మెయిన్ ఫీచర్

దివ్యమైన వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలంతోపాటు జీవితాలు పరుగులు పెడుతున్న నేటి ఆధునిక యుగంలో కూడా అమ్మాయిలు వాహనాలపై దూసుకుపోతుంటే వింతగా చూస్తూ కామెంట్స్ చేసే మగవారికి కొదవేలేదు. అలాంటిది అగ్రరాజ్యమైన అమెరికాలో దివ్యా సూర్యదేవర అనే ముప్ఫై తొమ్మిదేళ్ళ తెలుగు మహిళ తన ప్రతిభా పాటవాలతో ఉన్నతస్థాయికి చేరుకుంది. ఇప్పటికే మహిళలు అన్ని రంగాల్లోనూ నిబద్ధతతో పనిచేస్తూ తమ ప్రతిభాపాటవాలను చాటుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని ప్రఖ్యాత ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ తమ కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ)గా మొట్టమొదటిసారిగా ఒక మహిళను నియమించింది. పురుషుల ఆధిక్యత అధికంగా ఉండే వాహనరంగంలో, అది కూడా బ్యూక్, కాడిలాక్, చావర్లెట్ వంటి కార్లను రూపొందించే అగ్రగామి సంస్థ అయిన జనరల్ మోటార్స్‌లో ప్రవాస భారతీయురాలైన ఒక మహిళ ముఖ్య ఆర్థిక అధికారిగా ఎన్నికకావడం అంటే అది ఆషామాషీ విషయం కాదు. అకుంఠిత దీక్ష, పట్టుదలలు ఉంటే తప్ప ఈ స్థాయికి చేరుకోలేరు. ప్రస్తుతం సీఎఫ్‌ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న చక్ స్టీఫెన్స్ స్థానాన్ని దివ్యా సూర్యదేవర భర్తీ చేయనుంది. సెప్టెంబర్ ఒకటో తేదీన ఆమె ఈ బాధ్యతలు చేపట్టనుంది.
దివ్యది తెలుగు కుటుంబం. ఎప్పుడో వీరు చెన్నైలో స్థిరపడ్డారు. ఆమెకు చదువంటే చాలా ఆసక్తి. చిన్నప్పటి నుంచీ బాగా చదువుకుని ఉన్నతస్థానంలో నిలబడాలని ఆశించేది. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లే ఆమెకు అన్నీ అయ్యి పెంచి పెద్దచేసింది. దివ్యవాళ్ళు ముగ్గురు అక్కచెల్లెల్లు. దివ్య తల్లి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా అప్పులు చేసి మరీ పిల్లల్ని చదివించింది. పిల్లలు బాగా చదువుకుని మంచి లక్ష్యాన్ని చేరుకోవాలనేదే ఆమె ఆశ. జీవితంలో ఏర్పడిన కష్టాల మూలంగా దివ్యకు చిన్నవయస్సులోనే ఉన్నతంగా బతకడం అనుకున్నంత సులభం కాదని, దానికోసం ఎంతో కష్టపడాలని నిర్ణయించుకుంది. ఆ దిశగానే అడుగులు వేసింది. తనకోసం కష్టాలు పడుతున్న తల్లిని కష్టపెట్టకూడదనే నిర్ణయం కూడా చిన్నవయస్సులోనే తీసుకుంది దివ్య. అందుకే ఉన్నత చదువుల కోసం దివ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది. ఉద్యోగం చేసేటప్పుడు ఆ రుణాలను చెల్లించింది. మద్రాసు యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఇరవై రెండేళ్ళ దివ్య అమెరికాకు వెళ్లింది. అక్కడ హార్వర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ చేసింది. అది చదువుతూనే ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంకు యూబీఎస్‌లో విధులు నిర్వహించింది. తరువాత 2005లో వాహన తయారీ సంస్థ అయిన జనరల్ మోటార్స్‌లో ఉద్యోగం లభించింది. అప్పుడు ఆమె వయస్సు పాతిక సంవత్సరాలు. తరువాత ఆమె తన కెరీర్‌లో వెనుతిరిగి చూసుకోలేదు. సంస్థ ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న దివ్య 2016లో ఆటోమోటివ్ రైజింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. నలభై మంది విజేతల్లో మొదటిస్థానంలో నిలిచింది. జనరల్ మోటార్స్ కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణలో దివ్య చాలా కీలకపాత్ర పోషించింది. సంస్థకు చెందిన ఐరోపా అనుబంధ సంస్థ ఓపెల్ విక్రయంలో, స్వీయచోదక వాహన అంకుర సంస్థ క్రూజ్ స్వాధీనతలో కూడా దివ్య ముఖ్యపాత్ర వహించింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నుంచి జనరల్ మోటార్స్ రేటింగ్స్ మెరుగుపరిచేందుకు దివ్య చాలా కృషి చేసింది. ఇలా అతి తక్కువకాలంలో జనరల్ మోటార్స్‌లో రకరకాల కీలకపాత్రల్లో బాధ్యతలు నిర్వహించిన మహిళగా కీర్తి గడించింది దివ్య. తరువాత 2017లో సంస్థ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందింది. దివ్యలోని అకుంఠిత దీక్ష, ప్రతిభ, పట్టుదల, నాయకత్వ లక్షణాలతో జనరల్ మోటార్స్ వాణిజ్యపరమైన లాభాలను ఎన్నింటినో చూసిందని ఆ సంస్థ కొనియాడింది. సెప్టెంబర్ ఒకటి నుంచి సీఎఫ్‌ఓగా బాధ్యతలు స్వీకరించనుంది దివ్యా సూర్యదేవర. .
దివ్య కుటుంబం న్యూయార్క్‌లో స్థిరపడింది. ఆమె భర్త రాజ్ సూర్యదేవర వ్యాపారి. వీరికి ఒక కుమార్తె ఉంది. ఉద్యోగ రీత్యా దివ్య డెట్రాయిట్‌లో ఉంటూ వారాంతాల్లో న్యూయార్క్‌లోని కుటుంబం వద్దకు వెళుతూ ఉంటుంది. అటు కంనెనీని, ఇటు కుటుంబాన్ని రెండు కళ్లుగా చూసుకుంటూ తనదైన బాటలో దూసుకుపోతూ భవిష్యత్తు తరాలకు బాటలు వేస్తోంది దివ్యా

సూర్యదేవర. -ఉమా మహేశ్వరి