ఎడిట్ పేజీ

తేనెపూసిన కత్తి ‘తీరప్రాంత ముసాయిదా’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాయు, జల, శబ్ద కాలుష్యాలు విషమించినా, అంతర్జాతీయ ఒడంబడికల పుణ్యమాని ఇంతకాలం సురక్షితంగా ఉన్న భారతీయ కోస్తా తీరం పరిరక్షణ, అభివృద్ధికి కేంద్రం కొత్త ప్రతిపాదనలను చేస్తోంది. మన దేశంలో సుమారు 7,500 కిలోమీటర్ల మేర సమద్ర తీరం ఉంది. ఇందులో 5,420 కిలోమీటర్లు ద్వీపకల్ప భారతదేశం. తీరప్రాంతంలో దాదాపు 25 కోట్ల మంది (దేశ జనాభాలో 14 శాతం మంది) జీవిస్తున్నారు. వీరంతా తీర ప్రాంతానికి సగటున 50 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారు. డాక్టర్ శైలేశ్ నాయక్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక ప్రాతిపదికగా పర్యావరణం అడవుల మంత్రిత్వశాఖ 1991 ఫిబ్రవరి 19న ఇచ్చిన ‘తీర నియంత్రణ ప్రాంత ప్రకటన’(సిఆర్‌జడ్)కు తిలోదకాలు ఇవ్వనున్నారు. పర్యావరణ సంబంధమైన సామాజిక అంశాలకు చట్టబద్ధత కల్పించేందుకు, సంస్థాగత పరిధిని రూపొందించేందుకు కేంద్రం ముసాయిదా పత్రాన్ని రూపొందించింది. ఇది అమలులోకి వస్తే భారత్ పర్యావరణ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి వెళ్తుందనేది ఒక అంచనా. ఆ అంచనా సంగతెలా ఉన్నా, కోస్తా తీరం రూపురేఖలు మారిపోయి పర్యావరణం ఎంతగా దెబ్బతింటుందనేదానిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. చెట్లను నరికి రోడ్లు వేయడం వల్ల రవాణా సౌకర్యం మెరుగయ్యేమాట నిజమే. కానీ పచ్చదనం హరించుకుపోవడంతో ఏర్పడే పర్యావరణ ముప్పు ఎటుదారి తీస్తుంది? అభివృద్ధి కోణంలో చూస్తే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను స్వాగతించదగినవే. అభివృద్ధి వెనుక ఉన్న పెనుముప్పును చూస్తే పర్యావరణ వేత్తలు గుండెలు బాదుకోవడం ఖాయం.
కేంద్రప్రభుత్వ కొత్త నోటిఫికేషన్‌తో తీరప్రాంతం కుదించబడుతుంది. ఇంత వరకూ సముద్ర కెరటాలు తాకే స్థలం నుండి 500 మీటర్లు వెలుపల ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనకు స్వస్తి పలుకుతారు. కొత్త నిబంధనల ప్రకారం 12 మీటర్లలోపే సముద్ర తీరంలో కార్యకలాపాలకు అవకాశం కలుగుతుంది. శాశ్వత నిర్మాణాలను సమీప పరిమితిలో అనుమతించేది లేదనే నిబంధన ప్రస్తుతానికి ఉన్నా, ముసాయిదా కాస్తా చట్ట సవరణగా వచ్చాక అది ఎన్ని రూపాలు సంతరించుకుంటుందో చెప్పలేం. తాజా ముసాయిదాతో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సిఆర్‌జెడ్) నోటిఫికేషన్‌లో సవరణలు రానున్నాయి. తొలిదశలో ఈ పథకం పశ్చిమ బంగ, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో అమలవుతుంది. తర్వాతి స్థానం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌దే. నదీతీరాల్లో సైతం ఈనిబంధనలు వర్తింపచేస్తుండటంతో తెలంగాణలో సైతం కొత్త నిబంధనల ముప్పు పొంచి ఉంది. కోస్తా ప్రాంతంలో ప్రజల జీవన ప్రమాణాల పెంపు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ ప్రధాన లక్ష్యాలని కేంద్రం చెబుతోంది. ఏపీలో తీరం కోతకు గురికాకుండా పటిష్ట చర్యలు చేపట్టేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని అంతా భావిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతుంటాయి. ఇక సముద్ర తీరంలో నిర్మాణాలు, కట్టడాలు ఏర్పాటైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే.
