మెయిన్ ఫీచర్

ప్రవృత్తే వృత్తి అయతే...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన లాంగ్ జర్నీస్‌లోగాని, రకరకాల టూర్స్‌లో హోటల్ దగ్గర దిగి లంచ్, డిన్నర్‌ని చెయ్యడం తప్పనిసరి. ఒక్కొక్కసారి సిటీలలో లోకల్ సైట్ సీయింగ్‌లు తప్పనిసరి. న్యూక్లియర్ ఫ్యామిలీస్- ఇద్దరు ఎంప్లాయిస్ అయినప్పుడు వారాంతంలో హోటల్ భోజనం ఒక ఎంజాయ్‌మెంట్. ఒక్కొక్కసారి అతిథులు వచ్చినపుడు, టేబుల్ బుక్ చేసి భోజనాలు పెట్టించడం సరదా. ఎందుకంటే వచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్పకుండా వంట ఇంట్లో సతమతమవ్వడం ఏంబాగుంటుందని అనుకోవడం సహజమే కదా. టైముగాని టైములో వెళ్లి భోజనాలు పెట్టమనడమూ పద్ధతి కాదు. అందుకని హోటల్ భోజనం తప్పనిసరి అవుతోంది. కాని ఇక్కడే అనుకున్నది సాధించడానికి మార్గం వెతుక్కుంది నేటి మహిళ.
ఈ మార్గమే మంచి ఉపాధి మార్గంమా మహిళలు అనుకొంటున్నారు. కేవలం అనుకోవడం కాదు తనవరకే కాక ఇతరులకు కూడా ఉపాధి మార్గాన్ని చూపించగలుగుతోంది. కాని, ఇటువంటి మహిళలు భోజనాలు కేటరింగు చేయడం ఉపాధిమార్గం గా ఎన్నుకోవడం మంచిదే ఈ కేటరింగులోనైనా, లేదా కర్రీపాయంట్స్ లోనైనా కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవలసిన విషయాలు ఉన్నాయ. ఏమాత్రం అజాగ్రత్త గా ఉండడానికి వీలు లేని విషయాలు ఇవి. అందుకే కేటరింగు ఉపాధిగాఎన్నుకొన్న మహిళలు కొన్ని సూచనలు చూద్దాం.
అన్నం వేళ ఆవురావురుమంటూ భోజనం చెయ్యడమో, ఫలహారం చెయ్యడమో, కాఫీ, టీలు త్రాగడమో తప్పనిసరి. హోటళ్ళలో గతంలో అరటి ఆకు, ప్లాస్టిక్ ఆకు, కాగితం ప్లేట్, డిస్పోజబుల్ గ్లాసులు వాడితే సరేసరి, అలా కాకుండా స్టీలు, పింగాణీ పాత్రలు వాడితే మటుకు పరిశుభ్రత బాగా ఉండాలి. గినె్నలు, మూకుళ్ళు కూడా బాగా తోమాలి. లేకపోతే అమీబియాసిస్ వచ్చే అవకాశాలున్నాయి.
ఇపుడు మినరల్ వాటర్ ఇస్తున్నారు. తాగడానికి తినడానికి శుభ్రత పాటిస్తే సరిపోదు. తినే జాగాలో కూడా అంటే పరిసరాల పరిశుభ్రత ముఖ్యం. మంచి ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేయాలి. చుట్టూ మొక్కలు ఉంటే చూడడానికే కాదు మంచి ఆహ్లాదకర వాతావరణమూ, పరిశుభ్రమూ ఉంటాయ. బయట హాలు ఎంత పరిశుభ్రంగా ఉంటుందో అంతే పరిశుభ్రతను లోపల వంట గదిలో ఉండేవిధంగా చూడాలి. పొగ గొట్టాలు, పరిసరాలు, వంట పాత్రలు ఇవి కూడా శుభ్రతనే కలిగి ఉండాలి. సర్వర్స్, క్లీనింగ్ బోయ్స్ వీరు కూడా మంచి శుభ్రమైన డ్రస్సులు వేసుకోవాలి.ప్లేటు అందించడంలోను, తిరిగి తినేసిన తరువాత ప్లేటు తీసుకొని వెళ్లేటపుడు టేబుల్ శుభ్రపర్చడం లోను శుభ్రతను పాటించాలి. లేకపోతే కష్టమర్లు తిరిగి ఇంకో సారి రావడానికి ఇష్టపడరు .
హోటల్స్ కాని, కేటరింగు ప్రదేశాలు కాని, లేక కర్రీ పాయంట్స్, రోటీ టేబుల్స్ ఎవైనా సరే అవి అన్నీ హెల్త్ అండ్ హైజిక్‌కి సింబల్‌గా ఉండాలి.
ఫర్నీచర్, ఎలక్ట్రికల్ ఫ్యాన్స్, ఏసిలు, కలర్ లైట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు కండిషన్‌లో ఉండేలా హౌస్ కీపర్స్ రెడీగా ఉండాలి. కారు పార్కింగ్ మొదలు ప్రతి అంగుళం కస్టమర్ సర్వీస్ బాగుండాలి.
పెళ్లిళ్లు, ఫంక్షన్లు, మీటింగ్‌లు, హోటల్స్‌లో కాన్ఫరెన్స్ హాల్స్‌లో నిర్వహిస్తారు. వారు చాలా కోణాల్లో పరిశీలిస్తారు. అతిథుల సౌకర్యం, పిల్లల సౌకర్యం కోసం, బేబి సిట్టర్స్ ఏర్పాటు కూడా ఏర్పాటు చేస్తుంటారు. చిన్నఉపాధి మార్గాలు అయనా వీటి అన్నిటి మీద దృష్టి పెడితే ఆర్జన బాగుంటుంది. పైగా పైకి ఎదగడానికి అట్టే సమయం పట్టదు. కొద్ది రోజుల్లో మంచి పేరు అంటే గుడ్ విల్ వచ్చేస్తుంది. దాంతో ఉపాధి మార్గాన్ని మంచి సంస్థగా ఎదగవచ్చు.
ఇవే కాదు ఇంకా -
మర్యాదపూర్వకంగా కస్టమర్స్‌కి సర్వీస్ అందించాలి. మహిళలు హౌస్ కీపింగ్‌లో ఎక్కువ సహనంగా ఉంటారు. చదువులో తక్కువగా ఉన్నా సరే ఈ మెళుకువలను పాటిస్తే చాలు ఉపాధి మార్గంలో మంచి ఉన్నతమైన ఫలితాలను సాధించవచ్చు.
కలివిడితనం, నైపుణ్యం, మర్యాదలుంటేచాలు అటు ధనం ఇటు సంతృప్తి రెండూ వస్తాయ.

- వాణి ప్రభాకరి