మెయిన్ ఫీచర్

శతగో(కో)టి అందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌందర్య వర్ణన చేసేటపుడు నఖశిఖ పర్యంతం వర్ణించేవారు మన పూర్వకవులు. అంటే కొనగోటి నుంచి కొప్పు వరకు నానాలంకార ప్రయోగాలతో వర్ణిస్తూ పద్యాలల్లేవారు. కొప్పుల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఏ ముఖానికి ఏ కొప్పు అందంగా ఉంటుందో అది వారి ముఖారవిందమే చెబుతుంది అని లెక్కలేనన్ని కొప్పులు చుట్టేవారు. ఇక తామరతూడుల్లాంటి చేతుల సౌందర్యం చెప్పడం ఆ శ్రీనాథునికి కూడా కష్టమేనంటారు. అందులోను గోరు సౌందర్యం ఆనాటి నుంచి నేటి దాకా వర్ణించవీలులేనన్ని అందాలను చిందుతూనే ఉంది.
బాడీ పెయింటింగ్ , టాటూ ఆర్ట్స్ ఇపుడు ఔట్ డేటెడ్ అనుకోకండి. వాటిని మించిపోయి ఫ్యాషన్ బుల్‌గా మార్కెట్ లోకి నెయిల్ ఆర్ట్ వచ్చి డామినేట్ చేస్తోంది. ఈ నెయిల్ ఆర్ట్ అనాదిగా వస్తూనే ఉంది. క్రీస్తు పూర్వం 600 సంవత్సరం నాటికే నెయిల్ పాలిష్ చైనాలోని సంపన్న వర్గాల మహిళలకు తప్పనిసరి ఫ్యాషన్ అని పేర్గాంచింది.
కాని ఇపుడు ఆ నెయిల్ పెయింటింగ్ ఆధునికతను జోడించుకుని యువత ఉర్రూతలూపుతోంది. వారినే కాదు నెయిల్ పెయింటింగ్ చూసిన వారంతా కళ్లప్పగించేస్తున్నారట.
కొన్నాళ్లు నెయిల్ ఆర్ట్ ను కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే వేసుకొనేవారు. ఇపుడు అలా కాదు. అమ్మాయిల మనసును బట్టి రంగులు వేసుకొంటారు కేవలం రంగులు కాదండోయ్ సృష్టినే గోటి మీద ఆవిష్కరిస్తున్నారు. మీరు ఒక్కసారి లుక్ వేయండి.
కాకపోతే పరిశోధకులు ఈ నెయిల్ పెయింటింగ్ గురించి కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. అవి గమనించడం మనకే మంచిది.
అదేపనిగా గోళ్లకు రంగువేసుకోవడం వల్ల గోళ్లపై ఉండే సహజ నూనెలు ఆవిరై పొడిబారి రంగు మారుతాయట.
వేసుకొన్న రంగును తొలగించేటపుడు కూడా జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి. గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి చేతులను 10 నిముషాలు అందులో నానబెట్టాలి. అపుడు గోర్లల్లో ఉండే మురికి దూరం అవుతుంది. ఎసిటోన్ లేని రిమూవర్‌ను ఉపయోగిస్తే గోర్లు దెబ్బతినవు.
గోళ్ల రంగులో ఉంటే ట్రైఫ ఇనైల్ ఫాస్పేట్ (టిపిహెచ్‌సి) అనే పదార్థం బరువు హెచ్చుతగ్గులకు కారణం అవుతుందని డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. ఇది గోళ్లకు రంగు వేసుకొనేటపుడు చర్మానికి రంగు అంటకపోతే బరువులో హెచ్చుతగ్గులు కూడా ఉండవని ఈ పరిశోధకుల అభిప్రాయం.
చర్మపు రంగును బట్టి గోర్లను కలర్ ను ఎంచుకోవచ్చు. కాకపోతే గాఢమైన రంగులను గోళ్లకు వేస్తే గోళ్లు పొట్టిగా కనిపిస్తాయి. పొట్టిగా కనిపించకూడదు అంటే గోరుకు ఒక పక్క నిలువు గీతను తెల్లగా పెయింట్ చేయకుండా వదిలేయాలి. నిమ్మ చెక్కలతో గోళ్లు రుద్దితే గోర్ల అందం రెట్టింపు అవుతుంది. గోర్లకు నాణ్యమైన రంగులనే వాడాలి. రంగు వేసేటపుడు చర్మానికి అంటితే వెంటనే ఆ రంగును దూదితో అద్ది తీసేయాలి. గోర్లకు రంగువేసేటపుడు బేస్ కోట్, పాలిష్, టాప్ కోట్ వేసుకోవాలి. ముదురు రంగులు వేసుకొంటే రంగు వేసుకొన్న తరువాత సుమారు 45 నిముషాలు, లేత రంగులు అద్దుకుంటే 25 నిముషాలు చేతులకు పని చెప్పకండి.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి