మెయిన్ ఫీచర్

గుడిసెలోంచి రాజప్రాసాదానికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేగన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీలు ఇటీవల వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే! వీరిలో ప్రిన్స్ హ్యారీ రాజకుటుంబానికి చెందిన రాకుమారుడు కాగా, మేగన్ మార్కెల్ అమెరికాకు చెందిన నటి. వీరిద్దరూ కొన్నాళ్ళుగా ప్రేమించుకుని ఇటీవలే ఒక్కటయ్యారు. అసలు మేడలోని రాకుమారుడికి, సినిమాలోని నటికి ఎలా పరిచయం? ఇంతకీ ఎవరీ మేగన్ మార్కెల్? వింటే.. కాదు కాదు చదివితే ఇదో చందమామ కథే! ఎందుకంటే హ్యారీది పెద్ద రాజకుటుంబం. కానీ మేగన్‌ది బానిస కుటుంబం. మేగన్ పూర్వీకులు ఒకప్పుడు బానిసల్లా బతికారు. వీరు జార్జియాలోని జోసెన్‌బోరోలోని తోటల్లో పనిచేసుకునేవారు. వివరాల్లోకి వెళితే..
మేగన్ మార్కెల్ 1981, ఆగస్టు 4న అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జన్మించింది. మేగన్ పూర్తిపేరు మేగన్ రేచెల్ మార్కెల్. మేగన్ తండ్రి థామస్ మార్కెల్ పదేళ్ళపాటు సినిమాల్లో లైటింగ్ డైరక్టర్‌గా పనిచేశాడు. మేగన్‌కు ఆరు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. తర్వాత మేగన్ తండ్రి థామస్ మరొకరిని పెళ్ళి చేసుకున్నాడు. ఆయన రెండో భార్యకు కూడా ఒక కూతురు, ఒక కొడుకు. కూతురు పేరు సమంతా గ్రాంట్. సమంతకు మేగన్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఒకసారి థామస్ మార్కెల్‌కి లాటరీలో 750, 000 డాలర్లను గెలిచాడు. ఆ డబ్బుతో తనకున్న అప్పులన్నీ తీర్చేసి మేగన్‌ను ఉన్నతమైన కళాశాలలో చదివించాడు. పదకొండేళ్ళ వయస్సులో మేగన్ ఫెమినిస్ట్ అవతారమెత్తింది. ఆడవారిని తక్కువ చేసి చూపిస్తున్న ఓ సబ్బు ప్రకటనను నిషేధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌తో పాటు ఆ సబ్బును తయారుచేస్తున్న పీఅండ్‌జీ కంపెనీకి కూడా లేఖ రాసింది మేగన్. ఆ కంపెనీవారు వెంటనే స్పందించి ఆ ప్రకటనలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. తరువాత పదమూడు సంవత్సరాలకే మేగన్ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. లాస్‌ఏంజిల్స్‌లోని హంఫే యోగర్ట్ అనే స్టోర్‌లో ఐస్ క్రీం సర్వ్ చేసే యువతిగా పనిచేసింది. అందుకుగాను ఆమె గంటకు నాలుగు డాలర్లను సంపాదించేది. వారాంతాల్లో చెత్తను ఏరే పనులను కూడా చేసేది మేగన్. తరువాత ఆమె పేపర్ సోర్స్ అనే చిన్న సంస్థలో క్యాలిగ్రఫీ పాఠకురాలిగా చేరింది. ఇవి చేస్తున్నా చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు మేగన్. కేకేటి విశ్వవిద్యాలయంలో థియేటర్, అంతర్జాతీయ వ్యవహారాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. అమెరికా దౌత్య కార్యాలయంలో ఆరువారాల పాటు జూనియర్ ప్రెస్ ఆఫీసర్‌గా ఇంటర్న్‌షిప్ కూడా చేసింది. ఆ సమయంలోనే మూడు గంటలపాటు ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ టెస్ట్‌లో పాల్గొనింది. కానీ అందులో ఆమె ఎంపికకాలేదు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నటనవైపుదఋష్టిసారించి ప్రముఖ నటిగా ఎదగాలనుకుంది. దానికి తగిన కోర్సులు చేయాలనుకుంది. కానీ నటిగా నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని అని తెలుసుకోవడానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు. ఖాళీగా సమయాన్ని వఋథా చేసుకోవడం ఎందుకు అనుకుని ‘డీల్ ఆర్ నో డీల్’ అనే గేమ్ షోలో సూట్‌కేస్ హోల్డర్‌గా వ్యవహరించింది. ఇలా చేసినందుకుగానూ ఆమెకు ఎపిసోడ్‌కు 800 డాలర్లు ఇచ్చేవారు. ఆ డబ్బులు ఆమెకు సరిపోయేవి కాదు. దాంతో ఆమెకు పార్ట్‌టైం ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది.
తరువాత నెమ్మది నెమ్మదిగా మోడలింగ్ చేస్తూ అందులో పేరు సంపాదించుకుని హాలీవుడ్ సినిమాల్లోకి అడుగుపెట్టింది మేగన్. ‘రిమెంబర్ మి, ది క్యాండిడేట్’ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. మేగన్ స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న తరువాత హాజరయ్యే ప్రతి కార్యక్రమానికీ భారీ ఎత్తున పారితోషికం అందుకునేది. ఎందుకంటే మధ్యతరగతి జీవితం గడిపిన ఆమెకు డబ్బు విలువ బాగా తెలుసు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుందో ఏమో కానీ ఏ కార్యక్రమానికి ఉచితంగా వెళ్లేది కాదు. ప్రముఖ ఫ్యాషన్ సంస్థ రాల్ఫ్ లారేన్‌లో పీఆర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ద్వారా మేగన్, వాయ్‌లెట్ వోన్ వెస్టెన్‌హోల్జ్‌లు మొదటిసారి కలుసుకున్నారు. వాయ్‌లెట్, యువరాజు హ్యారీకి చిన్ననాటి స్నేహితుడు. హ్యారీకి పెళ్ళి చేయాలనుకున్న వాయ్‌లెట్ 2016లో హ్యారీని, మేగన్‌కు పరిచయం చేశాడు. తరువాత వారిద్దరూ డేట్‌కి వెళ్లారు. అలా వారిద్దరి మనసులూ కలిశాయి. 2018 మే 19న వారిద్దరి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. మరో విషయం ఏమిటంటే మేగన్‌కు ఇది రెండోపెళ్లి. మేగన్‌కు మునుపు అంటే 2011లో ట్రెవర్ ఏంజెల్సన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తరువాత వ్యక్తిగత కారణాలతో వీరు 2013లో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మేగన్ రాజకుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టి నటనకు స్వస్తి చెప్పింది.

-విశ్వ