా అంతే లోపభూయిష్టంగా ఉంటాయి. రాసిన రచయతలకు, సంపాదకులకే అంతా గజిబిజి. ప్రభుత్వం రాయమన్నది కాబట్టి, రాశామన్నట్టుగా ఉంటుంది. ఏ పాఠ్యాంశం వాస్తవిక జీవితాన్ని ప్రతిబింబించదు. అన్వయించుకొనే ఆలోచన రేకెత్తించదు. విషయాల మధ్యన సమన్వయం ఉండకపోగా, ఒకే విషయంలోని పాఠ్యాంశాల మధ్యనే వైరుధ్యాలుంటాయి. బిందు వు అనేది కంటికి కనపడదని, కనిపించే బిందువు బిందువుల సముదాయమని విడమర్చి చెప్పని గణిత బోధనా విధానం. ఈ బిందువు వద్ద ఏర్పడే కోణాల మొత్తం 360 డిగ్రీలు అని బోధిస్తారు కాని, అది ప్రయోగానికి నిలబడుతుందా అనే ఆలోచన రాదు. గణితం మొత్తంగా ఆమూర్త భావనలతో గణించే అంచనా మాత్రమేననే భావాల్ని విద్యార్థులకు పెంపొందించరు. కాలము, దూరము, భారము (బరువు, పరిమాణం) లాంటి ప్రమాణాల్ని ఎంత కచ్చితంగా గుర్తించినా రైడర్ విలువ (దశాబ్దం తర్వాత వచ్చే నాల్గో విలువ) వ్యత్యాసాలుంటాయని పారలాక్స్ వివరణ ఇవ్వలేని తరగతిగదులు మనవి. ఒక గ్రాము బంగారం కచ్చితంగా పది మిల్లీ గ్రాములు ఉండే అవకాశమే లేదు. ఉష్ణోగ్రత, వాతావరణ పీడంనం వల్ల భారంలో మార్పు అనివార్యమని గుర్తించని భౌతికశాస్త్ర బోధకులు కోకొల్లలు అంటే చాలామందికి కోపం రావచ్చు!
మూసపోసిన ఉపాధ్యాయ శిక్షణ, చైతన్యాన్ని, క్రియాశీలతను, ఆలోచనను రేకెత్తించని పాఠ్యాంశాల రూపకల్పన, ఉన్న పాఠ్యాంశాల్ని కూడా విశే్లషించి, వివరించి, విడమరచి చెప్పలేని అత్యధికశాతం ఉపాధ్యాయగణం తరగతి గదిని ఏలినంతకాలం, విద్యాస్థాయి అంతకన్నా భిన్నంగా ఉండదు. జ్ఞానమే సర్వస్వమని, ఇదే ఉద్యోగాన్నో, విదేశీయానాన్నో, లేదా రాజకీయ అధికారాన్నో కలిగిస్తుందనే తప్పుడు భావన వ్యక్తులకే కాదు,మొత్తం వ్యవస్థకే ప్రమాదకరం. విద్య ఒక సామాజిక అవసరానికి, జరగాల్సిన వ్యక్తిగత, వ్యవస్థీకృత మార్పులకై దోహద పడాలనే ఆలోచనకు భిన్నంగా, కేవలం ఉద్యోగ సాధనకు, డబ్బులు పోగు చేసుకోవడానికి మాత్రమే జ్ఞాన సముపార్జన అనేది ఓ తప్పుడు త త్వం. ఇదే వాస్తవమనే ధోరణిని వ్యాపారం చేసుకునే విద్యావేత్తలు కల్గించగా, పాఠశాలలు వీటినే ప్రచారం చేస్తున్నాయి.
