మెయన్ ఫీచర్

‘గురుకులం’తో నవ తెలంగాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా వెనుకబడిన తరగతుల జీవన విధానాన్ని మార్చేందుకు, వారు అన్ని రంగాల్లో శిరసెత్తుకుని నిలిచేందుకు పెద్ద ఎ త్తున కృషి మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను రాజకీయ నేతగా కాకుండా భవిష్యత్ తెలంగాణను తీర్చిదిద్దే దార్శ నికునిగా చూడవలసి ఉంది. బహుజనుల వికాసమే తెలం గాణ వికాసమని కేసీఆర్ నమ్మినందునే బీసీలను శక్తివంతమైన మానవ వనరులుగా తయారుచేసేందుకు ఆయన కృషి చే స్తున్నారు. ఈ వర్గాల పిల్లలు అందరితో పాటు నాణ్యమైన విద్యను చదవాలని గురుకుల విద్యాలయాలను ఆయన ఏర్పా టు చేశారు. ఇప్పటి వరకు బడిగడప తొక్కని సంచా రజాతులు, ఎంబీసీల పిల్లలు ఈ గురుకులాల్లోకి వస్తున్నారు. ఇది తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం. ప్రభుత్వ హాస్టళ్లంటే పురు గులన్నం, నీళ్లసాంబరు అనే దుర్దశ నుంచి- మంచి పౌష్ఠికా హారాన్ని గురుకుల విద్యావ్యవస్థను కేసీఆర్ తీర్చిది ద్దుతున్నారు. గురుకులాల ద్వారా తయారయ్యే బహుజన వర్గాల పిల్లలు రాబోయే పదేళ్లలో తెలంగాణ ముఖచిత్రం మా ర్చడం ఖాయం. ఈ విద్యాలయాలను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుకునేందుకు బీసీ వర్గాలు కూడా ప్రభుత్వానికి అండగా నిలవాలి.
తరగతి గదిలోనే దేశభవిష్యత్‌కు రూపకల్పన జరు గుతుందని విద్యావేత్త కొఠారి అన్న మాటల సాక్షిగా గు రుకుల పాఠశాలలతో భవిష్యత్ తెలంగాణ నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించాక ప్రారంభించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన 815 గురుకుల పాఠశాలలు అత్యంత ప్రతిభాపాటవాలున్న విద్యాఠ్థులను తీర్చిదిద్దుతున్నాయి. తెలంగాణ అభివృద్ధి అట్టడుగు నుంచే మొదలవుతుందనటానికి గురుకుల పాఠ శాలలే ప్రత్యక్ష నిదర్శనం.
వీరు- ఏ పేద తల్లుల కన్నపేగులు
ఏ పేద తండ్రుల ప్రేమరూపాలు
ఏ మట్టిపొరల్ని తొలచుకొచ్చారో కదా
వూరు పేరు ఏదన్నా కావొచ్చు
ఏ వృత్తి కులం వారైనా కావొచ్చు
ఆ బిడ్డలకూ వూరు కూడా లేకపోవచ్చు
సంచార జాతుల పిల్లలైనా కావొచ్చు
ఆ మెడలకు అలంకరణ లేదు
ఆ చెవులకు పోగులు లేవు
నడుములకు వడ్డాణాలు లేవు
కానీ- వాళ్లంతా బంగారాలు
విరబూస్తున్న హృదయ మందారాలు
