మెయిన్ ఫీచర్

మానసిక ఒత్తిడి అధికమైతే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానసిక ఇబ్బందులు పడేవాళ్లల్లో స్ర్తిలే ఎక్కువగా ఉన్నారని ఓ సర్వే తెలుపుతోంది. ప్రతి సమస్యను కూడా స్ర్తిలు మనసుతో ఆలోచిస్తారు. ఇది ఒకందుకు మంచిదే. దాని వల్ల ఇతరులకు చెడు జరగకుండా ఉంటుంది. ఆ పనిని చేసేవారికి కూడా మనశ్శాంతిని పొందవచ్చు. గాని ఒకప్పుడు కేవలం శారీరక శ్రమ మాత్రమే ఉండేది. దాని నుండి ఉపశమనం కలిగించుకోవాలంటే తగినంత ఆహారంతో పాటు నిద్ర కూడా ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు యాంత్రిక జీవనానికి, ఆధునిక జీవనానికి అలవాటుపడిపోతున్నారు. ఆధునిక జీవనాన్ని ఏర్పర్చుకోవడానికి నిరంతరం శ్రమించాల్సి వస్తోంది. ఎసి గదుల్లో కూర్చుని చేసే పనే అనుకొంటారు కాని, ఏసి గదుల్లో యంత్రంలా 18 నుండి 20 గంటలు పనిచేసే వారికి శారీరక శ్రమకన్నా మానసిక ఒత్తిడి అధికమై ఆయుః ప్రమాణాన్ని తగ్గించేస్తుంది.
మనిషికున్న బలహీనత ఏ పని చేయాలన్నా నేను చేయగలనో లేదో అనుకోవడం సాధారణం.అంటే ప్రతిదానిని ప్రతికూల దృక్పథంలో చూడడం, ఆలోచించడం అలవాటు చేసుకొంటూ ఉంటారు. నేను ఒకవేళ ఈ పనిని చేస్తే అవతల వారు ఏమనుకొంటారో అని కూడా అనుకొంటారు. దీనివల్ల కూడా మానిసిక రోగం ప్రబలుతుంది. ఇటువంటి ఆలోచనలు మాని, ఏది జరిగినా మన మంచికే అనే సిద్ధాంతాన్ని అలవర్చుకుంటే మానసిక ఆందోళన, ఒత్తిడి తగ్గేందుకు వీలు అవుతుంది. అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితులను మనకున్న పాజిటివ్ థింకింగ్‌తో అనుకూలంగా మార్చుకోవడం అనేది మన చేతుల్లోనే ఆధారపడి ఉంది.అయితే దీనిని వైద్యపరిభాషలో ‘మానిక్ డిప్రెషన్’ అంటారు. దీనినిబట్టి దేనిగురించి అయినా సైకలాజికల్‌గా ఆ స్ర్తీ ఏ విధంగా ఆలోచిస్తుందని అర్ధం అవుతుంది. ఇటువంటి మానసికస్థితి కలిగిన వారు కనీస సంతోషాన్ని కూడా కోల్పోతారు. ఎప్పుడూ విచారంగా, నిరాశ, నిస్పృహలతో కూడిన జీవితాన్నిఈడుస్తూ తమలో తాము బాధపడుతుంటారు.
ఇలా కాకమానసికాందోళనను దూరం చేసుకోవాలంటే మొట్టమొదట నలుగురితో కలసి ఉండడం అలవాటు చేసుకోవాలి. కలవిడిగా ఉంటే కొన్ని సమస్యలుదూరమవుతాయ.
ఏదైనా సమస్య ఏర్పడి దానివల్ల మానసిక ఒత్తిడిని, ఆందోళనను కలుగుతుంటే తమకు దగ్గరైన వాళ్లతో కాని మంచి స్నేహితులతో కాని చెప్పుకుంటే వినేందుకు తనకంటూ ఒకరున్నారనే భరోసా మొట్టమొదట వీరికి కలుగుతుంది. దానితో వీరి ఆలోచనా విధానం మారి శక్తి వస్తుంది. దాని తరువాత ఆ సమస్యకు వీరే పరిష్కార మార్గం చూపిస్తారు. దానితో పాటుగా ధ్యానం చేస్తే ఎంతో మానసిక ప్రశాంతత వస్తుంది. మనసును అదుపులో ఉంచాలంటే ధ్యానాన్ని అనుసరించాలి. ఈ పద్ధతి ద్వారా ఉపశమనం పొందిన వారు కూడా చాలా మంది ఉన్నారు. శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవాలంటే సాధన అనేది చాలా అవసరం. దేనిని సాధించాలన్నా పట్టుదల కూడా అవసరం. శరీరం కూడా అతిగా పెరగకుండా ఉంటుంది. ఎక్కువ మానసిక ఇబ్బందులు ఉంటే ఒబెసిటి వచ్చే ప్రమాదం కూడా ఉంది. దానికి ఈ ధ్యానం ఎంతో మేలు చేస్తుంది. వౌనంగా ఏ ఆలోచన్లు లేకుండా కాసేపు ఉండడం వల్ల శారీరిక అలసట, మానసికపరమైన అలసట రెండూ తగ్గుతాయ.

- వాణి ప్రభాకరి