మెయిన్ ఫీచర్

సరస్వతీ! నమస్త్భ్యుం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘విగ్నోప కాదే విఘ్నోప, ఒత్తు ఎగరగొట్టేవా?’’ దేవుడి దగ్గర నుంచుని శుక్లాంబరథరం శ్లోకం చదువుతున్న ఆరేళ్ళ మనవరాలిని సరిచేసింది సరస్వతి. ‘‘అమ్మా! రిటైర్ అయినా నీలో టీచర్ మాత్రం ఎప్పుడూ ‘ఆన్ డ్యూటీ’నే, కాఫీ చేతికందిస్తూ నవ్వేసింది పెద్ద కూతురు అక్షర. ‘‘ఏం చేయనే! అలవాటైన దురలవాటు మరి, ఎంత వదిలించుకుందామంటే అంత దగ్గరవుతోంది. ఐనా తప్పేముందే, నువ్వు, నీ చెల్లెలు ప్రజ్ఞ నాలుగు ముక్కలు చదువుకుని, మీ పిల్లలకు నాలుగు ముక్కలు నేర్పుకోగలుగుతున్నారంటే దానివల్లే కదా. అవునమ్మా నిజమే, మేమిద్దరం అదే అనుకుంటుంటాం. టీచర్ కడుపున పుట్టడం మేము చేసుకున్న అదృష్టం అని. ప్రతీ వేసవి సెలవులకు మా పిల్లలను నీ దగ్గర ఉంచడానికి కారణం కూడా అదే. సమ్మర్ కేంప్‌లనీ, ఇంకేవో క్లాసులని అక్కడికి, ఇక్కడికి తిప్పే బదులు ఈ టీచరమ్మమ్మ ఇంట్లో ముద్దు ముచ్చటతో పాటు, చదువు మరచిపోకుండా కాస్త పద్యాలు, పాటలు, కథలు కూడా చెవినపడతాయని ‘‘ఔనమ్మా! వీళ్ళను దింపడానికి, తీసుకెళ్ళడానికి అన్న నెపంతో మేము కూడా మా టీచర్స్ చెప్పే నాలుగు మంచి మాటలు వింటాం’’ అంది చిన్నమ్మాయి ప్రజ్ఞ.
సరస్వతి ఉన్నచోట ఎప్పుడూ నవ్వులే, అందరినీ ఉత్సాహపరుస్తూ మాట్లాడుతుంది. అక్షర, ప్రజ్ఞలు తాము చదివిన చదువు వృధా పోకుండా, మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. పిల్లలకు తగ్గ సంబంధాలు చూసి పెళ్లి చేసింది. నాన్నమ్మ, తాతలతో కలిసుంటారు కనుక, ప్రతీ వేసవి సెలవులు నలుగురు మనవలూ అమ్మమ్మా, తాతల దగ్గర గడుపుతారు. పాటలు, పద్యాలు, కథలు, తోటపని, వీధిలో తోటి పిల్లలతో ఆటలు ఇలా రెండు నెలలు తెలీకుండానే గడిచిపోతుంది. సరస్వతికి పధ్నాల్గవ ఏటనే పెళ్లయింది. భర్త విశ్వం ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. పద్ధెనిమిదవ ఏటనే ఉద్యోగస్తురాలయింది. చిన్నతనంలోనే పెళ్లి జరిగినా తండ్రి ప్రోత్సాహంతో సంస్కృతం, తెలుగు భాషలలో డిగ్రీ సంపాదించింది. ఓ గవర్నమెంటు స్కూల్లో తెలుగు టీచర్‌గా పనిచేసింది. విద్యార్థులకు తనంటే ఎంతో అభిమానం. కేవలం పాఠ్యాంశాలే కాకుండా, నీతి కథలు, పద్యాలు, పాటలు... ఇలా పిల్లలకి అన్ని విషయాలు తనదైన సరదా శైలిలో బోధిస్తుండేది. తన ఇద్దరు కూతుర్లను అదే స్కూల్లో చేర్పించింది. ఇంట్లో వంట, వార్పు చేసుకుని, భర్తకు, పిల్లలకు కారేజీలు సర్దుకుని కాళ్ళకు చక్రాలున్నాయా అన్నట్టు తిరిగేది. స్కూల్లో తనది తప్ప అందరివీ గవర్నమెంట్ ఉద్యోగాలే. జీతం చెప్పుకోదగ్గది కాకపోయినా, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడమే తనకు ముఖ్యమని భావించేది. ‘‘టీచర్ మీవల్లనే నాకు ఫస్ట్ మార్కు వచ్చింది’’ అని విద్యార్థులు చెప్తే వచ్చే సంతృప్తి, జీతం తీసుకున్నప్పటికంటే వంద రెట్లెక్కువ అనుకునే అతి కొద్దిమంది ఉపాధ్యాయుల్లో సరస్వతి మొదటిది.