గుండెలనిండా ప్రేమనిండిన బతుకు మందారాలు
కాళ్లకు చెప్పులు లేని తండ్రుల పిల్లలు
ఇంటికాడ గల్లాపెట్టెలేని తల్లుల బిడ్డలు
వీళ్లు ఏకలవ్యుని ఆధునిక సంతానాలు
తమశక్తిని ధారపోసి
ఏమీ ఆశించని దానకర్ణుని తమ్ముళ్ల పిల్లలు
గురుకుల పాఠశాలకు పోయి అక్కడి పిల్లలను చూస్తుంటే కళ్లల్లో నదులు పొంగుకొచ్చాయి. ఏ మట్టి తల్లి పిల్లలో కదా వీరంతా. పేదరికం కన్న పేగుకు జన్మస్థానాలు కదా! వాళ్లను కదిలించి మాట్లాడమంటే వాళ్లు చెప్పే విషయాలకు ఈ ప్రపంచం విస్తుపోవాలి. ‘‘ఓడిపోవద్దు, జీవితం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. గెలుపోటములను సమంగా తీసుకుని ముందుకు పోదామని మిర్యాలగూడలోని గురుకుల పాఠ శాలలో 6వ తరగతి చదువుకునే ఓ బీసీ బిడ్డ సందేశం ఇస్తుంటే కళ్లు చెమ్మగిల్లాయి. వొళ్లు పరవశించింది. ఇప్పటి దాకా ఈ పిల్లలలోని టాలెంట్‌ను ఎందుకు బైటకు తీయ లేకపోయాం? ఇప్పటి దాకా వీరికి ఈ రకమైన చదువును ఎందుకు అందించలేకపోయారన్న ఒక రకమైన కోపాగ్రహం కలిగింది. మళ్లీ సముదాయించుకుని చూస్తే ఆ పిల్లలను ఎంత చూసినా తనివి తీరటం లేదు. ఆ పిల్లల క్రీడోత్సవాల ముగింపు సభకు గత ఏడాది నవంబర్ 4న వెళ్లాము. బీసీ గురుకుల సంస్థ జాయింట్ డైరెక్టర్ మల్లయ్యభట్టు నన్ను ముఖ్య అతిథిగా అనుకోకుండా అక్కడకు తీసుకువెళ్లారు. ఆ క్రీడా ముగింపు సభలో పిల్లలతో కలిసి 4 గంటలు గడిపాము. అమ్మాయిలు కబడ్డీ ఆడారు. మొత్తం 31 జిల్లాల పాఠశాల, ఇంటర్, డిగ్రీ స్థాయిలోని బీసీ గురుకులాల అమ్మాయిలకు రాష్టస్థ్రాయి క్రీడోత్సవాలు ఘనంగా జరిగాయి. పిల్లలు మాట్లాడే మాటలకు, వారి ఉత్సాహాన్ని చూసి అతిథులంతా ఫిదా అయ్యారు. ఇదే ప్రోత్సాహం వారికి అందించగలిగితే నేషనల్స్, ఇంటర్నేషనల్‌గా క్రీడాకారిణులు ఎంతోమంది ఈ గురుకులాల నుంచే వచ్చే అవకాశం ఉంది. ఇంత క్రీడా స్ఫూర్తిని, ఆ పిల్లల్లో చైతన్యాన్ని చూస్తుంటే ఇందుకు కారకులైన కేసీఆర్‌కు అభినందనలు చెప్పకుండా ఎవ రుంటారు? ఇప్పటి వరకు ఎవరూ చేయని పనిని కేసీఆర్ చేశారు. బీసీ గురుకులాలలోని పిల్లలు భవిష్యత్తులో ఏ దశకు వెళ్లినా కేసీఆర్‌ను మర్చిపోరు. వాళ్లు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని సస్యశ్యామలం చేస్తారు. క్రెడిట్ విల్ గోస్ టు కేసీఆర్.
