మెయిన్ ఫీచర్

ట్రెండ్ మారుతోంది బాసూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా-
సినిమా అంటేనే పిచ్చి. సినిమా అంటేనే ఫ్యాషన్. సినిమా అంటేనే గోల్. సినిమా అంటేనే క్రేజ్. సినిమా అంటేనే అదో ప్రపంచం. సినిమా అంటేనే ఓ ట్రెండ్ సెట్టర్. సినిమా అంటేనే ఓ ఛేంజ్. సినిమా అంటేనే ఓ విభిన్న మార్పు!
అంతటి సినిమా రంగంలో బోలెడన్ని ఊహించని మార్పులే మార్పులు. ఊపిరి సలపనివ్వని ట్రెండ్‌లు, మొన్నటిది నిన్న కనబడదు. నిన్న ఉన్నది నేటికి పాతపడిపోతుంది. నేటిది నేడే! రేపటికి రేపటిదే, అంతా కొత్తకొత్తగా... నిత్య నూతన మార్పులు...!
అలాంటి సినిమా రంగానికి సంబంధించిన శత దినోత్సవాలు, రజతోత్సవాలు, త్రీహండ్రెడ్ డేస్ వగైరాలెప్పుడో కనుమరుగై 50 కోట్ల షేర్ సంబరాలు, వంద కోట్ల అభినందన సభలు (లేదా స్టేట్‌మెంట్స్), 150 కోట్ల విరగదీసే వసూళ్ల సక్సెస్‌మీట్స్ (లేదా ట్విట్టర్స్ ద్వారా) లాంటివి అలవోకగా తెరమీదికి వచ్చాయి. సరే! ఇవన్నీ సినిమా విడుదలయ్యాక జరుపుకునే జాతరల సంబరాలు. ఇక విడుదలకి ముందే సినిమాకి హైప్ తేవడానికి సినీ మేకర్స్ విపరీత ధోరణుల్లో సరికొత్త పుంతలు తొక్కుతున్నారు. పాటల్ని సైతం రకరకాలుగా కొత్త రకంగా... ఒక్కటొక్కటిగా పాటని వింత వింత పంథాల్లో విడుదల చేస్తున్నారు. ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయడానికి ఎంతో వైవిధ్యపుటాలోచనలు చేస్తున్నారు. సూటిగా చెప్పాలంటే ట్రెండ్ పేరిట సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. ఎటొచ్చీ ప్రేక్షకుడు కదలాలి. కాసులు తరలాలి!!
అందులో భాగంగా మార్పుకి సంకేతంలా మొదలైనవే ప్రీ రిలీజ్ ఈవెంట్స్. ప్రేక్షకులు ప్రత్యక్షంగా పాల్గొంటుంటే... ఒక ఊపుకోసం, భారీ క్రేజ్‌కోసం ఒక హీరో సినిమాకి మరో హీరో భాగస్వామ్యమవుతూ విలక్షణతకు పెద్దపీట వేస్తున్నారు. ప్రేక్షక వర్గంలో విపరీతమైన జోష్ తెప్పించడంలో సక్సెస్ అవుతున్నారు.
విడుదలయ్యాక బొమ్మ బొరుసులా, బాగుంటే హిట్! లేదంటే ఫట్!... అది వేరే విషయం. థియేటరికల్ ట్రైలర్స్ అంటూ, మరో ట్రైలర్స్ అంటూ తెగ హంగామా చేస్తూ ప్రేక్షకుల్ని బుట్టలో వేసుకోవడానికి సినీ మేకర్స్ మొత్తానికి తెగ ప్రాయాస పడిపోతున్నారనడంలో సందేహం లేదు. అయినా వస్తువుల్ని వినియోగదారుడితో ఆకర్షింపచేసి బిజినెస్ సక్సెస్‌గ్రాఫ్ పెంచుకోవడానికి తయారీదారులెన్ని ప్రయత్నాలు చేస్తారో... అంతకుమించి... సినిమాని ప్రమోట్ చేయడానికి సినిమా వాళ్లంతా తలకు మించి ప్రయత్నాలు చేసేస్తున్నారు. మార్పు అనివార్యమైనపుడు కొత్త ఆలోచనలు పుట్టుకురావడం సహజం.
