మెయన్ ఫీచర్

సరిహద్దులో ‘శాంతి మంత్రం’ ఎన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంజాన్ పవిత్రమాసం! ఉపవాస దీక్షలు- ఇఫ్తార్ విందులు- నేతల సందడి- ఆ సమయంలో జీహాదీ ఉగ్రవాదులు తెగబడ్డారు. ‘రైజింగ్ కాశ్మీర్’ సంపాదకుడు షుజత్ బుఖారీ రంజాన్ పవిత్ర మాసంలో ‘రోజా’ (ఉపవాసం) పాటించి గురువారం రాత్రి ఇఫ్తార్ ముగించుకున్నాడు. అప్పుడు ఉగ్రవాదులు ఆయనను అతి దగ్గరగా కాల్చి చంపారు. ఈయన జమ్మూ కాశ్మీర్ మంత్రి బాషత్ బుఖారీకి సోదరుడు. 53 సంవత్సరాల వయస్సుగల బుఖారీ ఇస్లామిక్ సిద్ధాంతాలను నిష్ఠగా నమ్మినవాడు. ఉపవాసం ముగించి పత్రికా కార్యాలయం నుండి బయటకు వస్తుండగా ముష్కరులు కాల్చి చంపారు. పుల్వామా షోపియన్ (పూంచ్)లో ఒక ఆర్మీ జవానును కిడ్నాప్ చేసి అదే రోజు రాత్రి హత్యచేశారు. అమరుడైన జవాన్ పేరు ఔరంగజేబ్. కాశ్మీరు లోయలో ఇటీవలి కాలంలో నలుగురు జర్నలిస్టులను ఉగ్రవాదులు హతమార్చారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ద్వారా పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ సంస్థ బుఖారీని హత్య చేయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ కుట్రలో ముగ్గురు హంతకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బుఖారీ హత్యపై ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్) నియమించి చేతులు దులుపుకున్నది.
అమర జవాన్ ఔరంగజేబ్ తండ్రి ఇలా అన్నాడు- ‘మోదీ స్థానంలో నేను ప్రధానిగా ఉన్నట్లయితే 72 గంటల్లో మొత్తం కాశ్మీరు నుండి ఉగ్రవాదులను తరిమివేసి ఉండేవాడిని.’ ఔరంగజేబ్ రంజాన్ పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని నాలుగురోజులు సెలవుపెట్టాడు. హిజ్‌బుల్ ముజ్జాహుద్దీన్ ముష్కరులు అతనిని కిడ్నాప్ చేసి హతమార్చారు. చంపడానికి ముందు ఆయన ఫొటోలు తీసి మీడియాకు విడుదల చేశారు.
శనివారం నాడు (రంజాన్ పండుగ రోజున) అనంతనాగ్‌లో విధ్వంసం, దోపిడీలు, దురాక్రమణలు జరిగాయి. రంజాన్ పండుగలో ఈ విధ్వంసం అంతర్భాగం అని ఉగ్రవాదులు ప్రకటించారు. ఇది జరగడానికి ముందు కొంత ప్రహసనం జరిగింది. రంజాన్ మాసం సందర్భంగా భారత ప్రభుత్వం ఏకపక్ష యుద్ధవిరమణ చేసింది. సరిహద్దుల వద్ద పాకిస్తాన్ కవ్వింపు చర్యలు జరిపినప్పటికీ తాము కాల్పులు జరుపబోమని భారత భద్రతాదళాలు ప్రకటించాయి. దీనిని అదనుగా తీసుకొని ఉగ్రమూకలు తెగబడ్డాయి.
కాశ్మీర్‌లో మన భద్రతాదళాలు ఏకపక్షంగా కాల్పుల విరమణ చేయగానే ముందుగా ఇండియన్ బంకర్లకు మరమ్మతు చేస్తున్న సిబ్బందిని పాక్ ప్రేరిత ఉగ్రవాదులు హతమార్చారు. ఆ తర్వాత పౌరుల మీద విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఇప్పుడు పత్రికాధిపతిని పొట్టన పెట్టుకున్నారు. ‘కాశ్మీరియత్- ఇన్సానియత్- జంబూరియల్’ అంటూ నినాదాలిచ్చే కాశ్మీరు అభిమానులు ఇప్పుడేమంటారు?
రంజాన్ పవిత్ర మాసంలో ఇలా రక్తం చిందించవచ్చునా?.. ఉగ్రవాదుల ఉచ్చులో పడిన కొందరు కాశ్మీరీయులు తమ పౌరులను చంపవచ్చునా? వార్తలు అందించే జర్నలిస్టులు రాజకీయ నాయకులు కారు, సైనికులు అంతకన్నా కారు.. మరి జర్నలిస్టులను ఎందుకు చంపుతున్నారు?
