Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇలాటి రోగాలు కంటికి కనబడని బాక్టీరియా వగైరా సూక్ష్మజీవులవల్ల కలుగుతుంటాయని ఆధునిక వైద్యం చెపుతోంది. ఆనాటివాళ్ళు కంటికి కనపడని ఆ బాక్టీరియా సూక్ష్మజీవులకే భూతాలు, ప్రేతాలుగా పేర్లుపెట్టి, అందుకు తగినట్లు శబ్దరూపంగా చికిత్సామంత్రాలు, తంత్రాలు నిర్ణయించారు.
‘‘అభిచారం’’అనే ప్రక్రియలు విషప్రయోగాల్లాంటివి. ఇది శత్రు శరీరంలో దూరి భక్షిస్తుంది. (చర భక్షణే) ‘‘కృత్యా’’ ‘‘అభిచార’’ మంత్రాలు అథర్వంలో వున్నా, ఇవి నిజానికి ఒక రకమైన ఆయుధాలు. ‘‘కృత్యా’’అనేది అగ్ని-శిలా- శూల- రసాయన- విషవాయు- విస్ఫోటాలు కలగలిపిన ఒక రకమైన ఆయుధంగా భావించవచ్చు.
అలాగే అథర్వ వేదంలో వాడిన కొన్ని శబ్దాలు పరిశీలిస్తే, కొత్త విషయాలు అవగతవౌతాయి. ‘‘యాతు ధాన’’అనే శబ్దం వుంది. ఈ శబ్దానికి సాధారణంగా రాక్షసులు అనే అర్థం చెబుతారు. ‘‘యాతనా దుఃఖం, తం దదతి తే యాతుధనాః’’అని నిరుక్తం. (దుఃఖాన్ని కలిగించే క్రిములు అని అర్థం.)
అట్లాగే ‘‘కిమిదం’’అనేవి పిశాచాలుగా, చెబుతారు. ‘‘కిం ఇదం’’ ‘‘ఇప్పుడేమిటి?’’అని ఘోషిస్తూ తిరిగే క్రిములనే ‘‘కిమిదం’’గా నిరుక్తం చెబుతోంది.
‘‘రాక్షస’’అంటే ఏదో వికారరూపం మనకు తోస్తుంది. కోరలు, కొమ్ములు, వగైరాలతో ఇది రాత్రులందు తిరిగే క్రిమి-మనుషులను కుట్టి చంపుతుంది. ‘‘రహసి క్షిణోతి ఇతి వా, రాత్రౌ క్షిణోతి ఇతి వా’’ (నిరుక్తం) (రహస్యంగా కుట్టేది, లేక రాత్రిపూట కుట్టేది అని భావం)
అలాగే ‘‘గంధర్వ’’- ఇవి సంగీతం పాడుతూ తిరిగే సూక్ష్మజీవులు, దోమల లాగా (నిరుక్తం).
అప్సరా- అప్పులలో, అనగా జలములలో సంచరించే జీవులు.(నిరుక్తం)
ఇలాటి జీవులను చంపటానికి అథర్వంలో ప్రయోగాలున్నాయి. ఆ ప్రయోగాలలో మంత్రాలతోపాటు తంత్రాలుకూడా వినియోగింపబడ్డాయి. ఆ తంత్రాలలో ప్రత్యేకించి, హింగు, సరసు, తులసి, గుగ్గులు మొదలైన మూలికల వాడకం కనిపిస్తోంది. దీనినిబట్టి మనకు రోగాలు, జ్వరాలు కలిగించే క్రిములు మొదలైన సూక్ష్మజీవులను నశింపచేయటానికి తులసి, గుగ్గులు, హింగు, సరసు మొదలైన ఓషధులతో కూడిన మంత్ర ప్రయోగాలు కలిగినదే అథర్వవేదం అని అర్థం అవుతోంది.
‘‘రాజనిఘంటువు’’ ప్రకారం ‘‘హింగు’’కు మరో పేరు ‘‘రక్షోఘ్నం’’అనగా రాక్షసులను నశింపచేయునది- అనగా రాక్షసులని పిలవబడే క్రిములను నశింపజేస్తుంది. ‘‘్ధన్వంతరి నిఘంటువు’’లో ‘‘హింగు’’కు ‘‘జంతుఘ్న’’అని పర్యాయం వుంది. ‘‘్భతనాశినీ హింగు’’అనే మరొక వ్యవహారం కూడా వుంది. ‘‘రాక్షసులు’’ అంటే మనకు వాడుకలో ఒక భయంకరమైన రూపం మనస్సులో గోచరవౌతుంది. కానీ ‘‘అసృగ్ భాజానీహ వై రక్షింసి’’అని కౌషీతక బ్రాహ్మణములోని వాక్యానికి అర్థం తెలుసుకుంటే, రక్తం తాగే క్రిములుకానీ, జీవులు గానీ, రాక్షసులనబడతారని తెలుస్తుంది. ఈ క్రిములు సూర్యరశ్మినే ముఖ్యంగా నశిస్తాయని నేటి శాస్తజ్ఞ్రులు కూడా చెబుతున్నారు. మన వేదాల్లోకూడా అదే వుంది.