పిల్లల ఆకాంక్షలు
తెలంగాణ ప్రభుత్వం బీసీల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 119 గురుకుల పాఠశాలలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. వీటిలో ఫలితాలు బాగున్నాయి. పిల్లల ప ట్టుదల చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు పెద్ద సంఖ్యలో విద్యారంగంలోకి వస్తున్నారు. గురుకుల పాఠశాలల్లో ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ కోడిగుడ్డు, అరటిపండ్లు, కూర గాయల భోజనం అందిస్తున్నారు. గతంలో పప్పుకూర సాంబారులాగా, సాంబారు చారునీళ్లలాగా ఉండేది. గతానికి భిన్నంగా పిల్లలకు పౌష్ఠికాహారం అందిస్తున్నారు. ఆర్థికంగా ఎదిగిన కుటుంబాల వారు ఏ రకమైన పౌష్ఠికా హారం తీసుకుంటారో అంతకంటే మెరుగైన ఆహారాన్ని హాస్టల్ పిల్లలకు అందిస్తున్నారు. ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి ఎక్కువ గంటలు గడుపుతున్నారు. పిల్లలకు అనుమానాలున్న విషయాలపైన, అర్థం కాని సబ్జెక్టులను అడిగి తెలుసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. తెలుగు భాషకు పట్టం క డుతూనే, ఆంగ్లానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా పిల్లలు సాధన చేస్తున్నారు. ఇంగ్లీషు, లెక్కలంటే ఎక్కువ మంది పిల్లలు భయపడతారు. ఈ భయం పోగొట్టేందుకు ఉపా ధ్యాయులు కృషిచేస్తున్నారు.
బీసీ గురుకులాల్లో పోషకాలున్న ఆహారం, సమర్థులైన బోధకులతోపాటు, ఆరోగ్యకరమైన వాతావరణం కూడా ఉంది. విశాలమైన ఆటస్థలాలు, మంచి భవనాలు దొరికాయి. పరిశుభ్రమైన గాలి, మంచినీరు, మంచి వాతావరణం ఉన్న స్థితి పల్లలకు ఎంతో ప్రోత్సాహాన్ని కల్గిస్తుంది. ప్రధానంగా కొన్ని స్కూళ్లల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నా, అది కూడా త్వరలోనే నెరవేరబోతుంది. ముఖ్యమంత్రి ఈ స్కూళ్లకు సమర్థులైన ఉపాధ్యాయులు వచ్చేలా నియామకాలకు కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ పనిని వేగవంతంగా పూర్తిచేసింది. కొత్త విద్యాసంవత్సరం ప్రా రంభంలోనే గురుకులాలకు పూర్తి స్థాయి ఉపాధ్యాయుల నియామకం జరిగి వారు విధుల్లోకి వెళ్లనున్నారు.
ప్రధానంగా పిల్లలలో ఎలాంటి ఆలోచనలున్నాయి. వారు జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు? వారికి ఏయే రంగా లపై శ్రద్ధ ఉంది? ఏ సబ్జెక్టులు బాగా చదువ గలుగుతున్నారు? ఏ సబ్జెక్టులో బలహీనంగా ఉన్నారు? పిల్లలు తమ ఇంటి నేపథ్యం నుంచి చదువుపై ఏ రకమైన దృష్టిపెట్టగ లుగుతున్నారు? పిల్లల్లో ఎనె్నన్నో అభిరుచులుంటాయి, ఆశయాలుంటాయి, ఆలోచనలూ ఉంటాయి. వాటిని ఎలా బైటకు తీసుకురావాలి? అన్నది ప్రధానమైన విషయం. ఉపాధ్యాయుడు మాత్రమే ఆ పిల్లల్లో దాగివున్న ప్రతిభను, అభి రుచులను బైటకు తీసుకురాగలుగుతాడు. ఇది బృహత్తరమైన పని. ఇదే అత్యంత ముఖ్యమైనది కూడాను. దీనిపై ఉపా ధ్యాయులు కృషిచేస్తే అది విద్యావ్యవస్థకే మార గదర్శక మవుతుంది.