శ్రీనగర్‌లో బుఖారీని హత్యచేయడానికి ముందు కాశ్మీరు ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన వ్యక్తిగత రక్షణ బలాన్ని మరింత పెంచుకున్నది. అంటే- కాల్పుల విరమణ తర్వాత అల్లరిమూకలు రెచ్చిపోతాయని ఆమెకు ముందే తెలుసా? 1971లో ఇండో-పాక్ యుద్ధాన్ని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించగానే ఆమె కోడలు సోనియా గాంధీ తన ఇద్దరు పిల్లలను తీసుకొని ముందుగానే ఈ దేశం వదలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయిన సంఘటన గుర్తుకు వస్తుంది.
ఈ దేశంలో ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది. చివరకు అది ‘్భస్మాసుర హస్తం’లా మారింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ప్రధానమంత్రులను కోల్పోయింది. రాజకీయ లబ్ధి కోసం నెహ్రూ అనుసరించిన విధానానే్న సోనియా కొనసాగించింది. కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఉగ్రవాదులు కాశ్మీర్‌లో తిష్టవేసి విచక్షణా రహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. కాశ్మీరులోని జీహాదీ ఉగ్రవాదులకు చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు బహిరంగ మద్దతు ప్రకటించారు.
కాగా, కర్ణాటకలో ఆ మధ్య గౌరీలంకేశ్ అనే మహిళా జర్నలిస్టును అతివాదులు కాల్చి చంపినప్పుడు వామపక్షీయులు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన చేశారు. ఇప్పుడు ‘రైజింగ్ కాశ్మీర్’ ఎడిటర్ బుఖారీని ఉగ్రవాదులు హత్య చేసినప్పుడు వీరంతా ధృతరాష్ట్ర పాత్రను ఎందుకు అభినయిస్తున్నారు? ఈ ప్రశ్నకు ప్రకాశ్‌కారత్, ఏచూరి సీతారాం వంటి వామపక్ష మేధావులు ఏం సమాధానం చెపుతారు?
జర్నలిస్టులపై, పత్రికా కార్యాలయాలపై దాడులు జరగడం కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా ఈ అరాచకం కొనసాగుతోంది. భారత రాజ్యాంగంలోని 19వ అధికరణంలోని ఎ,బి-క్లాజుల ద్వారా ప్రజలకు భావస్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రం సిద్ధించింది. ఐతే భారత రాజ్యాంగం కాశ్మీరుకు వర్తించదు. వారికి వేరే రాజ్యాంగాన్ని వేరే జాతీయ జెండాను నెహ్రూ ప్రసాదించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఇష్టం లేకపోయినా కాశ్మీరుకు ప్రత్యేక హోదా కల్పించే 370 అధికరణాన్ని తర్వాతి కాలంలో చేర్చారు. అంబేద్కర్ నామస్మరణ చేస్తూ ఓట్ల రాజకీయాలు నడిపే ఈ అంగుష్టమాత్రులంతా దేశభక్తులు కారు. కాశ్మీర్‌లో ప్రస్తుతం పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నాలుగేళ్లుగా అధికారంలో ఉంది. మరి ఈ ప్రభుత్వాలు ఏం సాధించినట్లు? లక్షలాది కాశ్మీరీ పండితులు స్వదేశంలోనే కాందిశీకులైతే వారిలో కనీసం ఒక్కడికి కూడా పునరావాసం కల్పించలేదు. కాశ్మీరీ పండితులకు పునరావాస కాలనీలు నిర్మించరాదని ముఖ్యమంత్రి మెహబూబా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐనా బిజెపి వారు ముఫ్తీతో కలిసి ఎందుకు ప్రభుత్వం నడుపుతున్నట్లు? ప్రధాని మోదీ స్మరిస్తున్న అభివృద్ధి మంత్రం విఫలమైంది. ‘మీరు కాశ్మీరులో బంగారంతో రోడ్లు నిర్మించినా మా విధ్వంసకాండ ఆగదు’ అని లోగడ వేర్పాటు హురియత్ వాదులు ప్రకటించారు. అంటే ఉగ్రవాదులు భారతదేశాన్ని ముక్కలు చేయాలని కోరుకుంటున్నారే కాని రోడ్లు, విమానాశ్రయాల అభివృద్ధిని కోరుకోవటం లేదు.
‘్భరత్‌ను ముక్కలు ముక్కలు చేయండి’- అని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (న్యూఢిల్లీ)లో కన్నయకుమార్ అనే ఉగ్రవాద విద్యార్థి సంఘ నాయకుడు ఊరేగింపు జరిపితే- ఢిల్లీ సీఎం కేజ్రీవాలా,కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిపిఎం నాయకులు మద్దతు ఇచ్చారు. జెఎన్‌యులోని టీచర్స్ క్వార్టర్స్‌లో కాశ్మీరు నుండి వచ్చిన ఉగ్రవాదులను అక్కడి అధ్యాపకులు దాచిపెట్టడం ఇటీవలి పరిణామమే.
