Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీన భారతీయ వాఙ్మయము
కొన్ని సాక్ష్యాద్వైజ్ఞానిక వాక్యాలు
====================

మానవజాతి యొక్క ప్రాచీనతమ వాఙ్మయం వేదం. ఇది మానవ నిర్మితం కాదు. అందుకనే దాన్ని అపౌరుషేయం అంటారు. అందువల్లనే వేదానికి వయస్సు లేదని సనాతన భారతీయులు ప్రతిపాదించారు. ఆధునిక చారిత్రికులు మాత్రం వేదాల వయస్సును నిర్ణయించటానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఇంకా చేస్తూనే వున్నారు కూడా!
ఈనాటి ఆధునిక చరిత్రవేత్తల్లో ఎక్కువమంది వేదాల వయస్సు సుమారుగా ఎనిమిదివేల సంవత్సరాలని అంటున్నారు.
ప్రారంభకాలంలో వేదం అంతా ఒకే రాశిగా ఉండేది. సుమారు ఐదువేల సంవత్సరాల క్రిందట జీవించిన వ్యాసమహర్షి ఆ వేదరాశిని రెండు రకాలుగా విభాగం చేశాడు.
ఛందోబద్ధంగా వుండే వేదవాక్యరాశి ఋగ్వేదం. గద్యాత్మకంగా వుండేది యజుర్వేదం. ఛందస్సుతో పాటు గానానికి అనుకూలంగా వుండేది సామవేదం. ఈ దృష్టితో వేదాలు మూడు. వాటి పేరు త్రయి. ‘ఇతి వేదాస్తయ్రస్తర్రుూ’ అని అమరకోశకారుడన్నాడు.
వేదానికిగల ప్రయోజనాలలో యజ్ఞం ముఖ్యాతి ముఖ్యమైనది. వేదరాశి ప్రతిపాదించిన యజ్ఞ ప్రక్రియలో హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ అనే నలుగురు ఋత్విక్కులు ప్రధానులు. వీరి ఉపయోగానికి అనువుగా వేదరాశిని విభజిస్తే-
1.హోతకు ఉపయోగపడే వేదభాగం పేరు ఋగ్వేదం. దీనిలో ఛందోబద్ధ ఋఙ్మంత్రాలే వుంటాయి.
2.అధ్వర్యుడికి ఉపయోగపడే వేదభాగం పేరు యజుర్వేదం. దీనిలో గద్యాత్మక వేదవాక్యాలు అధికంగాను, ఋక్కులు తక్కువగానూ ఉంటాయి.
3.ఉద్గాతకు ఉపయోగపడే వేదభాగం పేరు సామవేదం. దీనిలో గానానుకూల మంత్రాలే వుంటాయి.
4.బ్రహ్మకు ఉపయోగపడే వేదభాగం పేరు అథర్వణ వేదం. దీనిలో ఋక్కులు, యజుస్సులు సంకీర్ణంగా వుంటాయి.
ఈ దృష్టిలో వేదాలు నాలుగు. వాటినే చతుర్వేదాలంటారు.
ఈ వేదాలు అన్ని రకాల విజ్ఞానాలకూ ఆకరాలు. వీటిలో ఆధ్యాత్మిక తత్త్వ విషయాలు మాత్రమే కాకుండా, భౌతిక విజ్ఞాన విషయాలు కూడా ఎన్నో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయి.
దివ్యదృష్టిగల మహర్షులు వాటిని తమ తపోమయ దృష్టిలో వెలికితీసి, మరిన్ని పరిశోధనలు చేసి సామాన్యులకు కూడా ఆ విషయాలు అందుబాటులోకి వచ్చేందుకు వీలుగా వివిధ వైజ్ఞానిక శాస్త్ర గ్రంథాలను రచించారు. వాటిలో ముఖ్యమైన వాటిని ఆయా వేదాలకు ఉపవేదాలుగా చేర్చుకున్నారు.
ఉదాహరణకు ఆయుర్వేదం ఋగ్వేదానికి ఉపవేదం.
ధనుర్వేదం యజుర్వేదానికి ఉపవేదం.
గాంధర్వవేదం సామవేదానికి ఉపవేదం.
అర్థశాస్త్రం అథర్వవేదానికి ఉపవేదం.
