మెయిన్ ఫీచర్

సంస్కార స్థాయ పెంచాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడ చూసినా మహిళలపైనా దౌర్జన్యాలు. తప్పు అనేది స్ర్తీ పురుషులు చేసినా సరే శిక్ష అనుభవించేది మాత్రం మ హిళనే. శారీరకంగానే కాదు మానసికంగా శిక్ష పడేది స్ర్తి కి మాత్రమే. పూర్వకాలంలో వాడికేం మగమహారాజు అనేవాళ్లు. వాళ్లంతా చాంధసులు అని ఇపుడు అంటున్నాం. ఇది నిజమేనా ఒక్కసారి ఆలోచించండి. తప్పు అనేది ఎక్కువగా పురుషులే చేస్తున్నారు. (ఇక్కడ తప్పు అంటే అత్యాచారాలు, మానభంగాలు చేయడం వరకే తీసుకొన్నాం అనుకోండి) సామూహికంగానో, లేదా ఒంటరిగా దొరికిన ఆడపిల్ల వయస్సులో చిన్నదైనా, పెద్దదైనా ఆఖరుకు వృద్ధాప్యంలో ఉన్నా సరే వారిని తమ పైశాచికానందానికి గురి చేస్తున్నారు. ఆర్థిక వెసలుబాటు లేకపోతే ఇక వారి పని అధోగతే. దానే్న వీరి అస్త్రం గా చేసుకొని వీరిని మానసికక్షోభను కలిగిస్తారు. పరువుగా బతుకుతున్నవారిని బతుకు భయం చూపించి వీరు వారిని దోచేస్తారు.
ఇవి అన్నీ అందరూ చేస్తున్నారని కాదు కాని చాలామంది స్ర్తిలను ఇట్లాగే హింసిస్తున్నారు.
ఇదంతా నాణేనికి ఒక వైపు..
మరోవైపు మహిళలూ మహరాణులు మీరే అంటూ ఆకాశానికి ఎతె్తైస్తున్నారు. అన్ని రంగాల్లోనూ మహిళ లే. వారే టాపర్స్. చదువు కునేవారిలోను వారే, ఉద్యోగాలు చేస్తున్న వారిలోనూ వారే. అంతేకాదు కష్టతరమైన ఆడవారు చేయలేరు అని నిర్ణయానికి వచ్చిన పనులు సైతం చిటికెలో సునాయాసంగా చేసేస్తారు. ఆడవారు ఇంత పని చేసారా అని ముక్కున వేసేకునేట్టు చేస్తారు. ఆఖరుకు తల్లదండ్రులు కాలం చేస్తే వారికి తిలోదకాలు ఇవ్వడమే కాదు ఖనన క్రియలూ ఆడపిల్లలే చేస్తున్నారు. హత్యలూ కూడా ఈ మధ్య చేస్తున్నారు అనే వార్తలు కూడా పేపర్లల్లో వస్తూ నే ఉన్నాయ. అంటే మహిళ అడుగు పెట్టని స్థలం ఏమీ లేదు.
ఆర్థిక వెసలుబాటు లేకపోవడం కాదు ఇంటి బాధ్యతనంతా మోస్తున్నారు. కొన్ని చోట్ల మగవారిని పక్కన కూచోబెట్టి ఇంటా బయటా పనులను చక్కగా చక్కబెడుతున్నారు. కుట్రలు పన్నగలఠు అని టీవి సీరియల్స్ చూపిస్తున్నాయ.
కాని ఇదీ నాణేనికి ఒకవైపు మాత్రమే.
