మెయిన్ ఫీచర్

వేదవాఙ్మయ పరిచయము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృపితృ సహస్రేభ్యో పి హితైషిణా వేదేనోపదిష్టమ్’
‘‘ప్రపంచంలోని వేలాది తల్లిదండ్రులకన్నా కూడా మన హితాన్ని సమధికంగా కోరేది- వేదం! ఆ వేదం చేసిన ఉపదేశమే హితం!’’ అని ఆదిశంకరాచార్యులవారు అన్నారు.
వేదం అంటే, ‘విచారణే’ (విచారణ చేయుట) ‘సత్తాయామ్’ (ఉండుట) ‘జ్ఞానే’ (తెలిసికొనుట) ‘లాభే’ (పొందుట) అని అనేకార్థాలున్నాయి.
‘‘ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయోః అలౌకికం ఉపాయం యో గ్రంథః వేదయతి స వేదః’’ అని సాయణాచార్యులవారి నిర్వచనం.
‘‘హితాన్ని పొందటానికీ, అహితాన్ని తొలగించుకోవటానికీ, లోకాతీతమైన ఉపాయాలను తెలిపే గ్రంథమే వేదము’’ అని సాయణా చార్యులవారన్నారు.
శ్రుతి, అనుశ్రావము, ఆమ్నాయము, సమామ్నాయము, స్వాధ్యాయము, ఆగమము, నిగమము, ఛందస్సు, త్రయి, బ్రాహ్మి.. ఇత్యాదులు వేదానికి పర్యాయపదాలు.
వేదాన్ని ఎవరూ వ్రాయలేదనీ, పరమేశ్వరుడే శబ్దరూపంగా వినిపిస్తే, మహర్షులు యోగంలో ఆ శబ్దాన్ని విని, దానినే వేదంగా తమ శిష్యులకు బోధించారని సంప్రదాయం చెపుతోంది.
ఇది ఇప్పటికీ వౌఖికంగా గురుశిష్యపరంపరలో బోధింపబడుతోంది.
వేదవ్యాస భగవానుడు వేదాన్ని నాలుగుగా విభజించాడు. 1.ఋగ్వేదం 2.యజుర్వేదం 3.సామవేదం 4.అథర్వవేదం లేక అథర్వణవేదం.
ఈ నాలుగు వేదాలకూ కలిపి మొత్తం 1131 శాఖలున్నాయి. కానీ ఇపుడు కేవలం 13 శాఖలే వాడుకలో వున్నాయి. వీటిలో కూడా 7 శాఖలకు మాత్రమే వేదపాఠం చెప్పబడుతోంది. మిగతా ఆరు శాఖలూ లిపి మాత్రంగానే మిగిలి ఉన్నాయి.
అనగా మొత్తం వేదవాఙ్మయంలో ఒక్క శాతం మాత్రమే ఇపుడు మనకు తెలుసునన్నమాట!
ప్రతి వేదంలోనూ సంహితా, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తులు అనే విభాగాలుంటాయి. ఇవిగాక ప్రతి వేదశాఖకూ అనుబంధంగా ప్రాతిశాఖ్య, శిక్ష, శ్రౌతసూత్రము, గృహ్యసూత్రము, శుల్బసూత్రము మొదలైన గ్రంథాలుంటాయి.
ఒక్కొక్క వేదానికి గల శాఖాదుల సంగ్రహ స్వరూపాన్ని ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
వేదాంగాలు: ఛందస్సు, జ్యోతిశ్శాస్తమ్రు, నిరుక్తము, కల్పము, శిక్షా, వ్యాకరణము
సూత్రాలు: శ్రౌత, గృహ్య, ధర్మ, శుల్బ సూత్రాలని నాలుగు రకాలు
ఇవికాక షట్‌దర్శనాలు, ఇతిహాసాలు, 18 పురాణాలు, స్మృతులు, వేదాన్ని ఆధారం చేసుకుని భరద్వాజాదులు వచించి విమానాది శాస్త్రాలు కూడా వైదిక వాఙ్మయం క్రిందికే చేరతాయి. క్లుప్తంగా వేదవాఙ్మయం ఇలా వుంటుందని చెప్పుకోవచ్చు.

కుప్పా వేంకట కృష్ణమూర్తి