ఒక్కసారిగా పిల్లలు టీచర్ అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పకపోవచ్చు. కానీ వారితో టీచర్లు కలిసి ఉంటే ఆలస్యంగానైనా వారి భావనలు చెప్పగలుగుతారు. పిల్లలతో ఎక్కువ గంటలు గడిపే అవకాశం గురుకుల విద్యావ్యవస్థలో మాత్రమే ఉంది. బీసీ కమిషన్‌తో గురుకులాలకు వెళ్లి పిల్లలతో గడిపి, వారు జీవితంలో ఏం కావాలనుకుంటున్నారని అడిగితే వారిచ్చిన సమాధానంతో పులకరింతకు గురికావాల్సి వచ్చింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు బీసీలలోని (ఇ) గ్రూపు అయిన ముస్లింల జీవన విధానంపై అధ్యయనం చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లటం జరిగింది. ముస్లింల సమగ్ర జీవన విధానం విద్యా, ఉద్యోగ రంగాలలో వారి స్థితిగతులను తెలుసుకోవటంలో భాగంగా కొన్ని ముస్లిం గురుకుల పాఠశాలలను పరిశీలించేందుకు వెళ్లాం. సూ ర్యాపేటలోని ముస్లిం పిల్లల గురుకుల పాఠశాలకు వెళితే అక్కడ ఆ పిల్లలు తమ భవిష్యత్తు లక్ష్యాలను చెబుతుంటే విని ఆనందంలో మునిగిపోయాను. సూర్యాపేట కలెక్టర్ సురేంద్ర మోహన్ ఆ పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అయ్యారు. ఆయన ఆ స్కూలుకు ఆప్పుడప్పుడూ వెళ్లి వారి బాగోగులను పరిశీలిస్తూ ఉంటారు. ఒక విద్యార్థి కలెక్టర్‌నవుతానని, మరో విద్యార్థి ఎస్‌పి అవుతానని, ఇంకో పిల్లవాడు టీచర్‌నవుతానని తెలి పారు. ఇంకొందరు పాలనా రంగంలో పనిచేయాలని, ప్రజలకు సేవ చేస్తామని అన్నారు. ఇలా విద్యార్థులు తమ మనసులోని భావాలు చెప్పుకుంటూ పోవటమే కాదు, తమ లక్ష్యాలను చేరుకుని తీరుతారన్న విశ్వాసం కూడా వారి ముఖాల్లో కనిపించింది. ఈ పిల్లలంతా కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్న కుటుంబాల నుంచి వచ్చారు. కలెక్టర్ నవుతానన్న విద్యార్థి తండ్రి సైకిల్‌షాపులో పంక్చర్లు వేస్తూ కుటుంబాన్ని నిర్వహిస్తున్నారు. పేదింటి పిల్లలంతా ఉన్నత శిఖారాలను అధిరోహిస్తామని, విద్యార్జనే ధ్యేయంగా లక్ష్యాలు చేరుకుంటామని ధైర్యంగా చెప్పారు. ఆ పిల్లల లక్ష్యాలకు జేజేలు. వారిని ఆ లక్ష్యం దరికి చేర్చేందుకు గురువులు బాటవేయాలి. ఈ నీటి చుక్కల్ని మహా నదులుగా మార్చాలి. జ్ఞాన జ్యోతులుగా వారు దేశానికి ఒక దిశానిర్దేశం చేయాలి. గురువును మించిన దైవం మరొకటి లేదు. గురుకులాలను మించిన స్కూళ్లు తెలంగాణలో మరొకటి లేవన్న ఖ్యాతిని కూడా ఉపాధ్యాయులే నిలబెట్టాలి. కేసీఆర్ ఎంతో దార్శనికతతో నెలకొల్పిన ఈ గురుకులాలన్నీ ఫలితాలిస్తే అది జ్ఞాన తెలంగాణగా విలసిల్లుతుంది. సమాజంలో సగభాగానికి పైగా వున్న బీసీ వర్గాల పిల్లలు జ్ఞానవంతులుగా మారినప్పుడే దేశంలోనే తొలి శక్తివంతమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. ఈ శక్తే దేశానికి గొప్ప మానవ వనరులను అందిస్తుంది.
