మెయిన్ ఫీచర్

వీధి జీవితం... అతని దృశ్యకావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫొటోగ్రఫీలో ఎలాంటి కోర్సు చేయలేదు. ఎవరి వద్ద శిక్షణ కూడా తీసుకోలేదు. పొటోలను తీయటంలో సిద్ధహస్తుడు కాదు. కేవలం తాను నడిచే వీధిలో కనిపించే అందమైన ఇళ్లను, పేదల జీవన దృశ్యాలను సెల్ కెమెరాలో బంధించి, ఆ ఫొటోలను ఇంకా బాగా ఎలా తీయవచ్చో అని తపించే మనస్తత్వమే ఆతడ్ని నేడు ప్రపంచ ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్‌గా తీర్చిదిద్దింది. వీధుల్లో కనిపించే సజీవ దృశ్యకావ్యాలను తన సెల్ కెమెరాలో బంధించి వాటిని తన మిత్రుడుకి చూపిస్తే, అతనిచ్చిన ప్రోత్సాహంతో తనలో దాగివున్న ఫొటోగ్రఫీకి మెరుగులుదిద్దుకున్న 28 ఏళ్ల నికుంజి రాథోడ్ జీవిత దృశ్యం ఇది. వివరాల్లోకి వెళితే...
‘‘వీధుల్లోనే జీవిత దృశ్యాలు దొరుకుతాయి’’ అని అంటున్నారు ప్రపంచ ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ నికుంజి రాథోడ్. సగటు మనిషి జీవితాన్ని చిత్రీకరించాలంటే వారికి సంబంధించిన సజీవ దృశ్యాలు వీధుల్లోనే దొరుకుతాయని చెబుతాడు. ఇటీవల జరిగిన ‘‘సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ’’లో ఈ యువకుడు తీసిన ‘బర్డ్ హంటర్’ అనే ఫొటో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఇది రంగుల ప్రపంచమైనప్పటికీ నేటికీ బ్లాక్ అండ్ వైట్‌లోనే సజీవ దృశ్యాలను తీస్తున్న ఈ యువ ఫొటోగ్రాఫర్ వీధుల్లోనే వాస్తవ జీవితాలకు దర్పణంగా నిలిచే చిత్రాలు లభ్యమవుతూ వాటినే ఎంచుకొని ఎన్నో ఫొటోలను తీస్తున్నాడు. 2014లో ఢిల్లీలో అసిస్టెంట్ ఫిల్మ్‌మేకర్‌గా పనిచేస్తున్నపుడు తాను నడుచుకొని వస్తుండగా... వీధి పక్కనే ఉండే అందమైన భవనాలు, కొందరి జీవన దృశ్యాలను మొబైల్ ఫోనులో తీసేవాడినని, ఆ ఫొటోలను చూసిన తన స్నేహితుడు మెచ్చుకోవటమే కాదు ప్రోత్సహించాడని, ఆ ప్రోత్సాహామే ఫ్రొటోగ్రఫీని హాబీగా కాకుండా జీవిత కథలకు ఉపయోగపడే వనరుగా మలచుకొని ఫొటోలను తీయటం ప్రారంభించానని చెబుతున్నాడు. ఓ చేతిలో చిత్ర నిర్మాణం, మరో చేతిలో ఫొటోగ్రఫీ అతనికి తోడుగా నిలిచాయి. వీధుల్లో తిరుగుతుంటే ఒక్కొక్కసారి కెమెరా కంటికి అద్భుతమైన దృశ్యాలు దొరుకుతాయని, ఆ సమయంలో వాటిని వదలిపెట్టకుండా బంధిస్తే అవే తీపి జాపకాలుగా మిగిలిపోతాయంటాడు. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు వాస్తవ జీవితానికి అద్దం పట్టేలా ఉంటాయని అంటారు. ఫొటో తాలుకాకు సంబంధించిన జీవం (ఆత్మ) కలర్ ఫొటోలో కనిపించదని, అందువల్లే తాను బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను ఎంచుకుంటానని చెబుతున్నాడు. వీధి ఫ్రొటోగ్రాఫర్‌గా తాను ఎంచుకున్న అంశాల్లో దృశ్యాలను తీయాలనుకుంటే మొట్టమొదట కాలంగురించి అస లు ఆలోచించని, అలాగే ఆ ఫొటో సహజసిద్ధంగా ఉండాలని కోరు కుంటానని చెబతున్నాడు. విభిన్న అంశాలున్నపుడు తనకు అనుకూలమైన సబ్జెక్టును ఎంపిక చేసుకుని టైమ్‌ను లెక్కచేయకుండా ఏమరుపాటులేకుండా అప్రమత్తతో రెడీగా ఉన్న పుడే తా ను అనుకున్న సజీవ దృశ్యాన్ని ఫొటోగ్రాఫర్ కెమెరాలో బంధించగలడని అం టాడు. నిదానం, వాయిదా వేయటం అనేది ఫొటోగ్రాఫర్‌కు ప్రధాన శత్రువులంటాడు. సోషల్ మీడియా వచ్చిన తరువాత ఫొటోగ్రాఫర్ల పనితనానికి గుర్తింపు లభించిందని, ఎల్లప్పుడూ ఫొటోగ్రాఫర్లను ప్రోత్సహిస్తూ మంచి చిత్రాలు రావటానికి ఎంతగానో దోహదపడుతుందని చెబుతూ.. తమలాంటి వారికి ప్రపంచ గుర్తింపు లభించటానికి కారణం వెన్నుతట్టి ప్రోత్సహించే సోషల్ మీడియానే అని అంటాడు. నేడొస్తున్న ట్రెండ్స్‌ను గ్రహిస్తూ, ఫొటోగ్రఫీకి సంబంధించిన పుస్తకాలు చదువుతూ.. ఎవరు ఏ రీతిలో ఫొటో తీస్తున్నారో పరిశీలిస్తూ తన ఫొటోగ్రఫీని మెరుగుపరుచుకుంటున్నాడు. స్ట్రీట్ ఫొటోగ్రాఫర్‌గా ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు, సవాళ్లు ఎదురుకాలేదా అని ప్రశ్నిస్తే.. ప్రజలే సవాలుగా నిలిచారని చెబుతాడు. నేడు ప్రజలు చాల అలెర్ట్‌గా ఉంటున్నారని, వారిని మెప్పించటం అంటే సవాలుతో కూడినదేనని అంగీకరిస్తాడు. తనపైన తనకుండే నమ్మకమే ఈ ఫొటోగ్రఫీలో ఎదగటానికి దోహదం చేస్తుందని చెబుతూ ఫొటో చూసేవారిని మానసికంగా కదలించటం, వినోదం పంచటం, విజ్ఞానవంతులను చేయటమే తాను తీసే ఫొటోల వెనుక ఉద్దేశ్యం అని వివరించాడు.

chitram ‘‘సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ’’లో ప్రథమ బహుమతి పొందిన ‘బర్డ్ హంటర్’