మెయన్ ఫీచర్

రాహుల్ పరిణతి ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందువులు నిర్వహించే ‘సత్యనారాయణస్వామి వ్రతం’లో మంటపారాధనలో భాగంగా అన్ని గ్రహాలను ఆహ్వానిస్తారు. రామగ్రహాన్ని కూడా ఆవాహన చేస్తారు. అది లోకకళ్యాణ కార్యం. కాని రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం- గాంధీల రాజరికం, కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబ ఆస్తి అయిన నేపథ్యంలో జరిగింది. అయినా ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. సోనియా తరువాత ఆయన పార్టీ అధ్యక్ష పీఠం ఎక్కారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధీలోని కొన్ని శాసనసభా స్థానాలను గెలిపించుకోలేక పోయిన రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వద్దనుకోలేదు. ఆయన పీఠం ఎక్కిన నాలుగు రోజులకే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. అయినా ఆయనకు చీమ చిటుకుమనిపించలేదు. గుజరాత్‌లో ఆయన చేసిన ప్రచారంతో కొందరు ‘రాహుల్ రాటుదేలారు’ అంటూ వ్యాసాలు వ్రాశారు, ప్రసార మాధ్యమాలు ఆయనను ఆకాశానికెత్తేశాయి. గుజరాత్‌లో ఓడినా నైతిక విజయం తమదేనని ఆయన ప్రచారం చేసుకున్నారు.
17 రోజులపాటు రాహుల్ గుజరాత్‌లో మకాం వేసినా ఆయన మాటలు ఓట్లమూటలు కాలేదు. ఆయనకు ఆలయాల చుట్టూ తిరిగే మంచి అలవాటు గుజరాత్ ఎన్నికల ద్వారా కలిగింది. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికిలపడింది. తాజాగా కర్నాటకలో ఆ పార్టీ బలం 121 స్థానాల నుంచి 78కి పడిపోయింది. కాంగ్రెస్ ఓడినప్పటి నుంచీ మొహం చాటేసిన రాహుల్ ‘్భజపా నేత యడ్యూరప్ప సీఎం కాకుండా’ జేడీఎస్‌తో చేతులు కలిపారు. యడ్యూరప్పను నిలువరించడంలో విజయం సాధించడంతో ‘ప్రజాస్వామ్య విజయం అంటూ’ రాహుల్ బయటకు వచ్చి, ప్రధాని మోదీపైన, ఆరెస్సెస్‌పైనా విషం కక్కారు. కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో విజయమే సాధిస్తే రాహుల్ ముఖం చాటేయాల్సిన పనేముంది? జేడీఎస్‌ను ‘జేడీ సంఘ్ పరివార్’గా అభివర్ణించి, దేవేగౌడను ఎన్నికల సభల్లో ఘోరంగా అవమానించి, మళ్లీ అదే జేడీఎస్‌కు సీఎం పదవి కట్టబెట్టాల్సిన అవసరమేముంది? తమ కూటమికి చెందిన ఎమ్మెల్యేలను బంధించి, వాళ్ళను గొర్రెల మందలా అటూ ఇటూ తిప్పాల్సిన అవసరమేముంది? మోదీ, అమిత్‌షాలు తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారంటూ రాహుల్ అసత్య ప్రచారం చేశారు. అలా చేసి ఉంటే యడ్యూరప్ప రాజీనామా చేయాల్సిన అవసరమేముంది? భారత్‌ను పాకిస్తాన్‌తో పోల్చి, కోర్టులను అవమానించిన రాహుల్- ‘కర్నాటక సీఎంగా యడ్యూరప్ప 24 గంటల్లో బలపరీక్షను ఎదుర్కొనాల’ని సుప్రీం కోర్టు తీర్పు రాగానే న్యాయస్థానాలను ఆకాశానికెత్తేశారు. తమకు అనుకూలంగా ఉంటే అంతా బాగుందనీ, అలా కాకపోతే అంతా అరాచకమని వాదించే రాహుల్‌కి పరిపక్వత లేదు. సంఖ్యాబలం లేని యడ్యూరప్ప రాజీనామా చేయడం బిజెపి రణనీతిలో భాగం అని ఈ అల్పసంతోషికి అర్థం కాలేదు. తాత్కాలికంగా కాంగ్రెస్ విజయం పొందినా, కర్నాటక ప్రజలకు కాంగ్రెస్-జేడీఎస్ పాలన శరాఘాతం కాక మానదు.
