మెయిన్ ఫీచర్

మృగాళ్లను వెలివేద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగా పెళ్లైన వారిని సీతారాముల్లాగా ఉండమని దీవించడం మన భారతదేశంలో సహజం. సీతమ్మ పడినన్ని కష్టాలు మరెవ్వరూ పడి ఉండరు అని కూడా చెబుతారు. ఎవరైనా దిగాలుగా కూర్చుని ఉంటే అశోకవనంలో సీతమ్మ వారిలాగా కూర్చున్నావేమిటి అనడమూ అంతే సహజం.
నాటి సీతమ్మ ఒక్క రావణాసురుణ్ణే చూసింది. వాడు రాక్షసుడని పేరుమోసినవాడు. వాడు కూడా సీతమ్మ ధృడచిత్తానికి భయపడి అశోకవనంలో తన భటులైన రాక్షస స్ర్తిలను కాపలాగా పెట్టా సీతమ్మను బంధించాడు. ఆమెను మానసికంగా ఇబ్బందుల పాలు చేశాడు. రాముని గురించి లేనిపోని అబద్ధాలు చెప్పాడు. తన గొప్పతనాన్ని అంతవాటిని ఇంతింతలు చేసి చెప్పాడు. తనను పరిణయమాడితే లంకారాజ్యానే్న ధారపోస్తాను అన్నాడు.
కాని సీతమ్మ వాడి ప్రగల్భాలకు లొంగలేదు. వాని పరాక్రమాన్ని చూసి భయపడలేదు. పోరా.. అన్న ధ్యాసతోనే త్రిలోకాలను ముచ్చెమటలు పట్టించిన రావణాసురుని గడ్డి పరకతో సమానంగా చూసింది.
కాని ద్రౌపది యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించింది. స్వయంవరాన్ని ప్రకటించి మత్య్సయంత్రాన్ని పడగొట్టినవానిని చేపట్టింది. కాని ఐదుగురి అన్నదమ్ములకు ఇల్లాలైంది.
కాని ఆమెను పడని కష్టంలేదు. కానని చిక్కు లేదు. ఆ తల్లి కీచకుడి దగ్గర నుంచి దుస్సల భర్తయైన జయదధ్రుని వల్ల కూడా ఆమె పరావభానే్న పొందింది. ఇక కర్ణదుశ్శాసనులను వేరుగా చెప్పనక్కర్లేదు. ఆమె ఎందరో కీచకుల బారిన పడింది. కాని ఆమె ధైర్యసాహస వనితగానే పేరెన్నిక గన్నది.
అట్లానే దమయంతి కూడా బాధలుపడింది.
ఇట్లా చూస్తే పోతే కలియుగం రాకముందునుంచే అనాదిగా ఆడవారికి ప్రమాదాలు పొంచే ఉన్నాయి. కాని వారంతా ధైర్యసాహసాలతో ఎదుటి కీచకులను పోరాడి గెలిచారు. వారి మాన ప్రాణాలు నిలబెట్టుకొన్నారు. కాని నేడు ముక్కపచ్చలారని పసికూనలు లోకం పోకడ తెలియని పసి పాపలు, వృద్ధులు, వనంలోని పడతలు అందరికందరూ కాముకుల కబంధ హస్తాలల్లో చిక్కి శల్యవౌతున్నారు. శీలహానే కాదు ఆఖరికి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.
ఇట్లాంటి మృగాలను శిక్షించడం ఎలా గన్నదే అందరూ ఆలోచించాల్సిన తరుణం ఇది. ఉరిశిక్షను అమలు చేసినా ఇంకా ప్రతి వాడలోను మృగాలు తిరుగుతూనే ఉన్నాయని మనకు దాచేపల్లి చెబుతుంది. తెలిసిన వారు కాదు తెలియనివారు కాదు. ఎవరైనా ఈ మానహానిని చేయడానికి ఉత్సుకతను చూపేవారే లోకం అంతా విస్తరించి ఉన్నారు. వీరిని గర్హిద్దాం. వీరి బారి నుంచి మన ఆడపిల్లలను మనం రక్షించుకుని తీరాలి.
స్ర్తిలు కూడా చిన్న నాటి నుంచి ఎటువంటి ప్రలోభాలకు, ఆకర్షణలకు, బెదిరింపులకు లొంగకూడదు. ధైర్యంగా చలించని నిండైన మనస్సుతో తన కర్తవ్య నిర్వహణాబాధ్యతను ఇంటా బయటా మోయాల్సి ఉంది. అందులోనే ఈ చిన్న పిల్లలైన ఆడపిల్లలను రక్షించుకునే మార్గాలను అనే్వషించాలి.
ఎవరైతే ఈ ఘాతుకానికి ఒడిగట్టుతున్నారో వారింటిలోని ఆడవారు సైతం వారికి బుద్ధి చెప్పాలి. వారిని ఇంట్లోనుంచి తరిమేయాలి. వారికి నిలువ నీడలేకుండా చేయాలి. తినడానికి తిండి లేకుండా చేయాలి. అపుడు కాని వారికి బుద్ధి రాదు. ఉన్మాదుల్లా వ్యవహరించిన వారినంతా తీసుకొని వెళ్లి ఒక ప్రత్యేకమైన గదుల్లో పెట్టి వారికి కౌన్సిలింగు ఇచ్చే ఏర్పాట్లు చేయాలి.

--అబ్బరాజు జయలక్ష్మి