మెయిన్ ఫీచర్

విజయాల వారథి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అవధానవాణి, సాహితీశ్రీ డా తాడేపల్లి వీరలక్ష్మి’’ సాహిత్య విజయ కేతనాలు మహిళా లోకపు మణిపూసగా, సాహితీ లోకంలో సరస్వతిగా, నక్షత్రంగా వెలుగును విద్యార్థులకు అవధాన ప్రక్రియల్లో- రూపకాలు అందిస్తూ, భావి తరాలకు విన్నూత్న రీతిలో ‘అవధాన వాణి’గా ప్రజల్ని ఆహ్లాదపరుస్తున్నారు. భావితరాలకు మాతృభాష వైశిష్ట్యాన్ని అందించే రీతిలో అతి సులువుగా, నైపుణ్యంగా భావితరపు అవధానులుగా తీర్చిదిద్దడమేగాక వ్యాసరచన, వక్తృత్వము, ఏకపాత్రాభియనము, నాటకాలలో రూపకాలలో విద్యార్థుల చేత విజయ కేతనాన్ని ఎగురవేయిస్తారు. విద్యతోపాటు వివిధ రంగాలలో విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని ప్రజ్ఞానాన్ని అందించి, భవిష్యత్తుకు వినూత్న ప్రణాళికలతో విద్య, కళలు నేర్పిస్తున్నారు.
తిరుపతి దేవస్థానంవారి పరీక్షలకు అధిక సంఖ్యలో విద్యార్థులను ప్రోత్సహించి, ప్రథమ, ద్వితీయ శ్రేణి తరగతులు పొందేలా విద్య నేర్పిస్తున్నారు. ‘చదువే కాదు కళలు వ్యక్తిని తీర్చిదిద్దుతాయి’- నిరంతర సాధన, జ్ఞాపకశక్తి పెంచుతాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కళాభిరుచి పెంచి, అవధానులుగా తీర్చిదిద్దే బాధ్యత తన భుజస్కంధాలపైన, జీవిత పరిమావధిగా తీర్చిదిద్దారు. ‘‘ఇది భావి తరాల వికాసమునకు ఒక పూలబాట.’’. శ్రీమదాంధ్ర భాగవతంలో స్ర్తి పాత్రలను 38 రకాలుగా విశే్లషించి, శ్రీ పద్మావతి యూనివర్సిటీనుంచి డాక్టరేటు పొందారు. తల్లి హృదయం తరతరాలకు సందేశము. యశోద కృష్ణున్ని, కౌసల్య రాముణ్ణి పెంచిన తీరు మనందరికీ ఆదర్శం. జంతువులు కూడా పి ల్లల్ని ఎంతో ప్రేమతో పెంచుతాయి. పెంపకంలోనే వారి భవిష్యత్, దేశ భవిష్యత్ ఆధారపడి ఉన్నది.
చిన్నతనంలో వివాహము, తర్వాత భర్త శ్రీ చిట్టు రామయ్యగారు ఆధ్యాత్మికవేత్త ప్రోత్సాహంతో విద్యనభ్యసించి, 97లో తెలుగు ఉపాధ్యక్షునిగా ఆవిడ ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఒక వ్యక్తిగా సంఘటిత శక్తిగా తీర్చిదిద్దిన తన భర్తకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించినప్పటినుంచి విద్యార్థులతో మమేకమై వారిలో భాషా .......... పెంపొందించడానికి విభిన్న రూపకాలను తయారుచేసి వారి చేత సాధన, సంస్కృత భాషా దిన్సోవము, ఉత్సవాలలో వారి చేత రూపకాలు నాటకాలు తెలుగు సంస్కృతము, గణితము, భగవద్గీతలతో అష్టావధానం చేయించడం, పద్యాల తోరణము, వివిధ సామాజిక అంశాలతో వివిధ నాటికలలో తర్ఫీదునిచ్చి నమూనా పార్లమెంట్, భువన విజయము, వాగ్దేవి విలాసం మొదలైన రూపకాలు, తిరుపతి వెంకటీయం మొదలైన నాటకాలు నేర్పించి విద్యార్థుల చేత ప్రదర్శింపజేశారు. స్వర్గ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా నేర్పించి, ప్రథమ, ద్వితీయ, తృతీయ మూడు కన్సొలేషన్ బహుమతులు అందజేశారు. వైజ్ఞానిక ప్రదర్శనలో, ధూప స్టిక్స్ తయారీలో 7వ తరగతి విద్యార్థికి బహుమతి, ప్రశంసలు అందించారు.
వ్యక్తిగతంగా అనేక రాష్టస్థ్రాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొని తెలుగు సాహిత్యాంశాలలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఆమె మంచి ప్రయోక్త. వివిధ సాహితీ సమావేశాలను, సదస్సు నిర్వహణను చేసి ప్రశంసలు పొందారు. సంస్కృత భారతీ వారోత్సవాలలో ప్రఖ్యాత సంస్కృత పండితులతో అలరించిన సభలో ప్రయోక్తగా ఆమె అభినందనలు పొందారు. కవి సమ్మేళనాలో ప్రముఖ కవులతో ప్రముఖ సంస్థలలో తరచూ పాల్గొన్నారు. పెనుగొండ జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొని, శతాధిక కవుల సమ్మేళనంలో పాల్గొని అభినందనలు పొందారు. 2012లో తిరుపతిలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు సభలలో సాహిత్య వేదికపై పద్య తోరణంలో పాల్గొని విశ్వనాథ వారి పద్యాలు చదివి డా ఓలేటి పార్వతీశంగారి విశిష్ట సాహితీమూర్తుల ప్రశంసలు అందుకున్నారు. నాదయోగంలో స్వాతి తిరునాళ్ మహారాజు పాత్ర, సాహిత్య రూపకాలలో శిశిర ఋతువు, దమయంతి, మహాకాళి, శాంతావాణి, కృష్ణానది మొదలైన పాత్రలు ప్రతిభకు తార్కాణాలు.
భారతీయ సంస్కృతి, వ్యక్తిత్వ వికాసము, సమాజంలో మహిళల పాత్ర- ఇలా మహిళల ఉత్తేజ అంశాలపై పలు ప్రసంగాలు అందించి, అభినందనలు పొందారు.

- లక్ష్మీ ప్రియాంక