నా కన్నీటి బిందువు ఒక మహా సముద్రం
సూర్యాపేటలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలను 2017 నవంబర్ 4న పరిశీలించాము. పిల్లలకు ఆరోగ్యకరంగా, శుభ్రంగా భోజన వసతులను ఏర్పాటు చేశారు. ఉపా ధ్యాయులు బోధన బాగానే చేస్తున్నారని పిల్లలు తెలిపారు. కొందరు పిల్లలు ధైర్యంగా నిలబడి తమకు వసతులు మెరుగుపరచాలని కోరారు. ఒక విద్యార్థిని మంచి కవిత్వం రాసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయులపై కవిత్వం రాసింది. తను ఏ మార్గం నుంచి వచ్చానో, తను ఏ దిశగా ముందుకు సాగాల్నో చెబుతూ కవిత్వం రాసింది. ‘‘నా కన్నీటి బిందువు ఒక మహా సముద్రం’’ అంటూ తన జీవన నేపథ్యాన్ని రాసుకుంది. ఆమెలో మంచి కవయిత్రి వున్న విషయం అవగతమైంది. ఆ దిశగా ఆ అమ్మాయికి చదువుతోపాటు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని సాహిత్యం చదివిస్తే ఎన్నో మానవీయ విలువల్ని ప్రతిష్ఠించే సాహిత్య సృష్టి చేయగలదు. ఈ విషయాన్ని నిత్యం ఆ అమ్మాయితో కలిసి ఉండే గురుకుల ఉపాధ్యాయులు గమనించారు. ఆమెను ప్రోత్సహిస్తున్నారు. అలాగే, వక్తృత్వ, వ్యాసరచన పోటీల ద్వారా పిల్లల్లో ఉండే విభిన్న విషయాలను తెలుసుకోవచ్చును. జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు? అన్న విషయంపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలు పెడితే వారి మనోభావాలను చెప్పే, రాసే అవకాశం ఉంటుంది. పిల్లలు చెప్పిన, రాసిన విషయాలను ఆ పాఠశాల హెడ్ మాస్టర్ పదిలపరచాలి. రికార్డు చేసిన విషయాలను తిరిగి పదేళ్ల తర్వాత కూడా పరిశీలించే విధంగా వాటిని డిజిటలైజ్ చేయాలి. కొందరు పిల్లలు చెప్పటానికి, రాయటానికి ఇష్టపడకపోతే ఉపాధ్యాయుడే తన బోధనా నైపుణ్యాల ద్వారా వారి ఆలోచనలను తెలుసుకోగలగాలి.
ఆధిపత్య చరిత్రను పాతేయాలి
గతంలో పాలించిన ఆధిపత్యవర్గాల వల్ల తెలంగాణలో బహుజనులు అభివృద్ధికి నోచుకోలేదు. బహజనులు గత 60 ఏళ్లలో ఇంతగా వెనకబడటానికి కారణాలను తెలంగాణ రాష్ట్రం వెతుక్కుంటోంది. అందుకు సరియైన సమాధానాలు కొత్త రాష్ట్రం కనిపెడ్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నామంటే ఇప్పుడు జరుగుతున్న పునర్నిర్మాణమే సమాధానం చెపుతుంది. తెలంగాణ ముఖచిత్రం 85 శాతం బహుజన వర్గాలదేనన్నది సత్యం. బడుగుల ఆర్థిక స్థిరత్వంకై కేసీఆర్ ఆరాటపడుతున్నారు. బీసీల కోసం ప్రవేశపెడుతున్న పథకాలతో పాటు 815 గురుకుల పాఠశాలలను నెలకొల్పటం గొప్ప విషయం. దేశంలో ఇన్ని గురుకుల పాఠశాలలను ఏ ప్రభుత్వం నెలకొల్పలేదు.