(గమనిక: కొన్నిచోట్ల ఆయుర్వేదం, ధనుర్వేదం అథర్వవేదానికి ఉపవేదాలని వుంది)
ఇదిగాక, గణితశాస్తమ్రు, ఖగోళశాస్తమ్రు, నక్షత్ర శాస్తమ్రు, కృషి శాస్తమ్రు, రసాయన శాస్తమ్రు, వృక్షశాస్తమ్రు, కిరణశాస్తమ్రు, లోహశాస్తమ్రు, యంత్ర శాస్తమ్రు, పశుశాస్తమ్రు, వాస్తుశాస్తమ్రు (లేక ఇంజనీరింగ్) వంటి అనేక విజ్ఞాన శాస్త్ర శాఖలపై మన మహర్షులు గ్రంథాలను రచించారు.
ఈనాడు మనం ఆధునికమని భావిస్తున్న విజ్ఞన విశేషాలు అనేకం ఈ గ్రంథాలలో వున్నాయి. వాటిని రేఖామాత్రంగా పరిచయం చేయటమే రుూ వ్యాసపరంపరకు ప్రయోజనం.
మున్ముందుగా, అత్యంత ప్రాచీనాలైన వేదాలలో సూటిగా వైజ్ఞానిక విశేషాలను బోధించే వాక్యాలేమైనా ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరిశీలిద్దాం.
1.ఆయం గౌః పుశ్చ్ని రక్రమీ
దసనన్మాతరం పునః
పితరం చ ప్రయన్‌త్సువః
(సూర్యుడు తండ్రి (ఆంబోతు); భూమితల్లి (గోవు); చంద్రుడు (దూడ)- అని వర్ణించే రుూ మంత్రం నాలుగు వేదాల్లోనూ కనిపిస్తోంది. ఆంబోతు చుట్టూ ఆవు, ఆవు చుట్టూ దూడ తిరుగుతున్నట్లుగా సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడని ఈ మంత్రం బోధిస్తోంది. ఎనిమిదివేల ఏళ్ళ ముందే ఈ విషయం వేదాలలో వుంది. కానీ దీన్ని క్రీస్తు శకం 16వ శతాబ్దికి చెందిన గెలీలియో అనే ఇటలీ వైజ్ఞానికుడు కనిపెట్టాడని మనం చెప్పుకుంటున్నాం.
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందన్నమాట వైజ్ఞానికంగా సత్యమే అయినా, భూమి మీద నివసించే సామాన్య మానవుడికి, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నట్లు అది కూడా సమవృత్తాకారంలో తిరుగుతున్నట్లు కనిపిస్తూ వుంటుంది. 16-17 శతాబ్దుల సంధికాలంలో జీవించిన జర్మనీ వైజ్ఞానికుడు కెప్లర్ జోన్సు వచ్చి నిరూపించేదాకా, సూర్యభ్రమణ మార్గం దీర్ఘవృత్తంగా (ఎలిప్టికల్‌గా) వుంటుందనే విషయం ఆధునిక లోకానికి తెలియదు. కానీ వేదం-
త్రినాభిచక్ర మజర మనర్వం
యేనేహ విశ్వాభువనాని తస్థుః
(సూర్యుడు త్రినాభి చక్రంలో- అంటే మూడు కేంద్ర బిందువులుగల దీర్ఘ వృత్తంలో తిరుగుతున్నందువల్లే ఈ సౌర కుటుంబమంతా నిలబడి వుంది) అని చెపుతోంది. ఈ మంత్రం మూడు వేదాల్లో వుంది.
కోడిగుడ్డు ఆకారంలో వుండే దీర్ఘవృత్తాన్ని ఆధునిక పరిభాషలో త్రీ సెంటర్డ్ ఆర్బిట్ అంటున్నారు. వేదం కూడా దాన్ని త్రినాభిచక్రం- మూడు కేంద్రాలు గల వృత్తము - అనే వ్యవహరిస్తోంది. దీన్ని బట్టి ఆ నాటికిగల రేఖాగణిత విజ్ఞానాన్ని కూడా మనం అంచనా వేసుకోవచ్చు.

ఇంకావుంది...

- కుప్పా వేంకట కృష్ణమూర్తి