మెయిన్ ఫీచర్

దైవ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడంటే ఒక విశ్వాసం- ఒక ధైర్యం- ఒక ఆలంబన- ఒక పునాది- ఒక ఓదార్పు- ఒక ప్రేమ- ఒక స్నేహం- ఒక ధర్మం- ఒక సత్యం! భగవంతుడంటే అంతర్గత శక్తి- ఆత్మస్థితి! దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఆయనకు ఏ అభ్యంతరం లేదు. సర్వసాక్షి! కృష్ణుడు - యెహోవా- అల్లాహ్ అంతా ఒకటే!
మన ప్రత్యక్ష దైవాలు ఏడు! కదిలే దైవాలు మూడు!
భూమి- నీరు- అగ్ని- వాయువు - ఆకాశం- చంద్రుడు - సూర్యుడు ప్రత్యక్ష దైవాలు! జన్మనిచ్చిన తల్లి- ప్రయోజకత్వాన్ని నేర్పిన తండ్రి- మార్గదర్శనం చేసిన గురువు!
వికసిస్తున్న గులాబీని చూసినపుడు వాటి రంగు, సున్నితత్వం, సౌందర్యం విత్తడంలో ఎక్కడో దాగివుందనే భావన కలగవచ్చు. అయితే గులాబీగా మారేందుకు కేవలం విత్తనం మాత్రమే సరిపోదు. దానికి నేల, నీరు, సూర్యరశ్మి- ఇలా ఈ అస్తిత్వ ఆలంబన చాలా అవసరం. అపుడు ఆ విత్తనం నేలలో అదృశ్యమై గులాబీ పొద ఎదగడం ప్రారంభిస్తుంది. ఇక దానికిపుడు గాలి, నీరు, భూమి, సూర్యరశ్మి, చంద్రకాంతి అన్నీ అవసరం. ఇవన్నీ కలిపి దాదాపుగా జీవం లేని ఒక రాతి ముక్కలా ఉన్న విత్తనాన్ని మొక్కగా రూపాంతరించాయి. అకస్మాత్తుగా అద్భుత పరిణామం ఈ రూపాంతరీకరణానికి దారితీసింది.
ఈ గులాబీల రంగులూ, హంగులు, సోయగం, సువాసనలు ఆ గులాబీలో ముందుగానే దాని అస్తిత్వంలో లేనట్లయితే వాటికి అవి వచ్చి ఉండేవి కావు. అవి మనకు కనిపించకుండా విత్తనంలో మరుగున నిక్షిప్తమయ్యే ఉన్నాయి. దాని అస్తిత్వంలోనే ఉన్నాయి.
అదే దైవం- అదే అంతర్గత శక్తి - ప్రతి జీవశక్తిలోనూ ఉండేది!
రామకృష్ణ పరమహంస కలకత్తాలోని దక్షిణేశ్వరంలో శారదా మాతతో, శిష్యులతో నివసించేవారు. ప్రతిరోజూ సుదూర ప్రాంతాలనుండి వేలాదిమంది రామకృష్ణులవారిని దర్శించేవారు. రామకృష్ణ పరమహంస ముఖ్య శిష్యులలో వివేకానందుడు పరమ ప్రసిద్ధి పొందినవాడు.