పూర్తి సడలింపులు
కొత్త నిబంధనల ప్రకారం తీరప్రాంతాన్ని నాలుగు ప్రధాన జోన్‌లుగా వర్గీకరిస్తారు. అందులో జోన్-1 , జోన్-2, జోన్-3, జోన్-4 ఉంటాయి. జోన్-1 అనేది సముద్ర కెరటాలు తాకే ప్రాంతంగా నిర్ణయించారు. అందులోనూ కెరటాలు తాకే చోటును జోన్ 1ఎగా, అక్కడి నుండి 12 మీటర్లు వెలుపలికి జోన్- 1 బి గా గుర్తిస్తారు. జోన్ -1ఎ మినహా మిగిలిన అన్ని జోన్లకు సడలింపులు వర్తిస్తాయి. జోన్ 1బి వరకూ క్రూడ్ ఆయిల్, పెట్రోలియం, స్పిరిట్, కిరోసిన్, ల్యూబ్రికెంట్స్ , బ్యూటేన్, ప్రొపేన్, నా ఫ్తా, ఫర్నెస్ ఆయిల్, అసిటిక్ యాసిడ్స్, మో ఎథిలిన్ గ్లైకాల్ వంటి ప్రమాదకర వాయు, ద్రవ పదార్థాలను అనుమతిస్తారు. సిఆర్‌జడ్-2లో రిసార్టులు, బీచ్ గేమ్స్, వాటర్ గేమ్స్, హోటల్స్‌ను అనుమతిస్తారు. జోన్-3లో శాశ్వత నిర్మాణాలకు అనుమతి లభిస్తుంది. అంటే ఇంతవరకూ రూపొందించిన అనేక చట్టాలకు ‘మంగళం’ పాడినట్టవుతుంది.
చట్టాలలో మార్పు
ప్రధానంగా కాలుష్య నివారణ నియంత్రణ చట్టం - 1981, యాన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ -ఎఎంఎఎస్‌ఆర్- 1958 చట్టం , 2010 నాటి సవరణ చట్టం వంటివి ఉల్లంఘించాల్సిందే. బయోడైవర్సిటీ యాక్టు-200 2, బాల కార్మికుల నియంత్రణ , క్రమబద్ధీకరణ చట్టం-1986, కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ యాక్టు -2005, డిస్ట్రక్టివ్ ఇనె్సక్టివ్స్ అండ్ పెస్ట్సై యాక్టు -1914 , డిజాస్టర్ మేనేజిమెం ట్ యాక్టు-2005, ఎంప్లాయిమెంట్ ఎక్చేంజెస్ యాక్టు- 1959, పర్యావరణ పరిరక్షణ చట్టం-1986, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్సు యాక్టు-2006, ఫారెస్టు కన్జర్వేషన్ యాక్టు- 1980 చట్టాలు ఈ తాజా ముసాయిదాతో ప్రభావితమవుతాయి. ఇండియన్ ఫిషరీస్ యాక్టు-1987, ఇండియన్ ఫారెస్టు యాక్టు-1927, ఇండియన్ పోర్ట్సు యాక్టు-1908, ఇన్‌లాండ్ వెస్సల్స్ యాక్టు-1917, ఇన్లాండ్ వెసెల్స్ సవరణ చట్టం-2007, ఇన్‌సెక్టిసైడ్స్ యాక్టు-1968, సవరణ చట్టం -2000, నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ యాక్టు-1962, షెడ్యూల్డు కేస్ట్సు అండ్ షెడ్యూల్డు ట్రైబ్స్ ఆర్డర్స్ అమెండ్‌మెంట్ యాక్టు-2002, షెడ్యూల్డు ట్రైబ్స్ అండ్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్టు (రికగ్నైషన్ ఆఫ్ ఫారెస్టు రైట్స్)-2006 వంటి చట్టాలపైనా ఎంతోకొంత ప్రభావం పడుతుంది. ప్రభుత్వం మాత్రం ఈ చట్టాలన్నీ చాలా సమర్ధంగా అమలుచేసేందుకు వీలు కలుగుతుందని చెబుతోంది. సీడ్స్ యాక్టు -1966, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్టు-1860, వాటర్ యాక్టు-1977, చట్ట సవరణ 1974, వన్యప్రాణి సంరక్షణ చట్టం-1912, 1972, 2002, 2006 నాటి చట్ట సవరణల్లోనూ కొత్త నిబంధనలతో మార్పులు చేయాల్సి వస్తుంది.
