మెయిన్ ఫీచర్

ఆత్మ స్థైర్యానికి వందనాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు 32వేల అడుగుల ఎత్తు..
గాల్లో ప్రాణాలు..
ఎటు చూసినా శూన్యమే..
విపరీతమైన గాలి ఒత్తిడి..
పై ప్రాణాలు పైనే పోవడం అంటే ఏమిటో తెలిసిన పరిస్థితి..
అటువంటి సమయంలో ఎవరికైనా ఏం తోస్తుంది?
తాము పోతే తమ వాళ్లు సంతోషంగా ఉండాలనో.. లేక తమ బాధ్యతలను ఇంకెవరు నెరవేరుస్తారనో.. పిల్లలకు దిక్కెవరు అనో.. ఇలా మనసులో, మెదడులో ఎవరి ఆలోచనలు వారివి. చావంటే భయం.. తప్ప ఇంకో విషయం ఆలోచించలేని పరిస్థితి. ఎదురుగా మఋత్యువు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి పరిస్థితీ ఇలాగే ఉంటుంది. కానీ ట్యామీ జోషల్ట్స్ మృత్యువు ఎదురుగా ఉన్నప్పుడు ఏమాత్రం చెక్కుచెదరకుండా, భయాన్ని దరిచేరనివ్వకుండా, ఓ వైపు తన బాధ్యతలను ఎంతో నేర్పుతో నెరవేరుస్తూనే.. మరోవైపు భయపడేవారిలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. తానున్నాననే భరోసాని అందించింది.. అదెలాగంటే..
అది అమెరికాలోని సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737 విమానం. న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయం నుంచి ఉదయం 10:27 నిముషాలకు డల్లాస్‌కు బయలుదేరింది. 11:23 నిముషాలకు విమానం ఆకాశంలో 32వేల అడుగుల ఎత్తులో ఉంది. ఉన్నట్లుండి ఆ విమానం ఇంజన్లలో ఒకటి పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ విపత్తుకు అందరూ ఉలికిపాటుకు గురయ్యారు. అప్పుడు ఆ విమానంలో దాదాపు 144 మంది ప్రయాణికులు, ఐదు మంది సిబ్బంది ఉన్నారు. పేలిన ఇంజన్ శకలాలు విమానం కిటికీ అద్దానికి తగిలి కొందరు ప్ర యాణీకులు గాయపడ్డారు. ఒక కిటికీ రంధ్రం నుండి గాలి ఒత్తిడి అధికమై ఓ ప్రయాణీకురాలిని తనవైపు లాక్కుంది. కానీ తోటి ప్రయాణీకులు ఆమెను తిరిగి లోపలికి లాగారు. కానీ అప్పటికే ఆమె తీవ్ర గాయాలపాలై చనిపోయింది.
దాంతో మిగిలిన ప్రయాణికులు తీవ ఒత్తిడికి లోనయ్యారు. మనసులో తమ పిల్లల్ని, ఆత్మీయుల్ని తలచుకున్నారు. కొందరు ఫోన్లు ఆన్‌చేసి చివరి మాటల్ని టైపు చేస్తున్నారు. ఎవరిలోనూ బతుకుతామన్న ఆశ ఏమాత్రమూ లేదు. ఇంజన్ పేలిన విమానం సురక్షితంగా లాండ్ అవుతుందని, తాము ప్రాణాలతో బయటపడతామన్న ఆశ ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు. ప్రతి ఒక్కరి మోముపై మృత్యుభయమే! అలాంటి పరిస్థితులున్న ఆ విమానంలో ఒకే ఒక వ్యక్తి మొక్కవోని దీక్షతో, అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఆమే ట్యామీ జోషల్ట్స్. ఇది జరిగిన వెంటనే ఆమె తను చేయాల్సిన పనులను అత్యంత చురుగ్గా చకచకా చేయసాగింది. ప్రయాణికులకు ఆమె ధైర్యాన్ని చెప్పింది. అత్యవసర ల్యాండింగ్ చేయాలనుకుంటున్నామని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని వారిని అలర్ట్ చేసింది. గగనతల రద్దీ నియంత్రణ కేంద్రానికి జరిగిన ఘటన గురించిన సమాచారాన్ని అందించింది. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరింది. అలాగే గాయపడిన ప్రయాణీకులకు అత్యవసర ప్రథమ చికిత్సను అందించడానికి ఏర్పాట్లు చేయమంది. ఇలా ఒకవైపు పనులను చురుగ్గా, చకచకా చేస్తూనే మరోవైపు ఫిలడెల్ఫియాలో విమానాన్ని అతి సురక్షితంగా ల్యాండ్ చేసింది. 143మంది ప్రయాణికులు, తోటి సిబ్బంది ప్రాణాలను కాపాడడమే కాకుండా, ల్యాండింగ్ తరువాత కూడా వారితో చాలాసేపు మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపింది.
ఇంత ధైర్యంగా ఉన్న ట్యామీ అమెరికా సైన్యంలోని తొలితరానికి చెందిన మహిళా పైలెట్లలో ఒకరు. మునుపుఈమె నావికాదళంలోని విమాన పైలెట్‌గా పనిచేసింది. అందులో భాగంగానే ఆమె సూపర్‌సోనిక్ ఎఫ్ 18 వంటి జెట్ విమానాలను నడిపింది. ట్యామీ 1985లో నేవీలో చేరింది. తరువాత విఏక్యూ - 34 వంటి ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ స్క్వాడ్రన్‌లో పనిచేసింది. తరువాత ఈఏ -6బిలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసింది. ఇలా రకరకాల శాఖల్లో పనిచేసిన ట్యామీ 2001లో కమాండర్ స్థానానికి చేరుకుంది. నేవీలో ఉన్నప్పుడు ఆమె ‘నేవీ మెరైన్ కార్ప్స్ అచీవ్‌మెంట్ మెడల్, నేషనల్ డిఫెన్స్ సర్వీస్ మెడల్’ వంటి ఎన్నో పతకాలను సొంతం చేసుకుంది. నేవీలో ఉన్నప్పుడే తన సహోద్యోగిని పెళ్లిచేసుకుంది ట్యామీ. నేవీలో రిటైరైన తరువాత కమర్షియల్ పైలెట్‌గా పనిచేస్తోంది.
మృత్యుకుహరంలో ఉన్న విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి ప్రయాణికులను, తోటి ఉద్యోగులను రక్షించిన యాభై ఆరు సంవత్సరాల ట్యామీ ఈ ఘటన గురించి వివరిస్తూ.. ‘ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం మా విధి. అనుకోకుండా తలెత్తిన సమస్య కారణంగా కాస్త ఇబ్బంది కలిగినా వారిని కాపాడటంలో మేం సఫలమయ్యాం. బాధ్యత కలిగిన సిబ్బందిగా మేం మా పనులను చక్కగా నిర్వర్తించాం’ అని ఎంతో నిరాడంబరంగా చెప్పి వెళ్లిపోయారు ట్యామీ. యాభై ఆరు సంవత్సరాల వయస్సులో ఎటువంటి ఆందోళనా, ఒత్తిడీ లేకుండా, ప్రయాణికులకు ధైర్యం చెబుతూ, తోటిసిబ్బందికి మానసిక ధైర్యాన్ని అందిస్తూ అందరినీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన అత్యంత గొప్ప మహిళ ట్యామీ. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా ట్యామీపై ప్రశంసల జల్లును కురిపిస్తోంది. హాట్సాఫ్ ట్యామీ..

- ఉమామహేశ్వరి