మెయిన్ ఫీచర్

గోరుముద్దలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరునెలల వయస్సు రాగానే పిల్లలకు తల్లిపాలతో పాటు ఘనాహారాన్ని అలవాటు చేయవచ్చు. డబ్ల్యూహెచ్‌ఓ సూచన ప్రకారం మొదటి ఆరునెలల తర్వాత బిడ్డకు మరీ ఘనపదార్థాలు కాకుండా జావలాంటి ఆహారపదార్థాలను అలవాటు చేయాలి. వీటిని తల్లిపాలతో పాటు ఇవ్వాలి. వీటిని అలవాటు చేయగానే తల్లిపాలను మానేయకూడదని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కొన్నిసార్లు బిడ్డ ఇలాంటి పదార్థాలు తినడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ పిల్లలకు ఇలాంటివి నెమ్మదిగా అలవాటు చేయాలి. కొద్దిరోజులు ఇలాంటి జావలాంటి పదార్థాలను అలవాటు చేసిన తరువాత ఘనపదార్థాలను అలవాటు చేయవచ్చు. భోజన సమయంలో పెట్టే భోజనమే కాకుండా బిడ్డకు వేలుతో సులువుగా తినగలిగే ఆహారాన్ని పెట్టవచ్చు. గుర్తుందా.. చిన్నప్పుడు అమ్మలు అన్నాన్ని మెత్తగా చేసి పాలుపోసి లేదా రసాన్ని పోసి బొటనువేలుతో గినె్నలో రాసి ఆహారాన్ని పాపాయి నోటికి అందించేవారు. వీటినే గోరుముద్దలని పిలిచేవారు. అయితే ఈ గోరుముద్దలను పిల్లల నోటికి ఎప్పుడు అందించాలి అని అందరూ సంశయిస్తూ ఉంటారు. దానికీ ఓ పద్ధతుంది అని చెబుతారు మన పెద్దవారు.
బిడ్డ ఒకవైపుకు పడిపోకుండా, వంగకుండా నిటారుగా కూర్చోగలుగుతున్నప్పుడు ఆహార పదార్థాలను తీసుకుని నోటిలో పెట్టుకోగలుగుతున్నప్పుడు, కొత్త ఆహారపదార్థాలపై బిడ్డ ఆసక్తిని కనబరిచినప్పుడు.. అంటే తరచుగా పాత్ర ల్లో ఉన్న ఆహారపదార్థాలను ముట్టుకోవాలనుకుంటున్నప్పుడు.. బిడ్డకు ఆహారపదార్థాలను అలవాటు చేయవచ్చు.
అలవాటు..
* బిడ్డకు ఇచ్చే ఆహారం చాలా పరిశుభ్రంగా ఉండేలా, తేలిగ్గా జీర్ణమయ్యేలా చూసుకోవాలి.
* ఆహారాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి పిల్లల నోటికి అందించాలి.
* మెత్తటి, చిగుళ్ళతోనే సులువుగా నమలగలిగే ఆహార పదార్థాలను ఎంచుకోవాలి.
* ఇడ్లీ లాంటి ఆహార పదార్థాలు పిల్లల నోట్లో ఇట్టే కరిగిపోతాయి. ఇక పిల్లలు నమలడం లేదు అనే బాధ కూడా ఉండదు.
* అంగిటికి అతుక్కునే ఆహార పదార్థాలను పిల్లలకు పెట్టకూడదు. కారమిల్ ఉన్న చాక్లెట్ ముక్కలు, పీనట్ బటర్ వంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి. ఇవి పిల్లల నోటిలో కరిగిపోవు. పైగా అంగిటికి అతుక్కుపోవడం వల్ల ఊపిరి ఆడకుండా పోయే ప్రమాదం ఉంది.
* పిల్లలకు తక్కువ చక్కెర, ఉప్పు వేసిన పదార్థాలను పెట్టాలి.
* పిల్లలకు ఆహారాన్ని స్పూన్, ఫోర్కుల కంటే చేతితో పెడితే మంచిది.
* పిల్లలు ముద్దుగా తింటున్నారు కదా అని వారికి ఆహారాన్ని పెట్టి మీరు పక్కకు వెళ్లిపోకూడదు.
ఆహారపదార్థాలు
* పిల్లలకు ఎండిన పప్పు్ధన్యాలను అందించడం ఆరోగ్యకరం.
* గుడ్డును బాగా ఉడకబెట్టి పిల్లలకు చక్కగా తినిపించవచ్చు.
* బ్రెడ్, బిస్కట్లు ఠెండూ రుచికరంగా, పౌష్టికంగా ఉండి పిల్లల ఎదుగుదలలో సహాయపడతాయి. పైగా ఇవి పిల్లలకు పళ్ళు వచ్చే సమయంలో నొప్పి తెలీకుండా ఉపశమనాన్ని కలిగిస్తాయి.
* పండ్లు సాధారణంగా మెత్తగా, రుచికరంగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. ఇవి పిల్లలకు తినిపించడం చాలా సులభం.
* కాయగూరల్లో కాస్త బియ్యాన్ని వేసి ఉడికించి బిడ్డకు తినిపించడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల పోషకాలు ఎక్కడికీ పోవు.
ఇలా పిల్లలకు ఆహారాన్ని అలవాటు చేసేటప్పుడు సరైన జాగ త్తలు తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు.

-ఉమా మహేశ్వరి