మెయిన్ ఫీచర్

ఆవుల సేవా నిలయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ హైవేకి సమీపంలోవెలసిన పవిత్రమైన ప్రాంతం అది. సకల దేవతా స్వరూపంగా భావించే ఆవును పదిలంగా కాపాడే వైద్యాలయం.. సేవానిలయం. ఆవును అమ్మలాగే చూసుకునే ఈ ప్రాంతం గోధూళి సోకి పవిత్రమైంది. అందుకే ఈ సేవానిలయ ప్రాంగణాన్ని దర్శించుకోవటానికి వందలాది మంది పర్యాటకులు అక్కడకు వస్తుంటారు. అక్కడకు ఎవ్వరు అడుగుపెట్టిన తెల్లని కుర్తా, ఫైజమా వేసుకున్న వలంటీర్లు కమ్మటి టీ కప్పుతో స్వాగతం పలుకుతారు. గోమాత ప్రసాదంగా భావిస్తూ తియ్యటి తేనీరు తాగి సేదతీరుతారు. సకల దోషాలను హరించే గోమాతను సంరక్షించేవారు కరువైన నేపథ్యంలో ఆవును అమ్మలాగా కాపాడుతూ దేశ సౌభాగ్యానికి తోడ్పడుతున్నారు. దాదాపు 300 కిలోమీటర్ల మేరకు ఆవుకి చిన్న దెబ్బ తగిలిందిన ఫోన్ వస్తే చాలు అంబులెన్స్ పరుగుపెడుతోంది.ఆవుకు క్యాన్సర్ వచ్చినా.. ప్రమాదంలో కాలు విరిగినా.. ఇంకేదైనా జబ్బుచేసినా ఐసియూ లాంటి వార్డుల్లో ఉంచి వాటికి ఉన్నతమైన వైద్యం అందిస్తారు. దాదాపు 1,600 తెల్లటి ఆవులతో నిండిన ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడి సాధు జంతువుల కళ్లలోకి చూసి సాక్షాత్తు సూర్యచంద్రులే అక్కడ కొలువైనారని భావిస్తారు. 2008లో ఒక్క ఆవుతో ఆరంభమైన ఈ సేవానిలయం నేడు 1600 ఆవులకు కొలువైంది.
ఆవు పొట్ట నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తారు..
రోడ్లపై తిరిగే ఆవులు ప్లాస్టిక్ వ్యర్థపదార్ధాలను తిని బతుకుతుంటాయి. అలాంటి ఆవులను సైతం ఇక్కడకు తీసుకువచ్చి ఆపరేషన్ చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను పొట్టలో నుంచి తొలగించి వేస్తారు. ఇటీవలనే ఒక ఆవు పొట్టలో నుంచి 77కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారని అక్కడ పనిచేసే ముఖేష్ అనే గైడ్ వివరించాడు. ఆకలిగొన్న ఆవులు గ్రాసం లేక ఇలాంటి వ్యర్థాలను సైతం తింటున్నాయని, కాబట్టి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తే ఆవులను కాపాడినవారమవుతామంటున్నారు.
21 అంబులెన్స్‌ల ఏర్పాటు
ఈ ఆసుపత్రిలో దాదాపు 21 అంబులెన్స్‌లు పనిచేస్తుంటాయి. ఆవుకి గాయమైనా, జబ్బుచేసినట్లు ఫోన్ చేస్తే చాలు నిమిషాల్లో తీసుకుని వచ్చి చికిత్స అందిస్తారు. ఆవులకు వచ్చి జబ్బులను బట్టి ప్రత్యేకమైన టెంట్‌లు వేసి వాటిని అక్కడ ఉంచి సంరక్షిస్తారు. అవసరమైతే ఐసియూలో ఉంచి చికిత్స చేస్తారు. బ్యాండేజీలు కట్టిన ఆవులకు సేవలందించే వలంటీర్లతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంటుంది. మూడు కాళ్లు, ఐదు కాళ్లతో పుట్టిన ఆవులను, క్యాన్సర్ సోకిన ఆవులకు ప్రత్యేక వార్డులు ఉంటాయి. వార్డు బయట బోర్డులు ఉంటాయి.