టీచర్‌గా తనకు తెలిసిన విద్యను నలుగురికి పంచడమే కాదు, ఇంకా ఎంతో నేర్చుకోవాలని తపించే వ్యక్తి సరస్వతి. అందుకే డిగ్రీతో సరిపెట్టుకోకుండా, సంసార బాధ్యతను విస్మరించకుండా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూనే భర్త ప్రోత్సాహం, సహాయ సహకారాలతో పిహెచ్‌డి చేసి డాక్టరేట్ సంపాదించుకుంది. డాక్టర్ సరస్వతి టీచర్‌కి రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఫంక్షన్ చేసి, ఘనంగా వీడ్కోలు చెప్పింది స్కూల్ యాజమాన్యం. వేడుకకు తన కుటుంబం, ఇంకా స్కూల్ మొత్తం హాజరయింది. వేసవి సెలవులు ప్రారంభం, మనవలొచ్చారు. ఓ రోజున మనవలతో కబుర్లు చెప్తూ సరస్వతి అడిగింది. ఏమర్రా! పెద్దయ్యాక మీరేమవుతారు. ‘‘నే బిల్డింగ్ కడతా. నేను డాక్టర్, నే పోలీస్, నే ఇంజనీర్ అవుతా’’ అని ఉత్సాహంగా సమాధానమిచ్చారు నలుగురూ.
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఎనిమిదేళ్ల అగస్త్య తలుపు తీసి ‘‘ఎవరండీ మీరు, ఎవరు కావాలి’’ అడిగాడు. ‘‘సరస్వతి టీచర్ ఉన్నారా’’ అని అడుగుతుండగానే, తనే వచ్చి చెప్పింది. ‘‘ఔను బాబూ నేనే సరస్వతిని, చెప్పండి ఏం కావాలి?’’- లోపలికి రావచ్చా టీచర్, అడిగాడు. ‘‘అయ్యో! సారీ రండి’’ పిలిచింది సరస్వతి. అడిగినతనితోపాటు, ఇంకో ముగ్గురొచ్చేరు ఇంట్లోకి. వారిలో ఇద్దరు అమ్మాయిలు. ‘‘కూచోడండమ్మా!’’ సోఫా చూపించింది. ‘‘మేము గుర్తొచ్చేమా టీచర్’’ అడిగింది వారిలో ఓ అమ్మాయి. ‘‘బాగా తెలిసినట్టే అనిపిస్తున్నారు కానీ...’’ ఆలోచిస్తున్నట్టుగా ఆగింది. ‘‘మీరు వర్క్ చేసిన స్కూల్లో మేము పదవ తరగతి పాసయిన మొదటి బేచ్ స్టూడెంట్స్, గుర్తొచ్చేమా టీచర్’’. ‘‘ఆ.. లలితా, నువ్వా.. మీరు మగ్గురూ సరళ, రవి, కార్తికేయన్ కదూ, ఎంత పెద్దవారయ్యారు, గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఎనే్నళ్లయింది కలిసి, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే.. ‘‘అవును టీచర్, మీరు రిటైరయ్యారని, డాక్టరేట్ వచ్చిందని తెలుసుకుని మిమ్మల్ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుందామని ఇలా వచ్చాం’’ అంది సరళ. మంచి పని చేశారు, నాకు మిమ్మల్ని చూసిన ఆనందంలో మాటలు రావట్లేదు. ఇంతకీ ఏం చేస్తున్నారు, మీ నలుగురూ? ఆత్రంగా అడిగింది సరస్వతి. ‘‘రవి పెద్ద కాంట్రాక్టర్ అయ్యాడు, సరళ హైదరాబాద్‌లో పెద్ద గవర్నమెంట్ డాక్టర్, కార్తికేయన్ వైజాగ్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్‌గా జాయిన్ అయ్యాడు. నేను అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్’’ ముగించింది లత. ‘వెరీ గుడ్’ తన క్లాసులో ఫస్ట్ వస్తే పొగిడినట్టు ప్రశంసించింది వాళ్ళని.