యుద్ధం ఎవరికీ ఇష్టం ఉండదు. కాని పాకిస్తాన్ బోఫోర్స్ శతఘు్నలతో ఎల్‌ఒసి వద్ద అమాయకులను పొట్టనపెట్టుకుంటుంటే మోదీ ప్రభుత్వం అవలోకితేశ్వర నిమిలిత నేత్ర ముద్రతో చేతిలో ‘కమలం’ ధరించి ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అనటం దేశద్రోహం కిందికే వస్తుంది. తమకు అనుకూలంగా వార్త రాకపోతే ఆ పత్రిక మీద దాడి చేయటం దుర్మార్గం. నిజానికి బుఖారీ హిందూ అనుకూల ధోరణిని కూడా ప్రదర్శించలేదు. కాశ్మీర్‌లో జరిగే విశేషాలను యథాతథంగా ఎలాంటి వక్రీకరణ లేకుండా ప్రకటించారు. అలాంటి వ్యక్తిని రంజాన్ పవిత్రమాసంలో హత్యచేసినవారు ముస్లిములు ఎట్లా అవుతారు? అంటే ఉగ్రవాదులకు బైబిలు- ఖురాను- భగవద్గీత- అనే ఏ మత గ్రంథాలమీద కూడా గౌరవం వుండదు. వారికి కావలసింది రాజకీయ లబ్ధి.
కాశ్మీరును పాకిస్తాన్‌కు ఇస్తే సరిపోతుంది కదా... అని సూడో సెక్యులరిస్టులు అంటున్నారు. అప్పుడు హైదరాబాద్ పాతబస్తీని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించండనే ఉద్యమం మొదలవుతుంది. 1947లో పాకిస్తాన్‌ను భారత్‌నుండి విడదీస్తే- సమస్యలన్నీ సమసిపోతాయని గాంధీ, నెహ్రూలు ఆలోచించారు. పాకిస్తాన్ అవతరణే నేడు అన్ని సమస్యలకు మూల కారణమయింది.
మరి ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఏమి చేయాలి? వెంటనే బెలూచీస్థాన్‌ను, సింథ్‌ను రెండు స్వతంత్ర దేశాలుగా ప్రకటించాలి. అక్కడ జరుగుతున్న స్వతంత్ర పోరాటాలకు మద్దతుగా ఇండియన్ ఆర్మీని పంపించాలి. 1971లో ఇందిరా గాంధీ తూర్పు పాకిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించినట్లే ఇప్పుడు మోదీ పాకిస్తాన్‌లోని స్వతంత్ర పోరాటాలకు మద్దతునివ్వాలి. పాక్ ఆక్రమిత కాశ్మీరులో 200 ఉగ్రవాద స్థావరాలు పటిష్టంగా పనిచేస్తున్నాయి. వాటిపై వెంటనే దాడి చేసి ఆక్రమిత కాశ్మీరును భారత్‌లో విలీనం చేయాలి.
కాశ్మీరులో ఉన్న వారంతా భారతీయులే. బలవంతంగా ఒకప్పుడు మతం మార్చబడినవారు వారిని ఆర్య సమాజం వారు తమ ‘శుద్ధి ఉద్యమం’ ద్వారా వారిని తిరిగి భారతీయ హిందువులుగా మార్చాలి. లోగడ స్వామి శ్రద్ధానంద చేసిన బలిదానాన్ని ఆర్య సామాజికులు గుర్తుకు తెచ్చుకోవాలి. మోదీ కఠోర నిర్ణయాలు తీసుకోవలసిన సమయం ఆసన్నమయింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘యుద్ధయకృత నిశ్చయ’అని నరునికి పిలుపునిచ్చాడు. కాశ్మీరు సమస్యకు శాశ్వత పరిష్కారం- పాకిస్తాన్ అనే టెర్రరిస్టు దేశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటమే!!
వాస్తవాధీన రేఖవద్ద ఇప్పటికి 1300 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘింపబడింది. ఇప్పటికే సమీప గ్రామ ప్రజలంతా ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. చైనాకు పోయి జిన్‌పింగ్‌తో మోదీ కరచాలనం చేసి వస్తే ఏం ఒరిగింది? మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను నిర్మూలించవలసిందిగా పూణెలో ఉగ్రవాదులు వ్యూహరచన చేసిన సమాచారం వెలుగులోకి వచ్చింది. మోదీ పాకిస్తాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ మనుమరాలి పెళ్లి విందు ఆరగించి షరీఫ్ తల్లికి పాదాభివందనం చేసివస్తే ఏమయింది? అమాయకులైన వందలాది మంది మన యువ జవానులు జీహాదీ ముష్కరుల తూటాలకు బలవుతున్నారు. ఎడిటర్ షుజత్ బుఖారీపై 2000లో మొదటిసారి హత్యాప్రయత్నం జరిగింది. అప్పటి నుంచి ఆయనకు పోలీసు రక్షణ కల్పించారు. మరి ఆ రక్షణ కవచం ఇప్పుడు బుఖారీని ఎందుకు కాపాడలేకపోయింది? మోదీని మావోయిస్టులు హత్య చేయాలని ప్రయత్నిస్తుంటే ‘్భద్రత’ పెంచుతామని హోం మంత్రి రాజనాథ్ సింగ్ ప్రకటించారు. బుఖారీ ఉదంతం కేంద్ర ప్రభుత్వానికి మేలుకొలుపు కావాలి.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్