Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంశుబోధిని సంగ్రహ పరిచయం
1. వెలుగు- చీకటి:- ఈ గ్రంథ ప్రారంభంలో కిరణాల స్వరూపం గూర్చి చర్చ వుంది. తర్వాత ఫొటోలు తీసుకునే విధానము, చీకటిని సృష్టించే విధానము వున్నాయి. ఈ సందర్భంగా చీకటిని కొలిచేందుకు కొలమానాలు ఇవ్వబడ్డాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయమేమంటే, ప్రతి సూర్యకిరణంలోనూ కొంత చీకటి భాగముంటుందని, ఆ చీకటి కూడా శక్తిస్వరూపమేనని దానిని తమఃప్రరూపక యంత్రము అనే యంత్రం ద్వారా విడదీసి కొలవ వచ్చునని ఈ గ్రంథం చాలావిపులంగా వివరించింది.
2. దర్పణాలు- కటకాలు:- రకరకాల దర్పణాలను, కటకాలను తయారుచేసేందుకు కావలసిన మూలద్రవ్యాలను, తయారుచేసే విధానాలను ఈ గ్రంథంలో చర్చించారు. ఈ దినుసులు 25కు పైగా వున్నాయి.
3. జలము:- ఈ పుస్తకంలోని 22వ సూత్రము జలంలో రెండు భాగాలున్నాయని చెపుతోంది. మొదటి భాగం పేరు విద్యుత్ జలము. రెండవ భాగం పేరు భూత జలము(అంటే పంచభూతాలలోని జలము).
4. పంచభూతాలు:- మన పురాతన శాస్త్రాలన్నింటిలోనూ పంచభూతాల ప్రస్తావన ఉంటుంది. ఆ ప్రస్తావనలు ఇంచుమించు ఒకే రకంగా వుంటాయి. కానీ ఈ గ్రంథంలో పంచభూతాల వివరణే విభిన్నంగా వుంది. ఈ గ్రంథంలో 45వ సూత్రం ప్రకారం ఆకాశానికి 10 గుణాలు, వాయువుకు 13గుణాలు, అగ్నికి 8 గుణాలు, జలానికి 10 గుణాలు, భూమికి 15 గుణాలు ఉన్నాయి.
5. సూర్యకిరణాలు:- ఈ అధ్యాయం చివరలో ప్రపంచం యొక్క శక్తిస్వరూపాలన్నీ సూర్యకిరణాలనుంచి ఉద్భవించినవే అన్నారు. ఈ గ్రంథం మధ్యలో ‘ఱజ ఱ్ఘశ’’ ని కొంతవరకు ఫోలి వుండి, కొంతవరకు విభేదించే సృష్టి విజ్ఞాన ప్రక్రియ వివరంగా వర్ణింపబడింది.
ఈ గ్రంథంలో ఉదహరింపబడిన కొన్ని అలభ్య గ్రంథాలు
1. అశనికల్పము, 2. అంశుమత్‌తంత్రము, 3. దర్పణకల్పము
4. దర్పణశాస్తమ్రు, 5. దర్పణప్రకరణము, 6. ముకురకల్పము
7. ధ్వాంతవిజ్ఞాన భాస్కరము
11. ధనుర్వేదము
ఇది యుద్ధతంత్రాలకు సంబంధించిన శాస్తమ్రు. దీనిని అథర్వణ వేదానికి ఉపవేదంగా స్వీకరించడంవల్ల, దీనికిగల ప్రాధాన్యాన్ని మనంగుర్తించవచ్చు. దీనిలో కొన్ని మంత్రశాస్త్ర విషయాలు ఉన్నప్పటికీ, వైజ్ఞానిక విషయాలు కూడా అనేకం వున్నాయి. ఈ శాస్త్రంలో ఎక్కువ గ్రంథాలు దొరకటం లేదు. పాకలపాటి రాజగోపాల కవి అనే ఆయన తెలుగు పద్యాలలో రచించిన ధనుశ్శాస్త్రం అనే గ్రంథం లభిస్తోంది.
1. దీనిలో బాణాలను గురిచూసి వేసే విధానాలు విస్తారంగా వున్నాయి.
2. ధనుస్సులను తయారుచేసేందుకు కావలసిన వెదురు కర్రలు, వాటిని ఉత్పత్తి చేసేందుకు అనువయిన భూమి గుణాలు, వాటికి సంబంధించిన వ్యవసాయ పద్ధతులు కూడా చెప్పబడినాయి.
3. బాణాల తలలను తయారుచేసే లోహాలు, వాటి మిశ్రణ విధానాలు, వాటికి పదునుపెట్టే ప్రక్రియలు వివరంగా ఇవ్వబడినాయి.
4. ధనుస్సునుఉపయోగించే వీరుల చేతులకు కవచాలుగా తొడుక్కునే చర్మాల రకాలు, ఉపయోగ విధానాలు వివరింపబడినాయి.
5. మంత్రపూరితమైన అస్త్రాలను ప్రయోగించేందుకు అనువైన ప్రత్యేక బాణాలను గురించి వివరించారు.
6. గదాయుద్ధము, ఖడ్గయుద్ధము, చక్రయుద్ధము, మల్లయుద్ధము, అశ్వయుద్ధము, గజయుద్ధము మొదలైన యుద్ధప్రక్రియలు అనేకం వర్ణింపబడినాయి.
7. సైన్యాలను మోహరించే వ్యూహరచనా విధానాలు దీనిలో వున్నాయి.
8. పూర్వమహావీరుల పరాక్రమ గాథలు ప్రస్తావించబడినాయి.
