మెయిన్ ఫీచర్

ఇలా చేస్తేనన్నా ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య ఎక్కడ చూసినా అఘాయిత్యాలు, అత్యాచారాలే.
వీటికి గురైయ్యేది మాత్రం అప్పుడే కళ్లు తెఠుస్తున్న పసికందులూ ... ముక్కపచ్చలారని చిన్నారులు.... వయసుడిగిపోయిన వృద్ధులూ పదహారేళ్ల అమ్మాయిలు... కాపురం చేసుకొంటున్న బిడ్డల తల్లులూ
ఈ కామాంధత కు అంతం లేదా... గుడ్డితనాన్ని పెకిలించి వేసే దబ్బనాలు తయారు కావడం లేదా... మనుష్యులంతా ఏమైపోతున్నారు.
మానవత్వం మరిచి కామమే ముఖ్యంగా జంతుసంస్కృతిని ఆచరిస్తున్నారే .. జంతువులు కూడా నియమిత కాలంలో నియమిత పరిధుల్లో తమ కామాన్ని తీర్చుకుంటాయే కాని ఇలా విపరీతమైన జాడ్యంతో కాదు కదా..
ఈ కామాతురలను చూసి జంతువులు సైతం చీదరించుకుంటాయి. ఈ అఘాయిత్యాలకు, అత్యాచారాలకు భరత వాక్యం పాడేదెప్పుడు ఆడవారి కన్నీళ్ల ప్రవాహాలకు అడ్డుకట్టలు వేసేదెన్నడు...
ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసే వారంతా ఈ కామాంధుల కళ్లకు కప్పిన పొరలను తొలగించాల్సిన అవసరం వచ్చింది.
కామాంధత అసలు ఎందుకు కలుగుతోంది? ఇంటి వాతావరణమా, వారి చదువుకున్న నేపథ్యమా. లేక వారు పెరుగుతున్న సమాజమా ఏది కారణం అవుతోంది?
తరచి చూడాల్సిన అవసరం ఉంది. సమస్య కనుక్కొంటే పరిష్కారం లభ్యవౌతుంది.
ఇంతకుముందు కొందరు మీరు ధరించే దుస్తుల వల్ల మగాళ్లు మృగాళ్లుగా మారుతున్నారు అన్నారు.
మరి ఇపుడు ఆరునెలల పసికందు వేసుకొన్న బట్టలు చూసి కామాంధత కమ్ముకొందా?
లేక గుర్రాలు, మేకలు కాచుకునే చిన్నారుల బట్టల చూసి కళ్లు పొడుచుకున్నాయా?
ఈ కామాంధత ఎందుకు మనుష్యుల్లో ఎక్కువ అవుతోంది.
కామాంధత వృద్ధుల్లో సైతం కనిపిస్తుంది. సిటీ బస్సుల్లో కూడా సీనియర్ సిటిజన్ సీట్లల్లో కూర్చుని వెకిలి చేష్టలు చేసే వృద్ధులున్నారు.
స్నేహం ఎర చూపి వారి వికృత చేష్టలకు శ్రీకారం చుట్టే పురుషులున్నారు.
ఇక ఆడవారి ఆర్థిక పరిస్థితులను, వారి వైవాహిక పరిస్థితులను తెలుసుకొని పెట్రేగిపోయే మనిషి వేషం వేసుకొన్నవారు మృగాళ్లుఉన్నారు.
కరుడు గట్టిపోయిన కఠినులు కూడా ఈ అత్యాచారాలను చూసి అవాక్కు అయ్యేట్టుగా వ్యవహరిస్తున్న ఈ కామాంధుల భరతం పట్టే రోజు త్వరగా రావాలి.
దానికి ప్రతి ఆడపిల్ల శివంగియై నిలవాలి.మాట వచ్చిన తరుణం కాదుకాదు మనుష్యులను గుర్తుపట్టే వయస్సు వచ్చిన దగ్గరనుంచే ఆడపిల్లలు కామాతురులను కాటేసే ధైర్యాన్ని శక్తిని నూరిపోయాలి.
మరణ శిక్ష వేయమనే చట్టాలు వస్తున్నాయ అంటున్నారు. కాని ఈ మరణ శిక్షల వల్ల ఒరిగేదేముంది? ఆ మరణశిక్ష లను అమలు జరపడం చూసినవారిలో లేకపోతే అట్లాంటి ఆలోచన ఉన్నవారిలో పశ్చాత్తాపం కాని, వారి ఆలోచనలో మార్పు గాని వస్తుందా ? అన్నది చెప్పలేం. అందుకే కనీసం నేరం జరిగిన వెంటనే శిక్షను విధిస్తే ఆ శిక్షఅమలును చూసిన వారైనా అత్యాచారాల్లాంటి నేరాలను చేయడానికి సాహసించకుండా ఉంటారు. నేరాలను చేసినవారిఆలోచనలో మార్పు వచ్చేట్టు, పశ్చాత్తాపం కలిగేట్టు శిక్షలను అమలుచేస్తే అట్లాంటి నేరాలను ఎవరూ చేయకుండా ఉంటారేమో! దీనికి మానసిక వైద్యులూ ఏదైనా మార్గాన్ని కనిపెట్టాల్సిన అవసరం ఉంది.

- శ్రీలత