రెండు ఆరోగ్యకరమైన ఆవులను ఇస్తారు..
ఈ ఆసుపత్రికి 300 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఆవులను వీరు సంరక్షిస్తుంటారు. దాదాపు 21 అంబులెన్స్‌లు పనిచేస్తుంటాయి. అనారోగ్యానికి గురైన ఆవులను తీసుకువస్తే వాటిని తీసుకుని సంరక్షించటంమే కాకుండే వారికి ఆరోగ్యవంతమైన రెండు ఆవులను ఇచ్చి పంపుతారు. ఇలా గోసంతంతి పెంచుతుంటారు. ఆవులకు ఉన్నతమైన ఆరోగ్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి భక్తులు, దాతల సాయంతోనే పనిచేస్తోంది. ఈ హైవేకి పక్కనే ఉండే దాబా, దుకాణాల ఎదుట విరాళాల సేకరణ బాక్సులు ఏర్పాటుచేశారు. ఎవరికి తొచిన
విధంగా వారు ఇస్తుంటారు. హిమాలయాల నుంచి నీటిని తెప్పించి ఈ ఆవుల చేత తాగిస్తుంటారు.
ప్రతిరోజూ 8 టన్నుల దాణా తయారీ..
ఆవులకు పౌష్టికాహారాన్ని అందిస్తారు. ప్రతిరోజూ 4.5
లక్షల విలువ చేసే ఎనిమిది టన్నుల గోధుమల దాణా ఉడకబెట్టి ఆవులకు పెడుతుంటారు. ప్రతి ఆవుకి శీతాకాలంలో దుప్పట్లు సైతం కప్పుతారు. స్వామి కుషాల్ గిరిజీ మహారాజ్ ఈ వైద్యాలయా న్ని పర్యవేక్షిస్తుంటారు. ఆయన ఎ పుడూ ధ్యా నంలోనే ఉం టా రు. ఉదయం, సాయంత్రం వేళల్లో గుహ లో నుంచి బయటకు వచ్చి ఆసుపత్రిని పరిశీలించి వెళతారు.
నంద కామధేనువు ఆగమనంతో..
ఈ ఆశ్రమంలోకి తొలి అడుగు వేసిన ఆవును నంద కామధేనువు అంటారు. దేవతామూర్తిగా భావించి ఈ ఆవుకు ప్రతిరోజూ పూజలు చేస్తారు. నంద కామధేనువు ఆసుపత్రికి కల్పవృక్షమై నేడు వందలాది గోవుల సంరక్షణాలయమైంది. మహావీర్ జయంతి రోజున గోమాతకు గొడుగుపట్టి ముందు నడుస్తుండగా.. వందలాది మంది భక్తులు వెనుక నడుస్తూ భారీ ఎత్తున ప్రదర్శన సైతం నిర్వహిస్తారు. గోమాత ప్రాశస్త్యన్ని వివరిస్తూ ఓ మ్యాగ్‌జైన్ సైతం నిర్వహిస్తున్నారు. వలంటీర్లకు కొదవ లేదు. వేసవి సెలవులు ఇస్తే ఎంతోమంది టీచర్లు ఇక్కడ సేవచేస్తూ తమ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సేవ చేయటానికి నాకు ఇంతకుమంచిన మార్గమే లేదని ఓ టీచర్ అంటారు. ఆవులతో నేస్తం చేసేందుకు జింకలను, నెమళ్లన, ఇతర పక్షులను సైతం పెంచుతారు. ఈ పక్షులు స్వేచ్ఛగా టెంట్‌ల్లోకి వచ్చి ఆవులతో కలిసి ఉంటాయి. రాజస్థాన్ వచ్చే పర్యాటకులు చాలామంది హైవే పక్కనే వెలసిన ఈ గోమాత సేవాలయాన్ని సందర్శించుకుని పునీతులవుతారు.

chitram దేశంలోనే ఆవుల కోసం రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన ఏకైక పెద్ద వైద్యాలయం