పుస్తకాల్లోని పేజీలవారీ సమాచారాన్ని జ్ఞప్తికి ఉంచుకోవడం తప్ప, ప్రయోగపూర్వకంగా, ఆచరణాత్మకంగా అవి ఎంతమేరకు వాస్తవమో పట్టించుకోం. ‘పళ్లను శుభ్రంగా తోమాలి, నిండుగ స్నానం చేయాలి, ఉతికి న బట్టలు తొడగాలి, గ్లాసెడు పాలు తాగా లి, చక్కగ బడికి రావాలి..’ ఎంత అందమైన వాక్యాలో? ఇవేవీ పాటించే పరిస్థితిలేని విద్యార్థులు సమాధానాల్ని మాత్రం రాస్తే విద్యార్థికి బాగా తెలివితేటలున్నట్లుగా భావిస్తున్న విధానం మనది. ధర్మం, నిజాయితి, విలువలు..తరగతి గదిలో బోధించే కథలకే పరిమితం గాని, ఇంట్లో తల్లిదండ్రుల్లో, అటు ఉపాధ్యాయుల్లో ఎంతమేరకు ఉండా లో చర్చనే జరగదు. ఇక పాలకుల్లో, బ్యూరోకాట్రలో, అధికారుల్లో, ఈ గుణాలు (99శాతంలో) వెతగడమే ఓ ప్రయాస. అయినా వీటిని ప్రచించేది ఈ వర్గమే. ఈ బోధనల్ని జీర్ణించుకున్న విద్యార్ధులెవరైనా నిజ జీవితంలో ఆచరించే ప్రయత్నం చేస్తే ముందుగా అడ్డుకునేది మొత్తంగా పై వర్గాలే.
ఇన్ని లోపాల్ని, లోపభూయిష్ట విధానాల్ని మూటగట్టుకున్న విద్యా విధానాన్ని పట్టించుకోకుండా, ఫలితాలే పరమావధి అని, పొందిన మార్కులు, గ్రేడ్లు, కొలమానమని భావించే వ్యవస్థలో అత్యధిక మార్కులు సాధించిన వారికి కనీస పరిజ్ఞానం కొరవడిందని వాపోవడం మన అమాయకత్వమే. సైన్సు ఉపాధ్యాయుడు, భాష ఉపాధ్యాయుడు తరగతి గదిలో కూడా అన్యమనస్కంగా విషయాల్ని బోధించి, బయట వాటి ప్రసక్తే రానీయని విద్యావ్యవస్థ మారనంత కాలం, ఆంగ్లభాషపై కనీసపట్టు లేనివారు కూడా ఆంగ్లమాధ్యమం కావాలని అడుగుతుంటే, ఎవరి చెవుల్ని ఎవరు మెలిపెడుతున్నారో అర్థం కాదు.
ఈ విషయాలేవీ విద్యార్థులకు పట్టవు. ఉపాధ్యాయులకు, విద్యాశాఖకు, ఇతర మేధావి వర్గానికి చెవికెక్కవు. ఈ సందర్భంగా చర్చ జరగాల్సింది బిహార్ రాష్ట్ర వైశాలి జిల్లాకు చెందిన రుబి రాయ్, సౌరభ్ కుమార్‌లు పనె్నండవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించినా, కనీస పరిజ్ఞానం లేదని కాదు-వీరికి విద్యనందించిన బిషన్ రాయ్ కళాశాల గూర్చి. వీరికి బోధించిన ఉపాధ్యాయుల గురించి. ముఖ్యంగా వీరి జవాబు పత్రాల్ని సరదాగా దిద్దిన తలకాయల గూర్చి మాట్లాడాలి.
ఎపి ఎమ్సెట్ ఇంజినీరింగ్‌లో 160/ 160 మార్కులు సాధించడానికి గల కారణాలు అడగ్గా, ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి పదిగంటల వరకు చదవడమే అని చెప్పిన జవాబు మనకు సంతోషాన్ని కలిగించవచ్చు. మన పిల్లల్ని అలా చదవమని ఒత్తిడి చేయవచ్చు. కాని అన్ని గంటలు చదవడం సాధ్యమా, అవసరమా అనే ఆలోచన రానంతకాలం, విద్యార్థులు ఉత్తములుగాను, చవటలుగాను ముద్రవేయబడుతూనే ఉంటారు. ఏ విద్యార్థి స్వతాహాగా చెడు విద్యార్ధి కాడనే సూక్తి లాగానే, ఈ సమాజానికి మంచి ఉపాధ్యాయులు అవసరమన్న సూక్తిని కూడా గుర్తించాలి.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162