నేపథ్యం చాలా పెద్దది
కోస్తా ప్రాంత పరిరక్షణకు చాలా పెద్ద చరిత్రే ఉంది. ఇటీవలి సునామీ ఘటనలకు జపాన్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, మాల్దీవులు, మయన్మార్, సోమాలియా, శ్రీలంక దేశాలు ఎలా విలవిలలాడిపోయాయో అందరికీ తెలిసిందే. సముద్రాల్లో వ్యర్థ పదార్థాలు, కాలుష్య జలాలు ప్రవేశించకుండా నియంత్రించడం, ప్రకృతి వనరులను పరిరక్షించుకోవడంపై అనేక అంతర్జాతీయ సదస్సుల్లో ఒడంబడికలు జరిగాయి. ఈ సదస్సుల ఫలితంగా దేశంలో ఇంతకాలం తీర ప్రాంతాల్లో కట్టడాలకు తావులేకుండా పరిరక్షించగలిగారు. కొన్ని చోట్ల కాలుష్య జలాలు సముద్రంలోకి చొచ్చుకువస్తున్నా, సముద్రాన్ని ఆనుకుని శాశ్వత నిర్మాణాలను ఆపగలిగారు. కాని తాజా ప్రతిపాదనలతో ఇక సముద్ర తీరంలోనే శాశ్వత కట్టడాలు రానున్నాయి. ‘2016-పారిస్ ఒ ప్పందం’తో శీతోష్ణస్థితిలో వస్తున్న మార్పులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముప్పుపై తీవ్రమైన ప్రతిస్పందనే వ చ్చింది. 2013లో పాదరసంపై మినమాట కనె్వన్షన్, 2010 జన్యు వనరుల జీవవైవిధ్యం కనె్వన్షన్, వాటి వినియోగం నుండి ప్రయోజనాలను న్యా యబద్ధంగా సమానంగా పం పిణీ చేసుకోవడానికి యా క్సిస్‌పై నగోయా ప్రొటోకాల్ పాటించడం, 2008- ఆఫ్రికా యురేపియా వలస పక్షుల పరిరక్షణకు ఒప్పందం, 20 07-డుగాంగ్స్ ఆవాస ప్రాం తాల ఒప్పందం, 2006- ఇంటర్నేషనల్ ట్రాపికల్ టిబర్ అగ్రిమెంట్, 2003-గ్లోబల్ క్రాప్ డైవర్సిటీ ట్రస్టు స్థాపన ఒడంబడిక, 2003-టొబాకో కంట్రోల్ , 2001- స్టాక్‌హోం కనె్వన్షన్, 2000-జీవ వైవిధ్య ప్రొటోకాల్.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు వందకు పైగా ఒడంబడికలతో దేశంలో తీర ప్రాంత పరిరక్షణకు చట్టాలు అమలులోకి వచ్చాయి.
