మెయిన్ ఫీచర్

పనిచేయి.. ఫలితం అందుకో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు చాలా చోట్ల మహిళా సంఘాలు ఉన్నాయ. ప్రతి కాలనీకి ఒక మహిళాసంఘం ఉంది. అందులో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయ. ఎంతో మంది పెద్దమనుష్యులు వస్తారు. వారంతా మహిళలకోసం ఎంతో చేస్తున్నామని చెబుతుంటారు. కానీ స్వయంగా తన కష్టాలను తానే ఎదుర్కొని పైకి వచ్చిన మహిళలను స్తుతించేవారు అరుదు. అంతేకాదు కష్టపడి పైకి వస్తున్న స్ర్తిలను స్ర్తిలే చేదోడుగా నిలువాల్సిది పోయ ఎద్దేవా చేస్తుంటారు.
ముందు ఇల్లు తర్వాత వీధి అని వారిని ఎగతాళి చేస్తుంటారు. ఈ రకమైన అలవాటు చదువుకున్న వారిలోను కనిపిస్తుంటుంది. ఈ పద్దతి మారాలి. ప్రతి మహిళా తన కుంటుంబం కోసం ఎంతో శ్రమిస్తుంది. రాత్రనక పగలనక కష్టపడుతుంది. తన పిల్లలకు మంచి చదువు , మంచి ఉపాధి రావాలని తాను శ్రమిస్తుంటుంది. ఈ కష్టంలోనే మరో మహిళకు చేదోడుగా కూడా నిలుస్తుంది. ఎవరో ఒకరు ఈసడించుకున్నారనో, తనను హేళన చేసారనో బాధపడక ప్రతి మహిళకూడా తాను ఎంతగా శ్రమిస్తోందో అవతలి వారు కూడా అంతే అన్న దృక్పథంతో కష్టపడాలి. అపుడే మహిళకు మహిళే సానుభూతిని, సాయాన్ని చేయగలదు.
ఎన్నో స్వచ్ఛంధ సంస్థలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తున్నాయ. తక్కువ వడ్డీకి మహిళలకు ఋణాలిస్తున్నారు. ప్రభుత్వం కూడా మహిళకు అభయహస్తాన్నందిస్తోంది. అపుడే పుటిటన పిల్లలకు కూడా ప్రభుత్వ సాయం అందుతోంది. కంటే కూతుర్నే కనాలి అన్నదృష్టి పెరుగుతోంది. వీరందరి తోడ్పాటును అందుకునే ముందుకు వెళ్లేందుకు మహిళ వందశాతం శ్రమించాలి. అపుడే అనుకొన్న లక్ష్యాన్ని చేరుకుంటుంది.
ఈ పొదుపు సంఘాల్లోని మహిళలు ప్రతి నెలా కొంత డబ్బుని సంఘంలోని ఓ ఇద్దరి మహిళలను గ్రూపులీడర్లుగా ఎంపిక చేసుకుని వారి గ్రామాల పరిధిలోని బ్యాంకులో లీడర్ల పేరిట ప్రారంభించిన పద్దులో జమచేస్తుంటారు. సంఘంలోని మహిళలకు ఏవైనా అత్యవసర ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు ఇతరులపై ఆధారపడకుండా వారు చేసుకున్న పొదుపునుంచి కొంత మొత్తాన్ని అందజేస్తారు. ఆ మొత్తాన్ని తీసుకున్న మహిళలు ఎటువంటి వడ్డీ లేకుండా నిర్దేశించిన సమయంలో బ్యాంకులో జమచేసేస్తారు.
ఈ బ్యాంకులిచ్చే ఋణాలతో స్వయం ఉపాధిని ప్రారంభించవచ్చు. మహిళలను ఏ సమస్యలేకుండా టైలరింగ్, కుట్లు అల్లికలు, న్యాప్‌కిన్‌ల తయారీ, బుక్ బైండింగ్, ఫినాయిల్, అగరబత్తీల తయారీ తదితర చేతిపనులను తాము చేసుకుంటూ ఇతరులకు కూడా ఉపాధిని ఇవ్వవచ్చు. నలుగురు లేక ఇంకా ఎక్కువ మంది కలసి పని చేస్తే ఉత్పత్తులు చేయడానికి, ఉత్పత్తి అయన వస్తువును మార్కెటు చేయడానికి వీలుగా ఉంటుంది. మార్కెటు ఎలా చేయాలో కూడా కౌన్సిలింగ్ ఇచ్చే సంస్థలున్నాయ. ఆయా విభాగాల్లో ఇంతకుముందు పని చేసిన వారి అనుభవాన్ని కనుక్కుని కొత్తగా ప్రారంభించే ఉపాధి పథకాలను ముందుకు తీసుకొని పోవచ్చు.
నేటి కాలంలో కూరగాయలు పండించడం, ఆకుకూరలు పండించడం కూడా ఉపాధి రంగంలో ముఖ్యభాగం అవుతోంది. విస్తరాకులు తయారీ, ఆఫీసులకు వెళ్లేవాళ్లకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యోగార్థం వచ్చే ఉండే బ్యాచులర్స్‌కు టిఫిన్స్, లేక భోజన సదుపాయాలను కల్గించడం లాంటి చిరు వ్యాపారాలు కూడా ఎక్కువ ఆదాయ వనరులుగా ఉంటున్నాయని పలువురు మహిళలు చెబుతున్నారు. కనుక కొత్తగా ఉపాధి రంగాన్ని ఎంచుకునే మహిళను నిర్భయంగా ఏ ఉపాధినైనా మొదలు పెట్టవచ్చు. కాకపోతే పూర్తిగా పనికి అంకితమై పని చేస్తే వారు వందశాతం ఫలాలను పొందుతారు.

- శ్రీ లక్ష్మి