‘‘అందరం పెళ్లిళ్ళు చేసుకుని హ్యాపీగా సెటిల్ అయ్యాం టీచర్. మీరు మాకు పాఠాలతోపాటు సంస్కారాన్ని, మంచి చెడు ఆలోచించే విజ్ఞాతను నేర్పారు. మీ వంటి టీచర్లందరి పర్యవేక్షణలో గడిచింది మా విద్యాభ్యాసం. అందువల్లనే ఈరోజింత మంచి జీవితాన్ని గడుపుతున్నాం’’ అన్నాడు రవి. ‘‘మా పిల్లలను మాలా గవర్నమెంటు స్కూలుకు పంపాలంటే భయమేస్తోంది టీచర్. ప్రైవేటు కళాశాలలకు ఆకర్షితులై ఎవరూ గవర్నమెంటు స్కూల్స్ వైపు చూడట్లేదు. దీనికి తోడు ప్రభుత్వం వారి స్కూల్స్‌లో సరైన అధ్యాపకులు ఉండటంలేదు. ధనవంతులు పెద్ద ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. పేదవారు గవర్నమెంటు స్కూల్లో చదువు నేర్పేవాళ్లు లేరంటూ పిల్లలను పంపడం మానేస్తున్నారు. మాలాంటి మధ్యతరగతి వాళ్ళం ఏంచేయాలి, ఎటు ఒగ్గాలో తెలియక సతమతమవుతున్నాం. మిమ్మల్ని తలవని రోజుండదు. మా బేచ్ అంతా వాట్సాప్ గ్రూప్‌లో ప్రతీరోజు ఆ పాత రోజులని తలచుకుంటూనే ఉంటాం. మీలాంటి టీచర్లు మా పిల్లలకు దొరికితే ఎంత బావుంటుందని అనుకుంటూనే ఉంటాం’’ తన ఆవేదనను బయటపెట్టాడు కార్తికేయన్. ‘‘ఔను! నిజమే ఉపాధ్యాయ వృత్తిమీద నేటి యువతకు ఆసక్తి లేదు. కనుకనే ఉపాధ్యాయుల కొరత ఉంది. మా రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్ప. రేపటి పౌరులని మేమే తయారుచేస్తున్నామని ఎంతో గర్వంగా ఉండేది. ఇపుడు విద్యను వ్యాపారం చేస్తున్నారు. తలచుకుంటే చాలా బాధనిపిస్తుంది’’ అంది సరస్వతి. అక్షర, ప్రజ్ఞలు కలిసి, వచ్చినవారికోసం ఫలహారం చేశారు. ‘‘సరే టీచర్, ఇక ఉంటాం, ఇలా మిమ్మల్ని మళ్లీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది, నమస్కారం’’ అని చెప్పి నలుగురూ వెళ్లిపోయారు.
అమ్మాయిలిద్దరూ వాళ్ళమ్మను చుట్టేసి ‘‘చూసారా! పిల్లలూ మా టీచరమ్మ ఎంత గ్రేటో’’ అన్నారు. నేను కాదు తల్లీ, ఈ ప్రపంచంలోనే టీచర్ అనే వ్యక్తి(శక్తి) చాలా గొప్ప. గురువు దైవంతో సమానం అన్నది అక్షరాలా నిజం. పిల్లల భవిష్యత్తుకు పునాది పడేది విశ్వవిద్యాలయంలోనే. చదువుతోపాటు సంస్కారం నేర్పేది ఉపాధ్యాయులు, గురువులే, ఈ కాలంలో పిల్లలు స్కూళ్ళలో చాలా ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఓ ఉత్తమ ఉపాధ్యాయుని శిక్షణలో పెరిగిన విద్యార్థులు జీవితంలో అత్యున్నత స్థాయికి వెళతారు. ఏదైనా సాధిస్తారు. బతకలేక బడిపంతులు అనే మాట అపోహ మాత్రమే. ఈ రోజున విజయవంతమైన, మంచి భవిష్యత్తును అనుభవిస్తున్న ప్రతీ పౌరుడి బతుకు, బడి పంతులు దగ్గర పాఠాలు విన్నదే. పిల్లలూ! మీరు కూడా మీ అధ్యాపకులను గౌరవించాలి, హేళన చేయకూడదు. దైవంతో సమానం అన్నట్టు భావించాలి, అర్థమయిందా’’ అని చెప్పింది. మర్నాడు పొద్దున్న టిఫిన్లయ్యాక, నలుగురు మనవలకు శ్లోకాలు నేర్పడానికి దగ్గర కూచోపెట్టుకుంది సరస్వతి. నలుగురిలో పెద్దదైన మైత్రి ‘‘అమ్మమ్మా! నేను పెద్దయ్యాక ఇంజనీరు ఆవను, నీలాగ గవర్నమెంటు స్కూల్లో మంచి టీచర్ అయి, ఇంజనీర్లని, డాక్టర్లని, పోలీసులని తయారుచేస్తా’’ అంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావ్ తల్లీ! వెరీ గుడ్ అని లోలోపల తృప్తిగా, గర్వంగా ఫీలయ్యింది సరస్వతి టీచర్.
‘‘సరే ఇక మీ సెలవలైపోతున్నాయి, ఆటలాపి నేను చెప్పే శ్లోకాలు బుద్ధిగా నేర్చుకోవాలి. ఏదీ చెప్పండి.. నలుగురూ చేతులు జోడించండి అంటూ ప్రారంభించింది. ‘‘సరస్వతీ! నమస్త్భ్యుం..’’

--కౌముది