అందరికీ విద్య, అందరికీ వైద్యం అన్నది నినాదంగా కాకుండా ఆచరణాత్మకమైన రూపు తీసుకునేందుకు కృషి జరుగుతోంది. దేశంలో ఎక్కడాలేని విధంగా సోషల్ వెల్ఫేర్ విద్యావ్యవస్థ తోపాటు భారీ సంఖ్యలో గురుకుల పాఠశాలలు నెలకొల్పటంలో బహుజన విద్యార్థులకు కార్పొరేట్ విద్యా ర్థులకు సమానంగా విద్య అందుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఎగిసిపడ్డ సామాజిక న్యాయం నినాదాన్ని బడుగులకు అనుగుణంగా మలిచే ప్రయత్నాలు మొ దలయ్యాయి. దీన్ని బీసీలంతా స్వాగితిస్తున్నారు. గతంలోని ఆధిపత్యవర్గాల సంస్కృతికి చరమగీతం పాడాలంటే బీసీవర్గాలు స్థిరత్వంగా నిలిచే విధంగా చేయాలి. ఈ ప్రభుత్వం మా కోసం ఏదైనా చేసి తీరుతుందనే విశ్వాసాన్ని క్షేత్రస్థాయిలో బీసీలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రావటం వల్లనే ఈ రకమైన మార్పు కనిపిస్తుంది. సమాజంలో సగభాగమైన బీసీల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇది నూతన పరిణామం.
పునర్నిర్మాణమూ యుద్ధమే
తెలంగాణ పునర్నిర్మాణం ఒక ఉద్యమంలా కొన సా గుతోంది. పునర్నిర్మాణం అంటే బహుజన బతుకులను తీర్చిదిద్దే పునర్నిర్మాణమేనన్నది సత్యం. తెలంగాణ రాష్ట్రం అంటే 85 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా ప్రకటించి ఉన్నారు. ఈ వర్గాల వికాసమే తెలంగాణ వికాసం. సమాజంలో సగభాగంగా ఉన్న బీసీలు, ఆ బీసీలలో సగం జనాభాగా ఉన్న సంచార జాతులు, ఎంబీసీల బతుకులు సంపూర్ణంగా మార్చవలసి ఉంది. ఈ వర్గాలు సామాజికంగా విద్యాపరంగా పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. చేతివృత్తులు చితికిపోయి ఎంబీసీల జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సంచార జాతులు స్థిర నివాసం వైపు వెళ్లవలసి ఉంది. ఇందుకోసం ముఖ్యమంత్రి ఆదేశం మేరకు బీసీ కమిషన్ అధ్యయనం చేస్తుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అందుకు యాక్షన్ ప్లాన్‌లను తయారు చేస్తున్నారు. బీసీల కోసం ఏం చేయాలన్న అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ కమిషన్‌తో సుదీర్ఘంగా చర్చించారు. దిశా నిర్దేశం చేశారు. అభివృద్ధి అన్నది అట్టడుగు నుంచి మొదలు కావాలన్నది సీఎం లక్ష్యం. గతంలో ఆధిపత్యం చెలాయించిన వర్గాలు బహుజనాన్ని పనిచేసే యంత్రాలుగా, ఓట్లేసే మనుషులుగానే తయా రుచేశారు. ఆ ఆధిపత్య విధానాలు చెరిపివేయాలి. నేడు గురుకులాలలోకి అట్టడుగునున్న బహుజనవర్గాలు వెళు తున్నాయి. ఇది గతంలో జరుగలేదు. సంచార జాతులకు చెందిన పిల్లలు గురుకుల విద్యాలయాల్లోకి వస్తున్నారు. గంగిరెద్దులను ఆడించే వారి పిల్లలు, పూసలవాళ్లు, వడ్డెర వాళ్లు, బైల్‌కమ్మర్లు, మొండివాళ్లు, నక్కలోళ్లు, బడిగ జంగాలు తదితర సంచార జాతులకు చెందిన పిల్లలు గురుకులాల్లోకి వచ్చి నాణ్యమైన విద్యను పొందుతున్నారు. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందంటే- సంచార జాతుల పిల్లలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అవుతారనన్న విశ్వాసం ఏర్పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్స్‌లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. రాబోయే 3 ఏళ్లలో 1,200 రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పేలా ప్రణాళికలకు రూపకల్పనలు జరుగుతున్నాయి. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో అన్ని కేటగిరీలకు చెందిన రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్య 298 ఉంటే, తెలంగాణ వచ్చాక 517 నెలకొల్పటంతో వాటి సంఖ్యను 815కు పెరిగింది. గురుకుల విద్యాలయాల్లో పౌష్ఠికాహారం, విద్యార్థుల వసతి సౌకర్యాల కల్పనకు ఏటా లక్ష రూపాయల చొప్పున ఒకొక్క విద్యార్థిపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. 162 బీసీ గురుకుల విద్యాలయాల్లో 28,400 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలకు చెందిన 815 గురుకుల విద్యాలయాల్లో 2 లక్షల 297 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ మార్పు రాబోయే పదేళ్ల తర్వాత మొత్తం తెలంగాణ ముఖచిత్రానే్న మార్చివేస్తుంది.
