మెయిన్ ఫీచర్

...ఖరీదు కట్టగలమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దారుణం! అతి దారుణం..! గోరఖ్‌పూర్ డిస్ట్రిక్ట్‌లోని ఖుషీనగర్‌లో పదమూడుమంది చిన్నారులను పొట్టనపెట్టుకున్న సెల్‌ఫోన్!- ఈవార్త విన్న ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడవక మానదు.
అసలేం జరిగిందంటే, ఖుషీనగర్‌లోని ఓ స్కూల్ పిల్లల వ్యాను నడుపుతున్న డ్రైవర్, చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని సెల్ వింటూ కాపలా లేని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద దూరం నుంచి రైలు వస్తున్న విషయం గమనించకపోవటంతో ముక్కుపచ్చలారని పదమూడు మంది చిన్నారులు బలైపోయారు. ఆశ్చర్యం ఏమిటంటే.. చెవుల్లో ఇయర్ ప్లగ్స్ వున్నా అతని కళ్ళు పనిచేస్తూనే ఉన్నాయిగా.. మరి వాహనం నడుపుతున్నపుడు న్యాయంగా అయితే అతను దూరం నుంచి వస్తున్న రైలును గమనించి ఉండాల్సింది కదా? అతను చూడలేదంటే ఎంత నిర్లక్ష్యంగా నడుపుతున్నాడో అర్థం అవుతోంది. అప్పటికీ పిల్లలు గట్టిగా అరుస్తూనే వున్నారుట రైలు వస్తోంది అని!
పైన చెప్పిన దుర్ఘటన కేవలం ఓ మచ్చుతునక మాత్రమే! ఈ సెల్‌ఫోన్లు మాట్లాడుతూ డ్రైవ్ చేయడంవల్ల ఎన్నో ఘోర ప్రమాదాలు ఈమధ్యకాలంలో ఎక్కువైనాయనే చెప్పాలి.
సెల్‌ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదని ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా ఏమీ ప్రయోజనం లేకుండా ఉంది. అందుకే వాహనం నడుపుతూ సెల్ మాట్లాడేవాళ్ళకి కఠిన శిక్షలు అమలుపరిస్తేగానీ లాభం లేదేమోననిపిస్తుంది.
అమెరికా లాంటి దేశాలలో ఇటువంటి కఠిన శిక్షలు అమలులో ఉన్నాయి. కాబట్టే అక్కడ వాహనం నడిపే వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేస్తారు.
గోరఖ్‌పూర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో చనిపోయిన చిన్నారుల తల్లిదండ్రులకు రెండు లక్షల రూపాయల కాంపెన్‌సేషన్ ప్రభుత్వం అనౌన్స్ చేసిందట. అంటే తమ పిల్లల ప్రాణాల విలువ రెండు లక్షలా అని విలపిస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం? తమ పిల్లలమీద వారి భవిష్యత్తుమీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రుల గర్భశోకాన్ని ఎన్ని లక్షలు పోసినా తగ్గించగలమా? చెప్పండి?!
అందుకే దేశం మొత్తంమీద చిన్నారుల వ్యానుగానీ బస్సుగానీ నడిపే డ్రైవర్లను నియమించే ముందు ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళు, చెవులు మరియు సామాన్య ఆరోగ్యం- ఇవన్నీ పరీక్షించిగాని పిల్లల వాహనాలు నడపటానికి అనుమతి ఇవ్వకూడదు.
ఎంతో కష్టపడి, నిద్రాహారాలు మానుకుని, ఎన్నో పరిశోధనలు చేసి సమస్త మానవాళికీ అన్నిరకాల సౌఖ్యాలనూ అందిస్తున్న మన శాస్తవ్రేత్తల కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు కాకుండా ఉండాలంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలన్నీ పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకునే బాధ్యత వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

-- మాధవపెద్ది ఉష