కాని ఇందులో అవసరమైనవి ఏవి అనవసరమైనవి ఏవి? మహిళ దేనినైనా చేయగలదు. ఇది నిరూపితమైంది. కాని ఏ పని చేయాలి ఎంత వరకు చేయాలి. ఆ పని ఫలితం ఏమై ఉంటుంది. ఆ ఫలితం వల్ల ఎవరైనా నష్టపోతున్నారా లేకలాభ పడుతున్నారా అని ఇపుడు ఆలోచించాలి. రావణాసురుని సంహరిండం ఆనాడు రాముడికి బాధ్యత అయంది. నరకాసురుని సంహరించడం సత్యాకృష్ణులకు అవసరం అయంది. మరి ఇపుడు నరకాసురులు, రావణాసురులు కలిపి కనబడుతున్నారు. వారిని అంతం చేయాల్సిందే. ఎందుకంటే వారు లోకమంతా పాకిపోతున్నారు. వారు ఇతరులను తమ క్రీడకోసమో, ఆనందం కోసమోఆడవారిని పావులుగా చేసుకుంటారు. మరి ఇలాంటి వారి జాడ కనిపెట్టి వారి అంతు చూడాల్సిందే. అది చేస్తే సరిపోదు.
మహిళలు ఎదుర్కొంటున్న వివక్షకు వ్యతిరేకంగా వివిధ దేశాల్లో దీనిని పౌర అవగాహన దినోత్సవం, సివిల్ అవేర్‌నెస్‌డే, యాంటీ సెక్సిజం డే, వివక్ష వ్యతిరేక దినోత్సవం, యాంటీ డిస్క్రిమినేషన్ డే... అని ఇలా రకరకాల పేర్లతో ఎన్నో చేస్తున్నారు. కాని ఎన్ని చేసినా మానవ రూపంలో ఉన్న మృగాల్లో ఏమాత్రం మార్పు రావడంలేదు. ఎక్కడో ఒకచోట వారు పంజా విసురుతూనే ఉన్నారు.
1977లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించే వరకు వివిధ దేశాల్లో పలు తేదీల్లో దీనిని జరుపుకునేవారు. ఐక్యరాజ్యసమితి ప్రకటన తర్వాత నుంచే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.కాని ఏం లాభం? ఒక్కరోజు మహిళాదినోవత్సవాన్ని జరిపితే వారికి అవార్డులు రివార్డులు ఇస్తే వచ్చే నష్టం రాకుండా పోతోందా? అందుకే ఇవన్నీ కాదు సమాజంలో మనుషుల చిత్తవృత్తి మారాలి. మనుష్యులు మనుష్యులు గా మెలిగేలా చేయాలి.
అసంఘటిత రంగంలో తక్కువ వేతనాలకే ఎక్కువ పనిచేసే మహిళలెందరో వున్నారు. సంఘటిత రంగంలో మహిళా ఉద్యోగులు 8 శాతం కన్నా తక్కువే. అందుకే సంఘటితమా అసంఘటితమా అని కాక పనిచేసే ప్రతిమహిళకూ సర్వహక్కులు లభ్యమయ్యేలా చేయగలగాలి. స్ర్తి అభ్యుదయ వాదులంతా ముందుకొచ్చి సమానత్వానికై సమర శంఖాన్ని పూరించాలి. రేపటి తరానికి ప్రతినిధులం మేమే అని నేడు వస్తున్న నేటి బాలలకు మంచిని ప్రబోధించాలి. వారిని మంచి దారిలో పెట్టాలి. కనీసం వారి వల్లనైనా ఈ ప్రపంచం మన సమాజం మంచి మార్గంలోకి వెళ్తుందా చూడాలి. ‘ఆడపిల్లగా పుట్టినందుకే నాకు ఇన్ని కష్టాలు’ అని ఏ ఆడపిల్ల అనుకోకుండా సమాజంలోని సంస్కార స్థాయి పెరిగేందుకు కృషి చేయాల్సిందే.
స్ర్తి పురుషుల మధ్య అంతరం ఎంత తగ్గితే అంత వేగంగా వృద్ధి పెరుగుతుంది.దీన్ని దృష్టిలో పెట్టుకుని నేడు స్ర్తీ వాదులంతా ఉద్యమించాలి. సమాజాన్ని నూత్నఉత్తేజంతో కొత్త ఒరవడితో మార్చడానికి సర్వశక్తులు ఒడ్డాలి.

-జి. కల్యాణి