ఇక, మహారాష్టక్రు చెందిన కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ గవర్నర్లను కుక్కలతో పోల్చి భాషామర్యాదను మంటగలిపారు. జెడిఎస్‌ను- బిజెపి బీ టీమ్‌గా పోల్చిన రాహుల్ ఇపుడు జెడిఎస్‌ను తమ బీ టీమ్‌గా చేసుకున్నారు. కాంగ్రెస్ అవినీతిని బయటపెట్టి వారిని జైలుకు పంపుతానన్న కుమారస్వామి ఇప్పుడు ఏం చేయగలరు? ఇది పూర్తి అవకాశవాద రాజకీయం మాత్రమే. యడ్యూరప్ప స్వచ్ఛందంగా వైదొలగడం 2019 ఎన్నికలకు భాజపాకు సంజీవిని అవుతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాలతో మోదీ వ్యతిరేక పార్టీలన్నీ ఆనందం పంచుకుంటున్నాయి. అన్నీ ఏకమవుతాయన్న భ్రమ మీడియా కల్గిస్తోంది. 2014లోనూ ఇదే భ్రమ షికార్లు చేయడం, ఆ భ్రమ పటాపంచలు కావడం తెలిసిందే. కర్ణాటకలో ఇంత జరుగుతుంటే మోదీ ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆయన రంజాన్ మాసంలో ‘కాల్పుల విరమణ’ అంశంపై దృష్టి సారించి, పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం కాశ్మీరు వెళ్ళారు.
కర్ణాటక పరిణామాల అనంతరం కూడా రాహుల్ మాత్రం- మోదీ అవినీతిపరుడని, ఆయన రాజ్యాంగ సంస్థలను నాశనం చేస్తున్నారని పలకడం ఎంత అప్రస్తుతమో అర్థం చేసుకోవచ్చు. పతనమవుతున్న తన పార్టీని సరిచేసుకునే వివేకం లేక, మోదీ ప్రజాదరణ చూసి రాహుల్ చేస్తున్న ప్రేలాపనలని ఎవరికైనా అర్థం అవుతుంది. రాహుల్ గతం మర్చిపోయారు. అలనాడు అత్యవసర పరిస్థితిలో మీడియాపై, ఇతర సంస్థలపై కాంగ్రెస్ పార్టీ చేసిన దౌర్జన్యాలు మర్చిపోయారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కొంతమంది ఎంపీల సంతకాలు తీసుకుని పార్లమెంట్‌లో అభిశంసన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటును స్తంభింపజేస్తున్నది, ఎలక్షన్ కమిషన్ పై ఆరోపణలు చేసేది కాంగ్రెస్ పార్టీ. గెలిస్తే ఇవిఎమ్‌ల్లో దోషం లేదు. ఓడితే ఇవిఎమ్‌ల కుంభకోణం జరిగిందంటారు. సైనికాధ్యక్షుడ్ని కూడా కాంగ్రెస్ పార్టీ ‘గుండా’అని నిందించింది. సైన్యం కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవం పొందలేదు. కాగ్, గతంలో యుపిఎ కుంభకోణాలపై చిట్టా విప్పింది. కాగ్ ప్రతి ఏడాది ఈ పని చేస్తుంది. ప్రస్తత ఎన్‌డిఎను తప్పుబట్టి ఉండవచ్చు. ‘కాగ్’ను నాడు కాంగ్రెసు విమర్శించింది, నేడు వెనకేసుకొస్తోంది. 400 పథకాలకు సంబంధించి 3.50 లక్షల కోట్లు పక్కదారి పట్టకుండా ఆధార్ కార్డును పారదర్శకం చేసింది బిజెపి ప్రభుత్వం.
జూన్ 19, 1970 నాడు పుట్టిన రాహుల్ 2004 వరకు రాజకీయాల ఊసెత్తలేదు. సిక్కు తీవ్రవాదానికి నాయనమ్మ, తమిళుల శ్రీలంక వివాదంతో తండ్రి హత్యగావించబడడంతో ఆయనకు చదువుకంటే భద్రత ఎక్కువైంది. లండన్‌లోని ఓ క్రైస్తవ కళాశాలలో ఆయన రాహుల్ విన్సిగా పేరు నమోదుచేసుకున్నాడు. ఆయన హార్వార్డ్ వెళ్ళాడు. హిందుజాలు ఇందుకు సహకరించారు. 3 నెలల్లో ఆయన వెనుతిరిగాడు. ఎందుకంటే ఆయన దాతల కోటాలో అక్కడికి వెళ్ళాడు. ఆయన కొలిన్స్ కాలేజిలో ఎమ్.్ఫల్ చేశారనడం కూడా అబద్ధమే. 1970లో ఆయన తల్లికి ఇటలీ పౌరసత్వం ఉండింది. అదే, ఆయనకూ ఆ దేశ న్యాయసూత్రాల పరంగా యిప్పటికీ వర్తిస్తుంది. రాహుల్ గతంలో పార్టీని సంస్కరించాలని కలలు కనేవారు. ఆయన కలలు సాగేవి కావు. యుపిఎ 10 ఏళ్ళ పాలనలో తల్లి సోనియాగాంధీ అండతో ఆయన యువరాజుగా ఎంతో దర్పం వెలగబెట్టాడు. అనేక ప్రాజెక్టుల మంజూరు విషయమై నాటి పర్యావరణశాఖా మంత్రి జయంతి నటరాజన్ ఆయనకు చరవాణి లేదా దృశ్యవాణి ద్వారా సమాచారమిచ్చేది. నెహ్రూ దేశానికందించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులన్నింటినీ యంగ్ మీడియా పేర సంస్థకు 2000 కోట్ల మేర మార్పిడి చేసి అమ్మ, కొడుకు తమ ఖాతాలో వేసుకున్న అవినీతి బాగోతం అందరికీ తెలిసిందే. అవినీతి పై మాట్లాడే రాహుల్ యుపిఎ-2లో జరిగిన కుంభకోణాల పట్ల నోరు విప్పరు.
మన్మోహన్ సింగ్‌ను సైతం ఆయన అనుచరగణం కట్టడి చేసేదని సంజయ్ బారు తమ పుస్తకంలో వ్రాశారు. లాలూను జైలునుంచి తప్పించి అవినీతిలో మునకవేసినా పార్లమెంటులో ఆయనను చూడాలని యుపిఎ-2 సర్కారు జారీచేసిన ఆర్డినెన్సు రాహుల్ బహిరంగంగా చింపి నాటి ప్రధాని గౌరవాన్ని కూడా అపహాస్యం చేశారు. అయినా మళ్ళీ బీహారులో లాలూతో జతకట్టి మహా కూటమిగా మోదీని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. రాహుల్‌కు ఓ స్థిరమైన అభిప్రాయం లేదు. బెంగళూరులో జరిగిన ఓ సమ్మేళనంలో స్వచ్ఛ్భారత్‌ను, మేక్ ఇన్ ఇండియాను విమర్శించినప్పుడు విద్యార్థులు ఆయన్ను వ్యతిరేకించారు. ఢిల్లీలో ఫిబ్రవరి 9న అఫ్గల్‌గురు ఉరితీతను వ్యతిరేకిస్తూ జరిగిన వామపక్ష విద్యార్థుల ర్యాలీకి వెళ్ళేందుకు ఆయనకు సమయముంది. లాన్స్‌నాయక్ హనుమంతప్ప దేశ సరిహద్దు మంచులో కూరుకొని పోయి అమరుడైనపుడు నివాళి అర్పించేందుకు ఆయనకు సమయం లేదు. గుజరాత్‌లో 80 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కలవడం కంటే రాహుల్‌గాంధీ స్టార్‌వార్స్ సినిమాకెళ్ళేందుకు సముఖత చూపారు. ఆయన నేడు 130 ఏళ్ళ వృద్ధ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు. కార్యకర్తల సమూహం, సమాహారం, సంరంభం, సమన్వయం సరిదిద్దితేనే కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకడుతుంది. నిందలు, నిషేధాలు, నెగిటివ్ రాజకీయాలు పార్టీని నిలబెట్టలేవు. జాతినీ నిర్మించలేవు.

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్ 96761 90888