9. సైన్యాన్ని అక్షౌహిణులుగా విభాగం చేసే లెక్కలు దీంట్లో వున్నాయి.
అక్షౌహిణి సంఖ్య: రథాలు- 2187, ఏనుగులు- 21870, గుర్రాలు- 65610, కాల్బలము (సైనికులు-109350,
218700)
గమనిక:- పైన ఇచ్చిన సంఖ్యలలోగల అంకెల మొత్తం ప్రతిచోట తొమ్మిదిగానే వస్తోంది. రథ సంఖ్య, గజ సంఖ్య సమానంగా వున్నాయి. అశ్వసంఖ్య, దానికి మూడురెట్లుగా వుంది. సైనిక సంఖ్య రథ సంఖ్యకు అయిదు రెట్లుగా వుంది. కాగా, అక్షౌహిణి సంఖ్య రథ సంఖ్యకు పది రెట్లుగా వుంది- అని గమనించండి.
12. యంత్ర శాస్తమ్రు(ఇంజినీరింగ్, మెకానిక్స్)
ఈ శాస్త్రాలను ప్రస్తావించటానికి మన పురాతన గ్రంథాలలో శిల్పశాస్తమ్రు, స్థాపత్య శాస్తమ్రు, వాస్తు శాస్తమ్రు, యంత్ర శాస్తమ్రు మొదలైన పదాలు ఉపయోగింపబడినాయి. భరద్వాజ మహర్షి బృహత్ యంత్ర సర్వస్వము అనే పేరుతో ఒక గ్రంథం వ్రాశాడని, విమానశాస్త్రం దానిలోని ఒక భాగం మాత్రమేనని, పెద్దలు చెపుతున్నారు. భోజరాజు రచించిన ‘‘సమరాంగణ సూత్రాధారము’’ అనే వాస్తుశాస్త్రగ్రంథంలో అనేక యంత్రాలను గురించి మాత్రమేకాక, మరమనుషుల గురించి (రోబోస్ గురించి) కూడా ప్రస్తావించాడు. కానీ వివరాలు చెప్పలేదు. ఇవి ప్రకృతి ప్రమాదకరాలు కనుక యోగ్యులైన శిష్యులకు ఈ రహస్యాలను ఏకాంతంగా ఉపదేశించాలే గాని గ్రంథాలలో వ్రాయకూడదు- అని కూడా ఆయన రాశాడు.
ఈ విధంగా వేద, వేదానంతర పురాతన భారతీయ సాహిత్యంలో విజ్ఞానశాస్త్రం వేయి ముఖాలుగా విస్తరించి విలసిల్లింది. కాలప్రవాహంలో చాలామటుకు కొట్టుకుపోయినా, దొరకని గ్రంథాలకోసం అనే్వషించడం ద్వారాను, దొరుకుతున్న భాగాలను రక్షించుకోవటం ద్వారాను వాటికీ, ఆధునిక విజ్ఞానానికీగల సమన్వయ సారూప్యాలను పరిశోధించటం ద్వారాను, ప్రకృతి మైత్రీ సంపన్నమయిన నూతన వైజ్ఞానిక ప్రక్రియలను ఆవిష్కరించటానికై వైజ్ఞానికులు కృషిచేయవలసి వున్నది.
4. అథర్వణ వేదము
నాలుగు వేదాల్లోనూ సూత్రప్రాయమైన వైజ్ఞానిక అంశాలు అనేకం ఉన్నప్పటికీ, అథర్వణ వేదంలో ఈ అంశాలు కొంచెం అధికంగా ఉండటంవల్ల ఆ వేదం గురించి నాలుగు మాటలు విశేషంగా చెప్పుకుందాం.
అథర్వణ వేదానికి అథర్వవేదం, అథర్వాంగిరసం, బ్రహ్మవేదమనే నామధేయాలు కూడా ఉన్నాయి. ఈ వేదంలో మొత్తం 5977 మంత్రాలున్నాయి. వీటిలో సుమారు రెండువేల మంత్రాలు ఋగ్వేదంలో కూడా వున్నాయి. మొత్తంమీద అథర్వవేదాన్ని అతి ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రానికి చెందిన సాహితీ ప్రతీకగా అభివర్ణించవచ్చు.
అథర్వ వేదపు మరో పేరు ‘‘అథర్వాంగిరసః’’ -అని చెప్పుకున్నాం కదా. ‘‘అథర్వం’’అంటే మంచి ప్రక్రియలకూ, ‘‘ఆంగీరసం’’అంటే క్షుద్ర ప్రక్రియలకూ ప్రతీకలుగా కొందరు పండితులు పరిగణించారు. కానీ ఈ భేదం తగదు. ఇది మొత్తం ఒక వైద్యశాస్త్రంగా పరిగణించవచ్చు. ఈ ప్రక్రియలో కొన్నిచోట్ల మందులకు మారుగా మంత్రాలూ, తంత్రాలు చోటుచేసుకున్నాయి. ఈ అథర్వశాస్త్రంలో రకరకాల శారీరక, మానసిక రుగ్మతలకు, రాక్షస పైశాచిక భూత ప్రేత పీడలకు, సంబంధించిన చికిత్సా మంత్రాలున్నాయి. జ్వరం, కుష్ఠు, కామెర్లు, దగ్గు, నేత్ర వ్యాధులు, బట్టతల, నరాల బలహీనత, ఎముకలు విరగటం, గాయాలు, పాము, తేలు మొదలైన విష కీటకాలకు విరుగుడు మంత్రాలు, చికిత్సా మంత్రాలు ఉన్నాయి.

--ఇంకావుంది...

--కుప్పా వేంకట కృష్ణమూర్తి