రామకృష్ణ పరమహంస సమకాలికులలో కేశవచంద్ర సేన్ ఒకరు. ఆ కాలంలోని ప్రముఖ హిందూ ఫిలాసఫర్ ఆయన. తన వేదాంత విజ్ఞాన పునాదులపై ఆయన ‘బ్రహ్మసమాజం’ అనే ఆధ్యాత్మిత మత సమాజాన్ని స్థాపించారు. కేశవచంద్రసేన్‌ను అనుసరించే మేధావి వర్గం వందల వేలమంది ఉండేవారు. అతడు భగవదానే్వషణ చింతనాపరులైన సమాజం కోసం పాటుపడే తత్త్వవేత్త. అయితే కనీసం ప్రాథమిక విద్యనైనా సరిగా పూర్తిచేయని ఒక విద్యవిహీనుడైన రామకృష్ణుని కోసం- దర్శనం కోసం రోజూ వేలాదిమంది ఎందుకు వెళుతున్నారు అనే సందేహం కేశవచంద్రసేన్ మనసులో నాటుకుపోయింది. చివరికి ఎలాగైనా రామకృష్ణుని ఓడించాలని నిశ్చయించుకున్నాడు. వాదనలో రామకృష్ణుని ఓడించలేమనే ఆలోచన అతనికి అసలు రాలేదు. ఆ కాలంలో కేశవ చంద్రసేన్ మహామేధావిగా కీర్తింపబడ్డాడు. ఎవరినైనా సరే అతడు వాదాల్లో గెలవగలడు అని పేరు. అతని దృష్టిలో రామకృష్ణడొక మూర్ఖుడు.
ఇక భరించడం అతడివల్ల కాలేదు. చివరికి కేశవచంద్ర ఇలా చెప్పి పంపాడు రామకృష్ణులకు. మీరు నమ్మిన సిద్ధాంతాలపై మీతో వాదించేందుకు మీ దగ్గరికి ఫలానా రోజు వస్తున్నాను. నాతో వాదించడానికి సిద్ధంగా ఉండవలసింది అని తన శిష్యునితో వర్తమానం పంపాడు.
ఇందుకోసం చాలాకాలం నుండి నేను ఎదురుచూస్తున్నాను. కేశవచంద్ర వచ్చినరోజు నాకు పరమానందాన్ని కలిగించేరోజు అని ఎగిరి గంతేసినంతగా ఆనందించి కేశవచంద్రకు ఆహ్వానాన్ని తెలిపారు రామకృష్ణ పరమహంస. రామకృష్ణుని శిష్యులు చాలా కలత చెందారు. భయపడ్డారు కూడా! కేశవచంద్ర అత్యంత ప్రఖ్యాతి పొందిన ప్రముఖ తాత్వికుడని, నెమ్మదిగా మితభాషిత్వంతో ఎక్కువగా దేని గురించీ వాదించని రామకృష్ణులు కేశవ చంద్ర ముందు వాదనలో నిలబడలేక ఓడిపోతారని వారు భయపడ్డారు.
ఏమిటి మీరు అతడితో వాదించేది? ఈ రోజు మనకు దుర్దినం అని విలపించారు వారు. భయంతో శిష్యులు వణికిపోయారు. వారు తమ గురువు తప్పక ఓడిపోతాడు అని భావించి కేశవ చంద్రతో వాదన వద్దని ప్రాధేయపడ్డారు. ఎందుకంటే ఆ కాలంలో కేశవ చంద్ర తెలివితేటలతో సరితూగేవారు ఎవరూ దేశంలో లేరు అని ప్రతీతి. ఆ రోజు రానే వచ్చింది. తాను నివశిస్తున్న ఆలయానికి కొద్ది దూరంలో రోడ్డుపైన వందమంది శిష్యులతో పటాటోపంగా వచ్చిన కేశవచంద్రసేన్‌కు ఎదురువెళ్లి సాదరంగా కౌగిలించుకుని ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని కలుసుకోవాలని నిరీక్షిస్తున్నాను. ఇంతకాలానికి మీకు నన్ను కలుసుకోవాలని అనిపించింది అని ఆహ్వానించి తమ ఆశ్రమానికి వెంటపెట్టుకుని వచ్చారు మన రామకృష్ణ పరమహంస!
నేను మీతో చర్చించేందుకు ఇక్కడికి వచ్చాను అన్నారు కేశవచంద్రసేన్. చాలా ఆనందంగా ఉంది, రండి అని ఆ ఆలయానికి దగ్గరలో వున్న గంగాతీరంలో చక్కని ప్రదేశంలో ఒక చెట్టు క్రింద అందరినీ కూర్చోబెట్టారు రామకృష్ణులు!
.......................... ఇంకావుంది

-మారం శివప్రసాద్ 9618306173, 8309912908