మెయిన్ ఫీచర్

మహిళలూ... మహారాణులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటి మహిళ గృహిణే. అట్లాఅని హాయగా నిద్ర పోతుండేది అనుకుంటున్నారా? అదేం కాదండి పాపం.. అపడు మహిళ ఏమేమి చేసేది అంటే పాడి పశువులు వున్న ఇల్లాలికైతే ఆ పనులన్నీ ఆమెవే. నిద్రలేచింది మొదలుకుని ఇంటిముందు నీళ్లు చల్లి ముగ్గు వేయటం, ఇళ్లు కసువులు వూడ్చడం, అంట్లు తోమటం పిల్లా జెల్లాలకు స్నానం, చద్ది వగైరాలన్నీ చూడటం, బావి నీళ్లు చేదటం, లేదా చెరువుకు వెళ్లి మంచి నీళ్లు తెచ్చుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, కట్టెల పొయ్యిల్లో బొగ్గుల కుంపట్లో వంటలు చేయటం, కరెంటు వుండని వూళ్లయితే రోజూ లాంతర్లు తుడిచిపెట్టుకోవటం, పక్కలు వేయటం ఇవి లేచిన దగ్గర్నుంచి చేసుకునే రోజువారి పనులు. ప్రతి ఇంట్లోనూ పదిమందికి తగ్గని కుటుంబ సభ్యులుండేవారు.
ఇక అదనపు పనులు మధ్యాహ్నం పూట నిద్రపోకుండా - దంచటం, రుబ్బటం, విసరటం, పప్పులు, బియ్యం లాంటివి బాగు చేసుకోవటం, అప్పడాలు, వడియాలు, వరుగులు వంటివాటిని తయారుచేసి నిల్వ వుంచుకోవటం కొందరిళ్ళల్లో కంచాల్లో తినటం నిషిద్ధం. విస్తళ్లు కుట్టుకోవటం దేవుడి దీపారాధనకు వత్తులు చేసుకోవటం, నిలవ పచ్చళ్ళకు కావలసిన సామగ్రిని తయారుచేసుకోవటం నిలువ పచ్చళ్ళు జాగ్రత్త చేయటం ఇలా చెబుతూ పోతే దానికి అంతూ పొంతూ ఉండదు.
ఇన్ని పనులు చేసుకొని తమ మానసిక ఆనందం కోసం రకరకాల కుట్లు అల్లికలు నేర్చుకునేవారు. కచేరీలు చేయకపోయినా సంగీతం నేర్వటం అదనపు అర్హతగా భావించేవారు. కాస్త చదువు సంధ్యా వున్నవారి ఇళ్ళల్లోని మహిళలకు రామాయణ, భారత, భాగవతాల్లోని కొన్ని వందల పద్యాలు కంఠతా వచ్చేవి ఇక శతక పద్యాలు సరేసరి. ఏ ఆధునిక పరికరాలు లేని రోజుల్లో తమ కోసం సమయం కేటాయించుకునేవాళ్లు.
నేడు మహిళలు మహరాణులు అయ్యారు. అంటే వారికి ఏదో అదనపు సౌకర్యం వచ్చేసిందనో లేక వారు విశ్రాంతి పొందుతున్నారనో కాదండోయ్. ఎందుకంటే నేడు పరిమిత కుటుంబ సభ్యులు. కుక్కర్, మిక్సీ, వాషింగ్ మెషీన్, ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్, ఒవెన్, వాటర్ హీటర్ సౌకర్యాలు. రోటి పచ్చళ్ళు లేవు మిక్సీలో వేస్తే చాలు. నిలవ పచ్చళ్ళు మనమే చేసుకోవటానికి కావలసిన సరంజామా అంతా రెడీమేడ్. అదీ చేసుకోలేనివారికి పచ్చళ్లే దొరుకుతున్నాయి. ఇంట్లో నలుగురు వ్యక్తులకు పనిమనిషి. ఆఖరుకు ఒక చంచా కూడా కడిగి పెట్టుకోవలసిన పనిలేదు.
