మెయిన్ ఫీచర్

తీర్చలేనిది మాతృరుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ అన్న దేవత లేకపోతే- ఇది రాస్తున్న నేనూ లేను, చదువుతూన్న మీరూ వుండరు.
రోజూ తలచుకోవాల్సిన ఈ దేవతను ఏదో ఒకనాడైనా తలచుకునేందుకు ఈనాటి నాగరికత మనకో ‘రోజు’ను ఇచ్చింది.
అదే ‘మదర్స్ డే’, మాతృమూర్తి దినోత్సవం
సంవత్సరంలో ఒక రోజుని ‘మదర్స్ డే’గా గుర్తింపు సాధించడానికి దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితమే అమెరికాలో ఒక మహిళ ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చిందంటే, తల్లులపట్ల సమాజానికి వున్న చిన్నచూపు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అన్నా జార్విస్ అనే ఈ అమ్మడు, 1890లోనే తాను నివసిస్తున్న గ్రాఫ్టన్ నగరం వదిలి ఫిలడెల్ఫియాకు మకాం మార్చుకున్నది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో ఒంటరి పోరాటం ప్రారంభించింది. 1905లో తన తల్లిని ఖననం చేసిన స్మశాన వాటికలో అమ్మ సమాధి ఎదుట నిలబడి, చనిపోయిన లేదా జీవించి వున్న మాతృమూర్తులపట్ల గౌరవ పురస్సరంగా ఏడాదిలో ఒక రోజుకి ‘మదర్స్ డే’గా గుర్తింపు తీసుకువస్తానని ప్రతినపూనింది. ఈ క్రమంలో ఒత్తిడి తీసుకురాగల అవకాశం వున్న బడా పారిశ్రామికవేత్తలకు ఉత్తరాలు రాసింది. విజ్ఞప్తులు చేసింది. దరిమిలా వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ముందుగా స్పందించి ఆ రాష్ట్రంలో మదర్స్ డే అధికారికంగా జరపడానికి అంగీకరించింది. ఆ తరువాత 1914లో అమెరికా కాంగ్రెస్ కూడా మెట్టు దిగివచ్చి ఈ దిశగా ఒక తీర్మానం ఆమోదించడం, ఆనాటి ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. మదర్స్ డే సాధించాలన్న అన్నా జార్విస్ పట్టుదల అయితే నెరవేరింది కానీ ఆమె కన్న మరికొన్ని కలలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి. ‘మదర్స్ డే’నాడు తల్లులకు కానుకలగా పూలూ గ్రీటింగ్ కార్డులూ పంపకండి, ఆమె పట్ల మీ ప్రేమానురాగాలు వ్యక్తం చేస్తూ సొంత దస్తూరీతో నాలుగు వాక్యాల ఉత్తరం ముక్క రాయండన్న అన్నా జార్విస్ వేడుకోలు గాలిలో కలిసిపోయింది. గ్రీటింగ్ కార్డుల్లో వ్యక్తమయ్యేది మొక్కుబడి ప్రేమేననీ, సొంతంగా ఉత్తరం రాస్తే తల్లికి కలిగే తృప్తి వేరనీ, జార్విస్ చేసిన విజ్ఞప్తులన్నీ, తల్లి పాలను సైతం లాభాలను అమ్ముకోవాలనే ‘మార్కెట్ శక్తుల’ ఎత్తుగడలముందు వెలవెలాపోయాయి. మాతృమూర్తి దినోత్సవం కోసం నిర్విరామంగా పోరాడిన అన్నా జార్విస్, చివరికి పిల్లలు లేకుండానే, తల్లి కాకుండానే, 1948లో చేతిలో చిల్లిగవ్వ లేకుండా దిక్కుమాలిన పరిస్థితుల్లో కన్నుమూసింది. ఏ తల్లికోసం ఆమె అంతగా పోరాడిందో, ఆ తల్లి సమాధి చెంతనే అన్నా జార్విస్‌ని ఖననం చేయడం ఒక్కటే చనిపోయిన పిదప ఆమెకు దక్కిన ఊరట. మదర్స్ డే నాడు తల్లి దగ్గరకు వెళ్లి ఆ రోజల్లా ఆమెతో గడపగలిగితే అంతకుమించిన సార్థకత వుండదు. ఒక రోజు మొత్తం తల్లితో గడిపి, సొంతంగా వంట చేసి ఆమెతో తినిపించగలిగితే మాతృరుణాన్ని ఏదో కొంతయినా తీర్చుకున్నట్టే. అలా కుదరని పక్షంలో గ్రీటింగ్ కార్డుతోపాటు స్వయంగా అమ్మకు రాసిన ఉత్తరాన్ని కూడా జతపరచాలి. తల్లి మనసు తెలుసుకుని ఆమె కోరుకున్న విధంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు విరాళం పంపాలి. తల్లీ తండ్రి లేని అనాధ పిల్లలను చేరదీయాలనే నిర్ణయం తీసుకోగలిగితే అంతకుమించిన కానుక ఏ తల్లీ ఆశించదు.
మదర్స్ డే నాడు గుడికి వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో వెలసి వున్న మాతృదేవతలకు నమస్కరించండి. ముక్కోటి దేవతలు మీ పూజలందుకుంటారు. ఇది సత్యం.

--భండారు శ్రీనివాసరావు 9849130595