మెయిన్ ఫీచర్

అరణ్యరోదనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో సగభాగమైన స్ర్తిలు స్వేచ్ఛగా జీవించే స్థితి, భద్రంగా బతికే పరిస్థితి కానరావటం లేదనటానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులు, గృహహింస, పరువు హత్యలు, వరకట్న చావులు- ఇలా ఎన్నో ఎనె్నన్నో ఉదహరణలుగా చెప్పవచ్చు. చట్టాలు ఎన్ని వున్నా కొత్తగా వస్తున్నా అవి నేరస్థులకు చుట్టాలుగా ఉన్నాయే తప్ప తగిన శిక్షలు పడటంలేదు. నిర్భయ చట్టం అమలులో వున్న నేరస్థులకు భయం లేదు. మానవ మృగాలు జనారణ్యంలో యధేచ్చగా మారణహోమం సాగిస్తున్నాయంటే మహిళల మాన ప్రాణాలకు బలికొంటున్నారంటే పాలకుల వైఫల్యం అధికారుల నిర్లక్ష్యం, ఆంక్షలు లేని ఇంటర్నెట్ పోర్నోగ్రఫి, నైతిక విలువల పతనం, రక్షకులే భక్షకులుగా మారడం మొదలైన కారణాలు ఎన్నో వున్నాయి.
ఆదిశక్తిగా స్ర్తిని ఆరాధించే సమాజంలో చదువుతల్లిగా సరస్వతిని పూజించే సంఘంలో, సిరిసంపదల జనని లక్ష్మిగా ప్రార్థించే దేశంలో ఏమిటీ వైపరీత్యం, ఎందుకీ పైత్యం. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, అత్తింటి బాధలు, గృహహింస, భ్రూణహత్యలు, వివక్ష- ఒకటా రెండా స్ర్తికి ఇంటా బయట సమస్యలే. పురుషులదే పైచేయిగా వున్న సంఘంలో వీరు ఆటబొమ్మలే. ఇక అసంఘటిత రంగంలోని స్ర్తిల స్థితి మరీ దారుణం. మానసిక, శారీరక దోపిడీ, పని ప్రదేశాలలో వేధింపులు (నివారణ- నిషేధ - పరిష్కార మార్గాలు 2013) చట్టం అమలులో వున్నా ప్రయోజనం సున్నా అనటం అతిశయోక్తి కాదు.
సమాజంలో స్ర్తి ఎలా ఉండాలి? ఏం తినాలి? ఏ దుస్తులు ధరించాలి. ఎలా ఉండాలి? ఏ విధంగా బతకాలి? పిల్లల్ని కనాలా వద్దా? చదువుకోవాలా లేదా ఉద్యోగం చెయ్యాలా లేదా ఊరికే ఉండాలా- అన్నీ మగవాళ్లే నిర్ణయించడం ఎంతవరకు సమంజసం? స్ర్తిలకు మెదడుంది, మనసుంది, వాళ్ళకి ఆలోచనలుంటాయి, అభిరుచులుంటాయి అనే ఆలోచన ఎందుకు రాదు. స్ర్తిల వ్యక్తిగత జీవితాన్ని శాసించే అధికారం ఎవరిచ్చారు? అనవసరంగా ఆంక్షలు విధించే అవసరం ఏముంది? అర్థంలేని ఆచారాలలో నిర్బంధంగా ఉంచడం ఏ విధంగా న్యాయం? అసలు స్ర్తి పురుషులిద్దరూ జన్మించడంలో ఎటువంటి తేడాలు లేనపుడు ఇద్దరూ సమానమని సహజ న్యాయానికి విరుద్ధంగా వికృతంగా ఎందుకు ప్రవర్తిస్తారు. ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎక్కడున్నాం, ఎటువైపు పోతున్నాం- ఆధునిక నాగరిక సమాజంలోనా- అనాగరిక ఆటవిక సంఘంలోకా. ఎక్కడ స్ర్తిలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు వుంటారని అంటారు. దేవతలు ఎక్కడున్నారు? వాస్తవానికి కల్లాపటం తెలియని ఆటవిక సమాజమే మేలనిపిస్తుంది. విజ్ఞానయుగంలో ఉన్నా జరుగుతున్న అజ్ఞానపు పనులు చూస్తే మానవులకన్నా మృగాలే మిన్న అనటం అతిశయోక్తి కాదు.
నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ అందించిన వివరాల్ని చూస్తే స్ర్తిలు ప్రత్యేకించి పసిపిల్లలపై జరుగుతున్న వివిధ నేరాలు 80 శాతం పెరిగాయి. ఎంత దారుణం. ఏమిటీ అమానుషం? ఇదేనా ధర్మభూమిలో ధరణీమణుల పరిస్థితి? ఇదేనా పుణ్యభూమిలో పడతుల జీవన స్థితి. ఇదేనా పవిత్ర భారతావనిలో నారీమణుల పురోగతి? పదేళ్ళ కాలంలో చిన్నపిల్లలపై లైంగిక నేరాలు అయిదు రెట్లు పెరిగాయంటున్న స్వచ్ఛంద సంస్థ ‘క్రై’- ప్రతి పదిహేను నిమిషాలకొక దారుణం జరుగుతుందని గణాంక సహితంగా వెల్లడించడం సమస్య తీవ్రతకు నిదర్శనంగా చెప్పవచ్చు.