‘‘నేను సినిమా పరిశ్రమకి అడుగుపెట్టిన కొత్తలో... సక్సెస్‌లు చూస్తున్న తొలినాళ్లలో, నా చిత్ర శత దినోత్సవ వేడుకకి, అప్పటి ఓ అగ్ర హీరోని ఆహ్వానిస్తే.. ఆయన రాలేదారోజు. ఆ బాధేంటో నాకు తెలుసు, అందుకే నాగశౌర్య పిలవగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్‌గా వచ్చాను’’అంటూ అప్‌కమింగ్ (మిగతా 12వ పేజీలో...)

(9వ పేజీ తరువాయ...) హీరో నాగశౌర్య ‘్ఛలో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చి ఆశీర్వదించారు. మెగా హీరో చిరంజీవిగారు, ఒక హీరో సినిమా ప్రమోషన్‌కు మరో హీరో రావడం ఇపుడు ట్రెండ్‌గా మారుతోంది.
ఈ సంఘటనకి కాస్తముందు అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్ సినిమా ‘హలో’ ప్రీ రిలీజ్ వేడుక రోజున ఏకంగా మెగా తండ్రీ కొడుకులు చిరంజీవి, చరణ్‌లు హాజరై ఆ హీరోకి అభినందనలు ఆశీర్వచనాలనందించారు. ఇంకాస్త ముందుకి మరింత ముందుకి వెళితే ఇదే హీరో అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మహేష్‌బాబు రావడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎవరూ ఊహించని విషయమిది. ఇలా ఓ సరికొత్త ట్రెండ్ ఆ హీరోతోనే ఈమధ్య ఈ ‘అఖిల్’ సినిమాతోనే మొదలైందని చెప్పొచ్చు.
సరే, ఈ సినిమాకి ముందు వెనకలుగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మెగాఫ్యామిలీ హీరోల ఉత్సవాలకి ఆయా ఫ్యామిలీల బిగ్ హీరోలు హాజరయ్యారు. అది వారివారి ఫ్యామిలీ హీరోల విషయం వరకు మాత్రమే! అభిమానిగా నితిన్ సినిమా వేడుకకి పవన్‌కళ్యాణ్, అలాగే నాని-శర్వానంద్ లాంటి హీరోలు మరో యంగ్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి హాజరై శుభాకాంక్షలందించారు. అదేమంత సెనే్సషనల్ కాలేదు. బడా బడా హీరోలు మరో క్రేజీ క్రేజీ హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి (లేదా ఓ ఫేమస్ ఫ్యామిలీ హీరోలకోసం మరో ఫేమస్ ఫ్యామిలీ హీరోలు రావడం) హాజరవ్వడం... ఊహించనంత విపరీతమైన హైప్ సినిమాకి తీసుకురావడం అనేది.. కొత్తకొత్తగా మొదలవుతుందీమధ్యనే... ‘అఖిల్’ సినిమానుండి అలా అలా...!
ఇక ‘్భరత్ అనే నేను’ సినిమా విషయానికి వస్తే ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ఏకంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను దించబోతున్నారన్న న్యూస్ స్ప్రెడ్ అయింది మొదట. కానీ ఫంక్షన్ సమయానికి అనూహ్యంగా ఎన్టీఆర్ మాత్రమే హాజరై అబ్బురపరిచాడు. హీరోలు మహేష్‌బాబు, ఎన్టీఆర్ లిద్దరూ ఒకే వేదికపైకి రావడం ఇరువర్గాల అభిమానులకు ప్లస్ సామాన్య ప్రేక్షకులకు కనుల పండువగా అన్పించి థ్రిల్‌కు గురిచేసింది.
పోతే ‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ వేడుకకు తమిళ పాపులర్ హీరో సూర్య లేదా జాతీయస్థాయిలో మోస్ట్ పాపులారిటీ సంపాదించుకున్న సూపర్ హీరో ప్రభాస్‌ని గాని పార్టిసిపేట్ చేయబోతున్నారనే ప్రీవార్త ఫిలింనగర్‌లో మొదట చక్కర్లుకొట్టింది. వీరిద్దరిలో ఏ ఒక్కరో లేదా మరో క్రేజీ హీరో ఆ ఈవెంట్‌కి అటెండయినా ఆ సినిమా అంచనాలు పెరిగిపోవడం ఖాయం. అయితే చివరికి రామ్‌చరణ్ హాజరై ఆశ్చర్యపరిచారు. అలాగే ఒక హీరో నటించిన సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు మరో హీరో అతిథిగా రావడమనే ట్రెండ్ ఊపందుకున్నట్లేనని రుజువవుతున్నట్లే!!
మరి సినిమానా! మజాకా! ప్రేక్షకులు... అదే డబ్బుపెట్టి సినిమా చూసే జనాలు.. హాయిగా ఉండటానికి... సినీ క్రియేటర్స్, క్రియేటివిటీతో ఆలోచిస్తున్నారు. తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘మహేష్‌బాబు’గారన్నట్లు ‘‘మా హీరోల మధ్య ఇగోలు, బేదాభిప్రాయాలు అస్సల్లేవు. అలాంటిది అభిమాన హీరోల తరఫున అభిమానులు పోట్లాడుకోవడం, తమమధ్య తామే చిచ్చుపెట్టుకోవడం తగదు.’’ అభిమానుల మధ్య విభేదాలు మటుమాయమైతే బావుంటుంది కదా!
ట్రెండ్ మారుతోంది బాసూ...! హీరోలే మారుతున్నారు... ఇగోలు పక్కన పెడుతున్నారు, ఈర్ష్యల్ని అణగదొక్కేస్తున్నారు... అభిమానులం మనకెందుకీ (నెట్లల్లో, ట్విట్టర్స్‌లో) గొడవలు? ఒకళ్ల సినిమాకు మరొకళ్లు ఒకే వేదికను పంచుకుంటూ హీరోలే భేషజాలకు చెక్ పెట్టేస్తుంటే.. బాసూ, అభిమానులం మనమధ్య ఎందుకింత గ్యాప్? చెరిపేద్దాం దూరాల్ని, దగ్గరవుదాం. నీదో వర్గం, నాదో వ్యతిరేక అభిమాన వర్గం. ఎందుకులెద్దూ... కలిసిపోదాం! అభిమాన సంఘాలు... ఆయా ఫలానా హీరో సంఘంగానే ఉండనీ! అక్కడితో ఆగిపోతే సరి. సినిమా విషయాల వరకొస్తే ఏ హీరో అయితేనేం... బాగుంటే చూసేద్దాం! మరీ మరీ బాగుంటే ఎగబడి చూసేద్దాం!! అంతేకానీ... బాగులేని సినిమాపై విమర్శల రాళ్లు రువ్వడం... విడుదల కాకముందే నెగెటివ్ బురద (నెటిజన్స్) జల్లడం... బాగులేని సినిమా మన హీరోదైతే... సూపరహా, బంపరహో.. అంటూ పటాసులు కాల్చడం లేదా అనవసరంగా మొదటిరోజే ఇన్ని కోట్లు వసూళ్లు, వారంలో అన్ని రికార్డుల కలెక్షన్స్ అంటూ... డప్పువాయిస్తూ, సన్నాయి నొక్కులు నొక్కడం.. లాంటివి చేయకూడదు.
అది సినిమా వర్గం, ఇది చూసే వర్గం అన్నట్లుగా రెండే రెండువర్గాలు ఉంటేనే సర్వత్రా శుభం, సినిమా అందరిది! హీరోలూ అందరివారే! ఏ హీరో ఎవరైతేనేం... బాగున్న సినిమాకు పట్ట్భాషేకం చేద్దాం! బాగోలేకపోతే నిర్మొహమాటంగా వెనక్కి తిప్పేసి పంపేద్దాం!!
ఏవంటారు? ఉత్తుత్తినే తలూపడం కాదు... తయారవ్వండి అలా! ట్రెండ్‌తోపాటూ మనమూ మారాలి బాసూ!
దట్సాల్! ఓకేనా?

- ఎనుగంటి వేణుగోపాల్