మెయిన్ ఫీచర్

పదిలంగా పట్టు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లిళ్లు అయినా ఏ సంప్రదాయ వేడుక అయినా చాలామంది పట్టుకే ప్రాధాన్యతనిస్తాఠు. పెళ్లిళ్లకయితే వేలరూపాయలు పోసి మరీ పట్టుచీరలను కొంటారు. అయితే వీటిని ఎల్లవేలలా కట్టుకోలేము. బరువు, వేడి అని చాలామంది ఫంక్షన్లు అయినా వీటి వైపు కనె్నత్తి చూడరు. అలాగని ఏళ్లతరబడి వీటిని అల్మారాలలో ఉంచేస్తే పురుగు చేరడం ఖాయం. లేదా మడతల్లో చీకు పట్టేసి పిగిలిపోతాయి. వేలు పోసి కొన్న చీర అలా అవుతుంటే ఎవరికీను మనసొప్పదు. అందుకని కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చీర పదికాలాలపాటు మన్నుతుంది.
* పట్టుచీరల్లో పురుగు చేరకుండా అల్మారాల్లో నాఫ్తలీన్ ఉండలు వేసి ఉంచాలి.
* పట్టుచీరలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నీరెండలో ఆరేసి బాగా గాలి తగిలిన తరువాత తీసేయాలి.
* పట్టుచీరలను ఎప్పుడూ ఒకే మడతకాకుండా వాడకపోయినా అప్పుడప్పుడు వాటి మడతలను మారుస్తూ ఉండాలి. ఒకేలా మడతలు వేయడం వల్ల అక్కడ బట్ట పిగిలిపోయే అవకాశం ఉంది.
* పట్టుచీరలను అప్పుడప్పుడూ డ్రై క్లీనింగ్ చేయించవచ్చు కానీ అదే పనిగా చేయించకూడదు. కారణం డ్రై క్లీనింగ్‌కు వాడే రసాయనాలు పట్టును పాడుచేస్తాయి.
* పట్టుచీరలను ఇంటివద్దే ఉతకాలనుకుంటే కుంకుడుకాయ రసంలో పట్టుచీరలను పదినిముషాలు నానబెట్టి ఉతకడం వల్ల పట్టు పాడుకాకుండా ఉంటుంది. రంగులు అంటుకోవు. అంతేకాదు కుంకుడుకాయలో ఉండే సహజసిద్ధ ఔషధ గుణం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది.
* పట్టుచీరలను అల్మరాలో పెట్టేటప్పుడు బ్రౌన్ కాగితం లేదా చీరలకు వచ్చే కాగితంలో చుట్టి పెట్టడం వల్ల చీరలు పాడవకుండా ఉంటాయి.
* కొన్ని పట్టుచీరలు పదేండ్ల తరువాత జరీపట్టు బాగానే ఉన్నా చీర భాగం దెబ్బతింటుంది. పట్టు అంచు గౌన్లు ఇప్పుడు ఫ్యాషన్. అందుకని పట్టుచీర అంచులను తీసేసి నచ్చిన రంగు బట్టను కొని దానికి జతపరిచి అందమైన ఫుల్ గౌనును తయారుచేయవచ్చు. అలాగే పట్టులంగా, లెహెంగా లేదా పలోజాల్లా కూడా వాడుకోవచ్చు.
* ఐదేళ్ళ నుండి కట్టిన చీరే కట్టడం వల్ల బోరుకొట్టింది అనుకోకుండా దానికి అదనపు హంగులను అద్దితే.. ఆ చీరే మరింత కొత్తగా కనిపిస్తుంది. అంటే బ్లాక్ ప్రింట్స్, ఎంబ్రాయడరీ, మగ్గం వర్క్, మోటిఫ్‌లు.. ఇలా ఆధునికంగా కనిపించేలా సృజనాత్మకతతో ఏదైనా చేసి కొత్తదనాన్ని తెప్పించవచ్చు.
* పట్టుచీర కొద్దిగా గట్టిగా ఉంది అనిపిస్తే కుర్తీలుగా కుట్టించుకోవచ్చు.
* పట్టు జరీలను పైటలకు అంచులుగా కుట్టడం వల్ల కూడా వాటిని గ్రా ండ్ లుక్ వస్తుంది.
* ఇంకా పట్టుచీరలతో పర్సులు, హ్యాండ్‌బ్యాగులూ కూడా తయారుచేసుకోవచ్చు.
*