‘‘సూర్యో హి నాష్ట్రాణాం రక్షసామపహన్తా’’అని శతపథ బ్రాహ్మణం చెపుతోంది.
‘‘అగ్ని ర్వై రక్షసామపహన్తా’’అని కౌషీతక బ్రాహ్మణం-
‘‘అదాభ్యన శౌభిషా‚గ్నే రక్షస్త్వం దహి’’అని ఋగ్వేదం. ఈ రెండు వాక్యాలలోనూ అగ్ని సూక్ష్మజీవులను నశింపజేస్తాడని వుంది.
సూక్ష్మజీవులు సూర్యకిరణాలవల్ల మాత్రమేగాక అగ్నివల్ల కూడా నశిస్తాయని ఆధునికులూ చెపుతున్నారు కదా!
‘‘అసురాః’’అనే పేరుకూడా రోగాలను కలిగించే సూక్ష్మక్రిములను సూచిస్తుంది. అసూన్ ప్రాణాన్ రాంతి ఇతి అసురాః- ప్రాణాలను పట్టి పీల్చే సూక్ష్మక్రిములను అసురులంటారు. (నిరుక్తం)
‘‘పిశాచం’’అంటే ‘‘పిశితం మాంసమాచా మతీతి పిశాచః’’- అంటే మాంసాన్ని తినే క్రిములనుకోవచ్చు. పిశాచాలంటే క్రిములు అని తెలుసుకోబట్టే వాటిని సంహరించమని అగ్నిని ప్రార్థిస్తోంది, అథర్వవేదం.
యదస్య హృతం వాహృతం
యత్ పరాభృత మాత్మనో జగ్ధం యతమత్ పిశాచైః
తదగ్నే విద్వాన్ పునరాభర త్వం
శరీరే మాంసమసుమేరయావుః॥ (అథర్వ వేదం)
ఈ మంత్రంలో పిశాచాలు మాంస ఖండాన్ని పునరుద్ధరించమని అగ్నికి ప్రార్థన వుంది. పిశాచాలు తిన్న మాంస ఖండం అంటే చర్మరోగాలు, వ్రణాలు వగైరాగా చెప్పుకోవచ్చు. అలాగే ‘‘దుర్ణామ’’అనే రాక్షస భేదం కూడా కనిపిస్తోంది.
తే వతోన్మమార్జ జాతాయాః పతివేద నౌ
దుర్ణామా తత్ర గృధత్ దశ్మింశ ఉతవత్సపః॥ - (అథర్వ వేదం)
ఇందులో ‘‘దుర్ణామ’’, ‘‘వత్సవ’’అనే రాక్షస పిశాచ జాతివాళ్ళలో ‘‘దుర్ణామ’’అనే శబ్దానికి యాస్కాచార్యుడు స్పష్టంగా అర్థం చెప్పాడు.
దుర్నామా క్రిమిర్భవతి పాపనామా
క్రిమిః త్రవ్యే మేద్యతి (నిరుక్తం)
దుర్నామ అనేది పచ్చి మాంసాన్ని తినే ఒక రకం క్రిమి.
అథో గంధేన చ వై రూపేణ చ
గంధ ర్వాప్సరసశ్చ చరంతి’’ (శతపథ బ్రాహ్మణం)
అప్సరసలు ‘‘గంధం- వాసన’’ ఆధారంగా బ్రతికే క్రిములు కాగా, గంధర్వులు ‘‘రూప- సౌందర్యా’’లను ఆశ్రయించి జీవించే క్రిములు అని పై మంత్రానికి భావం.
ఇలా అథర్వవేదంలో వున్న రోగ కారకాలైన యక్ష రాక్షసాది శబ్దాలను, వాటి నివారణ మంత్ర తంత్రాలను, లోతుగా పరిశోధిస్తే, ఇవాల్టి విజ్ఞానంకన్నా ప్రబలమైన మరో వైద్యవిజ్ఞానం ఆవిష్కృతమయ్యే సావకాశాలు చాలా వున్నాయి.

--ఇంకావుంది...

--కుప్పా వేంకట కృష్ణమూర్తి