మెయిన్ ఫీచర్

కళ్లు చెదిరే కళాకృతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచనలకు కృషిని మేళవిస్తే నవీన ఆవిష్కరణలకు, అద్భుత కళాకృతులకు అంతే ఉండదని ఆ దంపతులు నిరూపిస్తున్నారు.. ‘కళకు కాదేదీ అనర్హం’ అన్నట్లు మనం నిత్యం వినియోగించే కూరగాయలను అపురూప కళాఖండాలుగా తీర్చిదిద్దుతూ ప్రాచీక కళకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు.. గుమ్మడి, ఆనప, కాకర వంటి కూరగాయలను వండుకుని తినడం అందరికీ తెలిసిందే.. అయితే, మైసూరుకు చెందిన సీమ, కృష్ణప్రసాద్ దంపతులు పెద్దసైజులో లభించే ఈ కూరగాయలను అలంకరణ వస్తువులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆనప, గుమ్మడి కాయలపై రంగులు అద్ది నగిషీలు దిద్దడం బస్తర్, ఛత్తీస్‌గఢ్‌లలో ‘టుమా’ కళగా ప్రసిద్ధి చెందింది. స్వతహాగా వ్యవసాయంపై ఆసక్తి ఉన్న సీమా ప్రసాద్ ఆ కళను అధ్యయనం చేసి కూరగాయలను కళాకృతులుగా మార్చడంలో మరిన్ని మెళకువలను తెలుసుకున్నారు. కీన్యా, టాంజానియా దేశాల్లోని గిరిజనులు ఈ ప్రాచీన కళను తమ వారసత్వంగా కాపాడుకుంటున్నారు. కూరగాయలు, పలురకాల వ్యవసాయ ఉత్పత్తులను కళాకృతులుగా మార్చడంలో ఆ గిరిజనులు అవలంబించే పద్ధతులను కూడా సీమా ప్రసాద్ అధ్యయనం చేశారు.
ఆనప, గుమ్మడి, కాకర పాదులను ఇళ్లలో పెంచడం వల్ల పోషకాలున్న కూరగాయలు మనకు లభిస్తాయని, వాటిని కళాకృతులుగా మార్చి అలంకరణ వస్తువులుగా విక్రయించే అవకాశం ఉందని సీమా ప్రసాద్ దంపతులు ప్రచారం చేస్తున్నారు. ఇళ్లలో ‘పాదు’లు పెంచడం భారతీయుల వారసత్వ చిహ్నమని, ఈ రకం కూరగాయలను వాణిజ్య పంటలుగా కూడా రైతులు సాగుచేయాలని సీమ సూచిస్తున్నారు. అరుదైన కూరగాయల విత్తనాలను భద్రపరచేందుకు ‘సహజ సమృద్ధ’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఆమె నిర్వహిస్తున్నారు. కూరగాయ మొక్కలు, పాదులను పెంచే రైతులకు అవసరమైన విత్తనాలను ఆ సంస్థ ద్వారా అందజేస్తున్నారు.
ఆనప, గుమ్మడి కాయలను కళాకృతులుగా తీర్చిదిద్దేలా గ్రామీణ మహిళల్లో ఆసక్తి కలిగించేందుకు ‘కృషికళ’ పేరిట ఓ సంస్థను సీమా ప్రసాద్ ప్రారంభించారు. మహిళలు సృష్టించే కళాకృతులు ఇళ్లకు కొత్త అందాల్ని ఇస్తున్నాయి. విభిన్న ఆకృతుల్లో కాయలు కాసే ఆనప, గుమ్మడి విత్తనాలను సేకరించేందుకు సీమ మన దేశంలోని అనేక ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఆధునిక కాలంలో గృహాలంకరణకు అందరూ ప్రాధాన్యం ఇస్తున్నందున వైవిధ్యం ఉట్టిపడే కళాకృతులకు విపరీతమైన డిమాండ్ ఉందని ఆమె చెబుతున్నారు. ఈ కళలో మహిళలకు శిక్షణ ఇవ్వడమే కాదు, వారు రూపొందించే కళాకృతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు.
ఆనప, గుమ్మడి కాయల్లో గుజ్జును తీసివేసి, వాటిని ఎండబెట్టిన తర్వాత రంగులు అద్దడం, నగిషీలు చెక్కడం ఎంతో శ్రమతో కూడినపని. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ‘డొల్లలు’ పగిలిపోయి ఆర్థికంగా నష్టం జరుగుతుంది. దీంతో భారీసైజు కూరగాయలను సేకరించడం దగ్గర నుంచి కళాకృతులు పూర్తయ్యే వరకూ ఎన్నో మెళకువలను పాటించాలని సీమా ప్రసాద్ చెబుతున్నారు. తమ సంస్థ ఉత్పత్తి చేసే కళాకృతులకు దేశవిదేశాల్లో డిమాండ్ పెరిగిందని ఆమె అంటున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఆర్గానిక్ ట్రేడ్ ఫెయిర్’లో తమ ఉత్పత్తులకు ప్రశంసలు లభించాయని ఆమె గుర్తు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఇతర హస్తకళలను సైతం ‘కృషికళ’ ప్రోత్సహిస్తోందని సీమ తెలిపారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు వ్యవసాయోత్పత్తుల్లో అద్భుతాలు సాధించినపుడే సాధికారత సాకారం అవుతుందంటారు. ప్రాచీన హస్తకళలను పరిరక్షించే బాధ్యత మహిళలదేనని చెబుతుంటారు. తమ సంస్థ ఏడాదికి సుమారు 5,500 గుమ్మడి, ఆనప కాయలను కళాకృతులుగా మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఒక్క ఆనపలోనే 30 రకాల ఆకృతులున్న కాయలను సేకరించినట్లు, అలాగే గుమ్మడి కాయలు కూడా వివిధ ప్రదేశాల్లో విభిన్న ఆకృతుల్లో లభిస్తున్నాయని ఆమె వివరిస్తున్నారు. ఈ కళాకృతుల తయారీని మరింత విస్తృతం చేసి, సొంతంగా మార్కెటింగ్ చేస్తూ వినియోగదారులకు చేరువ కావాలన్నదే ‘కృషికళ’ సంకల్పం అని సీమ తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు.

-పి.ఎస్.ఆర్.