కేంద్రం ప్రతిపాదించిన కొత్త చట్టానికి ‘సముద్ర తీర ప్రాంత పరిరక్షణ - క్రమబద్ధీకరణ చట్టం ముసాయిదా’ అని పేరుపెట్టిరు. దీనిని కేంద్రం గత ఏప్రిల్ 18 న బహిర్గత పరిచింది. దీనిపై ప్రజల అభిప్రాయాలు, నిపుణుల సూచనలను స్వీకరిస్తోంది. ఈ ముసాయిదా చట్టం రూపంలో వస్తే ప్రతి ఒక్కరిపై దీని ప్రభావం పడనుంది. తీర ప్రాంతాల్లోని జనాభా ప్రాతిపదికగా గ్రామాల పునర్విభజన జరగనుంది. తీర ప్రాంతాలపై ఇంతకాలం కనే్నసిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల పంట పండనుందని, వారంతా అక్కడ నిర్మాణాలకు పూనుకుని పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసుకునే ముప్పు లేకపోలేదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అంతా బాగానే ఉన్నపుడు కేవలం తీర ప్రాంత ప్రజలు మాత్రం ఇబ్బందులు పడాలా? వారి రక్షణకు, జీవనోపాధికి చర్యలు తీసుకోరాదా? అన్నది కేంద్రం వాదనగా ఉంది. తీర ప్రాంత వాసుల భద్రత, రక్షణతో పాటు పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం, నూతన ఆదాయ వనరులను ఏర్పరచుకోవడం, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను పెంచడం, నిరుద్యోగాన్ని పారద్రోలడం ఈ ముసాయిదాలో అంతర్భాగంగా ఉన్నాయి. ఈ ముసాయిదా రూపకల్పనలో ప్రపంచ బ్యాంకు, గ్రీన్ క్లైమెట్ ఫండ్ సహకారాన్ని తీసుకుంది. కేంద్రం తన అధికారాన్ని కాపాడుకుంటూనే, మరింత సడలింపులకు, మార్పులు చేర్పులకు రాష్ట్రాలకు సైతం అవకాశం కల్పించింది. ఫలితంగా రాష్ట్రాలు గుర్రుగా లేకుండా ఈ ముసాయిదాను ఆమోదించేందుకు వీలుకలుగుతుందనేది కేంద్రం భావనగా పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఒకసారి ఇది చట్ట రూపంలో అమలులోకి రాగానే వివిధ ప్రాజెక్టులకు ఆన్‌లైన్‌లో ‘పర్యావరణం- అటవీ సంరక్షణ శాఖ’కు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులను పరిశీలించిన మీదట కేంద్రం రాష్ట్రాలకు, ఆయా సంస్థలకు అనుమతి ఇస్తుంది. దీనిని వీలైనంత తొందరగా అమలులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణకు 2018 జూన్ 19వ తేదీతో గడువు ముగిసింది.
ప్రయోజనాలు
కొత్త ప్రతిపాదనలతో తీవ్రమైన నష్టాలు ఉన్నా, ఆర్ధిక పరమైన ప్రయోజనాలు మాత్రం ఉంటాయి. తీర ప్రాంతంలోని ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ బీచ్ గేమ్స్, రిసార్టులు, పర్యాటక కేంద్రాలను తీర్చిదిద్ది విదేశీ యాత్రీకులను ఆకర్షించవచ్చు. మలేషియా, సింగపూర్, థాయిలాండ్ తరహాలో అతిపెద్ద రిసార్టులు, గేమింగ్ జోన్‌లు ఏర్పాటు చేసి పర్యాటకులకు కేంద్రంగా మార్చవచ్చు.
విమర్శలు
అభివృద్ధి పేరుతో తీర ప్రాంతాలను నాశనం చేసేందుకు ఈ ముసాయిదా బీజం వేసినట్టయిందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. కొత్త ముసాయిదా అమలులోకి వస్తే దాదాపు డజనుకుపైగా చట్టాల్లో ఉన్న నిబంధనలు చెల్లుబాటు కాకుండా పోతాయి. సామాజిక సంబంధాలు ఇప్పటికే దెబ్బతింటున్న దశలో, గ్రామాల్లో పాశ్చాత్య సంస్కృతికి బీజం వేస్తే విలువలు పతనమవుతాయని, తీరప్రాంతాలు వ్యర్థాలతో నిండిపోయి మురికి కూపాలవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్స్ ఇపుడే అమలులోకి వచ్చి అంతా నిబంధనలు పాటించేలా చూస్తున్న తరుణంలో కొత్త చట్టం గ్రీన్ ట్రిబ్యునల్స్‌ను నీరుగార్చే ముప్పు ఉందనేది వారి వాదన. తమిళనాడు, మహారాష్టల్రు ప్రజాభిప్రాయ సేకరణకు గడువు పొడిగించాలని కోరుతున్నాయి. అయితే కేంద్రం ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అభివృద్ధి కోసం జరిగే మార్పులకు ఎంతవరకూ మూల్యం చెల్లించాలి? మానవ,సమాజ విలువలకు తిలోదకాలివ్వాల్సిందేనా?

--బీవీ ప్రసాద్ 98499 98090