బీసీల కోసం పథకాలు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ల కోసం 1,16,000 రూపాయలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాలలో చదువుకునే పేద బీసీ విద్యార్థులకు ఓవర్‌సీస్ పథకం కింద 20 లక్షల రూపాయల సాయం అందిస్తున్నారు. తెలంగాణలో 59,60,000 మంది విద్యార్థులు చదువు తున్నారు. ఇందులో సగం మంది వరకు బీసీ విద్యార్ధులున్నారు. ఇక, ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం అమలు చేస్తున్నది. మత్స్యరంగంపై ఆధారపడ్డ సుమారు మూడున్నర లక్షల కుటుంబాలకు ఇది ఉపయుక్తంగా ఉంది. 2016-17లో 3,939 చెరువుల్లో 22 కోట్లు వెచ్చించి 27 కోట్ల చేపపిల్లలను వేశారు. దీని వల్ల 500 కోట్ల ఆదాయం లభించింది. 2017-18లో 11,067 జలాశయాల్లో 42 కోట్లతో 51 కోట్ల చేపపిల్లలను వదిలారు. ఈ ఏడాది 11 జలాశయాల్లో మంచినీటి నీలకంఠ రొయ్య విత్తనాలను వేశారు. మత్స్యకార్మికులకు సబ్సిడీపై ద్విచక్ర వాహానాలు, ట్రాలీ ఆటోలను ఇస్తున్నారు.
బీసీ సంక్షేమశాఖకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి 5919.13 కోట్ల బడ్జెట్ కేటాయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం మొత్తం 815 గురుకుల పాఠశాలలు నిర్వ హిస్తుండగా ఇందులో బీసీల కోసం 165 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. ఎంబీసీలకు 1,000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గత సంవత్సరం 119 బీసీ ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించారు. ఈ ఏడాది మరో 119 ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నారు. కాలేజీ విద్య చదువుతున్న 30,567 మంది బీసీ విద్యార్ధులకు బాలికలకు 125, బాలురకు 125 హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షల విద్యార్థుల కోసం 10 స్టడీ సర్కిళ్లు పనిచేస్తున్నాయ. కళ్యాణలక్ష్మి పథకం కింద 2018-19 సంవత్సరానికి 700 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద ఇస్తున్న 75,116 రూపా యలను ఈ ఏడాది నుంచి లక్షా నూట పదహార్లుగా పెంచారు. చేనేత పనివారి ఆర్థిక సహాయ సంస్థకు 250 కోట్లు, నాయా బ్రాహ్మణుల సహకార సమాఖ్యకు 250 కోట్లు, రజక సహకార సమాఖ్యకు 250 కోట్లు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు 100 కోట్లు, 10 బీసీ ఫెడరేషన్లకు 65.55 కోట్లు కేటాయింపులు జరిగాయి. 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ జరుగుతోంది. తెలంగాణ సంక్షేమ రాష్ట్రం దిశగా అడుగులు వేస్తున్నది. అదే బహుజనుల జీవితాల మార్పుకు సంకేతంగా నిలుస్తుంది.

చిత్రాలు..హాస్టల్ విద్యార్థినులకు కంప్యూటర్లు
*శ్రీహరికోట ఇస్రో సెంటర్‌ను సందర్శించిన గురుకుల బాలికలు

-జూలూరు గౌరీశంకర్ 94401 69896