మెయిన్ ఫీచర్

ట్రెండీ.. ట్రెండీ..! బ్లవుజులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక జీవనశైలిలో అమ్మాయిలకు, మహిళలకు చీరకంటే రవికలపైనే మోజు పెరుగుతోంది. చీర ఎంత తక్కువ ధర పెట్టి కొన్నా రవికను మాత్రం రకరకాల మోడల్స్‌లో కుట్టించుకుంటున్నారు. ఇక అమ్మాయిలైతే చాలా చాలా ముందుంటున్నారు. సంప్రదాయ సొగసులకి ఆధునిక సొబగులు అద్ది నయా ట్రెండ్‌కి స్వాగతం పలుకుతున్నారు. అవే ఇండో వెస్ట్రన్ బ్లవుజులు. ఇప్పటివరకు డీప్‌నెక్, బోట్‌నెక్, స్వ్కేర్ నెక్, వీనెక్ బ్లవుజులు వేసుకునే అమ్మాయిలు ఇప్పుడు ఇండో వెస్ట్రన్ బ్లవుజులపై దృష్టి పెడుతున్నారు. పెప్లమ్, రఫుల్, బోట్‌నెక్, జాకెట్, బెల్, చైనీస్ కాలర్, హైనెక్... వంటి డిజైన్లను నేటితరం అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. హ్యాండ్‌లూమ్ చీరలకు పెప్లమ్ బ్లవుజులు బాగుంటాయి. సన్నగా, పొడుగ్గా ఉన్నవారికి ఇవి బాగా నప్పుతాయి. వీటిల్లో చీరను బట్టి పెప్లమ్‌లోనే పొట్టి, పొడుగు వాటిని ఎంచుకోవచ్చు. స్లీవ్‌లెస్ బ్లవుజులను చాలామంది వేసుకోలేరు. ఇలాంటివారు కేప్ బ్లవుజుల్ని ప్రయత్నించవచ్చు. సాదా చీరపైకి ఫ్లోరల్ కేప్ బ్లవుజు చాలా బాగుంటుంది. హ్యాండ్‌లూమ్ చీరపైకి ఎంబ్రాయిడరీ కేప్ బ్లవుజు బాగుంటుంది. అంతేకాకుండా శరీరాకఋతిని బట్టి సింగిల్, డబుల్, ఎసిమెటి కల్ కేప్ డిజైన్లను ఎంచుకుంటాయి. మెడ కాస్త వెడల్పుగా ఉన్నవారికి కుచ్చిళ్ళతో చైనీస్ కాలర్, హైనెక్ వంటివి చాలా బాగుంటాయి. సాధారణ చీరలకు రఫుల్ బ్లవుజులు కూడా బాగుంటాయి. బోట్‌నెక్ బ్లవుజులకి రఫుల్ స్లీవ్స్ ఒకరకమైతే, బ్లవుజంతా రఫుల్స్ వచ్చేలా ఎంచుకుంటున్నారు మరికొంతమంది అమ్మాయిలు. ఇలాంటివి సన్నగా ఉండేవారికి బాగుంటాయి. సూపర్‌నెట్, ఆర్గండీ, క్రేప్, షిఫాన్, బ్రాసో, నెట్, చేనేత రకాల చీరలపైకి ఈ బ్లవుజులు చాలా బాగుంటాయి. కేవలం భుజాల వరకే కాకుండా మోచేతి వరకూ కూడా కుట్టించుకోవచ్చు. ఈ డిజైన్‌ను ఎంచుకున్నప్పుడు మెడ కూడా భిన్నంగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి బ్లవుజులు ఉన్నప్పుడు నూలుచీర నుండి పట్టుచీర వరకు ఏది కట్టుకున్నా సరే అది హాటెస్ట్ ట్రెండ్ అయిపోతుంది.
*