గుడి, బడి, పవిత్ర స్థలాలే అయినా అత్యాచారాలకి, ఆకతాయి పనులకి నిలయాలుగా ఉన్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. ఎక్కడైనా బహిరంగంగా రేప్‌లు, లైంగిక దాడులు జరుగుతుంటే వాటిని చిత్రీకరించి ఆనందిస్తున్నారే తప్ప ఆ అరాచకాన్ని అడ్డుకొనే ప్రయత్నం జరగడంలేదు- ఇంకా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసలి వరకు, వయసుని ఖాతరు చేయకుండా అత్యాచారాలకు పాల్పడటం, కనీసం మానవత్వం లేకుండా యాచకుల్ని దివ్యాంగుల్ని కూడా వదలిపెట్టని మానవ మృగాలు నాగరిక సమాజంలో ఉండటం నాగరిక సమాజానికి సిగ్గుచేటు.
ఒక సంవత్సరం పసికూనపై పైశాచికత్వం అని తెలుసుకొంటే ఆ అకృత్యం చేసేవాళ్లు అసలు మనుష్యులేనా? లేక ఏ వింత జీవాలైనాఈ నాగరిక ప్రపంచంలోకి వచ్చాయా అని అనుమానం వస్తోంది. వీరిని ఏవిధంగా మార్చాలి. అసలు ఈ అకృత్యాలకు పాల్పడానికి కారణ మేమిటి?
మహిళలపై నేరాలకు పాల్పడుతున్నవారు ఎక్కువగా బాధితులకు పరిచయస్తులు లేదా దగ్గర బంధువులుగా ఉండటం మానవ సంబంధాలలో వస్తున్న మార్పుకి దర్పణంగా నిలుస్తుంది. మాదక ద్రవ్యాలు, మద్యం వినియోగం అగ్నికి ఆజ్యం పోసినట్లు లైంగిక నేరాలకు కారణమవుతున్నాయి. ఇక పోర్న్‌సైట్స్ సంగతి సరేసరి. దీనిని నిషేధించే నాధుడే లేడు. ఉమ్మడి కుటుంబం లేకపోవడం, ఇంటి వద్ద పిల్లల్ని చదివించకుండా బయట చదివించటం, విలువలతో కూడిన జీవితం లేకపోవడం నేర ప్రవృత్తికి దారితీస్తున్నాయనటం స్వభావోక్తియే కాని అతిశయోక్తి కాదు.
సమాజంలో స్ర్తి పురుషులిద్దరూ సమానమైనా, ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదు. ధైర్యంగా బతికే సావకాశం లేదు. కాని మానవ మృగాలు, కామాసురులు మాత్రం స్వేచ్ఛగా సంచరిస్తూ వికృత చర్యలకు పాల్పడుతున్నారు. మహిళల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. చట్టం, న్యాయం, శిక్ష వంటి పదాలు వారికి వినపడవు. రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. చట్టమంటే భయం లేదు. ఆడపిల్లల్ని అవమానించడం, అమానుషంగా ప్రవర్తించడం, అనుభవించడం, లైంగికంగా హింసించడం, పశువులకన్నా హీనంగా దిగజారడం మానవ మృగ లక్షణాలు. పాలకులు, పోలీసులు, అధికారులలో కొందరు లైంగిక నేరాలకు పాల్పడటం, ప్రోత్సహించడం క్షమించరాని నేరం.
అనాదిగా స్ర్తి జాతికి జరుగుతున్న అన్యాయాన్ని శాశ్వతంగా సమాధి చెయ్యాలి. మహిళల్ని గౌరవించని సమాజం నాగరిక సమాజం ఎలా అవుతుందో విజ్ఞులు ఆలోచించాలి. స్ర్తిలను ఆదరించని సంఘం అభ్యుదయ సమాజంగా ఎలా గుర్తింబడుతుంది? మహిళలకు భద్రత కల్పించలేని ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుంది?
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడు పదులు దాటాయి. స్ర్తి పాలిట ఎన్నో చట్టాలు, సంక్షేమ పథకాలున్నా ఫలితం సున్నా. స్ర్తికి భద్రత లేదన్నది, న్యాయం జరగడం లేదన్నది జగమెరిగిన సత్యం. ఇకనైనా పాలకులు కళ్లు తెరవాలి. స్ర్తిల ప్రగతికి, భవితకి, విముక్తికి కృషి చెయ్యాలి. వాళ్ళ స్థాయిని పెంచడానికి అడుగులు వెయ్యాలి. అలా జరగాలని ఆశిద్దాం.

- ప్రొఫెసర్ గిడ్డి వెంకటరమణ