వీటితోపాటు ఆఫీసుల్లో కొలువులు కూడా వచ్చేశాయ. అక్కడ పొద్దున ఎనిమిదింటికి బస్ ఎక్కితే ఆ బస్‌లో వేళ్లాడుతూ కుంటుతూకుక్కుకుని ఆఫీసుకు చేరాలి. ఇక అక్కడ ఒక బాస్ చేసిందే చేయమంటాడు. అడిగిందే అడుగుతుంటాడు. పని తలతిప్పి కూడా అటుఇటూ చూడడానికి వీలులేనన్ని పనులుఉంటుంటాయ. ఎపుడూ ఏదో ఫైలులో తలదూర్చి దాన్ని ఫలవంతం చేయాలి. పత్రికాఫీసులైతే ఉన్నవి లేనివి కూడా వార్తలు రాయాల్సిఉంటుంది. లేకుంటే కథనాలు మీరు ఇలా ఉండండి అలా ఉండండి అంటూ రాసే పనే. గవర్నమెంటుఆఫీసుల్లో అయతే రకరకాల శాఖల్లో వారి వారి పని ఒత్తిడి. ఫించను ఆఫీసు అనుకోండి ఇక ఫించను రానివారు, వచ్చేవారిలోను అరకొరగా వచ్చినవాళ్లు. ఫించను పొందడానికి అర్హత లేమిటని అడిగేవారు ఇలా ఎందరికో చిరునవ్వుతో జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ని చేసి అందరినీ నప్పించినా చివరకు బాస్‌కు నచ్చినట్టు చెప్పినట్టు పని చేయకపోతే అక్కడా శబ్దంలేని యుద్ధమే. ఎపుడు ఏం చేస్తాడో అని చిరాకు ఉన్నా పరాకు లేకుండా పనిచేయాల్సిందే. తిరిగి ఇంటికి వచ్చేసరికి మళ్లీ రాత్రి తిండి కార్యక్రమాలు మొదలు. పిల్లలు వారి హోంవర్క్‌లు ఇలా ఎన్నో ఉంటున్నాయ.
మనిషికి వెసలుబాటు ఎక్కడ. అపుడు కట్లు అల్లికలు, సంగీతం ఇవీన్నీ మానసికానందాన్ని ఇచ్చేవి కాని నేడు అవి అన్నీ సంపాదనామార్గాలు అయపోయాయ. కనుక ఏది నేర్చుకుంటే దాని ద్వారా సంపాదన ఎలా పెరుగుతుందో అని ఆలోచించడమే మహిళ పని అయపోయంది. దాన్ని నేర్చుకోవడం దాంట్లో ఏం మెరుగులు పెట్టడం అవి ఎలా అమ్ముడు అవుతాయ. ఎలా సంపాదన పెరుగుతుంది అనే ఆలోచన్లతో వారికి నిద్ర రాకుండా ఉంటోంది.
ఇంతకుముంధుకాలంలో ఏదైనా ఆర్ట్ అంటే పెయంటింగ్‌నో, కవిత్వమో, గానమో దేన్ని నేర్చుకున్నా ఇంట్లో వాళ్లు లేకుంటే పక్కింటివాళ్లు అది ఇది కాదు అంటే ఇంకాస్త ఆ వూరి వాళ్లు ఇలా మెచ్చుకునేవాళ్లు అంతేకాని ధానికి ధరకట్టి అవి ఎలా ప్రమోట్ చేయాలో అవసరం లేకుండా ఉండేది. అది కేవలం మానసికానందంకోసమే ఉండేవి. కాని ఇపుడు రోజులు మారాయ. సృజనాత్మకత ఉంటే దాన్ని రూపాయల్లో విలువ కట్టేరోజులు .. అందుకే అమ్మాయకి సమయం అనేది ఎక్కడా లేకుండా పోతోంది.
కనుక నేటి కన్నా నిన్నటి రోజులే మేలు అనుకొనే స్ర్తిలు నేడు ఎక్కువ అవుతున్నారు. ఇలా సంపాదనామార్గం కాక కేవలం మానసికానందం అంటూ తిరిగితే నలుగురితో పాటుగా అన్నీ సమకూర్చుకోలేమన్న బెంగ. వారికే కాదు చుట్టు పక్కల వాళ్లు మగడు, అత్తమామ ఇలా ఎందరో ఉచితసలహాలనిస్తూనే ఉంటారు.
కనుక స్ర్తీ తన పనిలోనే తాను మానసికానందాన్ని పొందుతుంది. కాని మానసికానందంకోసమో విశ్రాంతి కోసమో ఎపుడూ ఎదురుచూడదు. అలసి పోయ వచ్చి తన పిల్లలకు ఇష్టమైన పదార్థమేదో త్వరత్వరగా వండేసి వాళ్లచేత తినిపిస్తుంటే అమ్మా ఎంత బాగుందో అని వాళ్లు తింటూ అంటున్నప్పుడు ఆ తల్లి పొందే ఆనందంలోనే ఆమె శ్రమ ను మర్చిపోతుంది. ఇది ఆడవాళ్లకే ఉన్న నైపుణ్యం. మగవారు మానసికానందం కోసమో , విశ్రాంతి కోసమో నిద్రపోవడమో లేక పార్టీలు అంటూ వెళ్లడమో చేస్తారు. అదే స్ర్తీ అయతే తన వారికి ఏమేమి కావాలో అవి చేసి పెట్టి వారి ఆనందాన్ని ప్రకటించినపుడు ఆమె శ్రమను మరిచి మానసికానందాన్ని పొందుతుంది. ఇది స్ర్తీ నైజం.

--డా.ఎ. రాజమల్లమ్మ